8, నవంబర్ 2020, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 22 - కవలపాటలు - తమిళ వానవిల్లిన్ తుణ్డొండ్రు మణ్ణిల్ వంధు - తెలుగు పిల్ల ఒళ్ళు విల్లైనది...

అనుకున్నామని పరుగిడక - 
అనుకోలేదని నడకాపక -
అదే రోజు మళ్లీమళ్లీ వస్తుంటుంది... 

అనగనగా అదే రోజు - ఎప్పట్లాగే... 
ఆ రోజులో -  
అంతవరకు... అంతా మామూలుగానే...
అచ్చం అంతకుముందులాగే -
ఆ పాటా, ఈ పాటా పాడుకుంటుండగా ... 
అనుకోకుండా గుర్తుకొస్తుంది ఒక పాట 

అంతే ... 
అప్పట్నుంచి అంతకు ముందులా ఉండదు 
ఆ పాటలో పదం, స్వరం, రాగం, శృతి, లయ అంటూ ఇన్నుంటాయా?!
ఆ అన్నిటికీ ఒక్కో నేనుగా నేను ఎన్ని నేనులవుతానో?

పాటకు ముందు... అదే నేను 
పాట వింటూ... అదే నేను 
పాడుకుంటూ... అదే నేను 
పాటలో పాటనై ... అదే నేను 
పాట లోన మునిగి నేను -  అదే పాటనౌతా! 

పదం పదం పదే పదే అంటూ - అదే పాట నేనౌతా!
అదే పాట అదే పనిగ పాడి - పదే పదే పాటనౌతా!
*******
*******

మా ఊళ్ళో నవంబర్ నెల రాగానే రోజులు నిడివి తగ్గి నలుపు-తెలుపుల్లోకి మారుతుంటాయి. చలిచలిగా ముసురెక్కి మసకేస్తుంటాయి. ఆ నలుపు-తెలుపు రోజుల్లో తప్పకుండా గుర్తుకొచ్చే పాటలు కొన్నుంటాయి. అవి కూడా ఎలాంటివంటే పొద్దున్నే మొదలై రోజంతా 'నీ వెంటే నేనంటున్నట్టు' వదలకుండా కురిసే వానముసురులా - ముసిరి మురిపించేవి. 

అలాంటి ఓ పాటే నాకు మొన్న శుక్రవారం గుర్తుకొచ్చింది. అనుకోకుండా అదీ ఒక వాన పాటే. అసలు తమాషా ఏంటంటే ఇన్నేళ్ళుగా నాకు తెలిసింది ఒక్క తమిళ్ పాటే. కానీ మొన్ననే నాకు ఆ పాట తెలుగులో కూడా ఉందని తెలిసింది. ఇంకేముంది? నాకో కవల-కలిమి కలిసొచ్చింది. 

అందుకే అనుకుంటుంటాను నేను - కలిసొచ్చే బ్లాగ్రాతలకి కలిసికట్టుగా దొరికే కవలపాటలుంటాయని 

అసలింతకీ ఆ తమిళ్ పాట ఏంటో, దాని తెలుగు కవల-పాట ఏంటో చెప్పనేలేదు కదా నేను?!

అప్పుడెప్పుడో మేం బెంగుళూరులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా విన్నానా తమిళ పాట. ఆ పాట ఉన్న సినిమా - భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 'కరుత్తమ్మ'. 

ఆ పాట మొదటిసారి విన్న రోజులు కూడా - వానమబ్బు గొడుగులో బెంగుళూరు వణుకుతున్న రోజులే. 

పాట రాసినవారు: వైరముత్తు 
పాట కట్టినవారు: రెహమాన్. 
పాట పాడిన వారు: చిత్ర, ఉన్నికృష్ణన్. 
పాటకు ఆడినవారు: వానచినుకులు, మహేశ్వరి, దగ్గుబాటి రాజా. 

ఒక చిన్న ఫిల్మీ titbit: మహేశ్వరి అతిలోకసుందరి శ్రీదేవికి చుట్టం;  రాజా దగ్గుబాటి వారి వారసుడు.  

