అప్పుడెప్పుడో రాసేసిన నా పాత పోస్టునొకదాన్నిఅప్పు తెచ్చుకుంటున్నాను - ఇక్కడ: నా "నీకో-పాఖ్యానం"
పెళ్ళయిన తర్వాత మొదటి సారిగా బదరి, నేను ఇంట్లోకి కావలసినవి కొందామని ఒక పే...ద్ద లిస్టు రాసుకుని ఇంటి దగ్గర విద్యాపీఠ్ సర్కిల్‌లో వున్న ఫాన్సీ-కం-మెడికల్ షాప్ కి వెళ్ళాము.
ఈ రోజు వినబోయే కవలపాటలు ఎలాంటివంటే -- ఒకే కథ - రెండు భాషలు (కన్నడ - శరపంజర, తెలుగు - కృష్ణవేణి) - రెండు భాషల్లో ఒకే సంగీత దర్శకుడు - విజయభాస్కర్.
గణపవరంలో శ్రీరామనవమి పందిరిలో మొదటిసారిగా కృష్ణవేణీ... పాట విన్నజ్ఞాపకం. అప్పుడు అందులో కృష్ణవేణి, విరిబోణి అణ్టూ విణిపిణ్చిన ణకారాలు భళే ణచ్చేషాయి :)
ఆ తర్వాత విన్న కన్నడపాట కూడా అంతే మిన్నగా - ఇదే అల్వా చిన్నద హాడు ಎಂదరే - ఎనిసుత్తదె (ఇదే కదా బంగారపు పాట అంటే - అనిపిస్తుంది) - అని కన్నడలో మురిసేలా చేసింది.
సరే! ఈ పాటలకి నాకూ ఉన్న సంబంధం - ఏంటంటే - ఈ రెండు పాటలూ ఒకటి కృష్ణానది గురించి, ఇంకోటి కావేరి గురించి.
నేను పుట్టినదే - కృష్ణవేణికి నెచ్చెలి , కావేరికి సంగాతి - అయిన గోదావరి ఒడిలో.
కృష్ణానది సమీపాన చదువు మొదలుపెట్టి, కావేరీనది దరిదాపుల్లో గట్టెక్కించాను (నా ఫైనల్ ప్రాజెక్టు NAL లో).
కృష్ణానది అలల ఆశీస్సులతో పెళ్ళాడి , కావేరీనది కెరటాల దీవెనల దరి కాపురమెళ్ళాను.
ఇవన్నీ పక్కన పెడితే - ముందు రాసిన నా పాత-పోస్ట్ కబుర్లకి ఈ పాటలకి సంబంధమేంటి అంటే... ఈ అసలు పాట-సిసలు పాటల్లో భావం చూస్తే - అమ్మాయి నది గురించి పాడుతుంటే, అబ్బాయి అమ్మాయి గురించి పాడుతుంటాడు. ఇక్కడ ఎవరి పాట-వరస వాళ్ళదే :)
నా నీకో-పాఖ్యానం చదివితే - అమ్మాయి నీకో (సబ్బు) కావాలంటుంటే, అబ్బాయేమో అమ్మాయికేం కావాలో (చెప్పలేకపోతోందేమో) అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో ఎవరి మాట-విసురు వాళ్ళదే :)
హమ్మయ్య! పాట వెనక మాటలు అయిపోయాయి.
ఇంకాట్టే పాట్లు పడకుండా పాటల గురించిన మాటల్లోకి వెళ్తే...
అసలీ రెండు పాటల్లో నాకర్థం కానివిషయం ఒకటుంది - నదిలో సరిగంగస్నానాలకి దిగిన వీరో-వీరోయిన్లు తలారా మునిగింతర్వాత - ఎవరో పూజారి వేంచేసి చెంబుతో తలమీద నీళ్ళెందుకు పోశారూ అని!
ఈ సినిమా నేను ఇప్పటి దుర్దర్శన రోజులకి ముందున్న దూర్‌దర్శన్ రోజుల్లో - ఆదివారం మధ్యాహ్నం వచ్చే - మా ముగ్గురు అక్కచెల్లెళ్ళం ఇష్టంగా ఎదురు చూసి మరీ - సబ్‌టైటిల్స్ చదువుకుంటూ చూసే - ప్రాంతీయభాషాచిత్రాల్లో - ఒకసారి వేసినప్పుడు చూశాను.
