ఆగస్టు నెల వనితా మాలికలో నా వ్యాసం ఇక్కడ చదవండి.
Rome లో రోమన్ లా ఉండాలట. ఇది ఎక్కడ విన్నా, చదివినా కుంచెం (బుడుగు తెలుగు లో ‘కొంచెం’ అన్న మాట
) ఆలోచనలో పడుతుంటాను – అంటే ఏంటబ్బా అని. అలా విన్నసారీ, చదివినసారీ కుంచెం కుంచెం ఆలోచించీ, చించీ – ఇలా అభిప్రాయపడిపోయానన్నమాట. ఎలా అంటే – మనం ఇప్పుడు (మనం అంటే మనందరం కాదండీ – రాయల్ వుయ్ అన్నమాట) ఉత్తర అమెరికా లో ఉద్యోగం చేస్తున్నామా- ఆఫీసు కి వెళ్ళేటప్పుడు నాకు కంచి పట్టు చీరలు ఇష్టం, చక్కగా జరీ అంచుతో మెరుస్తూ, మెరిపిస్తూ వుంటాయి అని మా అనాతవరం అగ్రహారంలో లాగ కాసె పోసి కట్టుకుని వెళ్దాము అనుకున్నాననుకోండి - ఇంకంతే నేనెక్కడికో వెళ్ళబోయి దారి తప్పి అక్కడికి వచ్చాననుకుంటారు. (మర్చిపోయాను చెప్పడం…నేను బెంగుళూరు లో నా మొదటి వుద్యోగం లో చేరినప్పుడు రోజూ నా ముచ్చట తీరేలా ప్రతి రోజూ పట్టు చీరేలే కట్టుకు వెళ్ళేదాన్ని. అందులోనూ బెంగుళూరు లో ఆ రోజుల్లో వేసంకాలం లో కూడా చల్లగా వుండేదేమో హాయిగా ‘మించుతూ’ ఎంజాయ్ చేసేదాన్ని. ) . అందుకని అమెరికా లో ఆఫీసు కి మాత్రం చక్కగా కుదురుగా బిజినెస్ casuals లో వెళ్తేనే అందరి కంటికీ, నా వంటికీ సుఖం. కరెక్టే కదా?
సరే! మరి అది కరెక్ట్ అయితే మరి ఎందుకు ఈ టాపిక్ మొదలు పెట్టింది – అమెరికాలో అమ్రేకా వాళ్ళలాగే ఉంటోంది కదా- మరింక ఇందులో రోము-రోమను అంటూ ఇలా బ్లాగడం ఎందుకూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను ఆగండి మరీ…
మొన్నామధ్యన మా ఇంటికి ఇండియా నుంచి ఒక ఆంటీ-అంకుల్ చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు మా ఇంటి ముందు ముగ్గు, మా వంటింట్లో చిన్న దేవుడి బీరువా చూసి – “ఎంత బాగా పెట్టావు లల్లీ! మా అమ్మాయిని ఇలాగే ముగ్గు వేయాలమ్మా వాకిట్లో అంటే – What Mummy! Don’t you know why they say – Be a Roman in Rome – when we are in America, we have to be like Americans. If not, they would treat us like untouchables- అనేసింది” అని పాపం ఆ ఆంటీ నిట్టూర్చారు.
అది విని నేను కుంచెం ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే మా ఇంట్లో ఏ చిన్న పూజ, భోగిపళ్లు, కిరణ్ పుట్టిన రోజు లాంటివేవి జరిగినా – నూరు సెంట్ల అమెరికన్ (అంటే మన పదహారణాల తెలుగు అమ్మాయిలా అన్నమాట) అయిన జాకీ పీటర్స్, జమైకన్ వేనెట్ హార్పర్ వచ్చి – ఆంధ్ర పులిహోర లో సాంబారు, టమాటా పచ్చడి (spoon తో)కలుపుకుని తిని, మళ్ళీ మూడింటికి మసాల టీ తాగి – సాయంత్రం డిన్నర్ కి కూడా ప్యాక్ చేసుకుని వెళ్తారు. అంతే కాక నేను వేసిన ముగ్గులని వాళ్ళ ఐ-ఫోన్ లలో ఫుటోపులు తీసుకెళ్తారు. ఆఫీసు లో Matt Erickson కి నోరూరేలా వర్ణించి చెప్తారు. మరి నేను రోము-రోమను లా లేనే- మరెంటబ్బా నన్ను ఎవరూ అస్పృశ్యతా వ్రతం చేయమనట్లేదు అనుకున్నాను.
