అలవాటుగా తెరిచిన Desi Radio
అలవోకగా ఒత్తిన Hindi Non Stop Hits
అనుకోకుండా విన్న ఆ పాట
అప్పుడే ముగియబోతున్న ఓ తలత్ మెహమూద్ పాట
అరె! ఇది మన రాకుమారి - తోటరాముళ్ల పాట అనిపించిన పాట
అప్పటికప్పుడు కలమూ-కాగితమూ వెతుక్కుని రాసుకుందామనుకుంటే చిక్కినది ఒకే ఒక లైను - ఆ పాటలో చిట్టచివరి లైను "జహా నైన్ మిల్ గయే..." అంటూ
అక్కడ ... అలా... మొదలు... నా జత-రాగ పరిశోధన!
దొరికిందేమో ఒక్కటంటే ఒక్క లైను - అది కూడా పల్లవిలో మొట్టమొదటిదిలా లేనే లేదు.
ఎక్కడని వెతకడం? ఎలా వెతకడం?
అప్పుడనుకున్నా - అండగా... గూగులుండగా... తన పద-సెర్చుల అదనుండగా - నాకెందుకింత బెంగా? - అని.
అనుకున్నదే తడవు గూగులించా - అందులో తేలొచ్చిన పాటలన్నీ గాలించా...
అద్గదీ! అలా దొరికేసింది నాక్కావల్సిన కవల-పాట ... హిందీ-డబ్బుడు వెర్షన్ ఆఫ్ తోటరాముడి పాట.
అప్పనంగా యూట్యూబ్‌లో దొరికిన ఈ అబ్బురపు కవలపాటలు ఈ పూటకి నా బ్లాగ్రాతకి భాగ్యప్రదాతలు.
తెలుఘంటసాల-లీలల పాట:
మూవీ: పాతాళ భైరవి
కవి: పింగళి నాగేంద్రరావు
చెవికింపు (గా సంగీతం కూర్చినవారు): ఘంటసాల
మోవి: ఘంటసాల, పీ లీల
ఆడిన బొమ్మలివి: ఎన్టీఆర్, మాలతి
ఓ అంతఃపురపు రాకుమారి కోటలో, ఆ రాకుమారిని చూసి మరులు గొన్న తోటరాముడు తోటలో - జాబిలి నీడన వెన్నెల తోడుగా తెమ్మెర ఆడగా - ఆ జాబిలికి, వెన్నెలకి, తెమ్మెరకి - చెప్పుకుంటున్న ఊసుల పాట ఇది.
అమ్మాయీమణిని తోటరాముడు ఎంతో ఘాటుగా ప్రేమించాడట. ఆ ఘాటు ప్రేమతో చూసిన చూపు తీవ్రమైనదట. ఆ తీక్షణమైన కన్నుకాటు తిన్న కన్నెమనసు కళలు విరిసి మురిసెనట. కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే... కన్నుకాటు తినడం అన్న మాటల వాడుక ఈ పాటలో తప్ప నాకు తెలిసినంతలో ఇంకో పాటలోఎక్కడా వినలేదు. అందులోనూ ఇంత మంచి సందర్భంలో, ఇంకెంతో మంచి అర్థంలో.
తోటరాముడికేమో రాకుమారిలోతన మీద అప్పుడప్పుడే మనసు చాటున పుట్టిన లేలేత వలపు కనుచూపులోనే తెలిసిపోయిందట. ఆ వలపుని ఇంకా పెంచమని, విరహమతిశయించేలా చేయమని మార్కస్ బార్ట్లీ గారు కెమెరా కన్నుతో పట్టేసి వెండితెర మీద అట్టేపెట్టేసిన చంద్రుడిని, ఆ చంద్రుడే ఇచ్చాడా అనిపించేలా వెలిగిపోతూ వెలిగిస్తున్న వెన్నెలనీ, హాయిగా వీస్తున్న తెమ్మెరనీ - ఎంతగా పెంచాలో చెప్తున్నట్టుగా చెయ్యి ఊపుతూ మరీ చెప్తున్నాడు. ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే... అన్న లైను దగ్గర నందమూరివారి హస్తచాలనం నయనమనోహరం. ఘంటసాలవారి గాత్రమే నందమూరి సుందర రూపమయ్యిందో, నందమూరి అందమే ఘంటసాల గాత్రమాధుర్యాన్ని పెంపు జేసిందో తెలుసుకోలేనంతగా అద్భుతంగా ఉంటుంది ఆ మేల్కలయిక.
కనిపించే ౘందమామ, కనిపించని పిల్లగాలికి ఊగే పూలు, లతలు చూస్తూ - ఈ పాట విన్నప్పుడల్లా నాకు చప్పున గుర్తుకొచ్చేది As You Like It లో Rosalind అన్న మాటలు...
"No sooner met but they looked; no sooner looked but they loved; no sooner loved but they sighed; no sooner sighed but they asked one another the reason;"
షేక్స్పియర్ గార్రాసిన ఒక మంచి romantic comedy ని గుర్తు తెచ్చే ఈ పాటంటే నాకు భలే ఇష్టం.
ఇప్పటికి మరి ఈ పాట చూస్తూ, వింటూ, మీరూ అంటూ ఆనందించండి మరి!
హిందీ తలత్-గీతాదత్తుల నోట: మూవీ: పాతాళ భైరవి
కవి: పండిట్ ఇంద్ర చంద్ర

