27, మే 2017, శనివారం

ధ్యానంలో హాయి - తెలిసిందండి, సాయి!


చిన్నప్పుటినుంచి నా పెళ్లయ్యే దాకా - ప్రతిరోజూ పొద్దున్న, సాయంత్రం - తలదువ్వి జడ వేయడం పూర్తయిన ప్రతిసారి ముందుకి తిరగమని - దువ్వెనతో ముంగురులు దువ్వుతూ మా అమ్మ తరచుగా అనే మాట - నుదురు చిన్నదైతే కుదురు తక్కువంటారు. నీకు నుదురు పెద్దదే కానీ ...- అని ఆపేసేది - ఆ తదుపరి నన్ను పూరించుకోమన్నట్టు. 

కుదురుండేది కుండలకి, బిందెలకి కానీ నాక్కాదు - అనేసి మాట మార్చేసి నుదుటికి విలోమ నిష్పత్తిలో వున్న నా కుదురుని సమర్థించుకునేదాన్ని. 

ఇంత హఠాత్తుగా నా కుదురు ప్రసక్తి, దాని గురించి మా అమ్మ ఉక్తి ఎందుకు గుర్తొచ్చాయంటే - ఈ మధ్య కాలంలో - అంటే గత నాలుగైదేళ్ళుగా నా ఫ్రెండ్స్ కొందరు ఆర్ట్ ఆఫ్ లివింగ్, యోగా, బిక్రం యోగా, మెడిటేషన్‌ల గురించి మాట్లాడుతూ - వాళ్ళు వెళ్ళే తరగతుల గురించి చెప్తుంటే విని - అమ్మో! అంతసేపు కదలకుండా మాట్లాడకుండా ఒకచోట కూర్చోవడమే?! నాకింకా యోగా చేసే టైం రాలేదు - అని నవ్వేసేదాన్ని. 

ఆకుపచ్చచెట్లు - అవెక్కే ఉడతలు, రోడ్డు పక్కనే నించుని పెద్దకళ్ళతో చూసే జింకలు, ఇళ్ల కిటికీల్లోంచో-ఇంటి చుట్టూ వున్న కంచెల్లోంచో చూసే బుజ్జి-బుజ్జి కుక్కపిల్లలు - వాటి తల్లులూ,  మెళ్ళో కట్టిన గంటలు మోగిస్తూ తిరిగే పెంపుడు పిల్లులు - వీటినన్నిటిని చూస్తూ - ఒంటిగా సరి-సరి పద-పద అని పాడుకుంటూనో -  జంటగా కబుర్లు చెప్పుకుంటూనో నడవడం ఎంతో బావుంటుంది నాకు. ఆ గమనంలోనే నా ధ్యానం వుంది అని సరిపెట్టేసుకునేదాన్ని. 

మా వూళ్ళో లైబ్రరీలో ఉచితమైన ఉచిత-మెడిటేషన్-తరగతులు ప్రతివారం జరుగుతాయి అని తెలిసినా, అవి నడిపేది మా బుజ్జిజింక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారైన సాయిరాంగారని తెలిసినా, కలిసినప్పుడల్లా ఉత్సాహంగా సాయిరాం గారు చెప్పే ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి ఎన్నిసార్లు విన్నా, తరచుగా ఆ మెడిటేషన్ సెషన్స్ గురుంచి వివరాలతో ఎన్ని email రిమైండర్స్ వచ్చినా - ఇది మాత్రం నావల్ల కాదు - అనుకునేదాన్ని. 

నా బెంగల్లా - ఇరవయ్యో, ముప్పయ్యో - నిముషాలు మాట-పాట లేకుండా కూర్చోవాల్సి రావడమే. 

మెడిటేషన్ అంటే హెజిటేషన్ లేకుండా దూరంగా జరిగే నాకు సాయిరాంగారు Guided Meditation అనే యూ-ట్యూబ్ లింక్  ఒకటి పంపించారు - ఇది ఒక ఇరవై నిముషాలు వుంటుంది, బిజీగా వుంటూ తీరిక సమయం ఎక్కువ లేని వాళ్ళ కోసం తయారు చేశానిది, చూడండి - అంటూ. 

సరే - అరచేతిలో వాట్సాప్ ధ్యానం - ఓ ఇరవై నిముషాలే కదా - అని కళ్ళు మూసుకుని వినడం మొదలుపెట్టాను. 

వేణునాదంతో పాటు మంద్రంగా వినిపిస్తున్న సాయిరాంగారు శ్వాస తీసుకోవడానికి, మనసు లగ్నం చేయడానికి ఇస్తున్న సూచనలు వింటూ - ఆచరిస్తూ - ఇరవై నిముషాలు ఎలా గడిచిందో తెలీదు. 

నాకు మాత్రం చాలా నచ్చేసింది సాయిరాం గారి ఈ Guided Meditation. 

అందుకే చెప్తున్నాను - ధ్యానంలో హాయి - తెలిసిందండి, సాయి!



ఇదే కాకుండా ప్రతి శుక్రవారం Global Meditation సెషన్స్ నడుపుతారు సాయిరాం గారు.

ఆ సెషన్ వివరాలు ఇవి:

Global Meditation sessions can be attended via free conference call or web.

Global meditation is conducted on every Friday and session starts @ 9pm CST and lines are opened at 8:45pm CST. It is a one hour session. There will not be any session on holiday weekends.

You can ask questions before or after the meditation session.

Call details:

Join online meeting:

Or by phone:

United States: (218) 339-7800 

Participant Access Code: 507 7577
మరిన్ని వివరాలకై సాయిరాం గారి Website

ఇంతకీ - తను నమ్మిన ధ్యానం గురించి ఇంత చేస్తున్న
సాయిరాంగారు తీసుకునేదెంత?
ఒక చిరునవ్వంత - అది కంటిని మెరిపించే మెరుపంత
వారి మంచితనమెంత? - కొండంత
వారికి బలమెంత? - వారి శ్రీమతి మాధవి తోడంత

ఏమీ ఆశించక -  అందరికీ మంచి జరగాలనే బహు-మంచి ఉద్దేశ్యంతో ధ్యానం వలన కలిగే లాభాలను తెలియజేయాలి అనుకుని - నిబద్ధతతో తన వారాంతపు తీరిక సమయాన్ని Global Meditation సెషన్స్ కోసం వెచ్చిస్తున్న సాయిరాంగారూ...

ఉరుకుల-పరుగుల అమెరికా జీవితంలో వారానికి ఒకేసారి అపురూపంగా దొరికే family-time ని ఆ ధ్యానం తరగతులకి ధారపోస్తున్న సాయికి నిశ్శబ్దంగా ఊతమిస్తున్న సహచరి - మాధవి...

ఇదిగో ఇలాంటి వాళ్ళ గురించే రాశారేమో - కృష్ణపక్షం లోని ఈ భావ కవిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు...

మావిగున్న కొమ్మను మధుమాసవేళ 
పల్లవము మెక్కి కోయిల పాడు టేల ?
పరుల తనియించుటకొ ? తన బాగు కొరకొ?
గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ

కలిసినప్పుడల్లా మనసారా నవ్వుతూ - నోరారా పలకరించే సాయి, మాధవి దంపతులకి శుభాభినందనలు - శుభకామనలు. 

11 కామెంట్‌లు:

  1. సాయిరామ్ గారికి నా హ్రుదయపుర్వక నమస్కారములు తెలియచెయ్యండి

    రిప్లయితొలగించండి
  2. //ఆ గమనంలోనే నా ధ్యానం వుంది అని సరిపెట్టేసుకునేదాన్ని.//
    సరిపెట్టేసుకున్నానని అంటున్నారుగానీ మీ ధ్యానాన్ని మించిన ధ్యానం, యోగం వేరే ఉన్నాయంటారా?
    కన్నులెదుటిదే ఘన వైకుంఠము వెన్నుని కొలిచిన (కాదు తెలిసిన) విజ్ఞానికి... అన్న అన్నమయ్య మాట గుర్తుకొచ్చింది ఈ లైన్ చదివాకా -
    "ఆకుపచ్చచెట్లు - అవెక్కే ఉడతలు, రోడ్డు పక్కనే నించుని పెద్దకళ్ళతో చూసే జింకలు, ఇళ్ల కిటికీల్లోంచో-ఇంటి చుట్టూ వున్న కంచెల్లోంచో చూసే బుజ్జి-బుజ్జి కుక్కపిల్లలు - వాటి తల్లులూ, మెళ్ళో కట్టిన గంటలు మోగిస్తూ తిరిగే పెంపుడు పిల్లులు - వీటినన్నిటిని చూస్తూ - ఒంటిగా సరి-సరి పద-పద అని పాడుకుంటూనో - జంటగా కబుర్లు చెప్పుకుంటూనో నడవడం ఎంతో బావుంటుంది నాకు."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. YVR గారు: నా గమన-ధ్యానాన్ని మెచ్చుకున్న మీకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. నుదురు (pun) లేకపోతే కుదురు(pun) లేదు :)

    ప్రకృతి సర్వస్వం భగవంతుడే. హంసమంత్రమే మూలం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారు: పన్ అర్థం కాలేదండి. కానీ చదివి వ్యాఖ్య వుంచినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  4. సాయిరాం దంపతుల గురించి తెలుసుకోవడం బాగుందండీ వారు చేస్తున్న సేవ అభినందనీయం.

    ఈ పేరాగ్రాఫ్ చాలా నచ్చేసిందండీ.. వైవిఆర్ గారన్నట్లు ఇంతకు మించిన ధ్యానం ఏముంటుంది...

    >ఆకుపచ్చచెట్లు - అవెక్కే ఉడతలు, రోడ్డు పక్కనే నించుని పెద్దకళ్ళతో చూసే జింకలు, ఇళ్ల కిటికీల్లోంచో-ఇంటి చుట్టూ వున్న కంచెల్లోంచో చూసే బుజ్జి-బుజ్జి కుక్కపిల్లలు - వాటి తల్లులూ, మెళ్ళో కట్టిన గంటలు మోగిస్తూ తిరిగే పెంపుడు పిల్లులు - వీటినన్నిటిని చూస్తూ - ఒంటిగా సరి-సరి పద-పద అని పాడుకుంటూనో - జంటగా కబుర్లు చెప్పుకుంటూనో నడవడం ఎంతో బావుంటుంది నాకు. ఆ గమనంలోనే నా ధ్యానం వుంది అని సరిపెట్టేసుకునేదాన్ని. <

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభినందనలు వారికి అందజేస్తానండి. మీకూ నా గమన-ధ్యానం నచ్చిందన్నమాట :)

      తొలగించండి
  5. చక్కటి పోస్ట్ రాశారు లలిత గారు.

    రిప్లయితొలగించండి
  6. "ఇంతకీ - తను నమ్మిన ధ్యానం గురించి ఇంత చేస్తున్న
    సాయిరాంగారు తీసుకునేదెంత?
    ఒక చిరునవ్వంత - అది కంటిని మెరిపించే మెరుపంత
    వారి మంచితనమెంత? - కొండంత
    వారికి బలమెంత? - వారి శ్రీమతి మాధవి తోడంత"
    కృష్ణ శాస్త్రి గారి ఈ కవిత మాత్రం నిజంగా very apt వీరి విషయంలో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును లక్ష్మి - నువ్వన్న కృష్ణశాస్త్రిగారి కవితలో వాక్యాలు ఇక్కడ మళ్ళీ copy/paste చేస్తున్నాను:

      " మావిగున్న కొమ్మను మధుమాసవేళ
      పల్లవము మెక్కి కోయిల పాడు టేల ?
      పరుల తనియించుటకొ ? తన బాగు కొరకొ?
      గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ"

      తొలగించండి