సినిమా అంతగా గుర్తు చేసుకోవడం నాకిష్టం లేదు కానీ అందులో ఒక డైలాగ్ మాత్రం వద్దన్నా గుర్తొస్తుంది ఎప్పుడు ఈ పాటలు విన్నా: నాన్ బందే...నాన్ నోడ్దె... నాన్ గెద్దె (I came... I saw... I conquered - Julius Caesar's "Veni...vidi...vici")
ఈ పాటలో కూర్గ్-స్టైల్ చీరకట్టులో కల్పన ఆట - నమ్మ నోట - పసందట!
నోడి - ఎంజాయ్ మాడి!
తులా మాసేతు కావేరీ... సర్వతీర్థాశ్రితా... నదీ.... ఆఆఆఆ
పంచపాతక సంహర్త్రీ ... వాజినేద ఫలప్రదా.... ఆఆఆఆ
భక్తానుకమ్పే... మునిభాగ్యలక్ష్మీ
నిత్యే ... జగన్మంగళదానశీల.... ఆఆఆఆ
నిరంజనే దక్షిణదేశ గంగే .... దక్షిణదేశ గంగే
కావేరీ ... కావేరీ ... మమ ప్రసీద
మమ ప్రసీద... మమ ప్రసీద...
కావేరి... కావేరి... కావేరి... కావేరి... కావేరి... కావేరి
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారీ
కన్నడ కులనారీ...
కావేరీ ... నీ ఒలవిన సింగారీ
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారీ
కన్నడ కులనారీ...
కావేరీ ... నీ ఒలవిన సింగారీ
హ హ్హ హ్హాహ్హా .... హొహ్హోహ్హొహ్హో
ఋషిజన జీవన తపోనిధి ... ఆఆఆఆ
కావేరీ ... నీనే జేనిన జీవనది
ఋషిజన జీవన తపోనిధి ... ఆఆఆఆ
కావేరీ ... నీనే జేనిన జీవనది
రైతర బాళిన భాగ్యనిధ.... ఆఆఆఆ
కావేరీ ... నీ నడెయువ నెలవెల్ల పుణ్యద సన్నిధి
ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారి
ఆ ఆహా ఆహా ఆహా ఆహా
ఆహా... ఆహా ...
హాలిన అలెయాగి ఆడోళె .... ఆఆఆఆ
కావేరీ... నీ బాళిన సువ్వాలె హాడోళె
హాలిన అలెయాగి ఆడోళె.... ఆఆఆఆ
కావేరీ... నీ బాళిన సువ్వాలె హాడోళె
చిన్నద నాడిన హొన్నాళె .... ఆఆఆఆ
కావేరీ... నీ నవరసవాహిని గిరిబాలె
ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారి
అహ్హహా హా హా హా
గంధద సీమెయ సౌందర్యలహరి.... ఆఆఆఆ
కావేరీ... నీ గంధర్వ గానద ఆనందలహరి
గంధద సీమెయ సౌందర్యలహరి.... ఆఆఆఆ
కావేరీ... నీ గంధర్వ గానద ఆనందలహరి
పతిత పావని అమృతలహరి.... ఆఆఆఆ
కావేరీ... నీ లలిత లతావని శృంగారలహరి
ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారి
కన్నడ కులనారీ...
కావేరీ...
సిసలుపాట - తెలుగింటి విరిబోణి గురించి:
ఈ సినిమా ఈ మధ్యనే - సగం సినిమా కళ్ళకి చేతులడ్డుపెట్టుకుని వేళ్ళ సందుల్లోంచి చూస్తూ చూశాను - నాకేదైనా ఇష్టం లేని సీనోస్తే అలాగే చూస్తాను నేను మరి.
అంత కష్టపడి చూడడం ఎందుకంటే - మంచిమంచి పాటలుంటాయి - పాటల్లో రంగుల చీరలలో - నగల హంగులతో మెరిసిపోయే వాణిశ్రీ వుంటుంది మరి!
పల్లవి పాడేటప్పుడు - గులాబీ రంగు బెనారస్ చీర, నీలం గాజులతో, మెళ్ళో వాణిశ్రీ-మార్కు-నెక్లెస్‌తో వాణిశ్రీ....
మళ్ళీ రెండో చరణంలో - పసుపు రంగు పట్టుచీర, వడ్డాణం, వంకీలు, పాపిడిబొట్టు పెట్టుకుని తెలుగింటి అలివేణిలా వాణిశ్రీ....
