చిన్నప్పుటినుంచి నా పెళ్లయ్యే దాకా - ప్రతిరోజూ పొద్దున్న, సాయంత్రం - తలదువ్వి జడ వేయడం పూర్తయిన ప్రతిసారి ముందుకి తిరగమని - దువ్వెనతో ముంగురులు దువ్వుతూ మా అమ్మ తరచుగా అనే మాట - నుదురు చిన్నదైతే కుదురు తక్కువంటారు. నీకు నుదురు పెద్దదే కానీ ...- అని ఆపేసేది - ఆ తదుపరి నన్ను పూరించుకోమన్నట్టు.
కుదురుండేది కుండలకి, బిందెలకి కానీ నాక్కాదు - అనేసి మాట మార్చేసి నుదుటికి విలోమ నిష్పత్తిలో వున్న నా కుదురుని సమర్థించుకునేదాన్ని.
ఇంత హఠాత్తుగా నా కుదురు ప్రసక్తి, దాని గురించి మా అమ్మ ఉక్తి ఎందుకు గుర్తొచ్చాయంటే - ఈ మధ్య కాలంలో - అంటే గత నాలుగైదేళ్ళుగా నా ఫ్రెండ్స్ కొందరు ఆర్ట్ ఆఫ్ లివింగ్, యోగా, బిక్రం యోగా, మెడిటేషన్ల గురించి మాట్లాడుతూ - వాళ్ళు వెళ్ళే తరగతుల గురించి చెప్తుంటే విని - అమ్మో! అంతసేపు కదలకుండా మాట్లాడకుండా ఒకచోట కూర్చోవడమే?! నాకింకా యోగా చేసే టైం రాలేదు - అని నవ్వేసేదాన్ని.
ఆకుపచ్చచెట్లు - అవెక్కే ఉడతలు, రోడ్డు పక్కనే నించుని పెద్దకళ్ళతో చూసే జింకలు, ఇళ్ల కిటికీల్లోంచో-ఇంటి చుట్టూ వున్న కంచెల్లోంచో చూసే బుజ్జి-బుజ్జి కుక్కపిల్లలు - వాటి తల్లులూ, మెళ్ళో కట్టిన గంటలు మోగిస్తూ తిరిగే పెంపుడు పిల్లులు - వీటినన్నిటిని చూస్తూ - ఒంటిగా సరి-సరి పద-పద అని పాడుకుంటూనో - జంటగా కబుర్లు చెప్పుకుంటూనో నడవడం ఎంతో బావుంటుంది నాకు. ఆ గమనంలోనే నా ధ్యానం వుంది అని సరిపెట్టేసుకునేదాన్ని.
మా వూళ్ళో లైబ్రరీలో ఉచితమైన ఉచిత-మెడిటేషన్-తరగతులు ప్రతివారం జరుగుతాయి అని తెలిసినా, అవి నడిపేది మా బుజ్జిజింక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారైన సాయిరాంగారని తెలిసినా, కలిసినప్పుడల్లా ఉత్సాహంగా సాయిరాం గారు చెప్పే ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి ఎన్నిసార్లు విన్నా, తరచుగా ఆ మెడిటేషన్ సెషన్స్ గురుంచి వివరాలతో ఎన్ని email రిమైండర్స్ వచ్చినా - ఇది మాత్రం నావల్ల కాదు - అనుకునేదాన్ని.
నా బెంగల్లా - ఇరవయ్యో, ముప్పయ్యో - నిముషాలు మాట-పాట లేకుండా కూర్చోవాల్సి రావడమే.
మెడిటేషన్ అంటే హెజిటేషన్ లేకుండా దూరంగా జరిగే నాకు సాయిరాంగారు Guided Meditation అనే యూ-ట్యూబ్ లింక్ ఒకటి పంపించారు - ఇది ఒక ఇరవై నిముషాలు వుంటుంది, బిజీగా వుంటూ తీరిక సమయం ఎక్కువ లేని వాళ్ళ కోసం తయారు చేశానిది, చూడండి - అంటూ.
సరే - అరచేతిలో వాట్సాప్ ధ్యానం - ఓ ఇరవై నిముషాలే కదా - అని కళ్ళు మూసుకుని వినడం మొదలుపెట్టాను.
వేణునాదంతో పాటు మంద్రంగా వినిపిస్తున్న సాయిరాంగారు శ్వాస తీసుకోవడానికి, మనసు లగ్నం చేయడానికి ఇస్తున్న సూచనలు వింటూ - ఆచరిస్తూ - ఇరవై నిముషాలు ఎలా గడిచిందో తెలీదు.
నాకు మాత్రం చాలా నచ్చేసింది సాయిరాం గారి ఈ Guided Meditation.
అందుకే చెప్తున్నాను - ధ్యానంలో హాయి - తెలిసిందండి, సాయి!
ఇదే కాకుండా ప్రతి శుక్రవారం Global Meditation సెషన్స్ నడుపుతారు సాయిరాం గారు.
ఆ సెషన్ వివరాలు ఇవి:
ఆ సెషన్ వివరాలు ఇవి:
Global Meditation sessions can be attended via free conference call or web.
Global
meditation is conducted on every Friday and session starts @ 9pm CST
and lines are opened at 8:45pm CST. It is a one hour session. There will
not be any session on holiday weekends.
You can ask questions before or after the meditation session.
Call details:
Join online meeting:
Or by phone:
United States: (218) 339-7800
Participant Access Code: 507 7577
మరిన్ని వివరాలకై సాయిరాం గారి Website:
ఇంతకీ - తను నమ్మిన ధ్యానం గురించి ఇంత చేస్తున్న
సాయిరాంగారు తీసుకునేదెంత?
ఒక చిరునవ్వంత - అది కంటిని మెరిపించే మెరుపంత
వారి మంచితనమెంత? - కొండంత
వారికి బలమెంత? - వారి శ్రీమతి మాధవి తోడంత
ఏమీ ఆశించక - అందరికీ మంచి జరగాలనే బహు-మంచి ఉద్దేశ్యంతో ధ్యానం వలన కలిగే లాభాలను తెలియజేయాలి అనుకుని - నిబద్ధతతో తన వారాంతపు తీరిక సమయాన్ని Global Meditation సెషన్స్ కోసం వెచ్చిస్తున్న సాయిరాంగారూ...
ఉరుకుల-పరుగుల అమెరికా జీవితంలో వారానికి ఒకేసారి అపురూపంగా దొరికే family-time ని ఆ ధ్యానం తరగతులకి ధారపోస్తున్న సాయికి నిశ్శబ్దంగా ఊతమిస్తున్న సహచరి - మాధవి...
ఇదిగో ఇలాంటి వాళ్ళ గురించే రాశారేమో - కృష్ణపక్షం లోని ఈ భావ కవిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు...
సాయిరాంగారు తీసుకునేదెంత?
ఒక చిరునవ్వంత - అది కంటిని మెరిపించే మెరుపంత
వారి మంచితనమెంత? - కొండంత
వారికి బలమెంత? - వారి శ్రీమతి మాధవి తోడంత
ఏమీ ఆశించక - అందరికీ మంచి జరగాలనే బహు-మంచి ఉద్దేశ్యంతో ధ్యానం వలన కలిగే లాభాలను తెలియజేయాలి అనుకుని - నిబద్ధతతో తన వారాంతపు తీరిక సమయాన్ని Global Meditation సెషన్స్ కోసం వెచ్చిస్తున్న సాయిరాంగారూ...
ఉరుకుల-పరుగుల అమెరికా జీవితంలో వారానికి ఒకేసారి అపురూపంగా దొరికే family-time ని ఆ ధ్యానం తరగతులకి ధారపోస్తున్న సాయికి నిశ్శబ్దంగా ఊతమిస్తున్న సహచరి - మాధవి...
ఇదిగో ఇలాంటి వాళ్ళ గురించే రాశారేమో - కృష్ణపక్షం లోని ఈ భావ కవిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు...
మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల పాడు టేల ?
పరుల తనియించుటకొ ? తన బాగు కొరకొ?
గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ
కలిసినప్పుడల్లా మనసారా నవ్వుతూ - నోరారా పలకరించే సాయి, మాధవి దంపతులకి శుభాభినందనలు - శుభకామనలు.
సాయిరామ్ గారికి నా హ్రుదయపుర్వక నమస్కారములు తెలియచెయ్యండి
రిప్లయితొలగించండితప్పకుండా, హనుమాన్!
