అ!ర్రే ... ఇలా అయిందేంటి?
ఏమయింది? - ఎలా అయింది? - ఎందుకు అయింది? - ఇల్లాంటి ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పాలంటే కొన్ని వేల రీళ్ళ వెనకాలకి వెళ్ళాలి.
అప్పుడెప్పుడో చిన్నపుడు .... మా అమ్మ పొట్టలో వున్నప్పటినుంచి మొదలుపెట్టి పెంచుకున్న ఆ ఇష్టంతో - పద్మవ్యూహం సుభద్ర కడుపులో ఉండి సగమే విన్న అభిమన్యుడు అక్కడే ఆపేశాడేమో కానీ - నేను మాత్రం అక్కడే ఆగిపోలేదు.
నెలల పిల్లగా సీటు పక్కన బొంతలో పడుకునో, ఆ తర్వాత అమ్మ ఒళ్ళో కూర్చుని జోగుతూనో చాలా చూసేసే వుంటాను. దానికి ప్రూఫు - మా అమ్మ "నువ్విది చూసేశావు" అని నాకు గుర్తు చేస్తున్నట్టుగా చెప్పేసిన కథలు ఎప్పుడో నేను పుట్టకముందటి విశేషాలు.
అలా మొదలైన "చూడడం" కొనసాగించిన విధానం ఎల్లాంటిదంటే...
ఇంటి మడేలు అప్పుడే తెచ్చిన చాకింటి బాంబేడైయింగ్ గౌను వేసేసుకుని ... ఎండాకాలపు ఉక్కకి పేలిన ఒంటికి జాన్సన్స్ ప్రిక్లీహీటు పౌడర్ రాసేసుకుని ... వెనక్కి దువ్విన జుట్టుకి కట్టిన రిబ్బన్-పోనీటెయిల్‌తో ... కాళ్ళకి హవాయి చెప్పులు వేస్తే ఎప్పుడూ ఒకటి పారేసుకుంటున్నానని బెల్టువైతే విదిలించినా వదలవని అమ్మ కొన్న బెల్టు చెప్పులు వేసుకుని... ఒంటెద్దు బండిలో ముందో వెనకో కాళ్ళు వేలాడేసి కూర్చుని ... వెళ్ళే ఉత్సాహంలో అప్పటివరకూ జుట్లు పట్టుకునో, ఇత్తడి సెమ్మాలు విసిరేసుకునో హోరాహోరీ పోరాడేసుకుని, ఏడ్చేసి కూడా "ఆహా! అప్పచెల్లెళ్ళు అంటే ఇలా ఉండాలి" అన్నంత ఆదర్శప్రాయంగా అంతకు ముందు జరిగిన పోనీపట్టు యుద్ధాలు జరిగాయా, మేము చూశామా అని మా అమ్మ, దొడ్డలు, పిన్నులు, మామయ్యలు, అత్తలు హాచ్చెర్యపడిపోయేలా ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసేసుకుని ...టిక్కెట్లబ్బాయి కిటికీ తెరిచి తిరగేసిన U కన్నంలోంచి అందించిన టిక్కెట్లు అపురూపంగా పట్టుకున్న చెల్లాయత్త కేసి అమృతభాండం పట్టుకున్న మోహినికేసి పిల్ల-రాక్షసులు చూసినట్లు ఆరాధనగా చూస్తూ ...
ఇంకా లైట్లు వెలుగుతున్న హాల్లోకి వెళ్ళడం ... మనకి కావాల్సిన సీట్లలో కూర్చోవడం ... కూర్చున్న కుర్చీ విక్రమార్క సింహాసనంలా అనిపించి చుట్టూ వున్న ప్రపంచాన్ని వేరే ఎత్తులోంచి చూస్తున్నట్లు అనేసుకోవడం ...
