ఇంచుమించు ఏడాది క్రితం - ఎక్కడికో వెళ్తున్నాం.
ఎక్కడికంటే - అక్కడికి ఇక్కడికి అనేమీ లేదు - ఊరికే ...అలా అలా - ఏ ఊరికీ కాక - మా ఊరనే మా కారులో షికారు తిరుగుతున్నాం.
మరి - కారులో ఊరికే వెళ్తామేంటి ? మాటో పాటో తోడుండాలి కదా!
ఆ మాటా ఈ మాటా - మాట మీద మాట - శృతి మించింది. మరిప్పుడు రాగాన పడాలి కదా! అదీ అయింది.
రాగాన పడ్డ మాట పాటయ్యింది. నాన్న చెవికి పోటయ్యింది.
నాన్న చెయ్యి గబగబా ఐఫోన్ మీటలు నొక్కింది - ఘల్లుఘల్లున ఓ పాట మొదలయ్యింది.
మాట మీద పాట పాడుతూ - పాట మీద మాట ఆడుతూ
అవిరామంగా - ఆడుతున్న అమ్మ నోరు
మీట మీద మొదలైన - పాట చెవిన పడగానే
అనుకోకుండా - ఆట కట్టింది
కనురెప్పల మూసి - చెవులప్పగించింది
అప్పటివరకు వంకలే లేని రోడ్డున
మాటల-పాటల గందరగోళంతోపుట్టిన
ఆందోళన-రాగానికి తాళం వేస్తున్నట్టు
దిక్కు తోచక మెలికలు తిరిగిన కారు
నిమ్మళించి - సాఫీగా పరుగులు తీసింది.
నెమ్మదించి - తాపీగా నడకలు సాగింది
అదీ ఆనాటి సన్నివేశం. అప్పుడువిన్నదీ పాట.
వినగానే - అరె! ఇది అచ్చు ఆ పాటలానే వుందే - అనిపిస్తోంది.
కానీ - ఆ పాటేదో ఎంత పాటు పడ్డా పట్టుబడట్లేదు
లీలగా గుర్తొస్తుంది - అంతలోనే నూనె రాసిన పనసపండు గింజలా జారిపోతుంది
ఒకటికి రెండు సార్లు కళ్ళూ-నోరూ గా...ఠిగా మూసుకుని వినగా...వినగా - తెల్సిపోయింది - ఆ ఇంకో పాట
బా...గా... గుర్తుంచేసుకోవాలి అనుకున్నాను.
గుర్తు పెట్టుకున్నాననే అనేసుకున్నాను.
ఆ గుర్తుతో మొదలెట్టాలి నా అప"రాగ"పరిశోధన -
ఎవరు రాగ-కర్తలో, ఇంకెవరో కాపీ-రక్తులో పట్టెయ్యాలి - అంటూ
కానీ చివరికి గుర్తున్నవి రెండే మాటలు "అమ్మతోడు, అమ్మతోడు" అంటూ.
ఇంకేది దారి? - మళ్ళీ గూగుల్ శరణం మమ
వెతగ్గానే - తీగ సాగిన రాగంతో ఆ పాట - టైపిన వేలికి దొరికింది.
అది చూస్తూ వింటుండగా - ఈలోగా అసలు పాటా గుర్తొచ్చింది.
హాచ్చెర్యం - ఇవి రెండూ కీరవాణి స్వరబద్ధ-కవలలు.
ముందొక తమిళ డబ్బింగ్ సినిమాలో వాడేసిన ఈ ట్యూను తర్వాత్తర్వాత - భీమవరం రాజుల వంశాంకురం - గవ్వో, శంఖమో ఒకటి - మెళ్ళో షోగ్గా వేసుకున్న - సినిమాలో మళ్ళీ వాడారు.
ఆ పాటేదో నాకన్నా అందరికీ బాగా తెలిసే వుంటుంది - అందుకే అదివ్వట్లేదు ఇక్కడ - ఎందుకంటే... పాటలంటే ఇష్టమున్న - ఎవరో ఒకరు ఎపుడో అపుడు చెప్పరా ముందుగా అదేమిటో ఆ పాటేమిటో - అనేసుకున్నాను కాబట్టి.
ఈ అమ్మతోడు పాట వున్నతమిళ డబ్బింగ్ సినిమా అక్టోబర్ 2.
ఇంకో హాచ్చెర్యకరమైన విషయం - ఈ సినిమా బాలచందర్‌గారిది.
ఇదే - ఇది వరకైతే - ఎలాగోలా వీలుచేసేసుకుని చూసేసేదాన్ని - బదరి-ప్రేక్షకత్వాన్ని వాలంటీర్ చేసేసేదాన్ని.
