8, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఎసెస్. రీ - ఎసెస్. వూ


తెల్లవారింది .

ఎసెస్. వు   లేచి బెడ్రూం లోంచి బయటకి రాబోయి కాలు చటుక్కున లోపలి తీసుకున్నాడు. అలాగే వెళ్ళిపోతే ఇంకేమయినా ఉందా?! గబగబా వెనక్కి వెళ్లి వార్డ్రోబ్ లో తగిలించి వున్న నైట్-గౌన్ తీసి వేసుకుని ఈపాటికి చిన్న సైజ్ కిష్కింధలా కోలాహలంగా వుండాల్సిన ఇల్లు - అదీ ఆదివారం పూట ఇంత నిశ్శబ్దంగా వుందేంటా అనుకుంటూ ఎసెస్. రీ ని వెతుక్కుంటూ  వంటిటికి అవతల వున్న బాల్కనీ లోకి వెళ్ళాడు.

అక్కడ రెయిలింగ్ కి దగ్గరగా కుర్చీ వేసుకుని ఐఫోన్ చూసుకుంటూ ఎసెస్. రీ కనిపించింది.

అటు పక్కగా పనిమనిషి వాషింగ్ మెషీన్ లో బట్టలు వేస్తూ "నా నిన్నా మరియలారే" అని కన్నడ కంఠీరవ రాజకుమార్ పాటేదో పాడుకుంటోంది.

 ఎసెస్. వు రావడం చూసినా వాళ్ళిద్దరూ చూపు తిప్పలేదు - పాట ఆపలేదు - రెస్పెక్టివ్లీ.

ఒక నిముషం అక్కడే నించుని ఇంక ఉండబట్టలేక అడిగేశాడు - "సుందరీ - వైదేహి, విరించి ఏరీ?" అని.

 పెళ్ళైన పదేళ్ళకి రకరకాల వేడుకోళ్ళు-మొక్కుబళ్ళు అందరు దేవుళ్ళకి కిట్టించాక పుట్టిన వరప్రసాదాలు - వైదేహి, విరించి. లేవగానే వాళ్ళని చూడందే ఎసెస్. వు కి తోచదు.

"అబ్బ! హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యు వూ? కాల్ దెం హీ అండ్ చీ. ", ఫోన్ మీంచి చూపు తిప్పకుండానే విసుక్కుంది రీ.

ఒక ఆరు నెలలు ఆన్ సైట్ అమెరికా వెళ్లి వచ్చింది సీలా సుబ్బారావు గారి భార్య సీలా సుందరి. అక్కడ వున్నప్పుడు వాళ్ళ క్లైంట్ మేనేజర్ ఎప్పుడూ వాళ్ళ టీం లీడ్ చాంగ్ ని తెగ పొగిడే వాడట. పైగా టైగర్ మదర్ పుస్తకం రాసిన ఏమీ చౌ ఆ చాంగ్ కి స్వయానా కజిన్ అట. ఒక ఆటోగ్రాఫుడు కాపీ ఒకటి సుందరి కి ఇచ్చాడు. అసలు కజిన్స్ అయిన ఆ చాంగు, చౌవూ ఎంత దగ్గర కజిన్సో తెలీదు కానీ ఆ పుస్తకం చేతికి వచ్చిన దగ్గర్నుంచీ సీలా సుందరి కాస్తా  ఎసెస్. రీ అలియాస్ టైగర్ మామ్ (ఆవిడ వాట్సాప్ గ్రూప్ పేరు అదే మరి) గా మారిపోయింది.


ఇంక ఇండియా కి తిరిగి వచ్చినప్పటినుంచీ అందరి పేర్లూ మార్పించేసింది - అఫిడవిట్లూ, న్యూస్ పేపర్ , గజెట్ నోటిఫికేషన్స్ తో - అప్పటినుంచీ వాళ్ళు నలుగురూ - ఎసెస్. వు, ఎసెస్. రీ, ఎస్వీ. హి , ఎస్వీ. చి.

పేర్ల మార్పుతో పాటు ఇంకా రకరకాల మార్పులు తెచ్చింది తన ఇంటికి - వూ కి నైట్-గౌన్, తనకి బాత్ రోబ్ తో సహా. హాయిగా లుంగీ కట్టుకుని రంగురంగుల నెమలిలా తిరిగే వూ కి ఆ నైట్-గౌన్ అసలు నచ్చలేదు. కానీ రీని కాదనే ధైర్యం చేయలేకపోయాడు.