"నమో వెంకటేశా ..." అన్న ఘంటసాల పాటతో - వేంకటేశ్వరస్వామి బొమ్మతో తెర మీద బొమ్మలు మొదలైతే - పొగ త్రాగరాదు, దయ చేసి ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు, నేడే చూడండి - వగైరా స్లైడ్లను అక్షరం పొల్లు పోకుండా చదువుకుంటూ ... బెంగుళూరులో పెరిగిపోతూ న్యుమోనియా రావడానికి కారణమవుతున్న పార్థీనియం మొక్కలని ఎలా కాలుస్తున్నారో చూపించే న్యూసురీలు ఐదువందల అరవై నాలుగోసారి కూడా అదే మొదటిసారి అన్నట్లు చూస్తూ - "ఆ మొక్కలు మన ముక్కుపుడక పూల మొక్కలు కదా - అయ్యో కాల్చేస్తున్నారా?" అని తెగ బాధపడిపోతూ ... తలమీద ముసుగుతో మైకు పట్టుకుని హిందీలో ఏదేదో మాట్లాడేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయే ఇందిరాగాంధీని చూస్తూ ... చివరాఖరికి అసలు సినిమాని - నోట్లో నమిలే జంతికల చప్పుడుకి డైలాగులు వినిపించవేమో - అని - అతి నెమ్మదిగా నవులుతూ ... అర్థం అయినా కాకపోయినా తెరమీద కదిలే బొమ్మలని కళ్ళప్పగించి చూసి - ఇంటికి వచ్చి - ఆ రెండో రోజు విన్న పాటలని పాడేసుకుంటూ ... సిని-మా-లక్ష్మివ్రతాన్ని నిరవధికంగా, నిరంతరాయంగా ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు చేశాను నేను.
ఇంక ఆ వ్రతాన్ని ఇంక కొనసాగించలేనేమో అన్న బెంగొచ్చేసింది.
ఒక రోజా - రెండ్రోజులా - కొన్ని ఏళ్ళ సావాసం - ప్రతి మాసం ఒక సినీ-మాసం అన్నట్లు జరిగిన సినీ-మా-ప్రయాణం.
ఒక చేత్తో క్లాసు పుస్తకాలు, ఇంకో చేత్తో విజయచిత్ర, జ్యోతిచిత్ర, సితార, స్టార్ డస్ట్ లాంటి సినిమా పుస్తకాలు పట్టుకుని, సినీ-గాసిప్పులని పాలగ్లాసు సిప్పు చేస్తూ చదువుతూ, లెక్కలు చేస్తూ రఫ్‌వర్క్ కోసమని గీసిన మార్జిన్‌లో పక్కనే రేడియోలో వింటున్న నచ్చిన పాటలు రాసేసుకుంటూ - సిని-మాయలో పెరిగాను.
కిరీటాలు పెట్టుకునే దేవుళ్ళుంటే పౌరాణికాలు, సోషల్ టెక్స్ట్ లో వున్న రాజులు, రాణుల కథలంటే చారిత్రాత్మకం, వనమునేలే రాణి, నగరినేలే రాజు ఉంటే జానపదం, ఇవేవీ కాకపోతే సాంఘికం - సినిమాల్లో రకాల గురించి ఊరిస్తూ మా అమ్మ చెప్పిన నిర్వచనాలతో చూసే సినిమాలని పోల్చుకుంటూ ఉండేదాన్ని.
ఎంత చదివినా పరీక్షల ముందు బెంగెట్టేసుకుని గోళ్ళు కొరికేసుకునే నన్ను మరిపించడానికి " సంవత్సరమంతా చదువుతావు - పరీక్షల ముందురోజు చదవక్కర్లేదు - పద సినిమాకెళ్ళొద్దాం" అని సినిమాకే తీస్కెళ్ళేవారు నాన్న.
ఇంట్లో పుట్టినరోజులకి, పండగ-పబ్బాలకి, ఇంటికి వచ్చిన చుట్టాలతో, ఇంటి పక్కన పక్కాలతో, చదువుకునేటప్పుడు స్నేహితులతో, పెద్దయ్యాక సన్నిహితులతో, పెళ్ళైన కొత్తలో ఇద్దరం, పుట్టిన పిల్లలతో కలిపి నలుగురం - ఇలా సందర్భమేదైనా, బంధమూ-సంబంధమేదైనా మా దార్లన్నీ సినీ-దరికే.
హీరో ఆరడుగుల అందగాడైనా - అయోమయపు విజ్జిబాబైనా, ఆడ వేషం వేసినా - పాడు ఏక్షన్ చేసినా చూసేశాను.
హీరోని కొట్టి పచ్చడి చేద్దామని రూంలో కూర్చుని గట్టిగా అరుస్తూ రహస్యంగా ప్లాన్లు వేస్తున్న విలన్ మాటల్ని కిటికీ బయట నుండి విని - చడీచప్పుడు చేయకుండా వెళ్ళి హీరోకి చెప్పాల్సిన హీరోయిన్ను - విలన్ కంటే గట్టిగా "హన్నా! మా హీరోని కొట్టేద్దామనుకుంటున్నావా ? ఆయ్ - నీకెంత ధైర్యం! వుండు నేనేం చేస్తానో? మా హీరోతో చెప్పి నీ పని పట్టిస్తాను" అంటూ అరుస్తూ వెళ్ళబోయి ఆ విలన్ చేతుల్లో చిక్కి - ఏ గాజు ముక్కల మీదో, కుండ పెంకుల మీదో పాదాలు రక్తాలు కారే దాకా - అద్దాల పరికిణీ వేసుకుని మరీ డాన్స్ చేసేస్తుంటే అయోమయ-భాష్పాలు రాల్చాను.