కానీ - నిన్న రాత్రి - ముందొక పది నిముషాలు వంశీ-సినిమా అని ఆశపడి పెట్టుకుని పదంటే పది నిముషాలు కూడా చూడలేకపోయిన వెన్నెల్లో హాయ్ హాయ్ - ఆ తర్వాత - 1949 లో వచ్చిన రాజ్‌కపూర్-నర్గీస్ సినిమా అని సరదా పడి చూసిన బర్సాత్ - తెగ సాగుతూ చేసిన సినీ-గాయం ఇంకా మానలేదు.
ఇంక దర్శకుల పేర్లు చూసి సినిమా చూడడం అనే సినీ-కాలం చెల్లిపోయింది - నా వరకు నాకు.
అందుకని పాట మాత్రం యూట్యూబులో చూసి సరి పెట్టేసుకున్నాను.
పల్లెటూరి వాతావరణంలో సజ్జకంకులు, పొద్దుతిరుగుడు పూలు, సెలయేళ్ళు, పచ్చని చేల మధ్య - పృథ్వీ, తమిళ-పల్లె-చీరకట్టుతో ముద్దబంతి పూవులాంటి హీరోయిన్-పొణ్ణు (పేరు తెలీదు మరి! సినిమా టైటిల్సులో రమ్యకృష్ణ, మధుబాల పేర్లు కనిపించాయి కానీ - మరి నేనైతే ఈ హీరోయిన్‌లో వాళ్ళిద్దరి పోలికలు పట్టలేకపోయాను.) - హుషారుగా ఆడుతూ పాడుతూ కనిపిస్తారు ఈ పాటలో.
ఈ పాట 0:28 సెకండ్ల దగ్గర కనిపించిన ఆ చెట్టూ-కాయలు ఏంటో తెలుసుకోవాలి - ఎవరికైనా తెలుసేమో.
పాట - చిత్ర, మనో పాడినట్లనిపించింది. సంగీతం - కీరవాణి.
పాటలో పదాలు - ఆ పెదవుల కదలిక ఈయన పాటదేనేమో అనిపించేలా రాసే అనువాద-"రాజ"శ్రీ గారివి.
పాటలో మాటలు, పాటకి ఆటలు - అన్నీ బావున్నాయి.
అన్నిటినీ మించి ఒకరోజు సెలవు దొరికింది - అమెరికా స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా.
సెలవు-బోనస్ పోస్టు అన్నమాట ఇది :)
ఈ కింది పాట వింటూ-చూసెయ్యండి మరి!
అమ్మతోడూ... అమ్మతోడూ - ఆడుకోనీ... మన ఈడూ
అసలు పాట అయ్యిందిగా - ఇప్పుడు నా సిసలు పాట
పాడుకున్నా... పాడుకున్నా - పాట ఏదో ... పట్టుకున్నా
రాసెయ్యనా ... ఆ పాట - వినిపించనా ... ఈ పూట
పాడుకోండి ... పాడుకోండి - కవల ఏదో ... చెప్పుకోండి
పట్టెయ్యండి ... ఆ పాట - చెప్పెయ్యండి ... ఈ చోట
~పాటల భైరవి

ఊరించెనే... నీ వాడు - వేసేనులే... వల నేడు
సందకాడా... అందగాడు - నాకు కాడా... ఈడు జోడు
నాతో నేడు... వంత పాడు - ఊసులాడే... కన్నె ఈడు
తన్ననానా... తన్ననానా...
తందననన... తందననన... తందననన...
కన్ను కన్ను కలిపేవే - కథలు నాకే తెలిపేవే
ఆశలన్నీ రేపేవే - రాసలీలలు చూపేవే
నీతోడు మాపటేల నే చేరేను - ఊసులు ఆడుకోనీ
నీ నీడలోన నేను తేనెజల్లు కానీ - ముచ్చటలాడుకోనీ
అందమే... ఆనందమే... నీ చెంగు చాటు నన్ను ముడి వెయ్యవే
పచ్చనీ... పచ్చికలా... మారాల తోటి వేడి తడి చెయ్యవే
అందించనీ... ఒక మాట - కట్టించనీ... నీ ఆట
సందకాడా... అందగాడు - నాకు కాడా... ఈడు జోడు
నాతో నేడు... వంత పాడు - ఊసులాడే... కన్నె ఈడు
వలపు వన్నెలు చిలికించీ - వయసు నన్నే మరిపించీ
కులుకు పిలిచెను ఈ పూట - గురుతు తెలిపెను మన బాట
గారాలు గంతులేసే తపనల తలపు - ఎప్పుడు నీ పిలుపు
మందార పెదవుల పండెను ఎరుపు - నా కంటి కది మెరుపు
ఏమిటో... అదేమిటో... ఇన్నాళ్ళు లేని ఆశ కదిలేనే
అమ్మమ్మో... నీ స్నేహమో... ముత్యాల వాన నేడు చిలికేనే
మావా మావా... ఒక మాట - నన్నందుకో... ఈ చోట
అమ్మతోడూ... అమ్మతోడూ - ఆడుకోనీ... మన ఈడూ
ఊరించెనే... నీ వాడు - వేసేనులే... వల నేడు
సందకాడా... అందగాడు - నాకు కాడా... ఈడు జోడు
నాతో నేడు... వంత పాడు - ఊసులాడే... కన్నె ఈడు
**** **** **** *****
అసలు పాట అయ్యిందిగా - ఇప్పుడు నా సిసలు పాట
పాడుకున్నా... పాడుకున్నా - పాట ఏదో ... పట్టుకున్నా
రాసెయ్యనా ... ఆ పాట - వినిపించనా ... ఈ పూట
పాడుకోండి ... పాడుకోండి - కవల ఏదో ... చెప్పుకోండి
పట్టెయ్యండి ... ఆ పాట - చెప్పెయ్యండి ... ఈ చోట
~పాటల భైరవి
Gundusoodi gundusoodi song?
