ఎప్పుడూ మా వూళ్ళో పుల్ల మావిడికాయలు ఏడాది పొడుగునా దొరుకుతాయి - ప్రపంచంలో ఏదో మూల వేసవి ఉంటూనే ఉంటుందేమో!
ఈసారి మాత్రం తియ్యమావిడికాయ మాత్రమే దొరికింది.
మర్చిపోయిన కొబ్బరికాయ తెచ్చుకుందామని హర్ష ఇండియన్ గ్రోసరీ అంగడికి వెళ్ళి - కొనుక్కుని డబ్బులిచ్చి రాబోతుంటే - "అయ్యో - మరిచాను మీకిమ్మన్నారు ఇది" అంటూ సొరుగు లోపల్నుంచి - వడిలి బంగారపు రంగులో వున్న చిటికెడు వేపపూత తీసి బంగారంలా నాకందించాడు - ఆ కొట్టులోని బంగారుకొండ.
మురిసిపోతూ కార్లో ఎక్కిన నన్నూ, నాచేత భద్రంగా పట్టుకున్నఆ బుజ్జి పొట్లం చూడగానే బదరి - "ఒక ఫ్రెండ్ చెప్పాడు - ఆంధ్రాలో ఇంకా వేపపూత రానేలేదట - పల్లెటూళ్ళో కూడా కొనుక్కోవాల్సిన రోజులొచ్చాయి అని" అన్నారు.
అది వినగానే - ఔరా! విరోధాభాస విళంబీ - అనిపించింది.
మావి చిగురులు వేయనేలేదట
వేప ఇంకా పూయనే లేదట
పేరు లోనేనేమో విలంబం?!
ఊసుపోని కోయిల పాట విన్న సంబరమేమో?!
తొందరపడి ఒక పండగ ముందే వచ్చింది
సంబరపడి మనందరికీ విందులు మప్పింది
విరోధాభాస అయితేనేం విళంబి!
కొత్త సంవత్సరాన్ని కానుకగా ఇచ్చింది
నవజీవనపు భరోసా తెచ్చింది.

dear sir very good blog and very good content
రిప్లయితొలగించండిBollywood News
Thanks!
తొలగించండిమీకు మీ కుటుంబసభ్యులకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్కా!
రిప్లయితొలగించండిధన్యవాదాలు హనుమాన్ - మీ అందరికీ కూడా శుభకామనలు!
తొలగించండిఇంత గడబిడ ముందుముందు ఉండదు లెండి.
రిప్లయితొలగించండిఅందరూ ఆన్‍లైన్‍లో అమెజాన్‍లో కొనాలి ఉగాది పచ్చడి.
అప్పుడది అమేజింగ్ పచ్చడి అవుతుందేమోననండి :)
తొలగించండిమాకైతే వేప మొగ్గలు (రెండే రెండు పూలతో) దొరికాయి, అదే మహా ప్రసాదం అనుకున్నాను.
రిప్లయితొలగించండిమమత గారు! "కొనగ కొనగ వేము ప్రియమగు" అనుకోవాలేమో ఇంక :)
తొలగించండి