మాయాబజారులో ఘటోత్కచుడి ముందు కెవి రెడ్డి చేర్చిన గిన్నెలను అరువు తెచ్చుకుని విఠలాచార్యుడు జగన్మోహినిలో బుల్లి-తెల్ల-దెయ్యప్పిల్ల చేత పేర్పించినా చప్పట్లు కొట్టుకుంటూ చూశాను.
ఆరాధనలో చివరి పదినిముషాల సీనులో - "రావే తల్లీ! నువ్వొచ్చి కనిపించకపోతే నాగేసొర్రావు కళ్ళే కాదు ప్రాణాలే పోతాయి" అని జగ్గయ్య, గుమ్మడి, రమణారెడ్డి బ్రతిమాలుతున్నా - నోట్లో చీర కుక్కుకుంటూ, గుడ్లలో నీరు కుక్కుకుంటూ - స్తంభాల వెనకనా, గోడల పక్కనా దాక్కుంటున్న సావిత్రిని చూసి - "అబ్బే! గుండమ్మకథలో ఎంచక్కా చేసింది - ఏంటిక్కడ బుర్ర లేకుండా బిహేవ్ చేస్తోంది - ఇంతా చేసి ఇప్పుడే వచ్చిన ఆ కళ్ళు మళ్ళీ పొతే ఇంకెలా - ఇదింకో చిరంజీవులా- దేవుడా! " అని కుర్చీ అంచుమీద గోళ్ళు కొరికేసుకుంటూ తెగ టెన్షన్ పడిపోయాను.
పైన చెప్పినవి మచ్చుక్కొన్ని నచ్చకపోయినా నొచ్చుకోని ఉదాహరణలు.
ఆట్టే సాగదీయకుండా ఇంకొన్ని నొచ్చుకున్నా, నచ్చినా-నచ్చకున్నా, చూసేసిన మెచ్చు-తునకల గురించి చెప్పాలంటే ...
కరుణామయుడు విజయచందర్ కోసం కన్నీరు కార్చాను.
అడవిరాముడితో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటూ గొంతు కలిపి పాడాను.
రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి. నీ కంటి చూపుల వెంట నా పరుగంటి అన్న"టి-పాట" పాడిన ఎంటీవోణ్ణి మురిపెంగా చూశాను.
ఆ తర్వాత నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ అంటూ "డి-పాట" పాడిన మనవణ్ణీ - "పోన్లే-మన ఎంటీవోడి మనవడే మనవాడే" అనుకుని వినీ-విననట్టు ఆట్టే ఆక్షేపించకుండా పక్కకి తోసేశాను.
మనవూరి పాండవుల చిరంజీవి, నందమూరి అందగాళ్ళు, అక్కినేని వంశజులు, మంచువారి వారసులు, దగ్గుబాటి వీరులు - "ఒక్కణ్ణి కాదు ఆడియన్స్ - వంద మందిని ఒదుల్తాము మీ మీదకి" అంటూ తమ్ముళ్ళని, కొడుకులని, అల్లుళ్ళని, మేనల్లుళ్ళని, మనవలని - కురుసంతతి-సంఖ్యకి దీటుగా నట-కార్ఖానాలా ఉత్పత్తి చేసి పంపిస్తుంటే - "పోన్లే! వాళ్ళెలాగూ డాక్టర్లయ్యి మన ప్రాణాలు తీయబోవట్లేదు అదే పదివేలు" అనుకుని యథాశక్తి ఇంటికో-ఏక్టర్ మాత్రమే అని నిబంధనలేమీ పెట్టకుండా తలకో సినిమా చొప్పున వాళ్ళందరి సినిమాలు చూసి పెట్టాను.
చిన్నప్పటి స్కూల్లో ఫ్రెండు భారతికి బాబాయి కొడుకని, కాకుటూరివారిపాలెం వారబ్బాయని తొట్టెంపూడి గోపీచందు సినిమాలు చూశాను.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని శంకరాభరణ రాగం ఆరోహణలో వినిపించిన కాశీనాధుని విశ్వనాథుని సినిమాలు చూశాను.
