కిందటి 19 చెప్పిన కబుర్లు
దసరా ... అంటే ఎలాంటి పండగ?
మహా సరదా పండగ - పది రోజులకు పైగా సెలవులు పప్పి, కుట్టిలకి, నాకు - పైగా లక్ష్మి దొడ్డ, ప్రశాంతి వస్తారు. వీలైతే బాబూ వస్తాడు - చిన్న శ్రీను ఇక్కడే వున్నాడు.
వీటన్నిటికీ తోడు ప్రతి దసరాకి - వారం రోజుల ముందునుంచీ ఇల్లు దులపడం, కడగడం - తెల్ల నామురాయి నీళ్ళల్లో తడిపి - ఆ తడి నాముతో ఇల్లంతా నా చేత మా అమ్మ వేయించే ముగ్గులు - మా అమ్మ - ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ స్నేహితులతో, మాష్టారితో కలిసి ఇంటింటికి వెళ్ళి - "ఏదయా! మీ దయా మామీద లేదు - ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు - అయ్యవారికి చాలు ఐదు వరహాలు - పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు" - అంటూ ఎలా పాడేవారో చెప్తూ ఇష్టంగా గుర్తు చేసుకునే పాటలు - దుర్గాష్టమి రోజు అమ్మవారు యుద్ధం చేసి అలసిపోయి ఉగ్రంగా ఉంటుందని - మహర్నవమి రోజుకి మాష చక్రాలు, ఆవడలు చేయాలని - కథలు చెప్తూ - ఆవిడ చెప్పే కథలకి మావైన అర్థాలు తీసుకుని అమ్మని ఉడికిస్తూ మేం ముగ్గురం మాలో మేమే నవ్వుకునే అల్లరి కబుర్లు, నవ్వులు - ఇల్లు మహా సందడిగా ఉండేది.
ఈ సందడికి తోడు కొత్త బట్టల హడావిడి. నేను హాస్టల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికే అమ్మ డ్రెస్ మెటీరియల్ కొని ఉంచేది. నాకు గుర్తుండి - నా MCA అయ్యేవరకూ ప్రతి పండక్కీ మా ముగ్గురికీ ఒకే రంగు బట్టలు ఉండేవి. పప్పి, కుట్టి ఇంట్లోనే ఉండేవారు కాబట్టి వాళ్ళ డ్రెస్సులు పండక్కి ఒక వారం ముందుగానే తయారైపోయేవి - కుట్టించుకోవడం, చున్నీలు జిగ్-జాగ్ చేయించుకోవడం. నావి మరి - నేనింటికి వచ్చి నాకెలా కావాలో చెప్పేదాకా అమ్మ కుట్టించేది కాదు - అందుకని పండగ ముందు రోజు వరకూ టైలర్ చుట్టూ తిరగడం నాకు అలవాటే.
ఆ తిరగడంలో నాకు బోల్డంత ఉక్రోషం వచ్చేసేది - ఒక్కోసారి అసలు టైంకి ఇస్తారో ఇవ్వరో అని టెన్షనూ వచ్చేది . ఈ దసరాకలాగే అయ్యింది. ఎప్పుడూ కుట్టే ఆస్థాన-టైలర్ నాగేశ్వర్రావు దగ్గర మిషన్ ఏదో రిపేర్ ఉందని నావి కుట్టననేశాడు. సరే - ఇంకేం చేయాలో తెలీక అప్పుడే 18 అడ్డరోడ్డులో మా ఇంటికి ఎదురుగుండా రోడ్డులో కొత్తగా పెట్టిన టైలర్ షాప్‌లో ఇచ్చి వచ్చాను - చుడీదార్ కుట్టి ఇవ్వమని. అష్టమి సాయంత్రం దాకా ఇవ్వనే లేదు.
ఎక్కెడికి వెళ్లినా , అదెంత చిన్నపని అయినా మా ముగ్గురికీ కలిసి వెళ్ళడం అలవాటు కాబట్టి - నవమి పొద్దున్నే తొమ్మిదింటికి ముగ్గురం టైలర్ దగ్గరికి వెళ్ళాం.
నేను షాప్ ముందు ఉన్న రెండు మెట్లు ఎక్కి "నా డ్రెస్ కుట్టడం అయిందా?" అనడిగితే - తలొంచుకుని ఎవరిదో పరికిణీ కుడుతున్న అతను తల కూడా ఎత్తకుండా లేదన్నట్టు తలూపాడు.
