గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 8 - అరటికాయ బజ్జీ న-ఖాదనం - కుయ్‌కుయ్ వయొలిన్ నహినహి-వాదనం
1963 మార్చ్ ఎస్సెస్సెల్సీ పరీక్షలు రాసేసి వైజాగులో - పాస్ అయ్యాను.
తర్వాత అనాతారం వచ్చేసి 63 జూన్‌లో అమలాపురం ఎస్కెబీఆర్ (SKBR) కాలేజీ - లో పీయూసీ (ప్రీ-యూనివర్సిటీ కోర్స్) చేరాను. అది ఒక్కేడాది కోర్సు - అదయ్యాక మూడేళ్ళు డిగ్రీ.
పీయూసీలో నా గ్రూపేమో అకౌంట్స్ ఎండ్ ఎకనామిక్స్. ఒక సైన్స్ సబ్జెక్టు కూడా తీసుకోవాలి. నాకేంటంటే చిన్నప్పట్నించీ జంతువులంటే ప్రేమెక్కువ - ఈ ఆవులూ, గేదెలూ, గుఱ్ఱాలూ - వీటితో తిరిగేవాణ్ణి కదా - అందుచేత జువాలజీ తీసుకున్నాను.
రోజూ అనాతవరం నుంచి ఎనిమిది కిలోమీటర్లు - సైకిలు మీద వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి.
నాతో పాటు నాయనరాజుగారి సూరి కూడా ఉండేవాడు. నాతోపాటే పీయూసీ సగం వరకు చదివాడు - తర్వాత మైనింగ్‌లో చేరతానని చెప్పి కొత్తగూడెం వెళ్ళిపోయాడు.
కాలేజీలో మా క్లాసులో ఓ నలభై మందిమి ఉండేవాళ్ళం.
అందులో ముఖ్యంగా కొల్లూరు సుబ్బారావని తొండారం అతను మంచి ఫ్రెండు.
ఇంకా - మాచిరాజు ప్రభాకరు, కూచిమంచి సత్యనారాయణమూర్తి (చంటబ్బాయ్ అనేవాళ్ళం), మంగిపూడి సీతారామయ్య , దీక్షితులు , కాంతిలాల్ - వీళ్ళందరూ నా స్నేహితులు. .
మాకు ఇంగ్లీషుకి ఒక లెక్చరర్ వచ్చేవారు - ఆయన అసలు పేరు జీవీకే గారు - గాది వెంకట కృష్ణారావుగారు. ఆయన కెందుకో పకోడీ గారని పేరు పెట్టారు. ఆయన కొడుకు - సూరి అని చెప్పేసి - వాడు కూడా నా ఫ్రెండే. వాడూ, నేనూ ఆర్టిస్టులం - ఇద్దరం కూడా నాటికలేసేవాళ్ళం. కాలేజీ వార్షికోత్సవాలూ వాటిల్లో మేమిద్దరం నాటికలేసేవాళ్ళం.
మణిమామయ్య కూడా మా కాలేజీ లోనే ఉండేవాడు. వాడు నాకన్నా వయసులో చిన్న- కానీ ముందు ఎస్సెల్సీ పాసయ్యాడు - అందుకని నాకన్నా ఒకేడాది సీనియర్ అయ్యాడు చదువులో. వాడేమో నాటకాలేసేవాడు. వాడు బీకాం చదువుతూ ఉండేవాడు.
నాటకం అంటే అంకాలుంటాయన్నమాట. నాటిక అంటే ఒకటే అంకం. ఆ రోజుల్లో నేనూ, ఈ గాది సూరి - "పేటెంటు మందులు" - అని ఒక నాటికేశాం.
అందులో వాడు కాంపౌండరు, నేనొక లాయర్ని. మా నాటికకి మొదటి బహుమతి వచ్చింది.
అప్పుడు SV రంగారావు వచ్చాడు మా కళాశాల వార్షికోత్సవానికి - వచ్చి ఆయనిచ్చాడు ప్రైజు మాకు.
పీయూసీ అంతా అలా సరదాగా గడిపేస్తున్నాం.
1964లో ఏమైందంటే చైనా యుద్ధం వచ్చింది.
అపుడు ఎన్సీసీ (NCC) అందరికీ తప్పనిసరి చేశారు.
ప్రతివాళ్ళూ ఎన్సీసీ లో చేరాలి. మేమందరం చేరాం.
మొదట్లో మాకు యూనిఫామ్ కూడా లేదు. తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, సన్నటి నల్ల బెల్టు, బూట్లు. మూణ్ణాలుగు నెల్లు పోయింతర్వాత యూనిఫామ్ ఇచ్చారు - కింద కాకీ ప్యాంటు,పైనేమో గచ్చకాయ రంగు ఫుల్‌హాండ్స్ చొక్కా.
చిన్నప్పుడు నాకెలాగూ స్కూల్లో స్కౌటింగ్ అలవాటే కాబట్టి ఎన్సీసీ కూడా చాలా ఈజీగా, ఆటలాగా ఉండేది.
గుఱ్ఱం ప్రకాశరావుగారని మా ఎన్సీసీ కమాండర్. ఆయనే మాజువాలజీ లెక్చరర్ కూడా.
ఒకసారి వారం రోజులు ఎన్సీసీ క్యాంపు అన్జెప్పి పెద్దాపురం తీసుకెళ్ళారు. అక్కడ రైఫిల్ షూటింగ్ రేంజ్ ఉండేది.
తెల్లవారుఝామునే లేపి గ్రౌండులో పరిగెట్టించేవారు - వ్యాయామమూ, శారీరక దృఢత్వం పేరు చెప్పి. ఓ రెండ్రోజులు సరదాగానే అనిపించింది.
ఆ తర్వాత - ఆ పొద్దున్నే లేవడం, చన్నీళ్ళస్నానం, పరుగు నా వల్ల కాదనిపించింది. మూడోరోజు ట్రాకులో ఓ రెండు రౌండ్లు పరిగెట్టగానే - కింద పడిపోయాను పొట్ట పట్టుకుని - "అమ్మో! కడుపు నెప్పి" అంటూ.
వెంటనే నన్ను మోసుకెళ్ళి దగ్గర్లో వున్న హాస్పటల్లో చేర్చారు - నాకు తోడుగా ఇంకో ఇద్దరు. హాయిగా బెడ్డు మీద పడుకుని వాళ్ళు తెచ్చిపెట్టే ఇడ్లీలు, పునుగులు తింటూ ఉండేవాణ్ణి - నాతోపాటు వాళ్ళూను.
ఓ రెండ్రోజులు బానే గడిచాయి.
ఓ రోజు పొద్దున్నే ఇడ్లీలు లాగిస్తూ కడుపునెప్పని ట్రాక్ చుట్టూ తిరగడం ఎలా తప్పించుకున్నానో చెప్పుకుంటూ నవ్వుకుంటున్న మా ముగ్గురి మాటలూ - నేనెలా ఉన్నానో చూద్దామని వచ్చిన మా కమాండర్ గారు వెనకాల్నుంచి విని - "హన్న వడ్లమానీ - ఎక్సర్సైజ్ తప్పించుకోవడానికి వేసిందా ఈ ఎత్తు?" - అంటూ చీవాట్లేసేశారు.
కాకపొతే అప్పటికే క్యాంపు గడువు అయిపోవడంతో పెద్దగా శిక్షేమీ లేకుండా తప్పించుకున్నాను. అదీ ఎగ్గొట్టిన ఎన్సీసీ సరదా.
1964 మార్చ్ పరీక్షలు రాశాను - ఇంగ్లీష్‌లో నేను పూరు కదా - పరీక్ష తన్నేహింది.
ఆ టైం నాకెలా కలిసొచ్చిందంటే- మనకి వ్యవసాయం వుంది కదా - పొలం వెళ్ళి వ్యవసాయం మీద కొంచెం పట్టు సాధించాను.
64 సెప్టెంబర్‌లో - పోయిన ఇంగ్లీషు - ఆ ఒక్క సబ్జెక్టు కట్టుకుని మళ్ళీ 65లో కాలేజ్‌లో చేరిపోవచ్చు - డిగ్రీలో.
సరే! సెప్టెంబర్ పరీక్షలకి ప్రిపేర్ అవడం మొదలు పెట్టాను. దానికోసం అమలాపురంలో ఉండేవాణ్ణి.
ముక్కామల భానుడుకామేశ్వరరావు అని ఒక చెవిటాయన ఉండేవాడు. ఆయన కో-ఆపరేటివ్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనేంటంటే చదివింది ఎస్సెల్సీ - కానీ ఇంగ్లీషు, ఎకౌంట్సు మాస్టర్ ఆయన.
ఆయన దగ్గర ట్యూషన్ - నేను - కొల్లూరు సుబ్బారావుదీ తన్నేసింది - మేమిద్దరమూ కూడా అయన దగ్గర చేరాము. నేను అమలాపురంలో మా అక్కయ్య పాపాయి గారింట్లో వుండి - చదువుకుంటూ ఉండేవాణ్ణి.
మా బావగారు కర్రా భాస్కరంగారు - ఆయనకి భాస్కర మెడికల్ స్టోర్స్ ఉండేది.
ఆగస్టు నెలలో మా నాన్నగారికి ఆరోగ్యం బావులేక ఆయన్ని విశాఖపట్టణం తీసుకుని వెళ్ళారు - KGH లో జాయిన్ చేశారు. ఆయన అక్కడ స్వర్గస్థులయ్యారు.
అప్పుడింక అమలాపురంనుంచి బయల్దేరి - నేను, మా బావగారు, అక్కయ్య, వాళ్ళ పిల్లలూ - విశాఖపట్టణం బయల్దేరాం.
అసలే శ్రావణమాసం - కోటిపల్లి గోదావరిలో అసలు పడవలు నడపనీయట్లేదు - వరద మీదుంది గోదావరి. పోలీసులు - పూర్తి బందోబస్తు అదీనూ.
పడవ వాళ్ళని - "మా మావగారు చనిపోయారు అర్జెంటుగా వెళ్ళాలి" అంటూ మా బావగారు బ్రతిమిలాడితే - వాళ్ళు మొత్తానికి ఓ పడవ ఏర్పాటు చేసి - జాగ్రత్తగా దించమని - మమ్మల్ని పడవెక్కించి పంపించారు.
పడవలో ఉండగానే - మధ్యలో కెళ్ళేటప్పటికి పెద్ద వర్షం - చాలా భయమేసింది మాకు - నిండు గోదావరి.
ముక్తేశ్వరం నుంచి నాలుగైదు కిలోమీటర్లు కోటిపల్లి - కోటిపల్లిలో మళ్ళీ ఇంకో రెండు-మూడు కిలోమీటర్లు గోదావరి - మొత్తం ఎనిమిదికిలోమీటర్లు వరదగోదావరిలో వెళ్ళాలన్నమాట.
చాలా భయంకరమైన ప్రయాణం అది.
అవతలి ఒడ్డు చేరి SRMT బస్సు తీసుకుని కాకినాడ వెళ్లిపోయాం. కాకినాడలో టాక్సీ కట్టించుకుని వైజాగ్ మద్యాహ్నం మూడు గంటలకి చేరాం. అప్పటికే అంత్యక్రియలు మొదలు పెట్టేశారు. అలా మా నాన్నగారిని చివరి సారిగా చూసుకుని - తిరిగి అనాతవరం చేరుకుని మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం.
అనాతవరం ఇంట్లో మా నాన్నగారు - బుల్లినారాయణగారు అనబడే - వడ్లమాని సూర్యనారాయణగారి హయాం ముగిసింది.
నరసింహ శతకంలో చెప్పినట్లు....
సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
దెప్పుడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?
తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు
భూషణ వికాస శ్రీ ధర్మపురనివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర
<వచ్చేనెల తరువాయి కథ>

నవ్విస్తూనే గుండె బరువెక్కించారు
రిప్లయితొలగించండిమరేండి! :(
తొలగించండిఅప్పటి వాళ్ళందరి పేర్లూ, ఇంటిపేర్లతో సహా ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు లలితా మీ నాన్న గారు!
రిప్లయితొలగించండివాళ్ళందరూ కూడా మీ నాన్నగారి జీవిత కథలో తమ జ్ఞాపకాలు వెతుక్కోవచ్చు.
అల్లరి వేషాలే కాకుండా బహుమతులందుకునే వేషాలు కూడా వేశారన్న మాట.
ఈ పద్యం ఏదో నాటకంలో చదివినట్లో, చూసినట్లో గుర్తు.
హరిశ్చంద్ర అనుకుంటా. సరిగ్గా గుర్తు లేదు.
ఆ పద్యం నరసింహశతకంలోది - మా నాన్నెప్పుడూ పాడేది.
తొలగించండితాతగారిని నేనెప్పుడూ చూడలేదు ఎంతసేపూ ఆయన పేరు వినడమే బుల్లినారాయణగారు అని, అసలు పేరు కూడా ఇప్పుడే తెలిసింది లలితా గారూ, ఎన్నెన్ని జ్ఞాపకాలో ఆ ఇంటితో అన్నిటినీ ఒక్కొక్కటిగా కదుపుతున్నారు తేనెతుట్టని కదిపినట్టు
రిప్లయితొలగించండిశ్రీనివాస్గారు: మా ఇంటికి, ఇంట్లోని వారికి ఆత్మీయులు మీరు. నా బ్లాగ్ చదువుతున్నందుకు సంతోషం!
తొలగించండి