అన్నీ బావున్నా తెర మీద వంకర-టింకరగా నించుని, అసందర్భంగా నవ్వుతోందని కుంచెం నచ్చకపోయినా, ముళ్ళపూడివారి పలుకులు పలుకుతాయని బాపు-బొమ్మలనీ చూసేశాను.
మీసాల్రాని అబ్బాయిలతోనూ, ఓణీయే ఇంకా సరిగ్గా వేసుకోవడం రాని ముద్దమందారాల తోనూ సినిమాలు తీస్తున్నాడని మా అమ్మ చూడనివ్వకపోయినా కోపం తెచ్చుకుని స్తంభానికి తల కొట్టుకోకుండా ఆవిడ చూపించిన జంధ్యాల సినిమాలు మాత్రమే చూశాను.
పొడుగు జళ్ళేసుకుని - నూలు చీరలు చుట్టేసుకుని - గోదారి ఒడ్డున తెగ పరిగెట్టేసే వంశీ హీరోయిన్ల కోసం చూశాను.
ముందంతా భలే తీసి చివర్లో చంపేస్తాడని కోపం వున్నా బాలచందర్ సినిమాలూ విసుక్కోకుండా చూశాను.
చెప్పాలనుకున్నది చాలా డీసెంటుగా చెప్పే సింగీతం వారి సినిమాలు ఇష్టంగా చూశాను.
ఇంకా దాసరి ప్రేమ-సిరీసు, జీన్సు-ప్యాంటు మీద గళ్ళజాకెట్టు వేసుకున్న రాఘవేంద్రరావు ఫ్రూటు-గరల్సు - అబ్బో - చాలా చూశాను.
కోడి రామకృష్ణ, బాలూ మహేంద్ర, మణిరత్నం, ఎస్వీ కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, గుణశేఖర్, గోదావరి శేఖర్, సంచుల కొద్దీ పంచులు రాసే త్రివిక్రమ్, క్రిష్షు, మారుతి, భాస్కర్, విజయభాస్కర్ - గట్రా గట్రా - ఎట్సెట్రా .... ఇలా పేరుపేరునా చెప్పుకోవాలంటే - అప్పటినుంచి ఇప్పటిదాకా ఎంతోమంది దర్శకుల-నటుల సినిమాలు లెక్కలేనన్ని చూశాను.
సినిమా చూసిన ప్రతిసారీ నచ్చితే ఎలాగూ మంచిగానే మాట్లాడుకుంటాం. నచ్చకపోయినప్పుడు కూడా - "పోన్లే - నేను వండిన వంట బాలేదంటేనే తెగ బాధ పడిపోతాను - అంత మంది కలిపి వండాల్సిన సినిమా అది. బాలేదంటే వాళ్లకెంత బాధ?" అని తలా-తోకా లేని లాజక్కులతో నాకు నేనే సర్ది చెప్పేసుకుని - హ్యాప్పీగా సినిమాలు చూసేసుకుంటూ - చిప్స్ నవిలేసుకుంటూ ఏదో నా మానాన నేను సినీ-మాయలో పడి రోజులు గడిపేస్తుంటే....
అనుకోలేదమ్మా ... ఇలా ఉంటుందని
ఇలా అవుతుందని...
దెబ్బే పడుతుందని... మతే పోతుందని,,,
సినిమా చూసే అప్పటిదాకా అనుకోలేదమ్మా... (చదివేవారూ - అసలు పాట పట్టగలరేమో చూడండి!)
ఒక్క వారం రోజులు వెనక్కి వెళ్ళగలిగితే ... ఆ ఒక్క బల-సీను క్షణాన్ని వెనక్కి తెచ్చుకోగలిగితే ఎంత బావుంటుందో?
ఇప్పటికి ఇలా అనుకోవడమే తప్ప - మా చేతుల్లో ఏమీ లేదు కదా!
కిందటి శుక్రవారం - ఊపిరాడని పనితో ఉన్న మతి పోతోందని - ఊరు మారితే గాలి మళ్ళుతుందని, మనసు తుళ్ళుతుందని అనుకుని పొరుగూరు వెళ్ళామా?
ఆ ఊళ్ళో సినిమా ఊసొచ్చినప్పుడు "అ!మ్మో! ఈనాడు-వాడు అ!ద్దిరిపోయింది అని చెప్తే చెప్పాడు - ఇది మాత్రం చూడొద్దు" అని ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకుని మరీ ఒట్టెట్టుకున్నామా?
