13, మే 2017, శనివారం

మనసే జతగా పాడిందిలే - 3 - కవలపాటలు - Pouring rain in గలగల పారుతున్న గోదారి

ఎర్రటి సూర్యుణ్ణి చిక్కటి మబ్బు పరదాల చాటున దాచేసి
నీలిరంగు నింగి మేడకి కృష్ణవర్ణపు పూతపూసి
ఆ మేడ మీద ఆడే మబ్బుకన్నెల గిరజాల కొప్పులో
మెరిసే సౌదామినీ-మాలికల తళుక్కన జేసి
ఆ నెలతల నెలవంకల-నడుమొంకల మోసే
శ్రావణ-ఘటాల తాకే కరకంకణాల ధ్వనుల ప్రతిధ్వనుల సందడితో
అణకువ లేని ఆ అల్లరికన్నెల - కుదురు లేని కుండల నుండి
తొణకిసలాడిన నీటితుంపరలుగా మొదలైన వాన
మబ్బుకన్నెల ఆడుతున్న ఆట లయ హెచ్చి -పాడుతున్న పాట  శృతి మించి
చిక్కుపడని జలధారల-జలతారై
నింగి-మేడకి నేల-ఒడ్డుని కలిపే చినుకుల-వంతెనయ్యింది
ఆ నిలకడ-నీటి-వాన...
చిట్టిపాపల, బుజ్జిబాబుల కాగితపు పడవల ఊయలలూపింది
దొరనవ్వు-బాబుల, చిరు-సిగ్గు-కన్నియల కనుల ఊసుల బాసటయ్యింది
అలసిన-అమ్మల, సొలసిన-నాన్నల అలరించగ చిరుజల్లుల అనులేపనమయ్యింది 

ఉరుములతో, మెరుపులతో కూడిన అలాంటి వాన కురిస్తే - ఇంటి కిటికీల కీవల కూర్చుని ఉరుములు వింటూ, మెరుపులు చూస్తూ, ఇంటి అరుగుమీద పడే చినుకుల చిందులకి మురుస్తూ, ఆ వర్షపు స్పర్శకి హర్ష-పులకితలైన పుడమి స్వచ్ఛతని, ఆ పుడమిపుట్టువులైన చెట్ల హరితాన్ని కంటినిండా నింపుకుంటూ - ఆ కిటికీ దగ్గరే మా పుస్తకాల-దర్బారు కావించి ఏ Wodehouse గారి Psmithనో, ముళ్లపూడివారి ఓ కొమ్మచ్చినో తోడు తీసుకుని - కబుర్ల-నవ్వుల-సందడితో మావంతు నేపథ్య సంగీతం వాన-పాట కందిస్తూ వుంటాం.

ఐదారేళ్ల క్రితం ఓ వాన కురిసిన సాయంకాలం బుజ్జిజింకలిద్దరూ గదిలో చేరి జంటగా పాటలు వింటూ - వంతగా గొంతు కలుపుతూ ఇల్లంతా పాటల-పందిరి వేసేస్తుంటే అప్పుడు విన్నానొక వాన పాట - José Feliciano పాడింది. వినగానే - 'అరె - ఇది మన గలగల పారుతున్నగోదారి పాటలా వుందే!' అనేసుకున్నాం బదరి, నేను.

అప్పట్నుంచి ఈ Rain పాట మా ప్లే-లిస్టాగ్ర అయ్యింది.

కిందున్న José Feliciano పాడిన పాట ఎప్పట్లాగే యూ-ట్యూబ్ పుణ్యం.
ఆ కిందనున్నవి పాట-పదాలు  José Feliciano తో గొంతు కలపడానికి వీలుగా - Happy Singing!






Listen to the pouring rain
Listen to it pour
And with every drop of rain
You know I love you more

Let it rain all night long
Let my love for you go strong
As long as we're together
Who cares about the weather?

Listen to the falling rain
Listen to it fall
And with every drop of rain
I can hear you call
Call my name right out loud
I can hear above the clouds
And I'm here among the puddles
You and I together huddle
 
Listen to the falling rain
Listen to the rain

It's raining
It's pouring
The old man is snoring
Went to bed and he bumped his head
Couldn't get up in the morning

Listen to the falling rain
Listen to the rain

గోదావరిలో వాన భలే వుంటుంది - చిన్న చినుకులైతే సంపెంగ మొగ్గల్లా, పెద్దచినుకులు పడితే గంధపుగిన్నెల్లా - చిందులేసి గోదారంతా సింగారించుకుంటుంది.

Rain పాటతో మన అచ్చతెలుగు సినిమా గౌరి లోని గోదారి పాట కూడా sin-గారించుకుంది.