రిప్లయితొలగించండిCorrect, SriLatha. Thanks for trying!
తొలగించండిబాగుందండీ పోస్ట్ :-) కీరవాణి పాటల్లో ఇలాంటివి చాలా దొరుకుతాయండీ.. రాజుల వంశాంకురం మెళ్ళో శంఖం అనగానే గుర్తొచ్చేసింది పాట.. ఛత్రపతి లో "గుండుసూది గుండుసూది" అని. ఈ సినిమా దర్శక ద్వయం నందమూరి వారసునితో కేరళలో తీసి హిట్ కొట్టిన సినిమాలో కూడా మీ కవల పాటలకు మంచి కంటెంట్ దొరుకుతుంది :-)
రిప్లయితొలగించండిఈ పాట తమిళ్ వర్షన్ విన్నారా.. https://www.youtube.com/watch?v=_wcs7ixyDbY
ఈ పాటలో అమ్మాయ్ వైశాలి కన్నదాసన్ (Vishali kannadasan) అనే తమిళనటి అంటండీ..
నా ప్రశ్న-పాటకి సమాధానంతో పాటు ఇంకెన్నో విశేషాలు చెప్పారు. చాలా థాంక్స్. మీరిచ్చిన యూట్యూబ్ లింక్‌లో పాట లేదు - ఒకసారి చెక్ చేస్తారా - ప్లీజ్?
తొలగించండిసారీ అండీ.. ఆ రోజే రిలీజైన జై లవకుశ టీజర్ అందరికీ షేర్ చేయడం వలన కంట్రోల్+సి లో అదే లింక్ ఉన్నట్లుంది అదే పేస్ట్ చేశాను చూస్కోకుండా..
తొలగించండిఇది కరెక్ట్ లింక్ :
https://www.youtube.com/watch?v=Yg4O7d08Q7Q
తమిళ పాట చాలా బావుంది. దీంతో కీరవాణిగారు తమిళంలో మరకతమణి పేరుతో సంగీత దర్శకత్వం చేస్తారని తెలిసింది. బోల్డన్ని థాంక్స్ మీకు!
తొలగించండికీరవాణి గారి పూర్తి పేరు "కోడూరి మరకతమణి కీరవాణి" అండి... తమిళ్ లో "మరకతమణి"గా హిందీలో "ఎమ్.ఎమ్.క్రీమ్" గా తెలుగులో "కీరవాణి"గా చలామణిలో ఉంటారు, ఈ మూడు పేర్లు చాలా ఫేమస్. ఇవి కాక ఎక్కడో తెలియదు కానీ "వేదనారాయణ" అనే పేరుతో కూడా కంపోజ్ చేశారని వికీ చెప్తుంది.
తొలగించండికీరవాణిగారికి ఇన్ని పేర్లున్నాయని తెలీదండి ఇప్పటిదాకా - Thanks for the info!
తొలగించండి'అపరాగ పరిశోధన' 'ఆందోళన రాగం'...
రిప్లయితొలగించండినీ మార్కు మాటలతో ఆటలు లలితా! ఈ పాటలతో ఆటల ఆటలసిరీస్ బావుంది.
పాట ఏదైనా, రాగమేదైనా నా నోట మాత్రం 'హింస ధ్వని' రాగంలోనే పలకాల్సిందే.
నువ్వు మాత్రం ఆడవా - మాటలతో ఆటలు?! నా ఆందోళన రాగానికి సరిజోడు నీ హింసధ్వని :))
తొలగించండి28 సెకన్ల వద్ద చెట్టు బూరుగు దూది చెట్టు అనుకుంటా!
రిప్లయితొలగించండిచెట్టు పేరు చెప్పినందుకు థాంక్సండి, శ్రీనివాస్‌గారు!
తొలగించండి