ఆదివారం గూటికి తిరిగొచ్చేటప్పుడు బదరి వాట్సాప్ ఎందుకు చూశారో ?
అందులో ఎవరు ఇది బావుందని చెప్పారో?
మేమెందుకు ఇంటికి చేరగానే ఆదరా-బాదరా ఆమ్ తినేసి బుజ్జిజింకని బజ్జోమని పరిగే...త్తుకుంటూ సినిమా హాలుకెళ్ళి పోయామో?
ఆదివారం కదా రష్షుండదులే అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ సినిమా హాలు చేరి చెరో టిక్కెట్టూ కొనుక్కుని - కాళ్ళు జాపేసుకుని - గంటా-ఏభై ఐదు నిముషాల సినిమా చూస్తున్నంత సేపూ - కథింకా మొదలు కాలేదు అని మాకు మేమే నచ్చ చెప్పుకుంటూ - తీరా అయిపోయాక ఏం చూశామో అర్థం కాక - మాటల్లేవ్ - మాట్లాడుకోడాల్లేవ్ అన్న నినాదంతో నోట మాట రానివాళ్ళమై, మాటొచ్చినా మాటల్లేనివాళ్లమై - మాటిమాటికీ చూసిన సినిమాని తలుచుకుని ఇప్పటికీ అ!డలిపోతున్నాము.
నాని-చేప, రవితేజ-చెట్టు అంటే - ఏంటవి ? అసలవి ఎందుకున్నాయ్? అవి సినిమాకేం చేశాయ్?
ఆ ముక్కుపుడకలేంటి? సినిమా మొత్తంలో అందరూ దాదాపు కూర్చునే ఏక్ట్ చేయడమేంటి?
అవసరాల శ్రీనివాసు అవసరమేంటి? ఆయన ఆడావిడ అయిపోయిన హడావిడి ఏంటి?
ఆ చిన్నపిల్ల ఏంటి? ఆ మాటలేంటి?
మురళీశర్మ మ్యాజిక్కు ఏంటి? ఆ టాయిలెట్టు సీనేంటి? తాగిన బ్లూబెర్రీ మొహితో ఏంటి?
అసలా సినిమా మొత్తం ఒక ఫుడ్-కోర్ట్ లో జరుగుతోందని, అందరూ తలో స్టేజూ వేసుకుని అక్కడక్కడే కూర్చుని డ్రామా వేశారని సినిమా అయిపోయేదాకా అర్థం కాని లెవెల్కి నా ఐక్యూ పడిపోవడమేంటి?
కాజల్ చేసిన అద్భుత నటనేంటి? రెజీనా పీల్చిన ముక్కేంటి? నిత్యామీనన్ ఉండి చేసిందేంటి?
రోహిణి తప్ప అసలింక మిగిలిన అమ్మాయిలెవరైనా తెలుగువాళ్ళలా కనిపించారేంటి?
ఆ పక్కజుట్టు-ప్రగతి రోలేంటి - ఆ నోరు తిరగని వంటల గోలేంటి?
గంటా-ఏభై ఐదు నిముషాల సినిమా అయిపోయాక కూడా - సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనిపించిన వైనమేంటి?
వాళ్ళేం తీశారు? మేమేం చూశాం? అందులో నాకెంత అర్థమయ్యింది? అస్సలడగొద్దు.
నచ్చని విషయాల గురించి మాట్లాడకూడదని, మరిచిపోవాలని పదేపదే బదరి చెప్పగా కష్టపడి నేర్చుకున్నాను, ignorance is bliss అని ఇంకోసారి రిమైండ్ చేసుకున్నాను - అనుకుంటూనే పైనో పెద్ద లిస్టు రాశాను.
పేపర్లలో తెగ రాస్తున్నారు - ఇండియాలో నెగటివ్ టాక్ వచ్చింది కానీ అమెరికాలో ఆదరిస్తున్నారు అంటూ.
అది చదివి అమెరికాలో - మాలాగా ఎందరో! - అని నవ్వుకున్నాం.
సరే! ఇంతవరకు వచ్చాక - అసలు విషయం చెప్పాలి కదా!
ఓయ్ సినిమా!
ఎప్పుడో నేను పుట్టక ముందు పుట్టావు నువ్వు. చిన్నప్పట్నుంచి నిన్ను చూస్తూ పెరిగాను నేను.
ఇకపై నిన్ను చూడకుండా ఉంటే నేను పదిలం. నేను చూసినా చూడకపోయినా నువ్వింకా పదికాలాలుండడం ఖాయం.
