మనసులు కలిసొచ్చే కాలంలో
గడిచే గడియ గడియకీ
మిగిలేదొకటి - గుఱుతు
ఎదిగేదొకటి - ఎఱుక
ఆ గుఱుతు... ఒక ఉగాది
ఆ ఎఱుక... ఒక ఉగాది
కలిసిన మనసులు విచ్చే మేలంలో
తరిగే రోజు రోజుకీ
కలిగేదొకటి - పేరిమి
కలిసేదొకటి - కూరిమి
ఆ పేరిమి... ఒక ఉగాది
ఆ కూరిమి... ఒక ఉగాది
ఏడాదికేడాదికీ
కొమ్మకొమ్మ చిగిర్చి
రెమ్మరెమ్మ పూతలిచ్చి
ఉల్లములుల్లాసంగా
ఉగగా... ఉప్పొంగగా...
పువ్వునవ్వు కన్న కన్ను - మినుమించు
సోలుగాలి పలకరించిన మేను - పులకరించు
ఆ ఉగ... ఒక ఉగాది
ఆ పొంగు... ఒక ఉగాది
యుగయుగాలుగా
ఆద్యంతాలు అంతుపట్టని అనాదిగా
ఏడాదికి ఆదిగా
వెలుగుతున్న ఉగాది
ఈ ఏడాదికి
శోభకృతై
మీ మదికి ఆనందాదియై
మీ హృదికి సంతోషాదియై
మీకూ మీ వారికీ మమతావారధై
మీ జీవనం శోభావృతమై
మీ మనోశోభ కృతమగుగాక

ఉల్లములుల్లాసంగా
రిప్లయితొలగించండిఉగగా... ఉప్పొంగగా...
పువ్వునవ్వు కన్న కన్ను - మినుమించు
సోలుగాలి పలకరించిన మేను - పులకరించు
ఆ ఉగ... ఒక ఉగాది
ఆ పొంగు... ఒక ఉగాది
ఎంత బాగుందో! ఒక్కో పదం, రక రకాలుగా బయటకి ఎన్ని సార్లు చదువుకున్నా..ఏదో గమ్మత్రు గా భలే ఉంది!
కూరిమి, పే రిమి i think your favs..may you have those in abondance!
To dance with:-)