సరే అసలు సంగతికి వస్తాను – ఈ పిట్ట కథలన్నీ ఆపేసి- ఆ ఇండో-అమెరికన్ ‘వాట్ మమ్మీ’ గాళ్ కి ఒక బుల్లి బొమ్మలాంటి గాళ్ వుంది. అది తన మమ్మీ మాట వినేసి- Be an American while in America అనేసుకుని లా-అఫ్ -ఇన్వెర్స్ -ప్రపోర్షన్సు ఫాలో అయిపోతూ పెద్దదయ్యేకొద్దీ బుల్లి, బుల్లి గౌనులేస్కుని, తన పద్నాలుగో ఏట - ఇంకో బుజ్జి బాయ్ ఫ్రెండ్ తో చెట్టా-పట్టా లేసుకుని తిరుగుతూ మన ‘వాట్ మమ్మీ’ కి హాయ్ చెప్పింది అనుకోండి – మన వాట్ మమ్మీ అప్పుడు హథాత్తుగా కళ్ళ ముందు రింగులు-రింగులు తిప్పుకుని తన తల్లి కి చెప్పిన రోము-రోమను ని గుర్తు చేసుకుంటుందా? లేకపోతే తన బుల్లి తల్లి-బుజ్జి ఫ్రెండ్ ని చూసి My li’l girl knows the rules అని మురిసిపోతుందా? ఇది మాత్రం నా ఆలోచనకీ, ఊహకీ ఏమీ అంతు పట్టకుండా వుంది.
ఇంతకీ రోం లో రోమన్ లా ఉండడమంటే మనం వున్న ప్ర్రాంతం లో కాలమాన పరిస్థితులకి తగినట్లు, మన విధి నిర్వహణలకు భంగం కలగకుండా నడుచుకోవడం తప్ప మన ఉనికినే మరిచి “మన” తనానికి దూరం కాకూడదని నా అభిప్రాయం – ఎందుకంటే ఏ దేశం లో వున్నా – ఎన్ని రకాల భక్ష్యాలు రుచి చూసినా – అమ్మ తిన నేర్పిన “పప్పు ఆమే” రుచికరం. ఎన్ని రకాల వస్త్రాలు ధరించినా అమ్మ నేర్పిన చీరకట్టే అందం. ఎన్ని భాషలు మాట్లాడినా – ఆనందం లో “అమ్మయ్య” అన్నా, ఆవేదనలో “అమ్మా” అన్నా అమ్మ భాషే మధురం. అమ్మ మనకి ఇచ్చిన సంప్రదాయమే మనకి శ్రీ రామ రక్ష.
lalli,
రిప్లయితొలగించండిkeep writing, this is a nice piece of writing for what mummy's...
waiting for many more..
Veena
Thanks, Veena.
రిప్లయితొలగించండిYou're the first one to visit my blog & post comments.
Keep visiting....
~Lalli
What an amazing blog andi! Manam maatladukunnatlu, Ee vishaym na manasuku baaga deggerainadi. Chaala baadha padathanu la ki aLa ki theda lekunda mastladinapoudu janam. However, I try to be optimistic and hope that our language will be revived. On another topic, I wish we have Manabadi in our town.
రిప్లయితొలగించండిThanks Manorama for taking time to read my blog. I believe this comment is intended for another blog post of mine: "మాయా"క్షరాలు. Thanks once again.
తొలగించండి