మోవి: తలత్ మహమూద్, గీతా దత్
ఆడిన బొమ్మలివి: ఎన్టీఆర్, మాలతి
ఈ హిందీ కవలపాటను అనుకోకుండా విన్నానన్నాను కదా! యూట్యూబ్ వీడియో కన్న తర్వాత ఇలా అనుకున్నా... అదే సీను, అదే రాగం, అదే ఏక్షను... (ఈ పాటకే మాత్రం సంబంధం లేని అందమైన-విలను ఆర్నాగేశ్వర్రావు అన్న అదే దెబ్బ, అదే చెయ్యి, అదే మడిసి మాటల్ని తలుచుకుంటూ ...)
మీరు కూడా తెలుగు పాటతో పాటుగా ఈ కింది హిందీ పాటని కూడా చూసి, విని, పాడుకుని ఆనందించండి మరి!
ఈ కవలపాటల గాలింపు-బ్లాగింపు ఇంతయ్యాక, చివరాఖరి తాలింపులా మర్రొంత నా పేరడీ-పాటా చేరుస్తానేం!
అదే వరసలో నే పాడేసుకుంటూ - మీరూ పాడేసుకుంటారనుకుంటూ...
ఇట్లు,
~ పాటల భైరవి

ఎంత ఘాటు ప్రేమయో - ఎంత తీవ్ర వీక్షణమో... ఓ..
ఎంత ఘాటు ప్రేమయో...
కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే...
నా మనసు మురిసెనే...నా మనసు మురిసెనే...
ఎంత ఘాటు ప్రేమయో...
ఎంత లేత వలపులో - ఎంత చాటు మోహములో... ఓ..
ఎంత లేత వలపులో...
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే...
నా మనసు నిలిచెనే... నా మనసు నిలిచెనే...
ఎంత లేత వలపులో...
ఎంత లేత వలపులో...
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే...
నా మనసు నిలిచెనే... నా మనసు నిలిచెనే...
ఎంత లేత వలపులో...
ఈ జాబిలి... ఈ వెన్నెల... ఈ మలయానిలమూ...
ఈ జాబిలి... ఈ వెన్నెల... ఈ మలయానిలమూ...
విరహములో వివరాలను విప్పి జెప్పెనే...
ఎంత ఘాటు ప్రేమయో...
ఎంత ఘాటు ప్రేమయో...
ఓ జాబిలి... ఓ వెన్నెల... ఓ మలయానిలమా...
ఓ జాబిలి... ఓ వెన్నెల... ఓ మలయానిలమా...
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే...
ఎంత లేత వలపులో... ఎంత చాటు మోహములో... ఓ..
ఎంత లేత వలపులో...
ఓ జాబిలి... ఓ వెన్నెల... ఓ మలయానిలమా...
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే...
ఎంత లేత వలపులో... ఎంత చాటు మోహములో... ఓ..
ఎంత లేత వలపులో...
హిందీ తలత్-గీతాదత్తుల నోట: మూవీ: పాతాళ భైరవి
కవి: పండిట్ ఇంద్ర చంద్ర
చెవికింపు (గా సంగీతం కూర్చినవారు): ఘంటసాల
మోవి: తలత్ మహమూద్, గీతా దత్
ఆడిన బొమ్మలివి: ఎన్టీఆర్, మాలతి
ఈ హిందీ కవలపాటను అనుకోకుండా విన్నానన్నాను కదా! యూట్యూబ్ వీడియో కన్న తర్వాత ఇలా అనుకున్నా... అదే సీను, అదే రాగం, అదే ఏక్షను... (ఈ పాటకే మాత్రం సంబంధం లేని అందమైన-విలను ఆర్నాగేశ్వర్రావు అన్న అదే దెబ్బ, అదే చెయ్యి, అదే మడిసి మాటల్ని తలుచుకుంటూ ...)
మీరు కూడా తెలుగు పాటతో పాటుగా ఈ కింది హిందీ పాటని కూడా చూసి, విని, పాడుకుని ఆనందించండి మరి!
కహి ప్రీత్ సే భరా - కోయి గీత్ గా రహా
కహి ప్రీత్ సే భరా...
అఖియా మిలా మిలా - ముఝ్ కో బులా రహా
జియరా ఉమంగ్ మే - జియరా ఉమంగ్ మే
కహి ప్రీత్ సే భరా...
కహి ప్రీత్ సే భరా...
అఖియా మిలా మిలా - ముఝ్ కో బులా రహా
జియరా ఉమంగ్ మే - జియరా ఉమంగ్ మే
కహి ప్రీత్ సే భరా...
జహా నైన్ మిల్ గయే... వహా ప్రాణ్ ఖిల్ గయే...
జహా నైన్ మిల్ గయే...
మేరే అంగ్ అంగ్ మే - కోయి ఛా రహా
మన్‌వా తరంగ్ మే - మన్‌వా తరంగ్ మే
జహా నైన్ మిల్ గయే...
జహా నైన్ మిల్ గయే...
మేరే అంగ్ అంగ్ మే - కోయి ఛా రహా
మన్‌వా తరంగ్ మే - మన్‌వా తరంగ్ మే
జహా నైన్ మిల్ గయే...
యే చంద్రమ... యే చాంద్‌నీ... యే కలియా... యే లతా...