"ఇంకెప్పుడిస్తారండి? ఇలా అయితే ముందే చెప్పి ఉండచ్చు కదా - కుదరదని. ఇలా ఆలస్యం చేస్తే ఎలా?" - కోపమో దుఃఖమో - మాటలు గబగబా వచ్చేస్తున్నాయి.
పక్కనే తన-మార్కు చిరునవ్వుతో పప్పి, నవ్వితే నేనేడుస్తానేమో అన్నట్టు - బుగ్గల్లో నవ్వు దాచుకుని పగలబోతున్న బుడగలా కుట్టి - ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకుంటున్నారు.
అప్పటికీ ఆ టైలరతను తల తిప్పలేదు - పాపం - అతనికి అప్పటికే చాలా కుట్టాల్సినవి వున్నాయి - పైగా ఎదురుగా నా దబాయింపు ఒకటి.
అంతే - ఇంక కోపం పట్టలేక - "సరే అయితే! - మీరిప్పుడు కుట్టిచ్చినా నేను తీసుకోను - మీరే ఉంచుకోండి" అని పరిగెట్టుకుంటూ - వెనక నుంచి పప్పి, కుట్టి పిలుస్తున్నా ఆగకుండా ఇంటికొచ్చేసి - చేతికందిన పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెట్టాను. నాక్కోపం వస్తే మాట్లాడకుండా పుస్తకాలు చదివేసేదాన్ని - అలా అయితే వాళ్ళ కేసి చూడడం, మాట్లాడడం ఎవాయిడ్ చెయ్యొచ్చు కదా!
ఓ రెండు పేజీలు చదివానో లేదో - వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చారు -వస్తూనే కుట్టి అడిగింది - "అదేం కోపమే లల్లెమ్మా! డ్రెస్సు కుట్టడం లేట్ అయిందని వాళ్ళనే ఉంచేసుకోమంటే ఎవరికే నష్టం?" - అంటూ.
ఆ మాట విన్న మా అమ్మ - నాకొచ్చే ఏ బాధకైనా, కోపానికైనా ఆవిడ పెట్టే లింకు నా భోజనానికే - ఎప్పట్లాగే "అందుకే కడుపునిండా తినాలి - అప్పుడైతే మాట్లాడడానికి ఓపిక ఉంటుంది - ఆ విసుగు తగ్గుతుంది" - అంటూ - ఇంకా ఏదో అనబోతూ ఉంటే - పప్పి అమ్మ మాట మధ్యలోనే అందుకుని "తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్" - అంటూ ఆవిడ స్టాక్-డైలాగ్‌ని పూర్తి చేసేలోగా - "ఆ... కండ కలవాడేను మనిషోయ్ - (మొక్కజొన్న) కండెలు నమిలెడిది లల్లోయ్!" - అంటూ దానికింకో రాగయుక్తపు-పొడిగింపు కలిపింది కుట్టి.
ఇలా పొంతన లేకుండా ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే - ఎప్పుడొచ్చారో నాన్న - వెనకనుంచి "అలా ఎక్కువ నవ్వితే మీ నోళ్ళు చెవులదాకా సాగిపోతాయి - ఎప్పుడో ఇలాగే" అని అన్నారో లేదో - అంతగా సాగిపోతే మేమెలా ఉంటామో ఊహించుకుని ఇంకొంచెం ఎక్కువ నవ్వుకున్నాం మా అమ్మాయీ-త్రయం.
మొత్తానికి ఆ రోజు సాయంత్రం పప్పి, కుట్టి నేను లేకుండా వెళ్ళి టైలర్ దగ్గర్నుంచి నా డ్రెస్ తీసుకొచ్చారు. నా కొత్తబట్టల కథ సుఖాంతం.
సరదా సరదాగా దసరా అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హుషారుగా ఉంటుందో - ఇంటి నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు అంతే బెంగగా ఉంటుంది.
మళ్ళీ అందరూ వచ్చి ట్రెయిన్ ఎక్కించారు - మా అమ్మ ఎప్పట్లాగే Higginbotham's లో CSR, Tinkle, Wisdom - ఇలాంటి పుస్తకాలన్నీ కొనుక్కొచ్చి నాకిచ్చింది. ఎప్పట్లాగే నేనున్న ట్రెయిన్ కదిలి నేనింక కనిపించను అనేదాకా చేతులూపుతూ నించుని - సెండాఫ్ ఇవ్వటానికి వచ్చిన ఇంటిల్లిపాదీ ఇంటికెళ్ళిపోయారు.
ఈసారి నాతోపాటు శ్రీలత కూడా ఉండడంతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం ఎప్పటికన్నా హుషారుగానే సాగింది.