తొలగించండి//ఆ గమనంలోనే నా ధ్యానం వుంది అని సరిపెట్టేసుకునేదాన్ని.//
రిప్లయితొలగించండిసరిపెట్టేసుకున్నానని అంటున్నారుగానీ మీ ధ్యానాన్ని మించిన ధ్యానం, యోగం వేరే ఉన్నాయంటారా?
కన్నులెదుటిదే ఘన వైకుంఠము వెన్నుని కొలిచిన (కాదు తెలిసిన) విజ్ఞానికి... అన్న అన్నమయ్య మాట గుర్తుకొచ్చింది ఈ లైన్ చదివాకా -
"ఆకుపచ్చచెట్లు - అవెక్కే ఉడతలు, రోడ్డు పక్కనే నించుని పెద్దకళ్ళతో చూసే జింకలు, ఇళ్ల కిటికీల్లోంచో-ఇంటి చుట్టూ వున్న కంచెల్లోంచో చూసే బుజ్జి-బుజ్జి కుక్కపిల్లలు - వాటి తల్లులూ, మెళ్ళో కట్టిన గంటలు మోగిస్తూ తిరిగే పెంపుడు పిల్లులు - వీటినన్నిటిని చూస్తూ - ఒంటిగా సరి-సరి పద-పద అని పాడుకుంటూనో - జంటగా కబుర్లు చెప్పుకుంటూనో నడవడం ఎంతో బావుంటుంది నాకు."
YVR గారు: నా గమన-ధ్యానాన్ని మెచ్చుకున్న మీకు ధన్యవాదాలు.
తొలగించండినుదురు (pun) లేకపోతే కుదురు(pun) లేదు :)
రిప్లయితొలగించండిప్రకృతి సర్వస్వం భగవంతుడే. హంసమంత్రమే మూలం.
శర్మగారు: పన్ అర్థం కాలేదండి. కానీ చదివి వ్యాఖ్య వుంచినందుకు ధన్యవాదాలు.
తొలగించండిసాయిరాం దంపతుల గురించి తెలుసుకోవడం బాగుందండీ వారు చేస్తున్న సేవ అభినందనీయం.
రిప్లయితొలగించండిఈ పేరాగ్రాఫ్ చాలా నచ్చేసిందండీ.. వైవిఆర్ గారన్నట్లు ఇంతకు మించిన ధ్యానం ఏముంటుంది...
>ఆకుపచ్చచెట్లు - అవెక్కే ఉడతలు, రోడ్డు పక్కనే నించుని పెద్దకళ్ళతో చూసే జింకలు, ఇళ్ల కిటికీల్లోంచో-ఇంటి చుట్టూ వున్న కంచెల్లోంచో చూసే బుజ్జి-బుజ్జి కుక్కపిల్లలు - వాటి తల్లులూ, మెళ్ళో కట్టిన గంటలు మోగిస్తూ తిరిగే పెంపుడు పిల్లులు - వీటినన్నిటిని చూస్తూ - ఒంటిగా సరి-సరి పద-పద అని పాడుకుంటూనో - జంటగా కబుర్లు చెప్పుకుంటూనో నడవడం ఎంతో బావుంటుంది నాకు. ఆ గమనంలోనే నా ధ్యానం వుంది అని సరిపెట్టేసుకునేదాన్ని. <
మీ అభినందనలు వారికి అందజేస్తానండి. మీకూ నా గమన-ధ్యానం నచ్చిందన్నమాట :)
తొలగించండిచక్కటి పోస్ట్ రాశారు లలిత గారు.
రిప్లయితొలగించండి"ఇంతకీ - తను నమ్మిన ధ్యానం గురించి ఇంత చేస్తున్న
రిప్లయితొలగించండిసాయిరాంగారు తీసుకునేదెంత?
ఒక చిరునవ్వంత - అది కంటిని మెరిపించే మెరుపంత
వారి మంచితనమెంత? - కొండంత
వారికి బలమెంత? - వారి శ్రీమతి మాధవి తోడంత"
కృష్ణ శాస్త్రి గారి ఈ కవిత మాత్రం నిజంగా very apt వీరి విషయంలో.
అవును లక్ష్మి - నువ్వన్న కృష్ణశాస్త్రిగారి కవితలో వాక్యాలు ఇక్కడ మళ్ళీ copy/paste చేస్తున్నాను:
తొలగించండి" మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల పాడు టేల ?
పరుల తనియించుటకొ ? తన బాగు కొరకొ?
గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ"