ఎండ అపురూపమైన Autumn మధ్యాహ్నవేళ...
(శిశిరం మంచి మాటే...కానీ "Autumn" feels like a harsh-less word as even the mention of it brings a pallete of bright hues, painting the memory vividly - with all the shades that are: of red, of orange, of purple, of maroon... which motivates me to use this English cousin of శిశిరం)
తలుపు తెరిచీ తెరవగానే పలకరించిందో ఆకురాల్చు గాలి
ఆగాల గాలి... ఈల రాగాల గాలి
చెదురుమదురుగా వున్న మబ్బుల్ని అదిలించిన గాలి
ఎంత సేపా ఊసుపోని తిరుగుడు? కురిసిపొండని కసిరిన గాలి
దగ్గర జేరి చిక్కనైన మబ్బుల చూసి మురిసిన గాలి
కరిమబ్బు గొడుగు కింద ఎంతలేసి చెట్లనూ ఊపేస్తున్న గాలి
వున్న పుంజీడు ఆకులనీ రాల్చేస్తున్న రాలుగాయి గాలి
చలి గాలి - బరువెక్కిన తడి గాలి
కుదురుండని పొగరు గాలి
ఉండుండి వీస్తూ ఈ చెంపని ముట్టి, ఇంకో చెక్కిలి తాకి
అక్కడక్కడే ఒంటిని చుట్టి ఒణికిస్తూ ఉంటే
ఆ ఆగకుండా వీచే గాలి దొరికింది కదా అని అదెటూ ఎక్కడికీ మోసుకుపోదు, ఒకవేళ ఆరాటంతో మోసుకెళ్లినా నోరు లేని గాలి వూరు దాటనియ్యదనే భరోసా వుండనే వుంది కదా!
అందుకే కబుర్లాడడం మొదలెట్టా.
నేనన్న మాటకి "ఊఁ ...ఆఁ " అన్నట్లు చిన్నిచిన్ని ఈలలూ, ఊళలే తప్ప ఇంకో మాటే మాట్లాడదే ఆ వెఱ్ఱిగాలి!?
నాదే సవాలు, నాకే జవాబు
కాస్సేపటికి విసుగు రానే వచ్చింది - నా ఒంటిగొంతు రాగం వినీ వినీ
చుట్టూ చూశా
కనుచూపుమేర ఇళ్ళు
ఇళ్ల చుట్టూ చెట్లూ
చెట్ల బారుల మధ్య దారులు
ఆ దారుల అప్పుడోటీ, అప్పుడోటీ సాగే కారులు
ఒక్కసారిగా బెంగొచ్చింది
ఒక్కదాన్నే వున్నానన్న దిగులేసింది
నేనేమన్నా మణులడిగానా, మాన్యాలడిగానా - PGW గారి Wooster మోస్తరులో - regular meals, a good show with decent music every now and then, one or two pals to totter round with, I ask no more - అనే కదా నేననేది? మీల్సూ, షోసూ ఉంటే సరిపోదుగా! ఊసుపోని వేళల ఊసులాడుకోవడానికి Pals తప్పనిసరే కదా!
చటుక్కున లేచి ఒక వేడివేడి కాఫీ కలుపుకున్నాను
చేత ఫోన్ పట్టి దూరానున్న చెలిమి-కలిమితో మాట కలుపుకున్నాను.
"హలో బావున్నావా?"
"నువ్వేనా? ఎంత కుదురుగా పలకరిస్తున్నావ్? ఇది నిజమేనా?"
"అబ్బా! అప్పుడప్పుడన్నా మంచిదాన్ననిపించుకోనీ. ఇంతకీ breakfast చేశావా?"
"ఎందుకూ? నీతో మాట్లాడడానికి strength వుందో లేదో అని పరీక్షిస్తున్నావా?"
"ఏదో మరి నా స్వార్థం! గాలితో ఊసులు చెప్పీ చెప్పీ ఉసూరుమంటున్నాను. మనిషితో మన్నికైన భాషలో కబుర్లకి కలవరిస్తున్నాను. ఆకలి కేకలు వెయ్యకపోతే ఇంకో నాలుగు మాటలెక్కువ చెప్తావని."
"బానే వుంది. మంచి టైంకే చేశావనుకో ఫోన్. ఇప్పుడే ఓట్లతో పోసిన అట్లు తిని వున్నా. నీతో మాట్లాటకి నేను సిద్ధం."
"ఓట్లతో అట్లు - rhyme భలేగా కుదిరింది."
"దానికే మురుస్తావే, మరి మిల్లెట్లతో పుల్లట్లు అంటే ఇంకేమంటావో?"
"ఏమంటాను ... దోశలే కాదు ప్రాసలూ బా వేస్తావంటాను. ఇంతకీ మీ ఊరెలా వుంది?"
"ఊరుకేం? ఊరికే వూరేగాలనిపించేలా వుంది. ఊరేగడమంటే గుర్తొచ్చింది. ఈసారి Halloween కి ఎప్పట్లానే నీ బుజ్జిజింకతో కలిసి ఊరేగావా?"
"అబ్బే... ఎక్కడా?! వాణ్ణి ఎంత అడిగానో - 'మళ్ళీ వచ్చే ఏడాది హైస్కూల్‌కి వెళ్తావూ, పెద్దవాణ్ణయ్యానంటావూ, అందుకని మనిద్దరం ఎంచక్కా వేషాలేసుకుని, అందర్నీ భయపెట్టేసి సంచుల నిండా చాక్లెట్లు తెచ్చుకుందాం రారా' - అని"
"మరింతకీ వెళ్ళారా?"
"ఉహూఁ ! దానికి వాడేమన్నాడో తెలుసా? నేను టీనేజర్ని, రానన్నాడు. పైగా నేనైతే భయపెట్టాలంటే వేషం వేసుకోవాలి. నువ్వు మాత్రం నేనర్స్ అన్నట్లు ఎప్పుడూ ఎలా వుంటావో అలా వచ్చేసినా చాలు అన్నాడు చిలిపి నవ్వు బుగ్గసొట్టల్లో దాచేసుకుంటూ."
"హహ్హహ్హా... మాట్లాటలో నీకు వాడు సమవుజ్జీనే - అనుమానం లేదు. అయితే తండ్రీకొడుకులిద్దరూ నిన్నాటపట్టిస్తున్నారన్నమాట. మరి నువ్వు అలగలే?"
"అలకెందుకూ, ఉలుకెందుకూ? వున్నమాటేగా?! అయినా నిన్ను నిన్నుగా feaరించుటకూ, నీ రూపమె గాంచి దడిచేందుకు మేమున్నామని మందిగా పలికే వారెక్కడుండిన అదే భాగ్యమూ...అదే స్వర్గమూ... అన్నారు కదా!
"అలా నువ్వు తప్ప ఇంకెవరూ అనరు గానీ నీ జ్యేష్ఠుడేమంటాడు? వాడు నీ పార్టీనేనా?"
"వాడన్నదీ విను. మొన్నొక రోజు రాత్రి బుజ్జిజింకకి దుప్పటి కప్పి, ఇవతలకి వస్తూ 'లైట్ తీసేస్తాను కళ్ళు మూసుకో నాన్నా!' అంటుంటే తమ్ముడికి Good Night చెప్పడానికి వచ్చిన అన్నగాడు 'తమ్ముడూ! A room with Amma in it is scarier than a room without light' అనడం దానికా తమ్ముడు గాల్లోకి కాళ్ళు లేపి మరీ చప్పట్లు కొట్టుకుంటూ నవ్వడం. నాకూ నవ్వొచ్చింది వాళ్ళిద్దరూ అలా కూడబలుక్కున్నట్లు నన్నాటపట్టించడం చూసి"
"బావుంది... బావుంది... వాళ్ళు నిన్ను ఆట పట్టించడం. నువ్వు దాన్ని ఆనందించడం."
"వాళ్ళది టీనేజ్ అయితే నాది బీనేజ్ కదా మరి. వాళ్ళ మాటలు, పాటలు చూస్తూ I relive my past."
"టీనేజ్ అంటే తెలుసు నాకు. ఈ బీనేజ్ ఏంటి తల్లీ?"
"కనుక్కోకోలేకపోయావా? హహహ... బీనేజ్ అంటే ఏది విన్నా, ఏం చూసినా "been there once" అనిపించే ఏజ్. Teenage పిల్లలది, Beenage తల్లిది-తండ్రిది."
"హహహహహా... Teenage-Beenage సరి పోయింది!"
"ఇప్పటికే బోల్డుసేపైంది - ఇంక ఫోన్ పెట్టేస్తాను. ఇందాకే అడుగుదామనుకున్నాను మర్చిపోయాను. ఇందాక మిల్లెట్స్ అన్నావు. అంటే చిరుధాన్యాలు కదా! ఎక్కడ దొరుకుతున్నాయి? మా ఊళ్ళో ఇండియన్ స్టోర్‌లో ఉండేవి కానీ ఈ వారం వెళ్లినప్పుడు కనపళ్ళేదు."
"మాకు పొలాల్లో పండుతాయి. అమ్మావాళ్లు పంపిస్తారు తడవకి ఐదేసి కేజీలు అలా."
"మంచి మాట చెప్పావ్. పొలం వుందన్నావ్. ఎప్పటికీ ఉంచుకో. మా ఊళ్ళ పక్క పచ్చటి పొలాలు తవ్వుకుని చేపల చెరువులుగా చేసుకోవడమో, అమ్ముకుని అపార్టుమెంట్లు కట్టేసి అద్దెకిచ్చుకోవడమో చేస్తున్నారు. ముందుముందు తిండిగింజ దొరకని రోజులొస్తాయ్. తలుచుకుంటే బెంగగా ఉంటుంది. సర్లే! ఎన్నిటికని బెంగెట్టుకుంటాను కానీ ... ప్రస్తుతానికి నా మాటల బెంగ నీకు ఫోన్ చేశాక తగ్గింది. మళ్ళీ ఎప్పుడో ఇలాగే... వస్తా! మళ్ళొస్తా! మళ్ళీ పలకరిస్తా!"
"నాకూ బావుంది ఇలా మాట్లాడడం. వుంటాను మరి. Bye!"
"Bye !"
చివరాఖరి సిప్పు:
If you didn't have to start a conversation with a "Sorry" and end with a "Thank you", you definitely were talking with a friend. ~meSayIt

మీ పద విన్యాసాలు, మీ ప్రాసలు బాగున్నాయ్ లలిత గారు especially 'బీనేజ్'. భలే పదం పుట్టించారు.
రిప్లయితొలగించండినే కాయిన్ చేసిన "బీనేజ్"ని మెచ్చుకున్నందుకు బోల్డన్ని థాంక్స్, పవన్ గారు!!
తొలగించండిఈ కాఫీ అన్నీ సమపాళ్లలో కుదిరిన వేడి వేడి ఫిల్టర్ కాఫీ లా ఉంది :)
రిప్లయితొలగించండిTeenage, beenage నీ మార్కు చమక్కు!
నీ కమెంట్ చిక్కటి కాఫీ తాగుతూ చెప్పుకున్న కమ్మని కబురులా వుంది, లక్ష్మీ!
తొలగించండిపోస్ట్ అంత ఒక యెత్తు. మీచివరాఖరి మాట మరో యెత్తు.
రిప్లయితొలగించండినా చివరాఖరి మాటను మెచ్చుకున్న మీ ఈ వ్యాఖ్య నాకు నచ్చేసింది, అన్యగామిగారు!
తొలగించండి
రిప్లయితొలగించండిYou are the Deen of Kaburs!
I mean it!
I would say you have the gene required to enjoy my kaburs ;) & I mean it!
తొలగించండిI love the 'been-age' word you have coined! ours is really so much of 'been there, blogged that' that when we come across a (pleasant) first, it becomes more cheris-worthy. Finding new words is one such - so thanks for adding one! Love your posts, though I don't comment often - keep blogging!
రిప్లయితొలగించండిAparne! First, let me Thank You for taking time to read my blog. Coining words is one of the favorite games that I play with myself. When I coin a good meaningful word, I reward myself with a blog post :)
తొలగించండి