నా "ఆర్గానిక్ జీవితాలు" వ్యాసం అంతర్జాల పత్రిక "విహంగ" లో ఇక్కడ చదవండి.
~లలిత
ఆర్గానిక్ జీవితాలు
ఈ మధ్య ఎక్కడ చూసినా ఆర్గానిక్-అవే కొనండి, ఆర్గానిక్-ఇవే తినండి అని ప్రకటనలు, ప్రక్కనే వాటి ధరలకి మనం పెట్టే డబ్బుల తేడాలు, ఇంకొంచెం ప్రక్కకి జరిగితే – అదే… చూపు జరిపితే – పాలకూర, ద్రాక్ష వగైరావి ఆర్గానిక్ కానివి తింటే వచ్చే రకరకాల – పేరు ఎప్పుడూ వినని-నోరు తిరగని జబ్బుల వివరాలు… అవి చదివిన మైకంలో ఏదో కలకాలం భూమ్మీద వుండిపోదామనే ఆశతో సరే-వాళ్ళు చెప్పినట్టే అన్నీ ఆర్గానిక్ కూరలు, పప్పులు కొనుక్కుందామని అటువేపు వెళ్లి వచ్చినా, హస్తి-మశకాంతరం అన్నట్టు వుండే ఆ ఆర్గానిక్ , ఆర్గానిక్-కాని ధరల వల్ల – ఆరోగ్యం మాట ఎలా వున్నా బస్తాల్లో డబ్బులు తీసుకువెళ్ళి సంచీలో సరుకులు తెచ్చుకోవాలనే బెంగతో, ఆలోచనతో మనుషుల ఆయుర్దాయం తగ్గిపోతోంది.

కూరలు, పప్పులు ప్రక్కన పెడితే ఈమధ్యనే ఎవరో చెప్తూవుండగా విని “హా”శ్చర్యపోయాను – మన ఆంధ్ర రాజధానిలో ఒక డిపార్టుమెంటల్ స్టోర్ లో ఆర్గానిక్-కుంకుడు కాయలు, ఆర్గానిక్-చింతపండు అమ్ముతున్నారట. ఔరా కలికాలం అంటే ఎక్కడో లేదు అనిపించింది. అడవుల్లో ఎక్కడో మబ్బులు పోసిన నీళ్ళు త్రాగి, తమ నుంచి రాలి, వడలిన ఆకులే ఎరువుగా అమాయకంగా పెరిగి, తమకన్నా అమాయకమైన కోయవాళ్ళు, భిల్లులు కోసి తలకెత్తుకుని, మోసి సంతలలో దళారీలకి ఐదు, పది రూపాయలకి అమ్మితే – ఆ కుంకుడు కాయలకి, చింతపండుకి దుమ్ము దులిపి, అందమైన ప్లాస్టిక్ కవర్లో పోసి వందల రూపాయలకి అమ్మే మనిషి దురాశ వినాశాహేతువే కదా!
అమెరికా ఆర్గానిక్ స్టోర్ లో ఆర్గానిక్-క్లోత్స్ వాషర్ ఒక పౌండ్ ఇరవై డాలర్లు – అని షోగ్గా ఒక గోనెసంచి (ఇదే సంచి మన వూళ్ళో కాళ్ళకడ్డం వస్తే గోనె అని తన్నేసి పడేస్తాము – ఇక్కడ షాప్ లో ఇస్తే మాత్రం ఆ షాప్ లోగో కనిపించేలాగా ముందు రూం గోడ మీదో, వంటింటి గోడలమీదో స్టైల్ గా “డిస్ప్లే”పెడతాము.) కనిపిస్తే ఏంటా అని కుతూహలం ఆపుకోలేక విప్పి చూశాను – అందులో ఏమున్నాయో ఊహించగలరా – కుంకుడు కాయలు. వెంటనే చిన్నప్పట్నుంచి తన పట్టుచీరలని కుంకుడుకాయ రసంతో వుతుక్కునే మా లక్ష్మి దొడ్డ ని తలుచుకుని – అబ్బా! మా దొడ్డ చెప్తే వినలేదే నేను – ఇప్పుడీ అమెరికా వాడు చెప్తే కాని నా తలకంటలేదు – నిజంగా నా తల కుంకుడుకాయతో తలంటుకుని శుభ్రం చేసుకోవాల్సిందే – అని మనసులోనే చెంపలు వేసుకున్నాను.
