11, ఫిబ్రవరి 2018, ఆదివారం

తెలుగు వెలుగు - 3 - భలే మంచిపాట వినిపించి(రాయించి)న రోజు

అక్కడ - ఆరోజు:

తేదీ: ఫిబ్రవరి 10, 2018

స్థలం: తరతరాల నట్టిల్లు - ఆ నట్టింట్లో ఓ బల్ల

సందర్భం: బుల్లన్నగారి పెళ్ళిరోజు వెండి పండగ

రాగం తీసినవారు: బుల్లన్నగారి బాబాయిగారు / మా నాన్నగారు

తాళం వేస్తూ సాయం పట్టినవారు: బుల్లన్నగారు

రాగం-తాళం ఫోన్లో పట్టి పంచినవారు: బుల్లన్నగారి అమ్మాయీ-మణి గారు - బుల్లి-లలితగారు



ఇక్కడ - ఈరోజు:
 
తేదీ: ఫిబ్రవరి 11, 2018

స్థలం: సముద్రాలవతల ఒకానొక చలిదేశంలో మా బొమ్మరిల్లు

సందర్భం: తెలుగు వినివ్రాత పథకం (అమ్మ వేసినది)

పాట చదివినవారు: అమ్మ

పాట చదువుటకు అక్కడక్కడ రాగం తీస్తూ సాయం పట్టినవారు: నాన్నగారు aka నేనర్స్

పాట విని వ్రాసినవారు: బుజ్జిజింక

వినివ్రాతని ఫోన్లో పట్టి పంచినవారు: అమ్మ

ఇప్పటి వినివ్రాత ప్రత్యేకత: 

అనుకోకుండా సమయానికి అందిన తాతగారి పాట.
అందులో వున్న బోల్డు గుణింతాలు, ఒత్తులు, గమ్మత్తులు.
ప్రతి ఆదివారపు వినివ్రాతకి బుజ్జిజింక అనుమతించిన మితి - ఐదంటే ఐదు వాక్యాలు - అంతకంటే ఎక్కువంటే కుదరదన్న బుజ్జిజింక సాధింపు.
వచ్చేవారం సెలవు ఇచ్చేద్దాం - ఇప్పటికి ఈ పాట రాసేద్దాం అని చెప్పి ఒప్పించడానికి - ఇంకొంచెం ఎక్కువ రాయించడానికి అమ్మ పడ్డ ఆపసోపాలు.
వెరసి .....
భలే మంచి పాట .... 
వినిపించిన రోజు .... 
బుజ్జిజింక కరుణించి రాసిన రోజు ....






8 కామెంట్‌లు:

  1. అబ్బాయి గారి వివాహ రజతోత్సవ వేడుకకు బాబాయి గారి అను’రాగ’పూరిత దీవెనలు వీనుల విందు.
    ఆ వీనులవిందైన పాట బుజ్జిజింక ముచ్చటైన అక్షరాలలో కనులవిందు.

    రిప్లయితొలగించండి
  2. మీ అన్నయ్యగారికి 25 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  3. ప్రసాద్ కి పెళ్ళిరోజు శుభాకాంక్షలు (కొంచం చాలా ఆలీసెంగా)

    రిప్లయితొలగించండి