16, ఫిబ్రవరి 2019, శనివారం

నే...డ్డే చదవండి-2-రాగదీపం




 
నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
ఫిబ్రవరి నెల సంచికలో
ఆరున్నొక్క-రాగమయిగా లక్ష్మి 
అనురాగమయిగా జయసుధ... 
ఈ రాగానురాగాల మధ్య నలిగిన 
త్యాగమయుడుగా నటసామ్రాట్  ఏఎన్నార్ ...
ఈ రాగులు*, త్యాగులు, రాగ-విరాగులు నటించిన 
దాసరివారి దర్శకత్వ-పరాగదీపం  - రాగదీపం
ఏనాడో విడుదల…
ఈనాడు మళ్ళీ చెప్పబడె ఇలా…
క్లిక్కుడి ఈ లింకుని అలా అలా... ఫిబ్రవరి నెల సరదా సిన్మాయణం




((*రాగులంటే చిరుధాన్యాలు కాదు సుమీ - ప్రాస కొరకై ప్రయాస మాత్రమే!!)

~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

6 కామెంట్‌లు:

  1. సినిమా అయిపోయిన తరువాత హాలు నుండి బయటకొస్తూ ఒక ప్రేక్షకుడు తన స్నేహితుడితో... ఇంత నానా కంగాళీ సినిమా ఎప్పుడూ చూడలేదు ... అంటున్న బాపు గారి కార్టూన్ గుర్తొచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ కార్టూను ఈ సినిమాకి అతికినట్టు సరిపోతుంది. ధన్యవాదాలు, విన్నకోట నరసింహారావుగారు!

      తొలగించండి
  2. ముళ్ళపూడి వెంకటరమణగారిని గుర్తు చేశారు మీ రివ్యూతో.
    క్రూరంగారావుగారి వారసత్వం క్రూరంగనాధ్ కి ఇచ్చి కూడా.
    ఈ సినిమా చూశాను, ANR సినిమాల్లో అతిజిడ్డు సినిమాగా మాత్రమే గుర్తుండిపోయింది.
    అన్నట్టు ప్రకాశరావు పాడింది "పసుపుతాడుకు .... " అని గుర్తు.ANRకి ఆ వాయిస్ తట్టుకోలేకపోయాను. 😅

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "పసుపుతాడుకు" పాడింది ఎస్పీబీ అండీ. ప్రకాశరావు పాడిన పాట "తెల్లావారే సూరీడొచ్చే వేళా ఆయె" పాట అట. మీ కమెంట్‌కి థాంక్స్ అండీ, YVR గారు!

      తొలగించండి
  3. What a coincidence!!! VNRగారికి బాపుగారు, నాకు రమణగారు ఒకేసారి మీ పోస్టులో గుర్తుకి రావడం విచిత్రంగా వుంది. మీ టపా రూపంలో వాళ్లిద్దరూ మళ్లీ వచ్చి వుంటారు. 🙏😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముళ్ళపూడి వారూ, నేనూ ఒకే గోదారి నీళ్ళు తాగామండి. ఎక్కడో ఒక పిసరన్నా ఆయన రాత చాలు నా రాతల్లో కనిపిస్తే ఆ నీటి మహత్యమే :)

      తొలగించండి