ఇంతకీ ఆ పాట ఎలా మొదలవుతుందంటే ...  "తెన్మేర్కు పరువక్కాట్రు..." అంటూ నైఋతి ఋతుపవనాల చల్లని - కుదురు లేని గాలి తెమ్మెరలా - చినుకుల చిందులాటతో మొదలవుతుంది. 

పాట సాగుతున్నంత సేపూ నేపథ్యసంగీతంలో - ఆగకుండా నిలకడగా కురుస్తున్న వానలా  - ఒక వాద్యలయ ఉంటుంది. అక్కడక్కడా చినుకుల సందడి కూడా!

ఈ పాటలో తెలుపు, నారింజ, ఎరుపు రంగుల దుస్తుల్లో - రెపరెపలాడుతున్న కాగితపు పడవలా - ఊగుతూ, తూగుతూ మహేశ్వరి చేసిన డాన్స్ నాకు భలే నచ్చింది. 

వానవిల్లు లాంటి దేహంతో - రంగుకే హంగుగా - బొమ్మలా కదులుతున్న మహేశ్వరితో పాటు - కురుస్తున్న వర్షం, పారుతున్న నీళ్ళు కూడా - రెహమాన్ సంగీతంలో పదాలకి పాదాలు కదిపినట్టు, పాటలో చరణాలకి చరణాల లయ చేర్చినట్టు అనిపించింది నాకు.  

పాట వింటున్నంత సేపూ ఏదో తెలియని ఆనందం నిలువెల్లా వర్షంలా తడుపుతూనే ఉంది నన్ను. 

పాట వింటున్నంత సేపూ కనపడని చినుకులేవో నా చేత కూడా చిందులేయిస్తున్నట్టనిపించింది నాకు. 

పాట పాడుతున్న ఉన్నికృష్ణన్, చిత్రలకి పాడుతుండగానే పాట నచ్చేసినట్టుంది - పాట ఆరంభం నుంచి అంతం దాకా - ఆసాంతం పాటలో మాటల కన్నా ముందు ముసిముసి నవ్వులనేసినట్టున్నారు. పాటంతా నవ్వులమూటలా మోగుతున్నట్టనిపించింది. మువ్వల ఆటలా సాగుతున్నట్టనిపించింది. 

ముందే చెప్పానుగా... నాకు మొన్నటి వరకు తమిళ పాటొక్కటే తెలుసు. పాట రాసుకుందామని యూట్యూబ్‌లో వెతుకుతూ - అదే పాట తెలుగులో కూడా ఉందా అని వెతికితే - పాడబోయిన కీర్తన ఎదురయినట్టు - 'సిరిమల్లె మొగ్గ మీద' పాట కనిపించింది. అప్పుడే తెలిసింది తమిళ 'కరుత్తమ్మ' తెలుగు 'వనిత' అయ్యిందని. 

తెలుగు పాట ఉందని చూసీచూడగానే అనేసుకున్నాను - ఈ వారం కవలపాటల గురించి రాసేద్దామని. 

తమిళ, తెలుగు పాటల్లో నాకు ఏది ఎక్కువ నచ్చిందీ అంటే... తమిళ పాటే - ఒక మంచి కవితలా ఉంది. 

తెలుగు పాట - మరి...  పాపం! అనువాదపు పలుకురాళ్ళు పైకనలేని వేదన పుట్టించినా - ఉన్నికృష్ణన్, చిత్రల ముసిముసి గొంతుల మాటున పుట్టబోయిన వేదన మటుమాయమయ్యింది. అంతగా పట్టించుకోదగని చిరుగాయమయ్యింది. 

అన్నట్టు - ఇప్పటి దాకా - కన్నడ, హిందీ పాటలు రాసుకున్నాను కానీ - నేనెప్పుడూ తమిళ పాటలు తెలుగులో రాయలేదు - ఏ మాట ఎలా రాస్తే తప్పుగా అర్థం వస్తుందో అని. 

మొదటిసారిగా - మొట్టమొదటిసారిగా ఈ "తెన్మేర్కు పరువక్కాట్రు" పాట మాత్రం రాయకుండా ఉండలేకపోయాను. చాలా వరకు మాటలు సరిగ్గానే రాశాననుకుంటున్నాను. 

నాకు వినగా వినగా ఈ తమిళ పాట అర్థం అవుతున్నట్టుగానే అనిపించింది. అలా అనిపిస్తూనే అర్థమయిన పాట ఎంతో అందంగా వినిపించింది. 

ముఖ్యంగా రెండు వాక్యాలు... 'జయహో, వైరముత్తు!'  అనిపించాయి. 

కాదల్ ఎణ్ణుమ్ మంధిరథిన్ మాయమ్ ఎన్న - కల్లుం ముళ్ళుం ఇప్పోదు పూవానదే!

 "ప్రేమ అనే మంత్రగాడి మాయ ఏంటో - రాళ్ళూ ముళ్ళూ కూడా పూలల్లా అనిపిస్తున్నాయి" అని అమ్మాయి అంటే - దానికి బదులుగా అబ్బాయి - 

 వానవిల్లిన్ తుణ్డొండ్రు మణ్ణిల్ వంధు - యారుక్కుమ్ సొల్లామల్ పెణ్ణానదే!

 "వానవిల్లులోంచి చిన్నముక్క ఒకటి ఈ భూమ్మీదకి వచ్చి ఎవరికీ చెప్పకుండా పడుచుపిల్లైనది" అనడం అద్భుతమైన భావం. 

నాకింతగా నచ్చిన తమిళ పాట ఈ కింద ఓ మాటల-రాశిగా రాసి ఉంది. దాని కింద తెలుగు పాట కూడా ఉంది. 

తమిళ పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=YXfttDhW9YQ

తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
వెంకాడు పొత్తగళ్ళి - సట్టెండ్రు మొట్టువిడ
సెంగాటు చిల్లిచ్చెడి - సిల్లెండ్రు పూవెడుక్క్   
 
వానోడుం మణ్ణోడుం ఇల్లాద వణ్ణంగళ్ - పెణ్ణోడుం కణ్ణోడుం నాన్ కాన్కిరేన్... 
తాళాతిళ్ ఇల్లాద సంగీద సారంగళ్ -  పారాట్టుమ్ ఉన్ పాట్టిల్ నాన్ కేట్కిరేన్... 
మళై తుళి ఎన్న తవం దాన్ సేయ్‌తదో?! - మలర్ కొణ్డ మార్బోడు తొట్టాదుదే... 
మళైతుళి తొట్ట ఇడం నీ తీండవో - నినై కైయిల్ ఉళ్ళూరక్ కళ్ళూరుదే... 
 
తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
వెంకాడు పొత్తగళ్ళి - సట్టెండ్రు మొట్టువిడ
సెంగాటు చిల్లిచ్చెడి - సిల్లెండ్రు పూవెడుక్క్   

తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
 
నీ యెండ్రుం నానెండ్రుం... ఇరు వార్తై ఒండ్రాగి - నామ్ ఎండ్ర ఓర్ వార్తై ఉణ్డానదే
 ఆణ్ ఎండ్రుం పెణ్ ఎండ్రుం... ఇరు వార్తై ఒండ్రాగి - ఆళ్ ఎండ్ర ఓర్ వార్తై ఉణ్డానదే
 కాదల్ ఎణ్ణుమ్ మంధిరథిన్ మాయమ్ ఎన్న - కల్లుం ముళ్ళుం ఇప్పోదు పూవానదే!
 వానవిల్లిన్ తుణ్డొండ్రు మణ్ణిల్ వంధు - యారుక్కుమ్ సొల్లామల్ పెణ్ణానదే!
 
తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
వెంకాడు పొత్తగళ్ళి - సట్టెండ్రు మొట్టువిడ
సెంగాటు చిల్లిచ్చెడి - సిల్లెండ్రు పూవెడుక్క్ 

తెలుగు పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=J0eYqZEI1Yw

సిరిమల్లె మొగ్గ మీద - చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ  - వానగాలీ...  
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ -పైట జారీ... 
వెంటాడి పడ్డ చుక్క - ఝల్లంటు ముద్దు చేసి 
సింగారి సిగ్గు గిల్లి - చీరంత ముద్ద చేసె 

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ  - వానగాలీ...   
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ - మనసు జారీ... 
వెంటాడి పడ్డ చుక్క - ఝల్లంటు ముద్దు చేసి 
సింగారి సిగ్గు గిల్లి - చీరంత ముద్ద చేసె 

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ  - వానగాలీ... 

కోకంచు మీద నుండి జారేటి చుక్కల్లో - నీ వేడి నా ఈడు తాకిందిలే 
ఉయ్యాల ఊగించి - నాలోన ఆ వేడి - రాపాడి ఓ పాట పాడిందిలే 
వానచుక్క ఏమి తపం చేసిందనీ? మనసైన బంతాట ఆడిందిలే!
మత్తైన కన్నెతనం చల్లారదు - మనువైతే బంతాటే తెల్లారులూ...

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ - వానగాలీ...
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ -పైట జారీ...
వెంటాడి పడ్డ చుక్క - ఝల్లంటు ముద్దు చేసి 
సింగారి సిగ్గు గిల్లి - చీరంత ముద్ద చేసె 

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ  - వానగాలీ...   
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ - మనసు జారీ...

నీవంటు నేనంటు - ఇక రెండు లేవంటు - మనకంటు ఒక రోజు వచ్చిందిలే!
రేయంటు పగలంటు - ఇక పైన లేవంటు - నీ ఈడు ఒక ఊపు ఇచ్చిందిలే! 
కళ్ళ తోటి మంతరిస్తే కైపైనది - గుచ్చుకున్న ముల్లైన మల్లైనది 
వేడి ఎక్కి పిల్ల ఒళ్ళు విల్లైనది - వానమ్మ ఒళ్ళోన పెళ్ళైనది 

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ - వానగాలీ...
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ -పైట జారీ...
వెంటాడి పడ్డ చుక్క - ఝల్లంటు ముద్దు చేసి 
సింగారి సిగ్గు గిల్లి - చీరంత ముద్ద చేసె

*******
*******

చుట్టుముట్టి చుట్టమైన పాటని 
చేరదీసి చెట్టాపట్టాలేసుకుని 
పట్టుబట్టి పదం పట్టి
పట్టరాని పొంగులెత్తి 
పదం పదం పదే పదే అంటూ -
అదే పాట నేనౌతా!
అదే పాట అదే పనిగ పాడి - 
పదే పదే పాటనౌతా!

~ పాటల భైరవి 

4 కామెంట్‌లు:

  1. అప్పట్నుంచి అంతకు ముందులా ఉండదు
    ఆ పాటలో పదం, స్వరం, రాగం, శృతి, లయ అంటూ ఇన్నుంటాయా?!
    ఆ అన్నిటికీ ఒక్కో నేనుగా నేను ఎన్ని నేనులవుతానో?

    పాటకు ముందు... అదే నేను
    పాట వింటూ... అదే నేను
    పాడుకుంటూ... అదే నేను
    పాటలో పాటనై ... అదే నేను
    పాట లోన మునిగి నేను - అదే పాటనౌతా!

    This is the paisa vasool part for me:-)

    Beautiful song..

    I too live this song because it is the reason for this post!!

    Thanks a lot!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Honestly, that prologue part that I write for each of my song posts is the one I enjoy the most - while writing as well as while reading it later. I am really happy to know there is someone who enjoys them equally. I should THANK YOU!

      తొలగించండి

  2. ఇంతకీ తెలుగులో "పాట రాసినవారు " ఎవరండీ ?

    రిప్లయితొలగించండి