ఏదో నాలుగు రకాల గాలివాటు కబుర్లాడే నేను - ఓనాడు - ఆ కబుర్లే - అనగనగా ... అంటూ - కథలా చెబ్దామని మొదలెట్టి - మొదలూ-తుదీ లేని కబురులాగే సాగించాను.
"నీలాంటి వాడే ఒకడు వెనకటికి - చిన్నప్పుడు కాకరకాయ - పెద్దయ్యాక కీకారకాయ - అన్నాడట" - అనేది మా అమ్మ చిన్నప్పుడు నేను మాట విననప్పుడో - విన్నమాటని నాక్కావాల్సినట్టు తిప్పి అన్నప్పుడో.
మరిన్నాళ్ళకి - నా బ్లాగ్ ముంగిట - అచ్చూ, హల్లూ పోగుచేసుకుని - రెమ్మరెమ్మన చిగురేసి, ఆకేసి - కొమ్మ కొమ్మన మొగ్గేసి, పూతపూసి - అంటుకట్టిన కబురుకొమ్మ - ఇంతై అంతై - డ్రాఫ్టులో ఇమడనంతై - వాకిలి సంపాదకులకు ఒప్పై - వెబ్ వాకిట అందరాని కొమ్మ అయిన నా కథ చదివిందంటే - కబుర్లప్పుడు కాకరకాయ - కథయ్యాక కీకారకాయ అంటుందేమో!
మొత్తానికి నా కథ బ్లాగు గడప దాటింది - అందరాని కొమ్మై వాకిలి మొగసాల నిలిచింది.
కాకరో, కీకరో, ఆకాకరో - తినగ తినగ తీపి కాకపోయినా - చేదైతే కచ్చితంగా కాదు :)
వాకిలిలో నా కథ "అందరాని కొమ్మ" ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అందుతుంది:)

Nice one andarani komma enduku vachindo akarlo telisindi... appude ayyipoyindaa anipinchindi... BTW idhi sasaeshama or sampuranama... just curious
రిప్లయితొలగించండిఅప్పటికది సంపూర్ణమే :)
తొలగించండిఅందరాని కొమ్మ సూపర్! ఎవరికి అందుతుందో కూడ రాస్తే బాగుంటుంది.. ఎండ్ డిటెయిల్డ్ డిస్చ్రిప్షన్ నేచర్ గురించి అదిరిపోయింది .. మళ్ళీ మళ్ళీ చదివాను పిక్చరైజ్ చేసుకొని - పెయింటింగ్ వేసేయాలనిపించే మోటివేషన్ గా ఉంది.
రిప్లయితొలగించండిఎవరికి అందుతుందో అంతీజీగా చెప్పేస్తారు మరి :)
తొలగించండి