అంతా సహజంగా జరిగిపోయే రోజుల్లో – ఆవులకి బలం కోసమని, ఎక్కువ పాలిస్తాయని, అలా వచ్చిన పాలు త్రాగితే పిల్లలకి బలమని చెప్పి – పాలల్లో డి-విటమిన్ అనీ, ఇంకోటనీ రకరకాల హోర్మోన్స్ కలిపి, పాలు కాచకపోయినా పర్వాలేదు అని చెప్పి ఇన్నేళ్ళూ కొన్ని తరాలకొద్దీ చల్ల పాలు త్రాగించి ఇప్పుడు హఠాత్తుగా , అదేదో కొత్తగా కనుక్కున్న సత్యంలాగా – హార్మోన్స్ కలిపిన పాల వల్ల పిల్లలు తొందరగా, ఎక్కువగా వయసుకు మించి ఎదిగిపోతున్నారని, చల్ల పాల వల్ల కూడా నష్టాలు వున్నాయని, ప్లాస్టిక్ డబ్బాలో పాలు మంచివి కావని చెప్పి – మళ్ళీ గాజు సీసాల్లో పాలని బంగారంలా రెట్టింపు రేటుకి అమ్ముతున్నారు – దట్ ఈజ్ కార్పోరేట్ అమెరికా అని. మన దురదృష్టమేంటంటే ఇదే గొప్ప అని ఇలాంటి ఎన్నో అవలక్షణాలను దిగుమతి చేసుకుంటోంది మన భారత దేశం.
అన్నట్టు ఇంకో విషయం అండోయ్ - సహజంగా పెరిగి దొరికేవి ఆర్గానిక్ అయితే మన పిల్లల్లో కూడా ఆర్గానిక్, ఆర్గానిక్ కాని వాళ్ళు వున్నారు – ఎలాగో తెలుసా – నార్మల్ డెలివరీ అయితే ఆర్గానిక్-బేబీ, సిజేరియన్ తో పుడితే నాన్-ఆర్గానిక్-బేబీ
) డాక్టర్లు అలాంటి బోర్డులు అంటే- “ఆర్గానిక్-బేబీ మా ప్రత్యేకత” – అని పెట్టే రోజులు ఎంతో దూరంలో లేవు.
ఆలోచించాల్సిన విషయమే మరి !!!!
అంతా సహజంగా జరిగిపోయే రోజుల్లో – ఆవులకి బలం కోసమని, ఎక్కువ పాలిస్తాయని, అలా వచ్చిన పాలు త్రాగితే పిల్లలకి బలమని చెప్పి – పాలల్లో డి-విటమిన్ అనీ, ఇంకోటనీ రకరకాల హోర్మోన్స్ కలిపి, పాలు కాచకపోయినా పర్వాలేదు అని చెప్పి ఇన్నేళ్ళూ కొన్ని తరాలకొద్దీ చల్ల పాలు త్రాగించి ఇప్పుడు హఠాత్తుగా , అదేదో కొత్తగా కనుక్కున్న సత్యంలాగా – హార్మోన్స్ కలిపిన పాల వల్ల పిల్లలు తొందరగా, ఎక్కువగా వయసుకు మించి ఎదిగిపోతున్నారని, చల్ల పాల వల్ల కూడా నష్టాలు వున్నాయని, ప్లాస్టిక్ డబ్బాలో పాలు మంచివి కావని చెప్పి – మళ్ళీ గాజు సీసాల్లో పాలని బంగారంలా రెట్టింపు రేటుకి అమ్ముతున్నారు – దట్ ఈజ్ కార్పోరేట్ అమెరికా అని. మన దురదృష్టమేంటంటే ఇదే గొప్ప అని ఇలాంటి ఎన్నో అవలక్షణాలను దిగుమతి చేసుకుంటోంది మన భారత దేశం.
అన్నట్టు ఇంకో విషయం అండోయ్ - సహజంగా పెరిగి దొరికేవి ఆర్గానిక్ అయితే మన పిల్లల్లో కూడా ఆర్గానిక్, ఆర్గానిక్ కాని వాళ్ళు వున్నారు – ఎలాగో తెలుసా – నార్మల్ డెలివరీ అయితే ఆర్గానిక్-బేబీ, సిజేరియన్ తో పుడితే నాన్-ఆర్గానిక్-బేబీ
ఆలోచించాల్సిన విషయమే మరి !!!!
హాయ్ లలిత గారు . నేనూ లలితనే వ్యాఖ్యల్లో మీ పేరు చూసి ఇటొచ్చా.....
రిప్లయితొలగించండిహాయ్ లలిత గారు . నేనూ లలితనే వ్యాఖ్యల్లో మీ పేరు చూసి ఇటొచ్చా.....
రిప్లయితొలగించండిలలిత గారు ...
రిప్లయితొలగించండినా బ్లాగ్ కి వచ్చినందుకు సంతోషం. నేను లలితనే కానీ ఇంకొంచెం పొడుగు పేరున్న లలితని. ఇప్పటినుంచీ నా పూర్తి పేరుతో వ్రాస్తాను - ఎలాంటి confusion లేకుండా.
Regards,
లలితా త్రిపుర సుందరి