హీరో కృష్ణ పాట అనగానే వీడియో దొరుకుతుందేమోనని ఆశ పడ్డాను కానీ - ఎక్కడా వున్నట్టులేదు. అసలు హీరో కృష్ణ డాన్స్ చూడకపోతే మజా ఏముంది?

తెలుగు పాటకి సంగీత దర్శకత్వం - డోలక్ సత్యం గారు.  ఈయన పాటలు కొన్ని ఇలా వేరే భాషల్లో పాటలకి కవలలనిపించినా - అవేవో  ఏ దర్శకుడి వ్యక్తిగత ఇష్టం వల్లో ఎంపిక చేసిన పాటలకి వేరే దారి లేక చేసినట్లనిపిస్తాయి నాకు. ఇలాంటి కవల-పాటలకన్నా సత్యంగారు చేసిన ఆయన సొంత పాటలు ఇంకా బావుంటాయి.

ఇంక - ఈ పాటలో SPB గొంతు వింటుంటే ఆయనకి José Feliciano పాట పదేపదే వినిపించి అలాగే పాడమని కూడా చెప్పి వుంటారేమో అననిపించింది. ఎందుకంటే సుతిమెత్తగా వుండే బాలు-స్వరం ఈ పాటలో కొంచెం శృతి-మొత్తగా అనిపిస్తుంది. అది కొంచెం ష్రుతి మించి రెండో చరణంలో మొదటి లైను "దేషానికాయువు పోసే ఈ పల్లెలు" అని వినిపించింది - నా చెవులకి. 

మొత్తం మీద ఇదో మంచి కవల-పాట - చూడడానికేమీ లేదు - విని ఆనందించడమే!



లా లా లా లా హే హే హే
గలగల పారుతున్న గోదారిలా 
రెపరెపలాడుతున్న తెరచాపలా 
ఈ చల్లని గాలిలా - ఆ పచ్చని పైరులా 
ఈ జీవితం సాగనీ హాయిగా - హే...

గలగల పారుతున్న గోదారిలా 

అందాల పందిరి వేసే ఈ తోటలు 
ఆ నింగి అంచులు చేరే ఆ బాటలు 
నాగలి పట్టే రైతులు - కడవలు మోసే కన్నెలు 
బంగరు పంటల సీమలు చూడరా - హే...

గలగల పారుతున్న గోదారిలా 
రెపరెపలాడుతున్న తెరచాపలా 
ఈ చల్లని గాలిలా - ఆ పచ్చని పైరులా 
ఈ జీవితం సాగనీ హాయిగా - హే...

గలగల పారుతున్న గోదారిలా 
<whistle... ... ... >

దేశానికాయువు పోసే ఈ పల్లెలు 
చల్లంగ వుండిననాడే సౌభాగ్యము 
సత్యం ధర్మం నిలుపుటే  - న్యాయం కోసం పోరుటే 
పేదల సేవలు చేయుటే జీవితం - హే...

గలగల పారుతున్న గోదారిలా

ఆ English వాన - ఈ తెలుగు గోదారిలో కలిసిన పాటలు వినండి - 'వి'న్నరవ్వండి!

~పాటల భైరవి

8 కామెంట్‌లు:

  1. ఇది హిందీ లొ కూడా ఉంది. Sir సినిమా - కుమార్ సాను.. సున్ సున్ బర్సాత్ కి ధున్.
    https://www.youtube.com/watch?v=u15WHjn8aBg
    nice improvisation from Annu malik

    రిప్లయితొలగించండి
  2. మంచి పాట గుర్తు చేశారు లలిత గారు. కృష్ణ గారి పాత పాటని అప్పుడెప్పుడో పోకిరి సినిమా లో remix చేశారు అన్నారు. అలా అయితే కృష్ణ గారి పాట కూడా ఒరిజినల్ కాదన్నమాట, దాన్ని ఇంగ్లీష్ పాట నుంచి పట్టుకొచ్చారన్నమాట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పవన్‌గారు: అవునండి - ఇది పట్టుకొచ్చిన పాటే :)

      తొలగించండి
  3. కవల పాటల సిరీస్ బాగుందండీ.. మంచి పాటలు వాటితోపాటు మంచి సమాచారం అందిస్తున్నారు.. వెరీనైస్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవల పాటల సిరీస్ మీకు నచ్చినందుకు సంతోషమండి :)

      తొలగించండి
  4. ఇంకా కొన్ని టపాలు చదవాలి. చాలా వరకు మీ వేగం అందుకున్నాను. మీ శైలి, వస్తువు, భాష ని గూర్చి కొత్తగా చెప్పెదేమీలేదు..ఒరవడిలోకి ఉరవడిగా సాగుతారు. భలే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ మరువపు-పొగడిక మరువలేని మైమరుపిక! ధన్యవాదాలు :)

      తొలగించండి