మూడో చరణంలో - శిల్పరమణిలా కనిపించే వాణిశ్రీ ....
యవనిక అంతా వాణిశ్రీ-మయమిక!
కన్నడపాటలో చరణాల కన్నా తెలుగు పాటలో చరణాలు పొడుగ్గా ఉంటాయి - ఎంతైనా కృష్ణంరాజు పాట కదా - ఆరడుగుల పాట. మూడో చరణంలో "ఏ శిల్ప రమణులు, ఏ దివ్యలలనలు" అన్న దగ్గర చేతులు అటూ ఇటూ విసురుకుంటూ చేసిన రాజుగారి అభినయం - నేత్రపర్వం.
ఈ పాటలో కనిపించిన కృష్ణ నిండుగా, కనకదుర్గ గుడి ఖాళీగా వున్నాయి - అవే ప్రస్తుతంలో అటుదిటు అయ్యాయేమో కదా - నీళ్లు తక్కువయ్యి కృష్ణ ఖాళీగా, భక్తులెక్కువయ్యి దుర్గ గుడి నిండుగా.
ఇప్పటికే చాలా చెప్పేశాను - చూడడమే తరువాయి ....
హే జనని కృష్ణవేణి ...రాజిత తరంగవాణి... ఆఆఆఆ
పంచ పాతక హారిణి...పరమ మంగళకారిణి... ఆఆఆఆ
దక్షిణోర్వి దివ్యవాహిని ...అక్షీణ భాగ్య ప్రదాయిని ... ఆఆఆఆ
శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంసేవిని.. ఆఆఆఆ
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధినీ ..
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధినీ ...
కృష్ణవేణి... ఆఆఆ....కృష్ణవేణి... ఆఆఆ... మమ ప్రసీద .. మమ ప్రసీద...
కృష్ణవేణి... కృష్ణవేణి.... కృష్ణవేణి... కృష్ణవేణి....
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ...
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ...
కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ...
హహ్హహ్హహ్హా... హహ్హహ్హహ్హా....
శ్రీగిరిలోయల సాగే జాడల...
శ్రీగిరిలోయల సాగే జాడల...
విద్యుల్లతలు కోటి వికసింపజేసేవు ...
లావణ్యలతవై నను చేరువేళ...
లావణ్యలతవై నను చేరువేళ...
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణీ ...
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ నా ఇంటి అలివేణీ...
ఆ ఆహా ఆహా ఆహా ఆహా
ఆహా... ఆహా ...
నాగార్జున గిరి కౌగిట ఆగి...
నాగార్జున గిరి కౌగిట ఆగి ...
బీళ్ళను బంగారు చేలగా మార్చేవు ...
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆంధ్రావనికే అన్నపూర్ణవై కరువులు బాపేవు..బ్రతుకులు నిలిపేవు...
నా జీవనదివై ఎదలోన ఒదిగి...
నా జీవనదివై ఎదలోన ఒదిగి ...
పచ్చని వలపులు పండించు కృష్ణవేణీ ...
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ నా ఇంటి అలివేణీ...
అహ్హహా హా హా హా
అమరావతి గుడి అడుగుల నడయాడి...
అమరావతి గుడి అడుగుల నడయాడి ...
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు...
ఏ శిల్పరమణులు.. ఏ దివ్యలలనలు
ఏ శిల్పరమణులు... ఏ దివ్యలలనలు
నోచని అందాలు దాచిన కృష్ణవేణీ ...
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అభిసారికవై హంసలదీవిలో ...
సాగర హృదయాన సంగమించేవు...
నా మేని సగమై... నా ప్రాణసుధవై...
నా మేని సగమై... నా ప్రాణసుధవై...
నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణీ...
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ...
ఎంత మంచి పాటలు కదా!
వింటే చింతలన్నీ ఎగిరిపోవు కదా!
గీతాలు ఇంతలై అంతలై కవ్వింతలై నవ్వింతలై
వంతలు లేని సంగీతలోకం సొంతమౌ గదా!
అందుకే... వింటూ .... అంటూ... ఇందిందే వుండండి
వస్తా .... వెళ్ళొస్తా - మళ్ళింకొన్ని పాటలతో వస్తా....
