కిందటి 19 చెప్పిన కబుర్లు: త్వామనురజామి - 15 - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట!
థర్డ్ సెమిస్టర్ - నవంబర్ నెల.
కార్తీకమాసం - శరదృతువు.
తక్కువైన పగళ్లు - మిక్కిలైన రాత్రులు.
శీతవేళలో - చుట్టూ వున్న కొండలు తేలికైన ఎండతో బంగరపు పూత పూసుకున్నహేలలో - రోజులు ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుండును అనిపించేవి.
పైగా డిసెంబర్‌లో రాబోతున్న క్రిస్మస్ నుంచి సంక్రాంతి దాకా వుండే సెలవులు, న్యూఇయర్ సెలబ్రేషన్స్ గురించి బోల్డన్ని కబుర్లు, పప్పి, కుట్టీలకి కొనబోయే సర్ప్రైజ్ గిఫ్టులు - చెప్పలేనంత ఉత్సాహంగా ఉండేది.
అందులోనూ ఈసారి నా క్లాస్‌మేట్స్ అందరికీ న్యూఇయర్ గ్రీటింగ్స్ పంపించాలి అనుకుని అందరి దగ్గరా వాళ్ళ ఇంటి అడ్రెస్సులు తీసుకున్నాను. ఎందుకో వాళ్లకి చెప్పలేదు - సర్ప్రైజ్ చేయాలి కదా మరి!
సర్ప్రైజ్ గిఫ్టులు, గ్రీటింగ్స్ కార్డ్స్ కొనడానికి గాంధీరోడ్‌లో వున్న ఆర్చీస్ గ్రీటింగ్ కార్డులుండే షాప్ -శిల్పం- కి వెళ్ళినప్పుడు శ్యామల, పుని కనిపించారు - వాళ్ళూ నాలాగే Santy-మోడ్‌లో వున్నారు (అమ్మాయిలం కదా Santa కాలేం కాబట్టి).
నన్ను చూడగానే శ్యామల గుర్తు చేసింది - "సెకండ్ సెమిస్టర్ పరీక్షలు అవగానే వస్తానన్నావు మా రూంకి - ఇప్పటి దాకా రాలేదు నువ్వు"- అంటూ.
నవంబర్ ఆఖరివారంలో ఇంటర్నల్స్ అయిపోగానే వస్తానని చెప్పి తన ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్ ఎక్కడ వుందో, అక్కడికి ఎలా వెళ్ళాలో అడిగితే చెప్పింది - SVU - SBM (School of Business Management) గేట్లోంచి తిన్నగా లోపలి వస్తే ఎడం పక్కగా ఉంటుంది అని.
అలా శ్యామలతో కబుర్ చెప్తూ న్యూఇయర్ షాపింగ్ కానిచ్చేసి హాస్టల్‌కి వచ్చాను.
ఇంటర్నల్స్ అయిపోయాయి. అనుకున్నట్టుగానే శనివారం సాయంత్రం అరుణాచంచల దగ్గర పర్మిషన్ తీసుకుని శ్యామల వాళ్ళ హాస్టల్‌కి బయల్దేరాను.
తీరా SBM దగ్గరికి వెళ్ళగానే - అదే మొదటిసారి ఆ క్యాంపస్‌కి వెళ్ళడమేమో - కొంచెం కన్ఫ్యూజ్ అయి కుడివైపుగా వున్న బిల్డింగ్ వైపు వెళ్ళాను. అక్కడ అసలు అమ్మాయిలే కాదు - అసలెవరూ కనిపించలేదు. శీతాకాలపు సాయంత్రం చీకటి తొందరగా పడిపోతుంది కదా - కొంచెం బెరుకుగా అనిపించింది. వెనక్కి నా రూంకి వెళ్ళిపోదామని గబగబా నడుస్తూ వచ్చేస్తూ వుంటే - ఇంతలో ఆ బిల్డింగ్‌లోంచి ఒకతను వస్తూ కనిపించాడు. "హమ్మయ్య" అనుకుంటూ ఆగి - ఎలాగోలా పలకరించి శ్యామల రూంకి దారి అడగాలి అనుకుని "May I know your name?" అనగానే అతను "సతీష్" అని చెప్పి - అప్పటికే అతనికి అర్థం అయింది నేను అక్కడికి పొరపాటుగా వచ్చానని. తన పేరు చెప్తూనే - "These are men's hostels" అని చెప్తూ నాతో నడిచి వచ్చి ఆ పక్కనే వున్న గర్ల్స్ హాస్టల్ దగ్గర వదిలి వెళ్ళాడు. మాటల్లో తను MBA చేస్తున్నట్టు చెప్పాడు. సతీష్‌కి థాంక్స్ చెప్పి హాస్టల్ దగ్గర కనిపించిన ఒక అమ్మాయిని శ్యామల పేరు, ఇంజనీరింగ్ బ్రాంచ్ చెప్పి తన రూమ్ ఎక్కడ అనడిగితే శ్యామల తనకి తెలుసని చెప్పి - రూం దాకా తీసుకెళ్ళి తలుపు కొట్టింది.
