26, జనవరి 2018, శుక్రవారం

కాఫీ విత్ కలిమి - 1 - ఫస్ట్ సిప్

అప్పుడప్పుడు పగళ్ళు మరీ పొడుగ్గా ఉంటాయి
సాయంత్రాలు కొంచెం దిగులుగా అనిపిస్తాయి
నడకలో అడుగులు కదలనని మొరాయిస్తాయి
గొంతులో పాటలు శృతి తప్పి విసిగిస్తాయి
అలాంటప్పుడు - కప్పుడు కాఫీ ఒక చేత -  ప్లెయిన్ ఓల్డ్ POTS లైనో, సెల్లుయుగపు స్మార్టు ఫోనో ఇంకో చేత బట్టి - మీటలు నొక్కగా - 'హలో' అంటూ కలిసే చెలిమి-తీగ కలిమి కాక మరేంటి?

ఆ చెలిమి-కలిమితో
కలిమి-చెలిమితో -
చేతిలోని కాఫీ కప్పుతో -
సిప్పు మీద సిప్పుతో -
కలిసిన మాట మీద మాట పెంచి -
ఎన్ని కబుర్లో!

ఎంత సేపని కాదు - ఎలాంటి కబుర్లనీ చెప్పడానికి లేదు - చెప్పుకున్నామా లేదా - అదీ లెక్క - అదే లెక్క!

అనగనగా మా వూళ్ళో ఉండేటప్పుడు -
గోడ వారగా ముక్కాలిపీటెక్కి -
పొద్దుటి నీరెండలో కళ్ళ-కమలాలు విచ్చుకుని -
పెదవి పగడాల నవ్వుల-ముత్యాల్ని దొర్లిస్తూ -
నేస్తంతో కబుర్లాడుకునే రోజుల్ని simulate చేసుకుంటూ -
ఇప్పుడూ ఆడుకుంటా కబుర్లు -
ఊసుపోని వేళల్లో
గాలివాటు పొద్దుల్లో 
ఉసురుసురనిపించినపుడల్లా
కుదిరితే పూసగుచ్చినట్టు - కుదరకపోతే నోటికొచ్చినట్టు
అచ్చమైన గాలికబుర్లు.
ఒక్కోసారి బావుంటాయి
ఒక్కోసారి.... ఉంటాయి
ఒక్కోసారి బోల్డుంటాయి
ఒక్కోసారి కొన్నే వుంటాయి
ఒక్కోసారి loooooong ear-time
ఒక్కోసారి quick (ear)bite
ఒక్కోసారి సిసలైన విశేషాలుంటాయి
ఒక్కోసారి అస్సలు విషయమే ఉండదు



అసల్చెప్పాలంటే - అప్పటికప్పుడు కాలక్షేపపు-బఠానీల-కరకరల్లా గలగలా నోట జాలువారే కబుర్ల వరస ఇదీ....

"హలో!"

"హలో"

"నీకు టైముందా? ఇప్పుడు మాట్లాడగలవా?"

"ఆ .. పర్లేదు - ఏంటి చెప్పు"

"హమ్మయ్య - ఐతే నీకు టైముంది - ఇప్పుడు చెప్పు - బావున్నావా?"

" బావున్నాను గాని - నువ్వెలా వున్నావ్? నాకు టైముందని చెప్తే కానీ కుశలమడగాలనిపించదా?"

"అవును మరి - నాతో నువ్వు మాట్లాడే sound నాకు వినిపించే టైం వున్నప్పుడే  నీకు sound mind in a sound body వుందో-లేదో నాక్కావాలి గానీ - ఉట్టప్పుడెల్లా ఉంటే నాకెందుకు?"

"మంచి దానివే! ఏం చేస్తున్నావింతకీ?"

"వంట చేస్తూ - నువ్వు గుర్తొచ్చావ్ - అంతే! కాఫీ కలుపుకుని నీకు ఫోన్ చేశా!"

"అయితే లైన్లో వుండు - నేనూ నా టీ కప్పు తెచ్చుకుంటా"

"వెళ్ళిరా మరి - తొరగా"

"తొరగానే - టీ మీద తొరక కట్టేలోగా వస్తా"

(అవతలి వాళ్ళొచ్చేలోగా ఇవతలవాళ్ళకి ear-time వృధా అయిపోతోందని బెంగ - అందుకే తనకి తనే పాడేసుకుని వినేసుకుంటుంది - వస్తా - వెళ్ళొస్తా - మళ్ళెప్పుడొస్తా - లైను కట్టయ్యేలోగ వస్తా అంటూ.)