లెహ్‌రా కే మన్ కా మేరే దే రహే పతా
కహీ ప్రీత్ సే భరా...

ఓ చంద్రమా... ఓ చాంద్‌నీ... ఓ కలియా... ఓ లతా...

మేరీ ప్రీత్ కా సందేశ్‌వా దో ఉసే బతా
జహా నైన్ మిల్ గయే... వహా ప్రాణ్ ఖిల్ గయే
జహా నైన్ మిల్ గయే...
ఓ చంద్రమా... ఓ చాంద్‌నీ... ఓ కలియా... ఓ లతా...
మేరీ ప్రీత్ కా సందేశ్‌వా దో ఉసే బతా
జహా నైన్ మిల్ గయే... వహా ప్రాణ్ ఖిల్ గయే
జహా నైన్ మిల్ గయే...
ఈ కవలపాటల గాలింపు-బ్లాగింపు ఇంతయ్యాక, చివరాఖరి తాలింపులా మర్రొంత నా పేరడీ-పాటా చేరుస్తానేం!
అదే వరసలో నే పాడేసుకుంటూ - మీరూ పాడేసుకుంటారనుకుంటూ...
ఇట్లు,
~ పాటల భైరవి
తెలుఘంటసాల పాటనూ... హిందీలో తలత్ పాడెనూ...ఓ...
తెలుఘంటసాల పాటనూ...
ఇద్దరివీ వినినంతనే మురిసిపోతినే
నే పోస్టు రాస్తినే... నే పోస్టు రాస్తినే...
తెలుఘంటసాల పాటనూ...
ఆ పాటకు... పీ లీలయు...ఈ పాటకు... గీతాదత్తుయూ...
తమ వంతుగ తేనెపూతల గొంతులు కలిపిరే
తెలుఘంటసాల పాటనూ… హిందీలో తలత్ పాడెనూ… ఓ...
తెలుఘంటసాల పాటనూ…

ఘంటసాల గానమే తలత్ తీపి రాగమాయెనహో ... ఓ ...
రిప్లయితొలగించండిఎంత తీపి మాటయో ...
ఇరువురివీ వినినంతనె సొగసు తెలిసెనే ...
మా మనసు మురిసెనే మా కనులు మెరిసెనే ... ఏ ...
ఎంత తీపి పాటయో ...
ఘంటసాల పాటనూ మరల తలత్ పాడెనొహో ... ఓ ...
తెనుగు హిందీ చేరెనో ...
హిందీలో వినినంతనె తెలిసిపోయెనే
మా ఎదను నిలిచెనే మా మదిని గెలిచెనే ... ఏ ...
ఎంత తీపి పాటయో ...
ఎంత తీపి మాటయో బోల్డు లలిత కబురులలో ...
(ఎంచేతనో నా బ్లాగ్రాతలపై శీత కన్నేసిన క్రమం లో ...
మా అనాతారం లలితమ్మకు నా అక్షర సుమం ...
అంచేతను ఇకపైనన్నా కనీసం ఓ లేటుకన్నైనా
చల్లగా వెయ్యాలన్న అభివాదనా ప్రణామం ... :)
jf / :)
ఱావుగారు! ఎంత అభిమానమహో! మీకు నా అభివాదమహో!
తొలగించండిమరో మంచి పోస్ట్ లలిత గారు మీ బ్లాగ్ ప్రవాహం లో.
రిప్లయితొలగించండిథాంక్స్, పవన్‌గారు!
రిప్లయితొలగించండి