మళ్ళీ back-to-pavilion. థర్డ్ సెమిస్టర్ కదా - పైగా సత్యం సర్ టీచ్ చేసే OB నాకు తెగ నచ్చేసేది - సబ్జెక్ట్, దాంతో పాటు ఆయన టీచ్ చేసే పధ్ధతి.
ఒక కవిత కూడా రాసుకున్నాను అప్పుడు - అదొక bookmark గా తయారుచేసుకున్నాను కూడా.
Whenever i think of Behavioural Science
My mind will be full of **Robbins, Davis, Luthans
Who were introduced by you
They give me utmost joy too
As long as the clouds trail on the hills
I will be coming to your class
With Pleasure - but not with pressure
(** Stephen Robbins, Ketih Davis, Fred Luthans are the authors who wrote the Organizational Behaviour text books)
ఇవే కాకుండా సత్యం సర్ క్లాస్ నచ్చడానికి ఇంకో కారణం కూడా ఉంది - ఆయన క్లాస్ అయిపోగానే నెక్స్ట్ క్లాస్ మొదలయేలోగా ఒక పదినిముషాలు టైం ఉంటుంది కదా - అప్పుడు మా CC (కంప్యూటర్ సెంటర్) ముందున్న మావిడిచెట్టు కాయలు కర్రతో కొట్టి కోసి ఇచ్చేవారు - మా మధ్యాహ్నపు స్నాక్ అవి - డైనింగ్ హాల్ నుంచి తెచ్చుకున్న ఉప్పుతో కలిపి.
ముందు సెమిస్టెర్స్ కన్నా ఈసారి నా క్లాస్‌మేట్స్‌తో కూడా ఎక్కువగా కలిసి క్లాసెస్‌కి వెళ్ళడం, వాళ్ళ రూముల్లోకి వెళ్ళి కొంచెం సేపు కూర్చుని రావడం మొదలుపెట్టాను.
103-సి లో ఉషశ్రీ, అపర్ణ, ప్రగతి, మాధవీలత - 502-బి లో నిగమ, నిరుపమ, మల్లిక - 506-బి లో పద్మప్రియ, సునీత; 501-ఏ లో అమృతవల్లి, ఉషారాణి, 201-బి లో అన్నపూర్ణ, సోనియా - వీళ్ళని వారానికి ఒక్కసారైనా వెళ్ళి మాట్లాడి వచ్చేదాన్ని.
రోజూ సాయంత్రం ఏడింటికో ఎప్పుడో హాస్టల్ మేట్రన్స్ హాజరు తీసుకునేవాళ్ళు - అమ్మాయిలందరూ హాస్టల్ బయటకి వెళ్లి ఎటెండెన్స్ వేయించుకుని రావాలి.
నేను ఆ ఎటెండెన్స్, డిన్నర్ అయిపోయాక - షిప్లీని పట్టుకుని - కళ్యాణి బ్లాకులో నా రూమ్ నుంచి - రెండు బ్లాకులని లోపలనుంచి కనెక్ట్ చేసే డైనింగు హాల్ ముందు నించి - కిన్నెరలో వున్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని.
రాత్రి డైనింగ్ హాల్ మూసేశాక అక్కడ కొంతమంది అమ్మాయిలు కూర్చుని చదువుకుంటూ ఉండేవారు.
నేను ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పో, పాటలు పాడో - రాత్రి పదకొండింటికి నా రూంకి వెళ్ళే టైంకి వాళ్ళింకా చదువుకుంటూనే వుండేవాళ్ళు. కాకపొతే సగం నిద్రావస్థలో వుండేవాళ్ళేమో - ఆ రాత్రిపూట జడ సరిగ్గా వేసుకోవడం రాక వదిలేసిన జుట్టుతో, చేతిలో షిప్లీతో వచ్చే నన్ను చూసి - ఉలిక్కిపడి - వాళ్ళ వీపులు వాళ్ళే - థూ థూ - అని కొట్టుకుని - నన్నొక్కసారి గట్టిగా విసుక్కునేవాళ్ళు - ఆ జడేసుకోవచ్చు కదా - జడుసుకుని చస్తున్నాం - అంటూ. అందులోనూ అమ్మ ఏరికోరి కుట్టించిన బాంబే డైయింగ్ - తెల్ల పువ్వుల నైటీలు వేసుకునే దాన్ని. వాళ్ళలా అనగానే - హహ్హహ్హ- అని నవ్వి పరిగెట్టేదాన్ని. దెబ్బకి రూముల్లోకి వెళ్ళిపొయ్యేవాళ్ళు.
మొత్తానికి రోజులు భలే పరిగెడుతున్నాయి.
నా సీనియర్స్ శ్రీలత, సంగీత, గుత్తి పద్మజ, పద్మజవల్లి - వాళ్ళు అప్పటికే ఫోర్త్ సెమిస్టర్.
(వాళ్ళు మామూలుగా అయితే ఫిఫ్త్ సెమిస్టర్లో ఉండాలి - కానీ మా కన్నా ఒక సెమిస్టరే ఎక్కువ - ఒక పూర్తి సెమిస్టర్ టైం లాస్ అయిందని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళు.)
వాళ్ళు నలుగురూ కలిసి బాలాజీ కాలనీలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్‌లో Unix / Shell Scripts & C నేర్చుకుందామని చేరారు. వాళ్ళతో పాటే నేనూను - ముందు ముందు పనికొస్తుంది కదా అని.
సంగీత హైద్రాబాదునుంచి తన TVS 50 తెచ్చుకుంది - ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంటుందని. ఈ Unix క్లాసెస్‌కి వెళ్ళేటప్పుడు నన్ను తన వెనకాల ఎక్కించుకుని తీసుకెళ్ళేది.
సాయంత్రం కాగానే - వారానికి ఎన్ని రోజులు వెళ్ళేవాళ్ళమో గుర్తు లేదు కానీ వెళ్ళిన ప్రతి రోజూ ఆ యూనివర్సిటీ ఎవెన్యూ రోడ్డులో - జుయ్ జుయ్ మంటూ - వెళ్ళిన ఆ TVS రైడ్స్ తెగ ఎంజాయ్ చేశాను నేను.
నవంబర్ మొదటివారంలో ఫోన్ చేసినప్పుడు నాన్న చెప్పారు శ్రీనన్న బెంగుళూరునుంచి తిరుపతి వస్తున్నట్లు. ఈలోగా శ్రీనన్న దగ్గర్నుంచి కూడా ఉత్తరం - తను నవంబర్ థర్డ్ వీక్‌లో తిరుపతి వచ్చి - ఒకవేళ నాకు గనక కుదిరితే తనతో పాటు కడపలో ఉన్న సుందరి పిన్ని వాళ్ళింటికి తీసుకుని వెళ్తానని.
నాకింక బోల్డంత ఆనందం - శ్రీనన్న వస్తున్నాడని. శ్రీనన్నతో కబుర్లు చెప్తూ ఉండడం నాకు చాలా ఇష్టం. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా తను వస్తున్నాడంటే ఆ రోజు కాలేజ్ మానేసేదాన్ని.
నా క్లాస్‌మేట్ అమృతవల్లిది కూడా కడప - తను చేసే smocking work నైటీల మీద, డ్రెస్సుల మీద చాలా బావుండేది. తను ఎంత స్టూడియస్సో - అంతే జోవియల్ & స్టైలిష్.
తనకి నేను కడప వెళ్తున్నానని చెప్పగానే - తను కూడా చాలా సరదా పడింది - ఎందుకంటే ఆ వారం తను కూడా ఇంటికి వెళ్తున్నాను అని - నన్ను వాళ్ళింటికి రమ్మని కూడా చెప్పింది.
వెంటనే గబగబా వాళ్ళింటికి డైరెక్షన్స్ అడిగి నోట్ చేసేసుకున్నాను. నాకు సుందరి పిన్ని వాళ్ళ ఇంటి ఎడ్రెస్ తెలీదు కాబట్టి ఈ ఊరుకైనా ల్యాండ్-మార్క్ బస్టాండ్ కదా - అందుకని అక్కణ్ణించి దారి చెప్పమన్నాను.
బస్టాండ్ దగ్గర నుంచి అమృతవల్లి చెప్పిన ల్యాండ్-మార్క్స్: అప్సర థియేటర్, టీటీడీ చౌల్ట్రీ, అన్నమాచార్య విగ్రహం, దేవి స్టూడియో - ఆ స్టూడియోకి ఇవతల వాళ్ళిల్లు.
నాకింక భలే ఎక్సయిటెడ్‌గా అనిపించింది - కడప ప్రయాణానికి రోజులు లెక్కపెట్టుకోవడం మొదలుపెట్టాను.
శ్రీనన్న హాస్టల్‌కి శుక్రవారం సాయంత్రం వచ్చాడు - శ్రీలత, సంగీత, పద్మజ, పద్మజవల్లిలకి తనని పరిచయం చేశాను - తను కాసేపు మాతో కబుర్లు చెప్పి - రేప్పొద్దున్న కడపకి వెళ్తున్నాము రెడీగా వుండు అని నాతో చెప్పి తను హాటల్‌కి వెళ్ళాడు. తనటు వెళ్ళగానే - అంతవరకూ మాట్లాడిన మా సీనియర్ పద్మజవల్లి - He is so informative - అనగానే నాకు భలే గొప్పగా అనిపించింది - మా శ్రీను కదా - అందుకని.