"ఏంటీ - పాడేస్తున్నావ్?"

"మరెంత సేపేంటి? - నోరాడుతూనో, పాడుతూనో ఉండాలి"

(ఇటు పక్కనుంచి చుయ్-చుయ్ నేపథ్యసంగీతం - బూర్లుమూకుడులో మరుగుతున్న నూనె-లయకి చిటపటలాడుతున్న ఆవాల శృతితో.)

"నీ నోటాడేపాటా నా చెవులారా విన్నాను కానీ ... ఇంతకీ నీ కాఫీ తాగడం అయ్యిందా? స్టవ్ మీదేంటి? పోపేస్తున్నావా?"

"అర్రే! నీకెలా తెల్సింది?"

"స్మార్ట్ ఫోనమ్మా!"

"హహ హహ - బావుంది - వాసన పట్టేస్తుందన్నమాట"

"అదే గదా! దానికీ app ఉందమ్మా!  రకరకాల apps - అవెలా పని చేస్తాయో గుర్తుంచుకోడానికో app - ఆ app ఉందని గుర్తు చేయడానికో app - మొత్తానికి ఫోన్లు స్మార్ట్ అవుతున్నాయి - మనం అ-స్మార్ట్ అవుతున్నాము."

"కదా! - మొన్నెప్పుడో office లో ఏదో document చదువుతుంటే ఎవరికో ఫోన్ చేయాల్సి వచ్చింది - అప్పుడు నేనేం చేశానో తెల్సా - laptop keyboard మీద అంకెలు నొక్కి ఫోన్ పని చేయట్లేదేంటా అనేసుకున్నాను."

"అనుకున్నావూ! నువ్వలా అనుకోకపోతే అనుకోవాలి - అనుకుంటే అనుకోవడానికేమీ లేదు - సరే మరి - ఇంకేంటి విశేషాలు?"

"ఏం లేదూ... మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావూ అని నువ్వడిగినప్పుడు - కాఫీ తాగుతూ నీతో కబుర్లు చెప్తున్నాను అంటే "ఓహ్ అయితే కాఫీ విత్ మి అన్నమాట" అన్నావు కదా? ఆ మాట పట్టుకుని నేనొక కొత్త సిరీస్ మొదలు పెడదాం అనుకుంటున్నానని చెప్పాను కదా! దానికో పేరు కూడా పెట్టానని చెప్పాను కదా - కాఫీ విత్ కలిమి అని. ప్రస్తుతానికి అదే విశేషం."

"ఓ అదా ! హహ్హహ్హ"

"ఎందుకా నవ్వు?"

"ఏం లేదు - మొన్న దీనిమీదే జరిగిన నన్ను అవాక్కు చేసిన ఓ walk లో-వాక్కు గుర్తుకొచ్చి"

"ఎక్కడికా walk  - ఏంటా వాక్కు - నువ్వెందుకయ్యావ్ అవాక్కు???"

"చెప్తాగా! నీ ఈ పోస్టుకి అనుబంధంగా రాసుకో - నీకు copyrights ఇచ్చేశాను"

"భలే! నా Coffee-write కి నీ copyright! నచ్చేసిందమ్మాయ్!"

"ఇంకో పది నిముషాల్లో ఆఫీస్‌కి బయల్దేరాలి - మళ్ళీ మాట్లాడదాం!"

"బానే వుంది - భూమికవతలెక్కడో వున్నావు - పట్టుమని పది నిముషాలు కూడా మాట్లాడవ్ - ఈసారి నేను కూడా ఒక meeting request పంపిస్తా - అలా అయితేనే కుదిరేలా వుంది నీతో - bye మరి"

"Bye!"


Walk లో అవాక్కు చేసిన వాక్కు (Coffee-Write with Copyright ):

"లలిత కొత్త సిరీస్ మొదలు పెడుతోందట - కాఫీ విత్ కలిమి అని"

"ఆహా!"

"దానికి నేనే ఇన్స్పిరేషనట - అయినా ఫోన్ కబుర్లు అని రాయడానికి ఏముంటాయి కదా?"

"కబుర్లేముంటాయో తర్వాత సంగతి కానీ - నువ్వు ఇన్స్పిరేషన్  అవడం ఏంటి?"

"అంటే మేమిద్దరం కుదిరితే రోజూనో, కుదరకపోతే కుదిరిన రోజునో ఫోన్లో కబుర్లు చెప్పుకుంటాం కదా! అప్పుడు అటు పక్క తాను కాఫీ, ఇటు పక్క నేను టీ తాగుతూ చెప్పుకుంటామన్నమాట. అందుకని ఈ సిరీస్ అంతా ఫోన్ కాన్వర్సేషన్ లా నడుస్తుందన్నమాట - రకరకాల టాపిక్కులతో"

"ఐడియా బానే వుంది కానీ - నీకేమీ బాధగా అనిపించలేదా - ఆ సిరీస్‌కి పేరలా పెడితే?"

"పేరుకేమయింది - బానే ఉందిగా - కాఫీ విత్ కలిమి?"

" అదే - ఆ కలిమి అంటే నీకు ఏమీ అనిపించలేదా?"

"ఏమనిపించాలి?"

"అదంత మంచి మాట కాదు కదా ?"

"ఎందుకు కాదు?"

"కలిమి అంటే కష్టం కదా! కలిమిలేములు అంటే కష్టనష్టాలు కదా! నిన్ను అంత మాటనేసిందేంటి?  నీకేం అనిపించలేదా? పైగా ఆనందంగా చెప్తున్నావ్... కలిమి అని నా పేరే పెట్టింది అనీ..."

"అబ్బా! అసలు నిన్ను తెలుగులో పాస్ చేసిందెవరు? కలిమిలేములు అంటే okey-dokeyలాంటి usage కాదు. తెలుగులో ద్వంద్వసమాసం అది - కలిమి అంటే wealth, లేమి అంటే poverty."

"ఓ హో "

"లలిత వాడే అర్థంలో కాఫీ విత్ కలిమి అంటే talking to a friend over a cup of coffee"

"అర్థం అయింది"

"హ్మ్.... "

"ఏంటాలోచిస్తూ నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావ్? ఇదంతా లలితతో చెప్పేయాలనుకుంటున్నావా? చెప్పేస్తావా?"

"మరి... చెప్పక? నాకు దక్కిన ఈ నవ్వులు పంచక మా చెలిమి-కలిమిని లేమి చెయ్యనా?"

"తల్లీ ! నీకో దండం - మీది చెలిమి-కలిమి; నాది బుద్ధి-లేమి. ఒప్పుకుంటున్నాను"

<<ఈ పోస్ట్ మరియు సిరీస్ 100 శాతం  నా చెలిమి-కలిమికి బోల్డన్ని ధన్యవాదాలతో దఖలు>>


11 కామెంట్‌లు:

  1. Coffee-Write with Copyright...కాఫీ విత్ కలిమి
    వాక్.. ఆవాక్కు మొత్తానికి పద ప్రయోగాలు ...సూపర్

    రిప్లయితొలగించండి
  2. Very nice naa morning coffee tho coffee with kalimi chadivaanu...hope for much more kaburlu on this.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా, శారదా - కలిమితో కబుర్లు కొనసాగుతాయి.

      తొలగించండి
  3. Nice. Coffee tagutoo chadivaanu. Madhyalo so many phone calls :)

    రిప్లయితొలగించండి
  4. ఇంకో కొత్త సిరీస్ మొదలు పెట్టావా?
    అసలు కావేవీ నీ బ్లాగింగ్ కనర్హం కదా!
    Apps అంటేనే happiness మాయం చేసే mishapps నా దృష్టిలో.
    నీ చెలిమి కలిమిలు మరిన్ని మేలిమి సొబగులద్దుకుని, మరింత బలిమి నొంది ఈ సిరీస్ మరిన్ని సిరులొలకాలని, నీ స్నేహనిధులు స్నేహితులు తరగని నిధులు కావాలని కోరుకుంటున్నాను.
    . (Intended typo in mishaps)



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును లక్ష్మీ - కొత్త సిరీస్. నాకే ఎప్పటిప్పుడు - అప్పటికప్పుడు చెప్పేవైనా - కొత్త కబుర్లు వుంటే రాయడానికి కొంచెం బావుంటుంది. In a way, it is for me to motivate myself to write.

      తొలగించండి
  5. నిజమ్గానె ‘ కాఫీ విత్ కలిమి’ టైటిలతో రాసావనమాట.
    నువ్ రాసానని చెప్పిన నేన్ సీరియస్గా తీస్కొలేదు.
    చదువ్తుమ్టే నువ్ మాటాడ్తునటే ఉన్ది.
    If I were to write the same it would be,
    ‘Naa tea time with Lalitha’...
    Naughty time with Lalitha’.
    Keep up your good work, rather writing.
    Thanks for the honour.
    Best wishes always.
    కలిమి

    రిప్లయితొలగించండి
  6. నచ్చేసింది ఇది :)

    ......
    ‘Naa tea time with Lalitha’...
    Naughty time with Lalitha’.
    .....

    రిప్లయితొలగించండి