~పాటల భైరవి
పెళ్ళయిన తర్వాత మొదటి సారిగా బదరి, నేను ఇంట్లోకి కావలసినవి కొందామని ఒక పే...ద్ద లిస్టు రాసుకుని ఇంటి దగ్గర విద్యాపీఠ్ సర్కిల్‌లో వున్న ఫాన్సీ-కం-మెడికల్ షాప్ కి వెళ్ళాము.
అక్కడ లిస్టులో వున్నవి అన్నీ తీసుకున్న తర్వాత బదరి అడిగారు "ఇంకేమైనా కావాలా?" అని.
నాకు వెంటనే నా స్పెషల్ సోప్ లిస్టు లో వ్రాయడం మరిచిపోయానని గుర్తు వచ్చింది.
వెంటనే నేను హడావిడిగా "నీకో!" అన్నాను.
బదరి అది వినగానే "నాకు సరే, నీకేం కావాలో చెప్పు" అన్నారు.
నేను మళ్ళీ "నీకో!" అన్నాను.
పాపం! బదరి మళ్ళీ సాధ్యమయినంత ప్రశాంతంగా " బుజ్జాయ్! నీకు కావలసినది ఏంటో చెప్పు - నా సంగతి తర్వాత " అన్నారు.
మళ్ళీ నేను అదే "నీకో!" పాటే పాడాను.
పాపం -
షాప్ అతను - మా ఇద్దరికేసి టెన్నిస్ మాచ్ చూస్తున్నట్టు ఎవరు మాట్లాడితే
వాళ్ళవేపు తిరుగుతూ చూస్తూ అలిసిపోయి తల పట్టుకుని ఈ బేరం తెగేది
కాదన్నట్టు చూస్తూ నించున్నాడు.
అంతే ప్రశాంత-బదరి కాస్తా అశాంత-బదరి అయిపోయి "బుజ్జాయ్! నీకేం కావాలో చెప్పు- సరేనా?" అన్నారు - ఖోపంగా!
నేనూ ఇంకా ఖోపంగా "నీకో అని చెప్పానా? నాకు 'నీకో' సోప్ కావాలి" అన్నాను....
అంతే! ఆ షాప్ అతను ఇంకాసేపుంటే నేను ఇంకేం తంటా తెస్తానో అని భయపడిపోయి గబగబా సోప్ ఒక బాగ్ లో వేసి, బిల్ బదరి చేతిలో పెట్టేశాడు.
------------------------------------------------------------------------------------------------------------------------
ఇంతకీ ఈ పాత-కబురు ఈ కొత్త-పోస్టుకు ఎందుకు పట్టుకొచ్చానూ అంటే - ఇది నేను చూపించి -వినిపించబోయే కవలపాటల పరిచయానికి కొంచెం దగ్గర విషయంలా అనిపించడమే. అదీ కాక ఆ కవలపాటలతో నాకున్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించడానికి కూడా ఆ పాత-కబురు ఊతమవుతుందని. ఈ రోజు వినబోయే కవలపాటలు ఎలాంటివంటే -- ఒకే కథ - రెండు భాషలు (కన్నడ - శరపంజర, తెలుగు - కృష్ణవేణి) - రెండు భాషల్లో ఒకే సంగీత దర్శకుడు - విజయభాస్కర్.
గణపవరంలో శ్రీరామనవమి పందిరిలో మొదటిసారిగా కృష్ణవేణీ... పాట విన్నజ్ఞాపకం. అప్పుడు అందులో కృష్ణవేణి, విరిబోణి అణ్టూ విణిపిణ్చిన ణకారాలు భళే ణచ్చేషాయి :)
ఆ తర్వాత విన్న కన్నడపాట కూడా అంతే మిన్నగా - ఇదే అల్వా చిన్నద హాడు ಎಂదరే - ఎనిసుత్తదె (ఇదే కదా బంగారపు పాట అంటే - అనిపిస్తుంది) - అని కన్నడలో మురిసేలా చేసింది.
సరే! ఈ పాటలకి నాకూ ఉన్న సంబంధం - ఏంటంటే - ఈ రెండు పాటలూ ఒకటి కృష్ణానది గురించి, ఇంకోటి కావేరి గురించి.
నేను పుట్టినదే - కృష్ణవేణికి నెచ్చెలి , కావేరికి సంగాతి - అయిన గోదావరి ఒడిలో.
కృష్ణానది సమీపాన చదువు మొదలుపెట్టి, కావేరీనది దరిదాపుల్లో గట్టెక్కించాను (నా ఫైనల్ ప్రాజెక్టు NAL లో).
