అప్పుడెప్పుడో ఆపిన కబుర్లు : త్వామనురజామి - 51 - మా మేటి చెలిమి ఒక కథ... కథ కాదు నిజము మా కల...
అనగనగా ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. ఒకరినొకరు ఇష్టపడ్దారు. వాళ్ళ కథ - అలా మొదలై పెళ్ళి దాకా సాగింది. ఆ వలపు కథ - పెళ్ళి మలుపు దగ్గర ఆగింది.
అయినవాళ్ళందరూ "హమ్మయ్య! పెళ్ళయ్యింది. 'శుభం' కార్డు పడింది" అనుకుటూ అక్షింతలేసి ఆశీర్వదించారు.
అసలూ ... ప్రతి fairy tale కూడా "And they lived happily ever after" అంటూ ఆగిపోతుంది.
కానీ నిజానికి అప్పుడే కదా అసలు కథ మొదలయ్యేది!
బద్రికి, నాకు కూడా - మా అసలు కథ పెళ్లితో మొదలయింది. జీవితం కలిసి నేర్చుకోబోతున్న పాఠమయ్యింది.
వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కథ ఒక కలగా తోస్తుంది.
కలగా మారిన ఆ కథని కబుర్లుగా కొనసాగించాలని - నిజంగా అయితే అనుకోలేదు.
కానీ ... ఓ ఆర్నెల్ల క్రితం "అమ్మా! నువ్వు నాన్నగార్ని ఎలా కలిశావో రాసుకున్నావు. మరి నన్నెలా కలిశావో ఎప్పుడు రాస్తావు?" అనడిగాడు అన్నజింక.
వాడి పక్కనే కూర్చుని - నోరు తెరవకుండానే - మెరిసే నవ్వు కళ్ళతో "నా సంగతి కూడా చెప్పు మరీ!" అంటున్నట్టున్న బుజ్జిజింక.
అప్పుడే అనుకున్నా - బద్రి, నేను - కలిసి జీవితానికి - చెప్పుకున్న - చెప్పుకుంటున్న "త్వామనురజామి!"ని కొనసాగించాలని.
ఆ కొనసాగింపుకి ఈ రోజు (డిసెంబరు 19) కన్నా మించిన మంచి రోజేది?!
కదిలిపోయిన కాలం - రాసేసిన పేజీలు
కదులుతున్న కాలం - పేర్చుకుంటున్న మాటలు'
కలిపి కూర్చుకున్న - బ్రతుకు పుస్తకం
మా "త్వామనురజామి"
మళ్ళీ మొదలెడుతున్నా!
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
Can't wait Laltha!
రిప్లయితొలగించండిOne more month to go! Thanks for your interest in my blog, Indrani!
తొలగించండిSabar ka phal :-)
రిప్లయితొలగించండిSo will wait..
Thank you :)
తొలగించండి👍
రిప్లయితొలగించండిThanks anDi, Neeharika!
తొలగించండిTwo months passed....
రిప్లయితొలగించండిఇంకొక్క నెల, దీప గారు! మార్చ్ నుంచి రాస్తాను. Thanks for your comment!
తొలగించండి