బుజ్జిజింకతో తెలుగు రాయించి చా...లా రోజులా - ...కాదు కాదు - నెలలు అయింది.
ఆ మధ్య అన్నజింకతో ఇంటికి వచ్చిన కెవినుడికి - వాడడిగాడని అత్యుత్సాహంతో తెలుగులో బోల్డన్ని పదాలు చెప్పేస్తూ - ఓ నెల నా దగ్గరుంటే నీకు బోల్డు తెలుగు నేర్పేస్తానని అనగానే - అన్నజింక "వాడికి కాదు ముందు - తమ్ముడికి మొదలుపెట్టింది పూర్తి చెయ్యి" అని గుర్తు చేశాడు.
అప్పుడు "నిజమే ...ప్చ్ ప్చ్ " అని కొరుక్కున్ననాలుక ఇప్పటికీ చురచురమంటూనే వుంది - పాఠం మళ్ళీ ఎప్పుడెప్పుడని అడుగుతూనే వుంది.
నాకూ బుజ్జిజింకకీ ఇప్పటికి కుదిరింది.
అప్పుడెప్పుడో బోల్డంత తెలుగు నేర్పేసుకున్నానని నేనూ - నేర్చేసుకున్నానని వాడూ - మురిసి మురిసి పరస్పరం మెచ్చుకోళ్ళు ఇచ్చేసుకుని - మేకతోళ్ళు కప్పుకున్నంత హడావిడి చేసేసి - ఆ మురిపెంలో తెలుగు రాసుకున్న పుస్తకాన్ని కూడా ఎక్కడో భద్రంగా దాచేసుకున్నాం.
ఆ దాచుకున్న నిధిని ఇవ్వాళే - ఇప్పుడే - అంటే ఒక గంట క్రితం బయటికి పురా-పుస్తక తవ్వకాల్లోంచి బయటికి తీసి - "తెలుగు రాద్దాం రారా" అంటే - "ఆమ్ తిన్నాక" - అన్నాడు బుజ్జిజింక.
కంచమేసి - పప్పేసి, టొమాటో పచ్చడేసి, పెరుగేసి - ఆమ్ తినేసి - అనిపించాక - పదంటే పది నిముషాల్లో
"తల్లీ! నిన్ను దలంచి పుస్తకమున్ చేతం బూని నే తెలుగు revise చేసితి" అన్నాడు వాడు.
"నీకెంత గుర్తుందో చూద్దాం దా" అనిపుస్తకం, పెన్సిలు తెమ్మనగానే ముందే బేరం పెట్టాడు - "ఎన్ని రాయాలో చెప్పు" అంటూ.
ఐదంటే ఐదు వాక్యాలు చాలు అని చెప్పి - వాడికింకా ఒత్తులు రావని - ఆట్టే నొక్కి-వక్కాణించకుండా ఓ ఐదు తేలికైన నిత్యసత్యాల్లాంటి వాక్యాలు చెప్పగా ... ఈ రోజుకి ఫలించిన వినివ్రాత:
ఇప్పటినుంచి వారానికి రెండు రోజులైనా తెలుగుని వెలిగిద్దామని - ఆ వెలుగులో బుజ్జిజింకని నడిపిద్దామని... అంతే అంతే !
అమ్మ తినిపించే వేడివేడి-ఆమ్ తెలుగు
అమ్మ వినిపించే జోలపాట తెలుగు
అమ్మని విసిగిస్తే వచ్చే కోపం తెలుగు
అమ్మని మురిపిస్తే పెట్టే ముద్దు తెలుగు
తెలుగు నేరిస్తే జ్ఞానదీపం మరింత వెలుగు
ఆ వెలుగులోన తెలుగు ఎలుగు మరింత పెరుగు

ఉక్తలేఖనాన్ని విని వ్రాత అన్నారన్నమాట. మా వాళ్ళకి తెలుగు నేర్పించే ప్రయత్నాలు నేను చేసి వున్నాను. కిటుకులూ గట్రా ఏమైనా ఉంటే ఓ టపా లో వేద్దురూ.
రిప్లయితొలగించండితప్పకుండానండి. నాకు తోచి - ఆచరణలో పెట్టిన చిట్టి-చిట్కాలు ఎప్పుడో రాయాలి ఒక పోస్ట్ - తొందరలోనే.
తొలగించండివినికిడివ్రాత అంటే బాగుంటుందేమో ఇంకా. అలోచించండి.
రిప్లయితొలగించండిచూచివ్రాత అంటాం కాని చూపువ్రాత అనం కదండి - వినివ్రాత కూడా అలాంటిదే.
తొలగించండిబుజ్జి జింక వ్రాత చక్కగా గుండ్రంగా భలే బావుంది.
రిప్లయితొలగించండిఇంతకీ లలితకు కోపం ఎందుకు వచ్చినట్లు.
ఆ మూడో వాక్యం నిత్య సత్యమెందుకయినట్లు?
లలిత కోపం (ఆత్మీయ)లోక ప్రసిద్ధం :) నిత్యసత్యం కాక మరేంటి? దాదాపు ఇరవైఏళ్ళ తర్వాత నాతో ఫోన్లో మాట్లాడిన శాంతాంటీ (అపర్ణ వాళ్ళమ్మగారు) "లలితా! నీ కోపం ఇంకా అలాగే వుందా?" అనడిగారంటే చూసుకో మరి - అదెంత "ఈబాల-కోపాలమో" ;)
తొలగించండిnamaste
రిప్లయితొలగించండిvery nice efforts and posts. when you got a mnt please call. I am in VA.
sreedevi
Thank You very much for your nice words, Sreedevi garu. Will try to call soon.
తొలగించండి