కృష్ణానది అలల ఆశీస్సులతో పెళ్ళాడి , కావేరీనది కెరటాల దీవెనల దరి కాపురమెళ్ళాను.
ఇవన్నీ పక్కన పెడితే - ముందు రాసిన నా పాత-పోస్ట్ కబుర్లకి ఈ పాటలకి సంబంధమేంటి అంటే... ఈ అసలు పాట-సిసలు పాటల్లో భావం చూస్తే - అమ్మాయి నది గురించి పాడుతుంటే, అబ్బాయి అమ్మాయి గురించి పాడుతుంటాడు. ఇక్కడ ఎవరి పాట-వరస వాళ్ళదే :)
నా నీకో-పాఖ్యానం చదివితే - అమ్మాయి నీకో (సబ్బు) కావాలంటుంటే, అబ్బాయేమో అమ్మాయికేం కావాలో (చెప్పలేకపోతోందేమో) అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో ఎవరి మాట-విసురు వాళ్ళదే :)
హమ్మయ్య! పాట వెనక మాటలు అయిపోయాయి.
ఇంకాట్టే పాట్లు పడకుండా పాటల గురించిన మాటల్లోకి వెళ్తే...
అసలీ రెండు పాటల్లో నాకర్థం కానివిషయం ఒకటుంది - నదిలో సరిగంగస్నానాలకి దిగిన వీరో-వీరోయిన్లు తలారా మునిగింతర్వాత - ఎవరో పూజారి వేంచేసి చెంబుతో తలమీద నీళ్ళెందుకు పోశారూ అని!
అసలు పాట - కన్నడ కులనారి బగ్గె (గురించి) :
తెరమీద బొమ్మ: శరపంజర (1971)
పదాలు పేర్చినవారు: కణగాల్ ప్రభాకర శాస్త్రి
పదాలు పేర్చినవారు: కణగాల్ ప్రభాకర శాస్త్రి
పాడినవారు: పిబి శ్రీనివాస్, పి సుశీల
పెదవులు కదిల్చినవారు: గంగాధర్, కల్పన
సినిమా అంతగా గుర్తు చేసుకోవడం నాకిష్టం లేదు కానీ అందులో ఒక డైలాగ్ మాత్రం వద్దన్నా గుర్తొస్తుంది ఎప్పుడు ఈ పాటలు విన్నా: నాన్ బందే...నాన్ నోడ్దె... నాన్ గెద్దె (I came... I saw... I conquered - Julius Caesar's "Veni...vidi...vici")
ఈ పాటలో కూర్గ్-స్టైల్ చీరకట్టులో కల్పన ఆట - నమ్మ నోట - పసందట!
నోడి - ఎంజాయ్ మాడి!
తులా మాసేతు కావేరీ... సర్వతీర్థాశ్రితా... నదీ.... ఆఆఆఆ
పంచపాతక సంహర్త్రీ ... వాజినేద ఫలప్రదా.... ఆఆఆఆ
భక్తానుకమ్పే... మునిభాగ్యలక్ష్మీ
నిత్యే ... జగన్మంగళదానశీల.... ఆఆఆఆ
నిరంజనే దక్షిణదేశ గంగే .... దక్షిణదేశ గంగే
కావేరీ ... కావేరీ ... మమ ప్రసీద
మమ ప్రసీద... మమ ప్రసీద...
కావేరి... కావేరి... కావేరి... కావేరి... కావేరి... కావేరి
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారీ
కన్నడ కులనారీ...
కావేరీ ... నీ ఒలవిన సింగారీ
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారీ
కన్నడ కులనారీ...
కావేరీ ... నీ ఒలవిన సింగారీ
హ హ్హ హ్హాహ్హా .... హొహ్హోహ్హొహ్హో
ఋషిజన జీవన తపోనిధి ... ఆఆఆఆ
కావేరీ ... నీనే జేనిన జీవనది
ఋషిజన జీవన తపోనిధి ... ఆఆఆఆ
కావేరీ ... నీనే జేనిన జీవనది
రైతర బాళిన భాగ్యనిధ.... ఆఆఆఆ
కావేరీ ... నీ నడెయువ నెలవెల్ల పుణ్యద సన్నిధి
ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారి
ఆ ఆహా ఆహా ఆహా ఆహా
ఆహా... ఆహా ...