మరుసటిరోజు బయల్దేరి కడపలో సుందరి పిన్ని ఇంటికి వెళ్ళాము. మమ్మల్ని చూడగానే సుందరి పిన్ని తెగ సంబరపడ్డారు. శనివారం సాయంత్రం శ్రీనన్న ఇంట్లో పిల్లలందరినీ - అంటే చైతన్య, సౌజన్య లతో పాటు నన్ను - తీసుకుని ఆమీర్ ఖాన్ - దిల్ - సినిమాకి తీసుకెళ్ళాడు .
ఆదివారం పొద్దున్న పదింటికి ఎడ్రెస్ వెతుక్కుంటూ అమృతవల్లి వాళ్ళింటికి వెళ్ళాము - నేను, శ్రీనన్న. అక్కడ ఒక అరగంట కూర్చుని - అమృతవల్లిని, వాళ్ళ అమ్మగారిని పలకరించి - మళ్ళీ ఇంటికి వచ్చేశాం. నాకు ఆరోజు అమృతవల్లి వాళ్ళ ఇంట్లో షోకేసులో ఉన్న చిన్న-చిన్న ఇత్తడి సామాను, ఇంకా బోల్డన్ని బొమ్మలు - బోల్డు నచ్చేశాయి - ముఖ్యంగా ఆ ఇత్తడి సామాను చూడగానే మా నాన్నమ్మ నాకిచ్చిన చిన్న ఇత్తడి డేగిసాలు, గోకర్ణాలు, నేతి జాలీలు గుర్తుకొచ్చాయి. కాకపోతే నా దగ్గరున్నవి ఎక్కడో పోగొట్టుకున్నాను - అప్పటికే.
ఆ తర్వాత రోజు - సోమవారం - కాకపోతే సుందరిపిన్ని ఉండిపొమ్మన్నారని - ఒక్కరోజు కాలేజ్ పొతే పర్వాలేదని ఆదివారం సాయంత్రం కాకుండా సోమవారం పొద్దున్న బయల్దేరి వచ్చి నన్ను హాస్టల్ దగ్గర దింపేసి శ్రీనన్న బెంగళూరు వెళ్ళిపోయాడు.
మళ్ళీ - కథ మామూలే!
పొద్దున్న - కాలేజ్‌లో క్లాసులు -
సాయంత్రం - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట! - అంటూ ఆడుతూ పాడుతూ రోజులు సాగుతూ...
నేనిక్కడ ఆగుతూ ...
మీరీలోగా ఆ టైటిల్ పొడుపు-పాట విప్పుతూ
దాంతో పాటు ఈ కొసరు పాట పని పట్టుతూ...
క్లాసు లేదని... డోంటీచు మాకని
మాటినీ ఉందని ... మమ్ము నేడు వెళ్లనీ
ఓ సారూ ... నో హాజరూ !
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

పాడనా తెనుగుపాట, ప్రేమ లేదని ప్రేమించరాదని.. :)
రిప్లయితొలగించండిశర్మగారు: సరిగ్గా చెప్పారు - మీరు పాటల గురించి పెట్టిన ఈ వ్యాఖ్య చూడగానే సంబరంగా అనిపించింది.
తొలగించండిఅసలు : పాడనా తెలుగు పాట..
రిప్లయితొలగించండికొసరు : ప్రేమ లేదనీ ప్రేమించ రాదనీ...
ఈ సారి మాత్రం మాపై దయ ఉంచి సులువుగా ఇచ్చినందుకు ధన్యవాదాలండీ 😀 పోస్ట్ సూపర్ ఎప్పటిలాగానే...
క్రమం తప్పకుండా చదువుతూ - పాటలని-పట్టుకునే ఆటలో పాల్గొంటున్న మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండి3rd semester ముచ్చట్లు భలే దసరా .... అదే సరదా గా ఉన్నాయి. ఓ రీడరూ..నో హాజరూ అనకుండా 19 కి సరిగ్గా attendance పలుకుతున్నందుకు, you get a good student star :-) Keep it up.
రిప్లయితొలగించండిAparne: Thanks for giving me a star :)
తొలగించండిEvery time i clap for your posts, but they r no longer enough. Awesome job Lalitha. I am simply amazed with your memory👌👌👌👌
రిప్లయితొలగించండిTakes me back to those SPMVV days
Thanks, Sunitha :)
తొలగించండి