 అన్నిటికన్నా వూ కి ఎంతో ఇష్టమైన బారెడు జడని బాబ్ చేయించేసుకుంది. అదేంటీ అని బాధపడిన అమ్మ-అత్తలని "మీరేగా ఎప్పుడూ అనేవారు బుద్ధిమంతుల జుట్టు భుజాలు దాటదని" అని దబాయించేసింది.

ఎవరైనా అమెరికా అంటారు, లేకపోతే యూరప్ అంటారు నీకెందుకు చైనా అంటే అంత ఇష్టం అంటే - అమెరికా అంతటి దేశమే వాళ్ళ జండా దగ్గర్నుంచీ "మేడ్ ఇన్ చైనా" వస్తువులే వాడుతుంది. నాకందుకే చైనా నచ్చుతుంది - అంటుంది రీ. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఎక్కడ చైనీస్ నేర్చుకుందామంటుందో - ఈ వయసులో ఆ బాధ పడలేను అని భయపడి దాదాపు ఆరడుగులు పొడుగుండే  సీలా సుబ్బారావు "పేరు"కే  కదా అని ఎసెస్. వు గా కుదించబడడానికి ఒప్పుకున్నాడు. పిల్లలదేముంది - అమ్మతో పాటు చీనా మాయ లో పడిపోయారు .

"ఓకే ఓకే ! వేర్ ఆర్ హీ అండ్ చీ ?"

"దే విత్ సుమీ మామీ డౌన్ స్టెయిర్స్ "

అమెరికా ఆన్ సైట్ వెళ్ళాల్సిన అమ్మాయికి పెళ్లి కుదరడం తో అనుకోకుండా అవకాశం వచ్చి వెళ్ళింది కానీ - సుందరమ్మది అచ్చ తెలుగు బ్రాండే. నోరారా చక్కగా పలకగల తెలుగు వచ్చినా - అబ్బే - అసలు పొరపాట్న కూడా అందమైన తెలుగుతనాన్ని ఒప్పదు - వచ్చీరాని ఇంగ్లీష్ లోనే ముద్దు ముద్దు గా "యా... యా...యయయ్య... యా...యా..." అని యా-భాషే టాకుతూ వుంటుంది.

"అదేంటి? ఇంత పొద్దున్నే వాళ్ళింటికి ఎందుకు వెళ్లారు? బ్రేక్ ఫాస్ట్ ఏమైనా తిన్నారా?"

"ఇవాళ ఇంట్లో నో కుకింగ్"

"బట్ వై?"

"టుడే మై స్టార్స్ ఆర్ నాట్ గుడ్"

"నీ నక్షత్రాలు బాలేదా? అదేంటి?" - వూ నోరు తెరిచేశాడు.
"7:49 టు 9:19 ఎయం - రాహుకాల; 12:54 టు 3:24 పీఎం యమగండ; 8:23 టు 9:46 పీఎం వర్జ్య"

నోరు తెరిచేశాడు ఎసెస్. వు "ఇదెప్పట్నుంచీ ?"


"యు డోంట్ నో వూ -  మై  టీం లీడ్ చాంగ్ వాంటెడ్ మీ టు  షిప్ హిం పంచాంగ. ఐ గో బై  దట్ టూ"

పొద్దున్నే శోష వచ్చినట్టయ్యి సీలా సుబ్బారావు / ఎసెస్. వు శిలలా నిల్చుండిపోయాడు. వంటక్కూడా నక్షత్రాలు, తిథులూ చూడడం మొదలు పెట్టింది అంటే తన జీవిత నౌకకి టైటానిక్ స్టేటస్ వచ్చినట్టు అనిపించి ఒక్క నిముషం ఉక్కిరిబిక్కిరి అయాడు.

ఇంతలో పనమ్మాయి పరిమళ పరిగెత్తుకుంటూ వచ్చింది - "అక్కా! హాలు - బుస్ బుస్! " అంటూ.

ఉత్తర కర్నాటక నుంచి వచ్చిన పరిమళకి కన్నడ, తుళు  తప్ప వేరే భాష రాదు. ఎసెస్. రీ తెలుగు నేర్వనివ్వదు.

గ్యాస్ స్టవ్ మీద పెట్టిన పాలు పొంగి పోతున్నాయి అని ఇంకెలా చెప్పాలో తెలీక అలా కన్నడలో అరుచుకుంటూ వచ్చింది.

ఒక్క ఉదుటున వంటింటిలోకి పరిగెత్తాడు ఎసెస్. వు - క్రితం సారి అలాగే అయితే స్టవ్ కడిగిన అనుభవం మరి.  అప్పటికే పాలు పొంగి వేడికి స్టవ్ మీద అట్ట  కట్టేశాయి.

గ్యాస్ స్టవ్ ఆపి ఇవతలకి రాగానే ఎసెస్. రీ ఎవరితోనో మాట్లాడుతోంది ఐఫోన్లో.

"వాట్? యు డోంట్ హావ్ స్కైప్ ఐడీ? వాట్ యార్ - యూ టెల్లింగ్  మీ నౌ?"

ఏదో చెప్పబోయిన వూ ని చెయ్యి పైకెత్తి మణికట్టు దగ్గర వంచి ఆపు అన్నట్టు సైగ  చేసింది.

పక్క నుంచి పరిమళ నెమ్మదిగా అంటోంది "అక్క ఈవత్తు వ్రత మాడ్తిద్దారె. అదిక్కే మక్కళన కెళగడె అవురి మనేగే కళుసిద్దారె" (అక్క ఈరోజు వ్రతం చేసుకుంటున్నారు. అందుకే  పిల్లలను కిందవారి ఇంటికి పంపారు"

దగ్గరలో పండగలేమీ లేవుగా ఏ వ్రతమో అర్థం కాక అమెరికా నుంచి వచ్చిన కొత్త అలవాటైన నైట్-గౌన్ ని జారిపోకుండా సర్దుకుంటూ, ఇంకో చేత్తో బుర్ర గోక్కుంటూ రీ మాటలు వింటూ నించున్నాడు వూ.

ఓ పది నిముషాలయాక స్కైప్ ఐడీ ఎలా క్రియేట్ చేయాలో చెప్పి "*$%!" అనుకుంటూ ఫోన్ ఆఫ్ చేసింది.

"ఏంటి రీ ఈ హడావిడి?"

"ఇవాళ ఈవెనింగ్ అయాం డూయింగ్ లక్ష లైకు నోం "

"అబ్బ సుందరీ ! ఈ ఒక్కసారికీ తెలుగు లో చెప్పవా ప్లీజ్ ! అమెరికా వెళ్లి వచ్సినప్పటినుంచీ నీ యాక్సెంట్ పట్టుకోవడం కష్టం అవుతోంది"

పడిపోయింది సుబ్బారావు మెచ్చుకోలుకి.

"అదే ! లక్ష లైకుల నోము"

"అదెక్కడి నోము ? మీ అమ్మ, మా అమ్మ ఎపుడూ చేసినట్టు గుర్తు లేదే" మేనమామ కూతుర్నే పెళ్ళాడిన సుబ్బారావు ఆలోచనతో కూడిన ఆక్రోశం.

"అదే మరి! అన్నీ పాతవే చేస్తామేంటి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ లో కూడా. ఇది నా డిజైనర్ నోము"

"నువ్వు డిజైన్ చేశావా?"

"ఊ ! నేనే . చాంగ్ పేటెంట్ కూడా చేయమన్నాడు"

"ఆ చాంగ్ కనిపిస్తే వాడిని మడిచి చిమీ చాంగా చేస్తాను" పళ్ళు కొరుక్కున్నాడు ఎసెస్. వు.

"అలా అయితే నేను చెప్పనంతే"

"అబ్బే! చాంగ్ ఎంత మంచి ఐడియా ఇచ్చాడో అని ఆశ్చర్య పోతున్నాను. నీకు తెలుసుగా ఐ అప్రిషియేట్ సచ్ క్రియేటివ్ ఐడియాస్. టెల్ మీ అబౌట్ లక్ష లైకు నోం"

"యూ ! చో చ్వీట్ " సుబ్బారావు బుగ్గని ఓ మైలు దూరం లాగి వదిలింది సుందరి.
పళ్ళ బిగువున భరించాడు.

"ఇవాళ సాయంత్రం అయిదింటికి మొన్న ఉత్సవ్ డాట్ కామ్ లో కొన్న పటోలా చీర కట్టుకుని నేను మన ఐమాక్ లో స్కైప్ ఆన్ చేసి కూర్చుంటాను. అదే టైం కి నా వాట్సాప్ టైగర్ మామ్ గ్రూప్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో స్కైప్ లో లాగిన్ అయి నా చీర చూసి వెంటనే ఫేస్బుక్ లో లైక్ కొడతారు. వెంటనే వాళ్ళ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లైక్ కొడతారు. అలా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టిన లక్ష లైకులు ఓ గంట లో వచ్చేస్తాయి. లక్ష లైకులూ పూర్తవ్వగానే అప్పుడు ఉద్యాపన చేసుకుంటాను"

"దీనికి స్కైప్ ఎందుకు? నీ ఫేస్ బుక్ లో పెడితే సరిపోతుంది కదా! మళ్ళీ ఆ ఉద్యాపన ఏంటి?"