కనీసం ఈ 2018 సంవత్సరంలో కొన్ని అజ్ఞానవాసి టైపు సినిమాలు చూడకుండా తప్పించుకున్నామని అనుకున్నా - దొరికిపోయాం - ఈ ఒక్క సినిమాతో.
ఎంతో కష్టపడి తీస్తారు - లివ్ ఎండ్ లెట్ లివ్ - అన్నారు కదా ఓ ఇరవయ్యో, పాతికో విచ్చు-డాలర్లు పొతే పోయాయి - మనం చూస్తే వాళ్ళకి డబ్బులొచ్చి ఇంకొంచెం మంచి సినిమాలు తీస్తారు అన్న మాటింక లేనే లేదు.
అందుకని ఇప్పట్నించీ మళ్ళీ 2019 దాకా సినిమాలు థియేటర్‌కి వెళ్ళి మాత్రం చూడం.
ఊరికే వస్తే యూట్యూబులోనో, యప్పు-టీవీలోనో చూస్తాం - అంతగా చూళ్ళేకపోతే కట్టేసుకునేవీలుంటుంది కదా! - అందుకన్నమాట!
నిజ్జంగా...నిజ్జం!
"అ!"డలిపోయి చేసేశాం... (చలన)చిత్ర సన్యాసం!
మళ్ళీ ఎప్పుడో - ఈ బాధ మరపుకొచ్చినప్పుడు -మళ్ళీ కలుద్దాం... ఏ థియేటర్లోనో!
అంతవరకూ ...నీకూ మాకూ టి!
ఇట్లు,
పతీ సమేత సినీ-మా-లక్ష్మి

Telugu cinema in olden days....very nicely described
రిప్లయితొలగించండిThank you for reading my blog & commenting!
తొలగించండి
రిప్లయితొలగించండిలలిత గారూ, ఈ సినీవైరాగ్యం ఏమిటండీ ఏదో ప్రసూతివైరాగ్యమూ శ్మశానవైరాగ్యమూ అన్నట్లుగా? అంతగా చూళ్ళేకపోతే కట్టేసుకునేవీలుంటుంది కదా అని టివీలు కంప్యూటర్లూ సాయంతో చూస్తారా సినిమానీ - హాల్లో ఐతే మాత్రం వాకౌట్ చేసేందుకు తప్పకుండా వీలుంటుంది కదండీ మీ యిల్లు బంగారం కానూ?
సినిమా హల్లోంచి వాకౌట్ చెయ్యొచ్చు కానీ - అక్కడికి వెళ్ళడానికి ముందొక 40 నిముషాలు, ఇంటికి రావడానికి ఇంకో 40 నిముషాలు, హాలు సౌకర్యాన్ని బట్టి కాక సినిమాకెంత ఖర్చు పెట్టారో అన్నదాన్ని బట్టి చక్రవడ్డీతో సహా వసూలు చేస్తున్నారా అన్నట్టుండే టికెట్ ఖర్చు, తెలుగు సినిమాకి వెళ్ళడానికి పిల్లలని ఒప్పించడానికి పడే పాట్లు, తీరా తీసుకెళ్ళాక ఎలాంటి సీన్లు చూసేస్తారో అన్న దిగుళ్ళు - ఇవన్నీ తలుచుకుంటే థియేటర్‌కి వెళ్ళకుండా ఇంట్లో వీలు కుదిరిన టైంలో పైన చెప్పిన భవసాగరాలు ఏవీ లేకుండా సినిమా చూడడం హాయి.
తొలగించండినా ఇల్లు బంగారమవాలని దీవించిన మీకు బో....ల్డన్ని ధన్యవాదాలు, శ్యామలీయం గారు! ! !
ఆ......క్కా!!
రిప్లయితొలగించండిసినిమా "ఫ్రీ" గా చూసా జస్ట్ అరగంట మాత్రమే కానీ చాలాసేపు ఏమి అర్థం కాక బిక్కుబిక్కు మంటూ కూర్చుని ఆలోచించాక నాకోటి అర్ధం అయ్యింది ... ఫాఫామ్ తెలుగు ప్రజలు నాకు వరుస హిట్లు ఇచ్చారు వాళ్ళకి ఏదోటి ఇవ్వకపోతే లావాయిపోతాడాని నాని చేసిన కుట్ర అఘాయిత్యానికి మాటల్లేవ్.....!
అజ్ఞాతవాసిని చూసిన"అజ్ఞాని"గా భీకర బీభత్స ప్రతిజ్ఞ చేస్తున్నా డబ్బులు పెట్టి సినిమా చూడను చూపించను. నెట్ లో చూడటమే ...
https://youtu.be/NEaRimrM3CI
తొలగించండినా తండ్రే ! నాకు తగ్గ తమ్ముడివే! తథాస్తు!
