నువ్వంటే నాకిష్టం...
ఆ ఇష్టం ఎందుకు కలిగిందో చెప్పాలంటే కష్టం
గాలి అలల తేలి వచ్చిన నీ గురించిన ఓ కబురో
ఎక్కడో ఎవరో పంచుకున్న నీదైన ఓ తలపో
అదాట్టుగా చిలకరించిన పలకరింపో
అనుకోకుండా రువ్విన నవ్వో - అసలేమీ లేని ఒట్టి నువ్వో
ఇష్ట పడడానికి నాకు పెద్దగా కారణాలక్కర్లేదు
ఇష్టపడాలీ అన్న కారణం తప్ప!
కలిగిన ఇష్టాన్ని - అది నీ మీద కదా! - నీకు చెప్పాల్సిందే!
నీకు చెప్పడం వరకే నా పాత్ర, నా ప్రమేయం
నీకు నేనిష్టమా, లేదా అన్నది నీ ఇష్టం
అది నాకు సంబంధించిన విషయం కాదు
నీతో నీవు ఆలోచించుకుని తేల్చుకోవాల్సిన విషయం
అంత లేదనుకుంటే అక్కర్లేదనుకుని తేల్చేయ్యాల్సిన విషయం...
నువ్వు కాదన్నా నీ మీద నాకున్న ఇష్టానికేం బెంగ లేదులే!
ఒకసారి పుట్టాక కష్టమో, నష్టమో తప్పదుగా ...
నీ మీద నాకున్న ఇష్టంగానే మిగిలుంటుంది...
అందుకే రాసి పెట్టుకున్నా...
Love, affection, friendship... Give unconditionally - Take nonjudgmentally ~meSayIt
నాకున్న ఇష్టాలు అనంతం అనను కానీ ... వున్న కొన్నైనా అవే నాకు ఆనందం. ఆ కొన్నీ నాకిచ్చే ఆనందం అనంతం. అంత అనంతమైన ఆనందమిచ్చే ఇష్టాల్లో మచ్చుకి రెండు - మొదటిది నెచ్చెలులతో అనువైన వేళ ముచ్చట్లు, రెండోది ఎవరికీ అనువుగాని వేళ నే వినే హాయైన పాటలు. ఓ పాటలోంచి ఇంకో పాటలోకి వెళ్తూ, ఇప్పటికి ఈ పాటా-నేనూ మాత్రమే నిజం అనుకునేంతగా అందులో మునుగుతూ-తేలుతూ ఉండడం ఇంకా ఇష్టం. అల్లాంటప్పుడు వింటున్న ఏ పాటో ఉన్నపాటున ఇంకే పాటనో గుర్తుకు తెస్తే తక్షణం ఆ ఇంకో పాటను వెతికి పట్టుకుని మురిసిపోవడం మహా ఇష్టమైన వ్యాపకం.
పాటేదైనా - భక్తిగీతమో, రక్తిరాగమో, ముక్తిమార్గమో - విషాదయోగమో, ఖుషీగానమో - ఏదైతే ఏంటి? పాటైతే చాలు...పాట తోడుంటే మేలు.
ఒక పాట అలసిన మనసుకు కుదురునిస్తుంది. ఒక పాట నిలవనీయక ఆడమని తొందరిస్తుంది. ఒక పాట గుండె కంటిన దిగులుని మరిపించి నవ్విస్తుంది. ఒక పాట మరుగునున్న జ్ఞాపకాన్ని కనుకొసల నీటిచుక్కగా నిలబెడుతుంది. కదిలించు పాటేదైనా మంచిదే...మంచి పాటేదైనా మంచికే...
ఇలా పాటలు గురించి తలచుకుంటూ, నాలో నేనే మురుసుకుంటూ - వివిధభారతి-జనరంజని మోస్తరులో నా మనోరంజని కార్యక్రమంలో చూపుడువేలితో ఐ-పాడ్ మీటలు నొక్కుతూ సినీ-కలల-బేహారి రాజ్‌కపూర్ పాటలు వింటూ వున్నా. ఆహ్, ఆవారా, అనాడీ, శ్రీ 420 - ఒకటొకటిగా పాటలూరుతున్నాయి, ఊరి మీరుతున్నాయి.
అంతలో ఈ మధ్యెప్పుడూ వినివుండని ఎప్పటిదో పాట -
అప్పుడెప్పుడో నే పుట్టకముందొచ్చిన కన్హయ్యా సినిమాలోని పాట-
ఎప్పుడో చదువుకునే రోజుల్లో ఛాయాగీత్‌లో విన్న పాట-
తెర నిండుగా రాజ్‌కపూర్ మాత్రముండు పాట -
కూర్చున్న చోటు నుండి కదలకుండా పాడుతుండు పాట...
ఈ పాట మొదలైనపుడు కనిపించే చెట్టు నాకున్న ఇష్టాల్లో ఓ ఇష్టం.
ఈ పాట విషాదమే కానీ కొన్ని లైన్లు భలే తమాషాగాఉంటాయి.
మేరా దిల్ అగర్ కోయీ దిల్ నహీ...
ఉసే మేరే సామ్‌నే తోడ్ దో - ఉసే మేరే సామ్‌నే తోడ్ దో!
నా హృదయం, హృదయమే కాకపోతే
దాన్ని నా ముందే పగలగొట్టెయ్
మై వో గుల్ హూ జో న ఖిలా కభీ...
ముఝే క్యోం న శాఖ్ సే తోడ్ దో?
నేనొక ఎప్పటికీ పూయని పువ్వును
నన్నెందుకు కొమ్మ మీంచి కోసేయవు?
నేను నాగ్గుర్తుండి "శాఖ్ (शाख) " అనే మాట ఓ హిందీ పాటలో వినడం ఇదే మొదటిసారి.
మీరూ చూసి, విని -
పాతవీ-ఏడ్పువీ కూడా వినేవారైతే ఇష్టమో,
కొత్తవీ-స్పీడువీ మాత్రమే వినీ-కనేవారైతే కష్టమో పడతారని ...
యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=4RaoB9usogQ
యూట్యూబ్ లింక్: https://www.youtube.com/embed/SSrTsN8SCQ4?start=10&end=127
ఇష్టపడాలీ అన్న కారణం తప్ప!
~ పాటల భైరవి

ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...
ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో - ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో!

మై యే భూల్ జాఊంగా, జిందగీ! - కభీ ముస్కురాయీ థీ ప్యార్ మే...

మై యే భూల్ జాఊంగా, మేరా దిల్! - కభీ ఖిల్ ఉఠా థా బహార్ మే...
జిన్హే ఇస్ జహా నే భులా దియా...
మేరా నామ్ ఉన్ మే హీ జోడ్ దో - మేరా నామ్ ఉన్ మే హీ జోడ్ దో!
ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...
ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో - ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో!
ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...
తుమ్హే అప్‌నా కహ్‌నే కీ చాహ్ మే - కభీ హో సకే న కిసీ కే హమ్...

యహీ దర్ద్ మేరే జిగర్ మే హై - ముఝే మార్ డాలేగా బస్ యే గమ్...
మై వో గుల్ హూ జో న ఖిలా కభీ...
ముఝే క్యోం న శాఖ్ సే తోడ్ దో - ముఝే క్యోం న శాఖ్ సే తోడ్ దో?
ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...
ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో - ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో!
ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...
ఈ పాట వింటూ - పాటలో మాటలకి నా మాటలనుకుంటూ, ఆ పాటలో మాటల గురించి నేననుకున్న మాటలు నాతో మాటాడుతున్న బదరితో అంటూ- వుండగా - ఉన్నట్టుండి నాకింకేదో పాట గుర్తొచ్చింది. అది కూడా ఎప్పుడో దూరదర్శన్ రోజుల్లో చూసిన బహదూర్ షా జఫర్ సీరియల్లో విన్న పాట. మన పాటల చక్రవర్తి కిషోర్ కుమార్ అన్నగారైన అశోక్ కుమార్ వేశారు టైటిల్ రోల్.
బహదూర్ షా జఫర్ భారతదేశాన్ని పాలించిన ఆఖరి మొఘల్ చక్రవర్తి. ఆయన ఉర్దూ-కవితా-ప్రపంచక్రవర్తి. ఆయన రాసిన ఘజల్ BR చోప్రా తీసిన హిందీ సీరియల్‌కి టైటిల్ సాంగ్. దీన్ని మహేంద్ర కపూర్ పాడారు.
అన్నట్టు ఈ చిన్ని గజల్ ముక్కలో నాకు నచ్చిన మాట: ముష్త్-ఏ-గుబార్ - అంటే పిడికెడు దుమ్ము.
పాపం! చిట్ట చివరి రాజుగా, ఢిల్లీకి మాత్రమే పరిమితమైన తన పాలనతో, మాట వినని, మన్నించని సిపాయిల ఏలికగా, అశక్తుడైన బహదూర్ షా జఫర్ తనెవ్వరికీ ఇష్టుడని కానని రాసుకున్న పాటలా ఉందిది. కానీ ఆయన రాసుకున్న పాటలు తన తర్వాత తరాల్లో ఎంతో మందికి ఇష్టమౌతాయని అనుకుని వుండడాయన. ఆయన గజల్-ఇష్టుల్లో నా ఇష్టానిదీ ఓ చిన్న పాలు.
ఆ
గజల్ గుర్తు రాగానే యూట్యూబ్లో వెతకడం - పట్టుకోవడం - ఆ గజల్ ముక్క వరకూ
తుంచుకోవడం - నా బ్లాగ్లో ఉంచుకోవడం ...జరిగాయి కాబట్టే - అదిక్కడ
పంచుకోవడం!
యూట్యూబ్ లింక్: https://www.youtube.com/embed/SSrTsN8SCQ4?start=10&end=127
న కిసీ కీ ఆంఖ్ కా నూర్ హూ...
న కిసీ కీ ఆంఖ్ కా నూర్ హూ...
న కిసీ కే దిల్ కా ఖరార్ హూ...
న కిసీ కీ ఆంఖ్ కా నూర్ హూ...
న కిసీ కే దిల్ కా ఖరార్ హూ...
జో కిసీ కే కామ్ న ఆ సకే...
జో కిసీ కే కామ్ న ఆ సకే...
మై వో ఏక్ ముష్త్-ఏ-గుబార్ హూ!
న కిసీ కీ ఆంఖ్ కా నూర్ హూ...
ఇలాంటి స్ స్ స్ స్లో.... సోలో ...శోక ... పాటలు కూడా ఇష్టమా నీకు అనడగబోయేవారికి...
ముందే చెప్పినట్టు...
ఇష్ట పడడానికి నాకు పెద్దగా కారణాలక్కర్లేదుఇష్టపడాలీ అన్న కారణం తప్ప!
~ పాటల భైరవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి