చల చల్లని మంచు ముద్దల శీతాకాలాన్ని అలా అలా మెల మెల్లని మాటల కరగింప జేసి సాగనంపి ఇదిగో ఇలా ఇలా వచ్చేసింది నులి వెచ్చని వసంతం.
శిశిరపు భూమికి రంగులద్దే సరదాలో ఆకుల అలంకారాలు పుడమికి పంచిన చెట్లు మళ్ళీ వివిధ వర్ణ పత్ర, పుష్పాలంకృతలై బంగరపు ఎండల మేలిముసుగులో స్వయంవరం కోసం వేచి వున్న వృక్ష కన్యల్లా వరసగా దారికి అటూ ఇటూ నించుని వున్నాయి.
అప్పటిదాకా చలికి ముడుచుకుని ఇళ్ళ కిటికీల లోంచి వచ్చేపోయే కార్లని లెక్కపెడుతూ రోజులు నెలలలా గడిపిన వాడిన ముఖాలు చిరు దరహాసపు మొలకలతో తలుపులు తెరచి వీధులలో నవ్వుల పువ్వులు పంచుదామని వచ్చి గల గలా మాటల పేరులు అల్లుతున్నారు.
రంగు రంగు సీతాకోకచిలుకల్లా అల్లి బిల్లి ఆటలతో బుల్లి తువాయిల్లా గంతులేస్తూ దారికే పూచిన పూవుల్లా వున్నారు పిల్లలు.
ప్రతీ ఉగాదికీ ఇదే చిత్రం మనసులో
ప్రతీ ఉగాదికీ ఇదే ఆనందం బ్రతుకులో
ఉగాది అంటే నోరారా మాటలే
ఉగాది అంటే చిరు నవ్వుల వెలుగులే
సంవత్సరం లో ఒక్క రోజు ముఖ-పుస్తకం కాక ముఖాలు చూస్తే
ఏడాదిలో ఒక్క రోజు వాట్సాప్ వదిలి మాటలు కలిపితే
పేరుకి దుర్ముఖి అయితే ఏం - ఉగాది పూటైనా అవదా సుముఖి?
శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభకామనలు!!!!

Just beautiful.
రిప్లయితొలగించండిLoved the simile in the second paragraph.
The last three lines of the post are the punch lines. Hits you where it really hurts. :)
Thanks for your comment! There was no intention to "punch" anyone though :) Just wrote like a reminder to myself to make time to talk to someone, instead of keeping my fingers to message on phone.
తొలగించండిVery beautifully written.. Like poetry in the guide of pride. Happy ugadi to you too...
రిప్లయితొలగించండిThank You for your nice comment & Ugadi wishes!!!
తొలగించండిAs you know I like poetry flowing in free-verse than to constrain it to a fixed-length line format. Anyway I am too practical to be good at aesthetics required for a poem.
A good one in your very own inimitable style Lalitha!
రిప్లయితొలగించండిReminded me of your Vihanga articles.
You have the knack of subtly highlighting the grossly ignored facts of life.
Keep writing. Any plans of writing columns or features for Vihanga or any other webzine?
Thank You - for liking my style.
తొలగించండిWriting a column for a Webzine requires lot of effort & a stream-lined thought process to construct an article that can appeal to everyone. As of now, I am in a mood & phase of life where I'm keeping some "me-time" to do whatever that helps me keep myself occupied & satisfied - which in turn makes lives around me happy.
For now, blogging is the way to go :)
చల చల్లని మంచు ముద్దల శీతాకాలమా అదెక్కడుంది. ఇప్పుడున్నవి రెండే రుతువులు. ఎండాకాలం. అగ్నికాలం.
రిప్లయితొలగించండినేనున్న ప్రదెశంలొ అలాగే వుంది లెండి - ఇంకా.
తొలగించండిచిగురు పూతల పచ్చలు, వేసవి ఎండల కెంపులు, ఆకురాలు పుష్యరాగాలు, మంచు ముద్దల ముత్యాలు చూడగలుగుతున్నాము - మా అదృష్టం :)
లలితా --
రిప్లయితొలగించండినిర్మలమయిన నీ మనసు
నిష్కలమయిన నీ నవ్వు
మధురమయిన నీ కవిత్వం
మనోహరమయిన నీ ఆలోచన
లలితమై ,లలాటమై - ఈ' దుర్ముఖి' సదా మీకు' సుమిఖి' అవుగాక !!!
రాధిక
రాధికా!
తొలగించండిమరీ పొగిడేయకు - మొహమాటంగా వుంది :) ఇక్కడ ఎలాగూ వేప పూతలు, మామిడి చిగుర్లు, కోయిల కూతలు వుండవు కదా! అందుకే నాకు అనిపించిన, కనిపించిన దృశ్యాన్నే ఉగాదికి అన్వయించుకుని ఏదో నాలుగు లైన్లు రాశాను. దాన్ని కవిత అంటున్నావంటే అది నీ దృష్తి మంచిదనం తప్పితే ఇంకెమీ కాదు.
వీలు చూసుకుని చదివినందుకు థాంక్స్!