హాలిన అలెయాగి ఆడోళె .... ఆఆఆఆ
కావేరీ... నీ బాళిన సువ్వాలె హాడోళె
హాలిన అలెయాగి ఆడోళె.... ఆఆఆఆ
కావేరీ... నీ బాళిన సువ్వాలె హాడోళె
చిన్నద నాడిన హొన్నాళె .... ఆఆఆఆ
కావేరీ... నీ నవరసవాహిని గిరిబాలె
ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారి
అహ్హహా హా హా హా
గంధద సీమెయ సౌందర్యలహరి.... ఆఆఆఆ
కావేరీ... నీ గంధర్వ గానద ఆనందలహరి
గంధద సీమెయ సౌందర్యలహరి.... ఆఆఆఆ
కావేరీ... నీ గంధర్వ గానద ఆనందలహరి
పతిత పావని అమృతలహరి.... ఆఆఆఆ
కావేరీ... నీ లలిత లతావని శృంగారలహరి
ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ
కొడగిన కావేరీ...
కావేరీ... నీ బెడగిన వయ్యారి
కన్నడ కులనారీ...
కావేరీ...
సిసలుపాట - తెలుగింటి విరిబోణి గురించి:
తెరమీద బొమ్మ: కృష్ణవేణి (1974)
పదాలు పేర్చినవారు: సి నారాయణ రెడ్డి
పదాలు పేర్చినవారు: సి నారాయణ రెడ్డి
పాడినవారు: వి రామకృష్ణ దాస్, పి సుశీల
పెదవులు కదిల్చినవారు: కృష్ణంరాజు, వాణిశ్రీ
ఈ సినిమా ఈ మధ్యనే - సగం సినిమా కళ్ళకి చేతులడ్డుపెట్టుకుని వేళ్ళ సందుల్లోంచి చూస్తూ చూశాను - నాకేదైనా ఇష్టం లేని సీనోస్తే అలాగే చూస్తాను నేను మరి.
అంత కష్టపడి చూడడం ఎందుకంటే - మంచిమంచి పాటలుంటాయి - పాటల్లో రంగుల చీరలలో - నగల హంగులతో మెరిసిపోయే వాణిశ్రీ వుంటుంది మరి!
పల్లవి పాడేటప్పుడు - గులాబీ రంగు బెనారస్ చీర, నీలం గాజులతో, మెళ్ళో వాణిశ్రీ-మార్కు-నెక్లెస్‌తో వాణిశ్రీ....
మళ్ళీ రెండో చరణంలో - పసుపు రంగు పట్టుచీర, వడ్డాణం, వంకీలు, పాపిడిబొట్టు పెట్టుకుని తెలుగింటి అలివేణిలా వాణిశ్రీ....
మూడో చరణంలో - శిల్పరమణిలా కనిపించే వాణిశ్రీ ....
యవనిక అంతా వాణిశ్రీ-మయమిక!
కన్నడపాటలో చరణాల కన్నా తెలుగు పాటలో చరణాలు పొడుగ్గా ఉంటాయి - ఎంతైనా కృష్ణంరాజు పాట కదా - ఆరడుగుల పాట. మూడో చరణంలో "ఏ శిల్ప రమణులు, ఏ దివ్యలలనలు" అన్న దగ్గర చేతులు అటూ ఇటూ విసురుకుంటూ చేసిన రాజుగారి అభినయం - నేత్రపర్వం.
ఈ పాటలో కనిపించిన కృష్ణ నిండుగా, కనకదుర్గ గుడి ఖాళీగా వున్నాయి - అవే ప్రస్తుతంలో అటుదిటు అయ్యాయేమో కదా - నీళ్లు తక్కువయ్యి కృష్ణ ఖాళీగా, భక్తులెక్కువయ్యి దుర్గ గుడి నిండుగా.
ఇప్పటికే చాలా చెప్పేశాను - చూడడమే తరువాయి ....
హే జనని కృష్ణవేణి ...రాజిత తరంగవాణి... ఆఆఆఆ
పంచ పాతక హారిణి...పరమ మంగళకారిణి... ఆఆఆఆ
దక్షిణోర్వి దివ్యవాహిని ...అక్షీణ భాగ్య ప్రదాయిని ... ఆఆఆఆ
శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంసేవిని.. ఆఆఆఆ
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధినీ ..
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధినీ ...