"సర్లే  ! మొన్న ఆ శ్రీవారి ముచ్చట్ల బ్రాండ్ ఎంబాసడర్ లేడూ - అదే ఆఫీస్-స్పౌస్ వుందని పోజ్ కొడితే వున్న స్పౌస్ వదిలేసింది - ఆ భుజంగ రావు గారు - ఆయన "Without Spouse There Is No Spice in Life" అని ఫేస్-బుక్ స్టేటస్ పెడితే మా తింగర మేళం అంతా  కలిసి 100 లైకులు, కీపిటప్పులు పెట్టారు. ఎవరు ఏం పెట్టినా వాళ్లకి లెక్క వుండదు. అందుకే వాళ్ళ లైకుని లైవులో కేప్చర్ చేద్దామని ఈ వ్రతం డిజైన్ చేశా. స్కైప్ లో ముందు జాయిన్ అయిన రెండు డజన్ల మందికి స్క్రీన్-ప్రైజెస్ ఉంటాయని చెప్పా. అవి వుద్యాపనలో ఇస్తానని ఈ-వైట్ పంపా " ఎలా వుంది నా ఐడియా అన్నట్టు చూసింది రీ.

అసలే పొద్దున్నించి బాగాలేని గ్రహ-స్థితుల, వక్ర నక్షత్రాల గమనం వల్ల కనీసం కాఫీ కూడా అందక నీరసం గా వున్నాడేమో రీ పక్కనే వున్న కుర్చీలో నెమ్మదిగా కూర్చుని అడిగాడు - "ఇంతకీ ఎం ప్లాన్ చేశావు నీ స్క్రీన్-ప్రైజెస్ కి ?"

 "ఏముందీ! మొన్న వచ్చిన బోనస్ తో ఓ ఇరవై నాలుగు ఉప్పాడ చీరలు కొన్నా. ఇవాళ సాయంత్రం స్కైప్ లో లైకుల వ్రతం అయిపోగానే మనింటికి వస్తారు - నువ్వూ పిల్లలూ ఓ రెండు గంటలు ఎక్కడికయినా వెళ్లి రండి ... " అని ఇంకా ఏదో ప్లాన్ చెప్తూ వుంది రీ - అప్పటికే వూ కి వూపిరాడక శోషొచ్చి పడి పొయాడు .









21 కామెంట్‌లు:

  1. 'హాలు బుస్‌ బుస్‌' అంటే హాల్లోకి పాము వచ్చిందేమో అని దడుచుకున్నాను సుమండీ!
    కన్నడ హాలన్నమాట.
    ' జీవితనౌకకు టైటానిక్‌ స్టేటస్‌' ఇక్కడ గట్టిగా పైకి నవ్వేశాను.
    ఎస్సెస్‌రీ గారికి, వాయనానికి చైనీస్‌ ఫుడ్‌ కానీ చైనీస్‌ రెస్టారెంట్ కూపాన్‌స్‌ కానీ ఇమ్మని ఐడియా ఇవ్వాలనుకొంటున్నాను.
    On a serious note, have come across a lot of people who undergo a metamorphosis after a hop (stint) out of the country. Nothing exaggerating about that fact.
    Loved the satirical tone of the plot and subtle humour. Enjoyed it thoroughly.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హాలు బుస్‌ బుస్‌' అంటే హాల్లోకి పాము వచ్చిందేమో అని దడుచుకున్నాను సుమండీ! కన్నడ హాలన్నమాట.

      నా భాష కొంచెం తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ - మిక్స్ తో కొంచెం చౌ-చౌ బాత్ లా వుంటుంది - మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు కూడా. అందులో మళ్ళీ కొంచెం కోనసీమ యాస, కొంచెం గుంటూరు మాట, ఇంకొంత ఒంగోలు మీద ప్రీతి అన్నీ కలిపేసి వుంటాయి. సందర్భానుసారంగా చేతికొచ్చిన భాషలో రాసేసినా వీలయినంతవరకూ అర్థాలు రాస్తాలెండి. నా భాషతో సర్దుకుని సరిగా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.


      ఎస్సెస్‌రీ గారికి, వాయనానికి చైనీస్‌ ఫుడ్‌ కానీ చైనీస్‌ రెస్టారెంట్ కూపాన్‌స్‌ కానీ ఇమ్మని ఐడియా ఇవ్వాలనుకొంటున్నాను.

      మీ వాయనం ఐడియా తో పెట్టిన వ్యాఖ్య నా కథ-ఇడ్లీ కి మంచి పచ్చడి-వ్యాఖ్య లా కుదిరింది. బావుంది. థాంక్స్!

