(చిన్నప్పుడు వేసవిలోశలవులకి అనాతవరం వెళ్ళినప్పుడు మా ఇంటి అరుగుమీద నాన్నమ్మ ఒళ్ళో పడుకుని విన్న ఎన్నో కథల్లో ఇది ఒకటి. )
ఒకసారి భోజరాజుకి, కాళిదాసుకి ఏదో కావ్యచర్చల్లో భిన్నాభిప్రాయం వచ్చింది. అప్పుడు కాళిదాసు భోజ రాజాస్థానానికి దూరంగా వెళ్లి ఒక చెట్టు క్రింద ధ్యానం చేసుకుంటూ వున్నాడు.
కొంతమంది ఆకతాయిలు కాళిదాసు వద్దకి వెళ్లి - స్వామీ! ఏం చెప్పమంటారు. మీరిలా రాజాస్థానం లోంచి అడుగు బయట పెట్టారో లేదో భోజ రాజుగారు కాలం చేశారు అని.
అది వినగానే కాళిదాసు నోటినుంచి ఇలా ఒక శ్లోకం వెలువడింది:
అద్య ధారా నిరాధార నిరాలంబా సరస్వతీ
పండితః ఖండితః సర్వే భోజ రాజే దివం గతే
(ఈరోజు ధారా నగరం నిరాధారమయింది. సరస్వతీ దేవికి ఆలంబన లేకుండా పోయింది. పండితులందరూ చెల్లాచెదురయారు. ఇదంతా భోజరాజు దివంగతుడవడం వల్లనే కదా!!!)
అదే సమయానికి రాజ్యసభలో మంత్రులతో కాళిదాసుతో తనకి వచ్చిన భేదాభిప్రాయాన్ని ఎలా పరిష్కరించాలా అని మంతనాలు జరుపుతున్న భోజరాజు సింహాసనం మీదనే ఒరిగిపోయాడు.
రాజుగారికి ఏమయిందో అర్థం కాక సభలో అందరూ దిగ్భ్రాంతులై చూస్తుండగా కాళిదాసుకి అబద్ధం చెప్పిన ఆకతాయిలు సభలోకి భయపడుతూ వచ్చి జరిగినది ఏమిటో చెప్పగానే మంత్రులందరూ వెళ్లి కాళిదాసుకి అసలు విషయం వివరించారు.
వెంటనే కాళిదాసు ఈ క్రింది శ్లోకం పలికాడు.

అద్య ధారా సదాధారా సదాలంబా సరస్వతీ
పండితః మండితః సర్వే భోజ రాజే భువం గతే
(ఈ రోజు భోజరాజు భువికి వచ్చాడు. ఆయన రావడంతోనే ధారా నగరానికి ఆధారం దొరికినట్లయింది. సరస్వతీ దేవికి ఆలంబన దొరికింది. పండితులు ఆదరింపబడ్డారు.)
వెంటనే సింహాసనం మీద తెలివి తప్పి పడి వున్న భోజరాజు స్పృహ లోకి వచ్చాడు.
పుంభావ సరస్వతి అయిన కాళిదాసు వాక్శుద్ధిని తెలిపే కథ ఇది.
alaa alaa ikkada thelaanannamaataa.. so happy..keep writing lalitha
రిప్లయితొలగించండిభలే! ఎప్పుడొ ఈ బ్లాగ్ మొదలుపెట్టిన రోజుల్లో రాసుకున్న చిన్నప్పుడు విన్న కథ - మీరు ఇంత వెనక్కి వచ్చి మళ్ళీ నెను కూడా తిరిగి చదువునేలా చేశారు - బోల్డన్ని థాంక్స్
తొలగించండి