తొలగించండినీహారిక గారు! భలే ! పాట కనిపెట్టి లింకు కూడా పట్టారు! చప్పట్లు!
తొలగించండిఅది శ్రీదేవి పాట కావడం కాకతాళీయం :( ఎంత బావుందో కదా :(
ప్రసూతి వైరాగ్యమూ సినిమా వైరాగ్యమూ శాస్వతమా చెప్పండి.ఒక్క సంవత్సరమేగా ? ఇట్టే గడిచిపోదూ ? నాని సంపాదించినదంతా ఈ సినిమాతో పోగొట్టుకున్నడేవిటా(పేరు ప్రతిష్టలు) అని బాధగా ఉంది.అనుకోలేదమ్మా....
తొలగించండిసినిమా చూడడానికై సినిమా హాలుకు వెళ్ళమనే మంచి నిర్ణయం ఇప్పుడు తీసుకున్నారా? నేను 1990 ప్రాంతంలోనే తీసుకున్నాను 🤓. అప్పటి వరకు నేను కూడా సినిమా హాళ్ళకు మహారాజ పోషకుడినే లెండి 😎. తరువాత తరువాత ఏ సినిమా అయినా ఎప్పటికైనా టీవీలో వచ్చేదే అని గ్రహించిన వాడినై టీవీలో వచ్చినప్పుడే సుఖంగా ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని చూద్దాం అనే పద్ధతి మొదలెట్టాను, ప్రాణానికి హాయిగా ఉంది 👍.
రిప్లయితొలగించండిఇక సినిమా హాల్లోంచైనా వాకౌట్ చెయ్యవచ్చుగా అని పైన శ్యామలరావు గారు అన్నారు చూశారూ - అదంత తేలిక కాదండి. డబ్బు పోసి టికెట్ కొనుక్కునుంటాం కదండి. కాబట్టి సగంలో లేచి వచ్చెయ్యడానికి ఓ పట్టాన మనసొప్పదు 🙁. టీవీలోనో, కంప్యూటర్ లోనో ఫ్రీగా దొరికేవి చూస్తే డబ్బు పోయే బాధుండదుగా. ఇక్కడ అతుకుందేమో తెలియదు కానీ ముళ్ళపూడి వారి జోకొకటి గుర్తొచ్చింది - కట్టుడుపళ్ళు కట్టించుకున్న వ్యక్తితో ఇవి జాగ్రత్తగా ఉంచుకోవాలండి అంటాడు డాక్టర్. అయ్యో కాదుటండీ మరి, పోయిన పళ్ళంటే ఊరికే వచ్చినవి, ఇవేమో బోలెడు డబ్బు పోసి కొనుక్కున్నవీనూ జాగ్రత్త అదే వస్తుందండి అంటాడా పెద్దమనిషి 😀.
“ ..... వెళ్ళమనే మంచి నిర్ణయం ...” = వెళ్ళం + అనే .. ...
తొలగించండివిన్నకోట నరసింహారావుగారు! సరిగ్గా చెప్పారు - సినిమా హాల్లోంచి వచ్చేయడం అంత వీజీ కాదండి - ఆయ్ :) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిమా దేశంలో టీవీ ఛానెల్స్ లో ఈ సినిమా గురించి అన్ని సినిమాలలో అ! సినిమా వేరయా అని ప్రచారం వస్తుంటే కాబోసనుకున్నాను. ఎలా వేరో ఇప్పుడు అర్థమైంది. మీ రివ్యూని ముందస్తు హెచ్చరికగా తీసుకుంటాను (టీవీలో చూడడానికైనా సరే), థాంక్స్.
తొలగించండికలయా? నిజమా? ఇది ఏమి మహిమా? :)
రిప్లయితొలగించండికాదు సుమా కల కాదు సుమా
తొలగించండిఅ! కొట్టిన దెబ్బ నిజమే సుమా
ఈ సినీ-విడుపు ఆ మహిమే సుమా!
ఓ బుజ్జి-గిద్యం నాతో రాయించిన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, శర్మగారు!
అయ్యో అ మూవీతో మూవీలకి అః చెప్పేశారా? మీనుండి ఇక మూవీ రివ్యూస్ ఎక్స్పెక్ట్ చెయ్యలేమా?