      తొలగించండి
    2. నా భాషా అంతే నండీ! కొంచం తమిళం కూడా వచ్చి చేరి ఓ మినీ నేషనల్‌ ఇన్‌టెగ్రేషన్‌ లా ఉంటుంది. పగోజి, గుంటూరు, అనంతపురం యాస లతో నా తెలుగు భాష అలరాలుతుంటుంది. మీరు పూర్వాశ్రమం లో బెంగుళూరు వాస్తవ్యులని మీ బ్లాగ్‌ పోస్ట్ ల
      నుండి అర్ధమవుతోంది. Could our paths have crossed by any chance????

      షడ్రసోపేతం గా ఉన్న ఈ పోస్ట్ ను ఇడ్లీ తో పోల్చుకొని, నా చిన్ని వ్యాఖ్యకు మంచి పచ్చడి స్టేటస్‌ ఇచ్చినందుకు ఏం చెప్పారో తెలియడం లేదు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. థాంక్స్, దీపు. నువ్వు తెలుగు చదువుతున్నావు అంటే సంతోషమేసింది. కథ నీకు నచ్చిందంటే ఇంకా బోల్డు ఆనందమేసింది. Your comment made my day!

      తొలగించండి
  3. లల్లి - ఐ లైకు యువర్ స్టొరీ వేరి మచ్చు !! నువ్వు వ్రతం చెయ్యకుండానే లక్ష likes కొట్టేసావు కాబట్టి , I am కమింగ్ to "ఉద్యాపన". ఉప్పాడ చీర Reday కదూ !! రాహుకాలం , యమగండాలు లేని సమయం చూసుకొని మరి వస్తాను లే !!

    Hilarious !! Thoroughly Enjoyed..

    Keep writing...

    Raadhika

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధికా!

      నీ లైకు ఒక లక్ష లైకుల పెట్టు. తొందరగా రా మరి - నీ వాయనం సిద్ధంగా వుంది.

      తొలగించండి
  4. excellent satire - very neatly achieved. laugh out loud comedy. beautiful language. i thoroughly enjoyed reading this...and will definitely pass this link on to like-minded humorists. keep writing!

    రిప్లయితొలగించండి
  5. Loved it Lalitha!
    Lungi kattukuni rangu rangeland nemalila...hilarious!
    Laksha likula nomu👌😆

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంకో లక్ష లైకులు పూర్తి నీ కామెంట్ తో :) థాంక్ యూ!

      తొలగించండి
  6. ఉప్పాడ చీర మాత్రం చాలా టెంప్టింగ్ ఆఫర్. అన్నట్టు నాకు స్కైప్ ఐడీ ఉందండోయ్. :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకో ఉప్పాడ చీర రిజర్వ్ చేశాను :)
      ఇంతకీ నాకు స్కైప్ ఐడీ లేదు, ఫేస్ బుక్కూ లేదు. ఎసెస్. రీ నా కన్నా చాలా advanced.
      Thanks for your comment!

      తొలగించండి
  7. ముందుగా Gamini Hanuman గారికి థాంక్స్ అండీ.. అక్కడెక్కడో లక్షలైకుల నోము అని తను రాసిన కామెంట్ చూసి, వెతికి ఇక్కడ తేలాను.. మాంచి నవ్వులు సొంతం చేసుకున్నాను :-) చాలా బాగుంది..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను ఫిక్షన్ రాయడానికి కొంచెం మొహమాటపడతానండీ. నేను రాసిన మొదటి కథ ఇది. నవ్వులు పంచినందుకు ఆనందంగా వుంది. కమెంట్ వెంట వెతుక్కుంటూ వచ్చి చదివినందుకు చాలా థాంక్స్!

      మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన హనుమాన్ కీ బోల్డన్ని థాంక్స్ !

      తొలగించండి
  8. లలిత గారూ,
    నా బంధోత్సవం లో మీరు పెట్టిన కమెంటు చూసి ఇటు వచ్చా. తెగ నవ్వుకున్నాను.
    https://anaganagaokurradu.blogspot.com/2016/09/bandhotsavam.html

    రిప్లయితొలగించండి
  9. Super hilarious.. malladi venkatakrishnamurthi taruvata Mere inka...uppada cheeralalu emaina migilaya 2016 post kada
    Appude telusunte likula vratam lo participate chesundedanni naku Skype id undi 😄

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోస్ట్ పాతదైతే ఏమయింది? నువ్వెప్పుడొస్తావో చెప్పు ఉప్పాడచీర నీ కోసం ఒకటి వుంచమని రీ కి చెప్తాను :))

      తొలగించండి