బడికి వీడుకోలని సెలవులిక మొదలని
వీడు యిక కాలు నిలవని సంబరాల నెలవని
వాడుక మరవని పాటల - అల్లరి ఆటల కొలువని
ఈ మురిపెం నిన్నా-మొన్నటిదిలా వుండగానే ...
ఆ సెలవులకేం నెలవు దొరికిందో? అప్పుడే వెళ్లిపోయాయి!
ఇంతలోనే స్కూళ్ల నుంచి ఈ-మెయిళ్లు
ఎక్కడ మీ కోయిలలు నెమళ్ళు అంటూ
పుస్తకాలు కొనండి పెన్సిళ్లు చెక్కండి
బేగ్గులు సర్దండి - బళ్లోకి పంపండి అంటూ
ఇంకేం చేస్తాం...
చుక్క పొడవగానే ఆమ్ పెట్టేశాం
రాతిరిని తొందరగా రమ్మన్నాం
నక్షత్రాలను రెప్పల మాటున దాచేసి
చందమామల దుప్పటి కప్పి బజ్జోపెట్టేశాం
వేగుచుక్క పొడిచీ పొడవకముందే
అల్లిబిల్లి సరదా పాటల మేలుకొలిపి
తెరిచీ తెరవని కన్నుల కాంతులు వెలిగించి
విరిసీ విరియని లేతమొగ్గల బుగ్గలు తుడిచి
కడుపారా పాలు పట్టి - కన్నారా రూపు పట్టి
బడికి పంపాం - బావురుమన్నాం :(
రెండున్నర నెలల సెలవులు ఇట్టే అయిపోయాయి.
ఈ ఏడాది ప్రత్యేకత - నిన్నామొన్నటి బుల్లి బుజ్జి-జింక ఆరవ తరగతికి మిడిల్ స్కూల్ కి వెళ్లడం.
సిక్స్త్ గ్రేడ్ ఓరియెంటేషనూ , లాకర్ అసైన్మెంట్లు, PE యూనిఫార్ములూ - ఓ .... బోల్డంత హడావిడీ - ఇల్లంతా సందడి.
ఈలోగా - వేసవి సెలవుల్లో కూడా చదువని కాలేజ్ లో వుండిపోయిన అన్న - సెలవుల చివరి వారానికి ఇంటికి రావడంతో - ఆ సందడి - ఇబ్బడి ముబ్బడి.
ఆ చివరి వారం సెలవు కూడా గడిచిపోయింది - చదువు పుస్తకంలో కొత్త పుట మొదలైంది.
Nice one Lalitha Gaaru
రిప్లయితొలగించండిథాంక్స్, పవన్ గారు!
తొలగించండి'ఇంకేం చేస్తాం....
రిప్లయితొలగించండి.........................
........బావురుమన్నాం' వరకు ఈ లైన్లు నాకు భలే నచ్చేశాయి.
ఇంక నీ Terzanelle, just beautiful. Proves your versatility.
Thanks for taking time to read my Terzanelle & your nice words about it!
తొలగించండిమా ఇంట్లో కూడా సెలవులు అయిపోయాయి.. మేము కూడా :(
రిప్లయితొలగించండికదా ! ఊపిరి తిప్పుకోలేని హడావిడి తప్ప కలకలమనే సందడే వుండదు - మళ్ల్లీ సెలవులు వచ్చేదాకా :(
తొలగించండినీ వ్యాసాలు చూస్తుంటే
రిప్లయితొలగించండిముళ్ళపూడి వారి కథలూ వంశి పసలపూడి కథల వలె నీ కథలు అన్నీ "లలితోపాఖ్యానాలు" అని ప్రింట్ చేయిస్తే బావుంటుంది అక్కా
ఇది పొగడ్త కాదు నువ్వు అనుమతి ఇస్తే అన్నీ కలిపి ఒక పుస్తకం చేయిపిస్తా నాకోసమే !!!!!
హనుమాన్! నీ అభిమానానికి చాలా థాంక్స్! డబ్బులు ఖర్చు పెట్టకుండా నీకు కావల్సినట్లు ప్రింట్ చేయించుకో - అదొక్కటే కండిషన్.
తొలగించండి