రెండేళ్ల క్రితం జనులందరు కూడి ఒత్తిన టచ్చుస్క్రీను బాలట్టు
వేసినవారికి కౌంటవ్వని వోటు
వేయనివారికి లోటవ్వని వోటు
దేశానికి తెచ్చిందో ట్రంపోటు
వట్టిదెంత ఆ వోటు!
ఓటిదెంతొ ఆ వోటు !
రెండేళ్ల తర్వాత మళ్ళీ పిలుపు రండి రండి మీరందరని
నచ్చినవారికి వెయ్యండని
నచ్చనివారిని తొయ్యండని
Rep నుంచి Dem కి జంపుడని
అట్లు చేసిన బెదురును ట్రంపుడని
చూదమింక ఎన్నిక త్రాసెటు తూగునోనని!
ఏళ్ళు రెండిక వేచివుండక ఎలాగూ తప్పదని!
రెండేళ్లు మరి ఆగాలి అందరమూ వోటేయుటకంట
ఈలోగా డిబేట్లు జరుగునంట
ట్విట్టర్లు తిట్టర్లవుదురంట
ట్రంపరి, ట్రంపారి - వీరిలో గెలిచేదెవరంట?
ఇంతా జరిగి చివరికి తేలేదేంటంట?
ట్రంపో రాజా భవిష్యతి! అవునో కాదో చెప్పేదెవరంట?!

ట్రంపరి, ట్రంపారి...
రిప్లయితొలగించండిపోతన గారి ఆశీస్సులు బాగా ఉన్నాయి ఈ తుంటరి కి
పోతనగారి ఆశీస్సులే? వుంటే అంతకన్నానా?! ఎక్కించేశావ్ ములగచెట్టు...హన్నా! పడేద్దామనే?!
రిప్లయితొలగించండి