కృష్ణవేణి... ఆఆఆ....కృష్ణవేణి... ఆఆఆ... మమ ప్రసీద .. మమ ప్రసీద...
కృష్ణవేణి... కృష్ణవేణి.... కృష్ణవేణి... కృష్ణవేణి....
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ...
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ...
కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ...
హహ్హహ్హహ్హా... హహ్హహ్హహ్హా....
శ్రీగిరిలోయల సాగే జాడల...
శ్రీగిరిలోయల సాగే జాడల...
విద్యుల్లతలు కోటి వికసింపజేసేవు ...
లావణ్యలతవై నను చేరువేళ...
లావణ్యలతవై నను చేరువేళ...
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణీ ...
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ నా ఇంటి అలివేణీ...
ఆ ఆహా ఆహా ఆహా ఆహా
ఆహా... ఆహా ...
నాగార్జున గిరి కౌగిట ఆగి...
నాగార్జున గిరి కౌగిట ఆగి ...
బీళ్ళను బంగారు చేలగా మార్చేవు ...
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆంధ్రావనికే అన్నపూర్ణవై కరువులు బాపేవు..బ్రతుకులు నిలిపేవు...
నా జీవనదివై ఎదలోన ఒదిగి...
నా జీవనదివై ఎదలోన ఒదిగి ...
పచ్చని వలపులు పండించు కృష్ణవేణీ ...
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ నా ఇంటి అలివేణీ...
అహ్హహా హా హా హా
అమరావతి గుడి అడుగుల నడయాడి...
అమరావతి గుడి అడుగుల నడయాడి ...
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు...
ఏ శిల్పరమణులు.. ఏ దివ్యలలనలు
ఏ శిల్పరమణులు... ఏ దివ్యలలనలు
నోచని అందాలు దాచిన కృష్ణవేణీ ...
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అభిసారికవై హంసలదీవిలో ...
సాగర హృదయాన సంగమించేవు...
నా మేని సగమై... నా ప్రాణసుధవై...
నా మేని సగమై... నా ప్రాణసుధవై...
నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణీ...
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ...
ఎంత మంచి పాటలు కదా!
వింటే చింతలన్నీ ఎగిరిపోవు కదా!
గీతాలు ఇంతలై అంతలై కవ్వింతలై నవ్వింతలై
వంతలు లేని సంగీతలోకం సొంతమౌ గదా!
అందుకే... వింటూ .... అంటూ... ఇందిందే వుండండి
వస్తా .... వెళ్ళొస్తా - మళ్ళింకొన్ని పాటలతో వస్తా....
~పాటల భైరవి
పోస్ట్ బాగా రాశారండి. శరపంజర నాకు కూడా చాలా నచ్చింది. కల్పనగారి నటన అద్భుతం, గుండెను కదిలిస్తుంది. పిబిశ్రీనివాస్ గారి మధుర గాత్రాన్ని కన్నడ చిత్రసీమ చక్కగా ఉపయోగించుకొంది.
రిప్లయితొలగించండినాగేశ్వరరావుగారు: నా పాటల పోస్ట్ మీకు నచ్చినందుకు సంతోషం. పై రెండు పాటల్లో నాకు పిబి శ్రీనివాస్‌గారు పాడిందే నాకెక్కువ ఇష్టం.
తొలగించండిహాయ్ హాయ్ మరో కొత్తపాటతో వచ్చేశారా.. పోస్ట్ చాలా బావుందండీ.. నాకు బాగా ఇష్టమైన పాట కన్నడలో వినడం బావుంది.. పాట చుట్టూ పిట్టకథలు, కబుర్లు భలే రాస్తున్నారు అసలు :-) పాట వింటూ మీ పోస్ట్ చదవడం మంచి రిలీఫ్ ఇస్తుంది :-)
రిప్లయితొలగించండినా పాటలు, మాటలు, పిట్టకథలూ - అన్నీ చదువుతున్నందుకు, నచ్చినవాటిని మెచ్చుకుంటున్నందుకు మీకు చాలా థాంక్స్!
తొలగించండినీకో soap story 👌👌
రిప్లయితొలగించండిThanks, Syamala :)
తొలగించండిAwesome - నేను పాత పాటే పడుతున్నా ఎప్పట్లాగే - ఆసమ్ అని. మీ రాతలకి తిరుగులేదు !
రిప్లయితొలగించండినీ కమెంట్ ఇంకా awesome! Thank you, Aparna!
తొలగించండి