శ్యామల నన్ను చూడగానే బోల్డంత సంబరపడింది. చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాక - శ్యామల, పుని వెళ్ళి ఈరోజుకి చదువుకుంటూ రూంలోనే భోంచేస్తామని చెప్పి- వాళ్ళ మెస్ లోంచి నాక్కూడా భోజనం తీసుకొచ్చారు.
ఆ ఒక్క రాత్రికి నేను తన రూంకి వెళ్ళడం, రాత్రి ఒంటిగంట దాకా కబుర్లు చెప్పుకోవడం - శ్యామల, నేను - ఏదో పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయాం. అంతే కాదు - ఆరోజు రాత్రి పదకొండు కాగానే - అన్ని రూముల్లో లైట్లు ఆగిపోయి అందరూ పడుకున్నాక - నేను, శ్యామల, పుని స్వెట్టర్లు వేసుకుని బయటికి వెళ్ళి వాళ్ళ హాస్టల్ రూం బయట వున్న ఒక చెట్టెక్కి కూర్చుని - కబుర్లు చెప్పుకుని, ఫోటోలు తీసుకుని లోపలి వచ్చేశాం. ఆ చెట్టు-కొమ్మాధిరోహణం శ్యామల నాకు మాటిచ్చిన ప్రి-న్యూఇయర్-గిఫ్ట్ :)
తెల్లవారితే ఆదివారం - పొద్దున్నే లేచి బ్రేక్‌ఫాస్ట్ టైంకి నా హాస్టల్ రూంకి వచ్చేశాను - వాళ్ళకి నేనుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని.
సెలవులకి ఇంటికి వెళ్ళేలోగా ఒకసారి తిరుమల నడిచి ఎక్కి - నడిచి దిగి వద్దామని ప్లాన్ చేసుకున్నాం మా క్లాస్ అంతా. డిసెంబర్ 21కి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. 12న తిరుమల వెళ్దామని అనేసుకున్నాం.
డిసెంబర్ నెల ఉత్సాహంగా మొదలయింది. ఏదో ఒక MIS సెమినార్ తప్ప ఇంక టెస్టులు కూడా ఏమీ లేవు.
ఒకరోజు క్లాసులు అయిపోగానే రూంకి వచ్చి ఆ తర్వాతి రోజు MIS సెమినార్ కోసం నోట్స్ తయారు చేసుకుందాం అనుకుంటూ వున్నాను - ఇంతలో కింద నుంచి "603-A లలితా - విజిటర్స్" అని వినిపించింది.
ఇప్పుడు నాకోసం వచ్చే విజిటర్స్ ఎవరబ్బా - ఎవరైనా మా ఊరినుంచి వస్తుంటే నాన్న ఫోన్ చేసి చెప్తారు కదా - అనుకుంటూ మూడో అంతస్తులో వున్న నా రూమ్ నుంచి - కళ్ళకడ్డం పడుతున్న జుట్టుని ఒక చేత్తో పట్టుకుని, కాళ్ళకడ్డం పడుతున్న స్కర్ట్‌ని ఇంకో చేత్తో పట్టుకుని - రెండేసి మెట్లు ఒకేసారి దిగుతూ - దాదాపు పరిగెడుతూ - విజిటర్స్ రూంలోకి వెళ్ళాను.
తీరా అక్కడికి వెళ్ళాక టేబుల్ దగ్గర రెండు కుర్చీల్లో కూర్చున్న ఇద్దరు అబ్బాయిలు తప్ప ఎవరూ లేరు. వాళ్ళే నాకోసం వచ్చిన విజిటర్స్ అని అర్థం అయింది.
నేను తిన్నగా వెళ్ళి వాళ్ళిద్దరి ఎదురుగుండా వున్న ఇంకో కుర్చీలో కూర్చున్నాను.
"హాయ్"
"హలో"
ఇద్దరూఒకరి తర్వాత ఒకరుపలకరించారు నన్ను.
అందులో ఒకతన్ని గుర్తు పట్టాను - దసరాకి ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రైన్‌లో ఎక్కిన పింక్ షర్ట్ అబ్బాయి.
కాకపొతే అతన్ని నేను గుర్తుపట్టనట్టు చూసి "హాయ్"అని "Who are you? May I know your names? Why are you here?" అని మధ్యలో వాళ్ళకి జవాబు చెప్పే గ్యాప్ ఇవ్వకుండా వరసగా ప్రశ్నలు అడిగాను.
వాళ్లిద్దరూ ఒకరి కేసి ఒకరు చూసుకుని నా ప్రశ్నలకి జవాబివ్వడం మొదలు పెట్టారు.
"I'm RajaSekhar" (ఇతనే ఇంతకు ముందు కలిసిన inky-pinky-ponky).
"I'm Rama Krishna" (ఇతన్ని ఇంతకు ముందు చూడలేదు).
"ఓకే - మీరెవరో నాకు తెలీదు - ఎందుకిలా వచ్చారు?"
"మేమిద్దరం SVUలో MBA చేస్తున్నాము. నిన్ననే మా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఒకసారి హాయ్ చెబ్దామని వచ్చాము" అన్నాడు రాజశేఖర్ అన్న అబ్బాయి.
నాకప్పటికే కొంచెంకొంచెంగా వున్న కోపం హెచ్చేసింది.
వీళ్ళెవరో నాకు తెలీనే తెలీదు - పైగా కాలక్షేపం కబుర్ల కోసం నా దగ్గరికి వస్తారా - హన్నా! - అనేసుకుని - ఇంక వీళ్ళతో మంచిగా మాట్లాడితే కుదరదు అంజెప్పి - "మీరెవరో నాకు తెలియనప్పుడు అసలు నేను మీతో మాట్లాడతానని ఎలా అనుకున్నారో అర్థం కావట్లేదు. మీరింక వెళ్ళొచ్చు" - అనేసి వెనక్కి తిరిగి చూడకుండా నా రూంకి వెళ్ళిపోయాను - మళ్ళీ రెండేసి మెట్లెక్కుతూ.
రూంలోకి రాగానే శ్రీలత అడిగారు - "ఎవరు లల్లీ వచ్చింది?" -అంటూ. నేనుచెప్పినది వింటూనే నన్ను టీజ్ చేస్తూ తను "హాయ్ హాయ్ లల్లీ ! MBA అబ్బాయిలు వస్తే కబుర్లు చెప్పకుండా పంపించేస్తావా" అంటుంటే నవ్వేసి నా MIS నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టాను.
ఆ అబ్బాయిల సంగతి అప్పుడే మర్చిపోయాను.
డిసెంబర్ 12న అనుకున్నట్టుగానే మా క్లాసులో అమ్మయిలందరం తెల్లవారుఝామునే బయల్దేరి అలిపిరి దాకా బస్సులో వెళ్ళి - అక్కడి నుంచి తిరుమల నడిచి వెళ్ళాము. నడక దారిలో కారం-దోసెలు తింటూ, జీలకర్ర పొడి కలిపిన నిమ్మకాయ షోడాలు (సోడా కాదు అప్పటి పిలుపు షోడానే :) ) తాగుతూ, మా మాటలు, నవ్వులతో కొండలన్నీ చెవులు చేసుకుని వినేలా - మధ్య మధ్యలో కొండల మధ్యలో రీసౌండ్ వచ్చేలా అరుస్తూ - కొండలు మాతో మాట్లాడుతున్నాయి అనుకుని మురిసిపోతూ - తెగ హుషారుగా ఏడుకొండలూ ఎక్కి - ధర్మదర్శనం చేసుకుని - గుడిలోనే పులిహోర, దద్ధోజనం, లడ్డు ప్రసాదం తిని, గుడి ఎదురుగుండా మెట్ల దగ్గర గాజులు, పూసలు కొనుక్కుని - సాయంత్రం నాలుగింటికి బయల్దేరి కిందకి నడిచి దిగడం మొదలు పెట్టాము.