రిప్లయితొలగించండినీ కమెంట్ భలే వుంది, అపర్ణా! అబ్బే - రివ్యూలకి అః చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడే వచ్చిన సినిమాకి అప్పుడే పెట్టిన కొత్తావకాయలాంటి కబుర్లు రాయబోను గానీ ఎప్పుడో వచ్చేసిన సినిమాలకి పాత-మాగాయ లాంటి కబుర్లేవో చెప్తాలే :)
తొలగించండిపోనీపట్టు యుద్ధాలు , టి-పాట, డి-పాట బాగున్నాయ్ మీ పద ప్రయోగాలు లలిత గారు
రిప్లయితొలగించండి"పోన్లే! వాళ్ళెలాగూ డాక్టర్లయ్యి మన ప్రాణాలు తీయబోవట్లేదు అదే పదివేలు" అనుకుని యథాశక్తి ఇంటికో-ఏక్టర్ మాత్రమే అని నిబంధనలేమీ పెట్టకుండా - ఈ వాక్యమైతే సూపర్ .
పవన్‌గారు! నా పదప్రయోగాలు నచ్చుకున్న మీకు మెచ్చుకోళ్ళు మరియు థాంక్సులు!
తొలగించండిసుశ్రీగారు! If you are checking my blog, please note that I'm unable to add my comments on your blog posts. Please check the comment settings and enable comments with blogger.
రిప్లయితొలగించండినేను అమెరికా వచ్చి అయిదేళ్ళయిందండీ... మొదటి రెండేళ్ళూ మన సినిమాలే కదా పాపం చూస్తే ఏం పోతుందిలే, ఇద్దరమే, నెల కి ఒక్కటే కదా అని అనుకునేదాన్ని. మొదట "బాద్ షా", తర్వాత "బలుపు" (రవితేజ ఫాన్స్ ఉన్నారిక్కడ, నేను కాదులెండి) ఆ తర్వాత ముచ్చటగా మూడోది "వన్ నేనొక్కడినే" (ఇది మాత్రం నాదే, పాపం మహేష్ బాబు ఏదో ఇంటిలిజెంట్ సినిమా తీసాడంటేనూ ...)
రిప్లయితొలగించండిఆ దెబ్బతో మళ్ళీ దాదాపు రెండేళ్ళు థియేటర్ వైపు వెళ్ళలేదు. ఒక "ఫ్రైడే నైట్ మూవీ నైట్" అని ప్లాన్ చేసి "భలే భలే మగాడివోయ్" రివ్యూలు చూసి కొంచెం ధైర్యం చేసినా బిక్కుబిక్కుమనుకుంటూనే వెళ్తే హమ్మయ్య ఇంకా మన సినిమాలు కొంచెం చూసేటట్టే ఉన్నాయి అని సంబర పడ్డాం.
అయినా ఇంకా నాకు సినిమాలంటే భయం పోలేదు, ఎప్పుడయినా మళ్ళీ "మూవీ నైట్" అంటే నెట్ఫ్లిక్స్ లేకపోతే యూట్యూబ్ ఉందిగా, ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా అని వంక చెప్పి ఇంట్లోనే చూసీ చూసీ అరిగిపోయిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూసి ఆనందిస్తున్నాం. ఇంకా ఈ మధ్య మన లాంటి వాళ్ళ కోసం చాలా సినిమాలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు కదా. (మేము సినిమాకి వెళ్ళాలంటే గంట ట్రావెల్ చేయాలి). థియేటర్ లో లేని ఫెసిలిటీ కూడా ఉంటుంది, అదేనండీ ఫార్వర్డ్, స్టాప్.
ఇన్నేళ్ళ మీ ఓపికని మాత్రం మెచ్చుకోవాలి.
మమతగారు! మాలాంటి ఎందర్లోనో మీరూ ఒకరన్నమాట. ఈ రోజుల్లో తెలుగు సినిమాలు రాజుగారి దేవతావస్త్రాలు. చూశాక బాలేదన్నా, అర్థం కాలేదన్నా అ-మేధావి వర్గానికి చెందుతామన్నమాటే :) నా బ్లాగ్ చదువుతున్న మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండిపాత్ బ్రేకింగు సినిమా అని అందరూ అంటూంటే కామోసని చూసి, అ!దిరి పడ్డాం. ఏది ఎందుకు ఎలా జరిగిందో అ!ర్ధం కాలేదు.
రిప్లయితొలగించండిమాధవ్గారు! అ!దేనండి - అ!లా అ!యిపోయింది - అ!మ్మో అ!ని అ!నిపించింది :)
తొలగించండి