ఒక పదిహేనేళ్ళ అబ్బాయి - రవికుమార్ అని - మమ్మల్ని - అక్కా - అని పిలుస్తూ మాట కలిపి సరదాగా కబుర్లు చెప్తూ మాతోపాటు నడక దారిలో వచ్చాడు. వాళ్ళ నాన్నగారు TTD లో పనిచేస్తారు అని చెప్పి సెలవులకిమా ఊళ్ళకి వెళ్ళేలోగామాకు లడ్డూలు, వడలు తెప్పించి పెడతానన్నాడు. మేమందరం అలిపిరిలో మా హాస్టల్ వైపు వెళ్ళే టౌన్‌బస్ ఎక్కేదాకా మాతో వుండి - తన అడ్రెస్ ఇచ్చి వాళ్ళింటికి రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళాడు.
మొదటిసారేమో - ఏడుకొండలు నడిచి ఎక్కడం, మళ్ళీ అదేరోజు నడిచి దిగిరావడం - కాళ్ళు బాగా నొప్పొచ్చాయి - మా అందరికీ. ఏ ఇద్దరు కలిసినా ముందు కాళ్ళ గురించి పరామర్శలే - ఆ తర్వాతే ఇంకే మాటలైనా.
డిసెంబర్ 15న సురేష్‌కుమార్‌గారు నన్ను SV ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు - SPIC-MACAY గురించేదో మాట్లాడాలి అని. ఆ రోజు బుద్ధిగా నాకిష్టమైన పసుపు రంగు ప్లెయిన్ షిఫాన్ చీర కట్టుకుని ( formal attire for SPIC-MACAY చీరే మరి! ) మరీ వెళ్ళాను.
నాతో పాటు నా జూనియర్స్ శుభా రామస్వామి , రజని, అరుణ కూడా వచ్చారు. తీరా అక్కడికి వెళ్ళాక మా నలుగురిని SBM లో వున్న లలితారామకృష్ణన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ స్టాఫ్‌రూంలో కూర్చుని వచ్చే ఏడాది మేము ఏర్పాటు చేయాల్సిన ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతూ - వున్నట్టుండి సురేష్‌కుమార్‌గారు నన్ను అడిగారు - "నువ్వు తిరుపతి చాఫ్టర్ కల్చరల్ సెక్రెటరీగా చేస్తావా?" అని.
ఆయన చెప్పిన దాన్ని బట్టి SPIC-MACAY కల్చరల్ సెక్రెటరీగా నేను చేయాల్సిన పని - మెంబర్ల నంబర్లు పెంచడం. ఎక్కువమందిని చేర్చడానికి వీలుగా మెంబర్‌షిప్ ఫీ పదిహేను రూపాయలకి తగ్గించారు.
నాకు "ఓస్ ఇంతేగా!" అనిపించింది. ఆనందంగా తలని వీలైనంత స్పీడుగా ఊపి "సరే" అన్నాను.
ఆ తర్వాత - ఆ స్టాఫ్‌రూంలోంచి బయటికి వచ్చేటప్పుడు నా పాదాలు - భూమికి ఒక రెండంగుళాల పైనే - నడిచి వుండాలి.
అలా SBM లోంచి బయటికి వస్తుంటే - అప్పుడే క్లాస్ అయినట్టుంది - MBA చదివే అమ్మాయిలు, అబ్బాయిలు బయటకొచ్చి నించుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ వున్నారు.
నేనూ, నా జూనియర్స్ ముగ్గురూ - మేం నలుగురం - SPIC-MACAY కబుర్లు, సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేం చేయబోయాలనుకుంటున్నామో వాటి గురించిన కబుర్లు - చెప్పుకుంటూ మా హాస్టల్‌కి వచ్చేశాం.
ఇంక ఆర్రోజుల్లో మా ప్రయాణం - ఇంటికి వెళ్ళబోతున్నామని అందరికీ చాలా హ్యాపీగా వుంది. డైనింగ్‌హాల్‌లో కలిసిన ప్రతీసారి ఎవరితో మాట్లాడినా - నువ్వే ట్రైన్‌కి వెళ్తున్నావు అంటే నువ్వే ట్రైన్‌కి అంటూ అవే ప్రశ్నలు, అవే జవాబులు.
ఈ సందడంతా చూసి నేను పాడేసుకున్నానిలా ...
(ఇది నా కొసరు పాట - ఇంకో అసలు పాటకి - పట్టేయండి ఆ అసలు పాటని మరి!)
సెలవులు రావాలి ...మేమంతా - ఇంటికి వెళ్ళాలి!
హాయ్! ఉరుకుల పరుగుల చకచక ఛుకుఛుకు ట్రైన్ ఎక్కాలి మా ఇల్లు చేరాలి...
ఆ టైటిలు పాటతో పాటు ఇంకో సరదా-కొసరు వచ్చేనెల దాకా ... పాత పాటలు వినే, కొసరు-పాటలకి అసలు-పాటలు కనిపెట్టే సరదా వున్న నా పాట-మిత్రుల కోసం ....
అదేను హాలిడే అదేను జాలిడే
అమ్మాయిలంత కూడి ఇంటికెళ్ళె సందడే ...
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

Lalita, college kaburlu chaala chaala baaga gurthu vundi neeku.
రిప్లయితొలగించండిమర్చిపోలేని రోజులవి, అమృతవల్లీ :) Thanks for your comment.
తొలగించండిమీ child hood and college days నాకు తెలియదు but blog లో చక్కగా చదువు తున్నా👌👌
రిప్లయితొలగించండిThanks, Syamala!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅరె! మీరు పాటలు సరిగ్గా చెప్పారు అని భలే సంతోషంగా అనిపించింది. బదులు ఇవ్వడం ఆలస్యం అయింది - ఈలోగా మీరు కమెంట్‌ని తొలగించారు. Anyway, Thank You for reading my blog, Satya garu!
తొలగించండిసత్యగారు నాకోసమే తొలగించారల్లే ఉందండీ కామెంట్.. గతనెల ఉరుకుల పరుగుల మధ్య మీ బ్లాగ్ మిస్సయ్యాను. అసలు "పరుగులు తీయాలి" కొసరు "ఇదేమి లాహిరి" పాటలేనా సత్యగారు చెప్పినది.
తొలగించండిక్రమం తప్పకుండా నా బ్లాగ్ చదువుతున్న మీకు బోల్డన్ని థాంక్స్! పాటలు సరిగ్గా చెప్పారు - ఇంకొన్ని థాంక్స్!
తొలగించండిఒక్కసారంటే ఒక్కసారి కలిపిన వాళ్ళ పేర్లు కూడా నీకు భలే గుర్తుంటాయే!
రిప్లయితొలగించండిన్యూ ఇయర్ కు గ్రీటింగ్ కార్డ్స్ కొనడం,
ట్రైన్లకు, బస్ లకు రిజర్వేషన్స్ చేయించుకునే హడావుడి,
ఏ ట్రైన్? ఏ బస్? ఏ టైమ్ కు? ....ప్రశ్నలు
సేమ్ సీన్ డైనింగ్ హాల్లో, డిసెంబరులో మా హాస్టల్ లో కూడా.
ఏ హాస్టల్లో విన్నా కబుర్లవేనేమో :)
తొలగించండి
రిప్లయితొలగించండిరంగురంగుల లోకమందున రాజ్ఞులిచ్చట గాలివా
టంగ కొండల రాయు చెంతన టంకరించుచు భాసిలన్
చెంగుచెంగున చేవగూర్చుచు చెట్టుపుట్టలు శోభిలన్
రింగురింగుల భావనమ్ములు లివ్వులివ్వున వీచెనే !
ఏమండోయ్ !
ఇంతకీ త్వామనురజామి అంటే ఏమిటి ?
జిలేబి
మీ పద్య-వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిమీరు ఎప్పుడైనా ఈ సమాధానం చూడగలిగే వీలుంటే త్వామనురజామికి అర్థం ఈ పోస్ట్ వ్యాఖ్యల్లో చూడండి: http://boldannikaburlu.blogspot.com/2016/05/blog-post.html
తొలగించండిఅది చూసాకే నండి :)
త్వాం
అనురజామి - దీని నెట్లా విడదీసి చదవాలండి ?
జిలేబి
నెను నా కథకి మంచి పేరు పెడదామని వెతికి ఏదో సంస్కృతం సైట్లో దొరికిన వాక్యాన్ని తీసుకున్నాను. అనురాగం కలిగి వుండడం అనే క్రియకి అనురజ-ధాతువవుతుందేమో అనుకుని. అనురజామి - ఉత్తమపురుష/వర్తమానకాలంలో వచ్చే ధాతురూపం ఏమో అని కూడా అనేసుకున్నాను - భవామి, వదామి, అనురజామి - లాగా. మీ వ్యాఖ్య చూశాక "భవ, వద" లాగా "అనురజ" అనే ధాతు వుందేమో వెతికాను. ఎక్కడా కనిపించలేదు :(
తొలగించండి
తొలగించండికంగ్రాట్యులేషన్స్
కొత్త పదాన్ని సృష్టించారు !
జిలేబి
నేను సైతం నియాలజిస్ట్ నైతి. ధన్యోస్మి! :)
తొలగించండి