ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి ఇంద్రధనస్సు వచ్చింది. అదేంటీ అంటే... కొంచెం గతం నుంచి స్వగతం ...
తోచీ తోచని ఒక పొద్దున్నే అమ్మాయి నుంచి అమ్మకి ఫోన్ ... (అలాంటి పొద్దున్నలెన్నో, ఎన్నెన్నో)
ట్రింగ్ .... ట్రింగ్.... ట్రింగ్....
నాన్న తీస్తారు ఫోన్ - అది నాన్నదే మరి.
అమ్మకి ఫోన్ వుంటుంది కానీ ఏ హ్యాండ్ బేగ్ లోనో వెచ్చగా బజ్జుని వుంటుంది , లేదా మనవల ఆటలకి బొమ్మై వుంటుంది.
"చెప్పు లల్లీ!" అని అటు నుంచి నాన్న
"ఎలా వున్నారు, నాన్నా!" ఇటు నుంచి పలకరింపు
"బ్రహ్మాండం గా వున్నాను - ఇప్పుడే వాకింగ్ అయి కిందకి వచ్చాను " (ఈయన వాకింగ్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ డాబా పైనే - దూరంగా మెరిసే గోదారిని చూసుకుంటూ నడక-పర్వం ముగించి కిందకి వచ్చారన్నమాట)
"ఎలా వుంది మీ ఆఫీసు ? అందరూ బావున్నారా?"
"నా ఆఫీసు బ్రహ్మాండం - పొద్దున్నే వెళ్తాను , మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తాను - అంతే ఆ తర్వాత వెళ్ళను. కాలక్షేపం అయిపోతోంది"
"సరే అమ్మ ఉందా అక్కడ? మాట్లాడుతుందా?" -
"ఎందుకు మాట్లాడదూ - ఇదిగో లల్లీ ఫోన్ "
"హలో అమ్మా! బావున్నావా?"
"నిక్షేపంలా వున్నాను - మీరు బావున్నారా ?"
ఇలా ఒకటి రెండు కుశల ప్రశ్నలు అవగానేఇంక ఇప్పుడు మొదలు చిత్ర విచిత్ర వర్ణాల ఊసులు.
"లల్లీ - వచ్చేవారం హైద్రాబాదు వెళ్తున్నాను - అక్కడ పప్పీ వాళ్ళింటికి చీరలు అమ్మే ఆయన వస్తాడు . పప్పీ అన్నీ అతని దగ్గరే కొంటుంది. ఈసారి ఏవో గళ్ళ చీరలు తెస్తాడట. చీరంతా ప్లెయిను. కుచ్చిళ్ళు , పమిట కొంగూ గళ్ళు. కాపర్ సల్ఫేటు, నలుపు కాంబినేషన్ తెమ్మన్నాను - నీకు తీసుకుంటాను - సరేనా?"
ఇట్నుంచి నాకప్పుడే టెన్షన్ మొదలు - అదేం చీరో అని.
"అమ్మా! వద్దు తల్లీ - నాకే చీరా వద్దు. గళ్ళూ వద్దు, గిళ్లూ వద్దు. మొన్న నువ్వు పంపిన ఆ బ్రౌన్ గళ్ళ చీర - అదే చీరంతా గళ్ళు - కుచ్చిళ్ళు , పమిట కొంగూ ప్లెయిను - గుర్తుందా - దాన్నే నా కళ్ళకి కనపడకుండా లోపల ఎక్కడో పెట్టేశాను. ఇంకే చీరా వద్దమ్మా. నాకసలు ఏ చీరా కట్టుకోవాలని లేదు" - అని చీర-వైరాగ్యం ప్రదర్శించేసి "హమ్మయ్య ! ఇంకే చీరా కొనదింక" అనుకుని "ఇంకేంటమ్మా విశేషాలు " అనగానే మా "బంగారు" తల్లి కబుర్ల దారి బంగారమే ఇంక.
"లల్లీ! మొన్న తనిష్క్ కి వెళ్ళినప్పుడు (ఖజానా,తనిష్క్ - అవేవో ఈవిడ వెళ్ళకపోతే బెంగ పెట్టుకుంటాయని బెంగ పడి ఒకసారి అలా వెళ్లి పలకరించి వస్తూ వుంటుంది) చిన్న చిన్న తెల్ల రాళ్ళ బుట్టలు చూశాను - తీసుకోనా నీకు?"
"అమ్మా! నాకిప్పుడు బుట్టలేంటమ్మ - అలాంటివేం వద్దు ఇప్పుడు" ఇటునుంచి నా బాధ.
"అది కాదు లల్లీ ! ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే పెట్టుకుంటున్నారు. చిన్నపిల్లవి నీకెందుకు బావుండవు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటావ్? " అటునుంచి అమ్మ ప్రశ్నల వరద.
(సరే ... అరవై దాటిన ఆవిడకి ఇరవై రాబోతున్న కొడుకు తల్లిని నేను చిన్నపిల్లని అనిపించడం నాకు బాగానే వుంది కానీ ఆ వంకతో ఆ రాళ్ళ బుట్టలని అవుననాలని అనడం అంత బాగా అనిపించలేదు నాకు)
మాట మారుద్దామని -" అది సరే కానీ అమ్మా ! నాకొక రెండు వైట్ చుడిదార్లు కొంటావా - సమ్మర్ లో వేసుకోవడానికి " అంటే
అంతే ...
ఫోన్ లోనే ఆ కళ్ళ మెరుపు కనిపించేస్తుంది - కొత్త టాపిక్ మీద ఇంట్రెస్ట్ తో - ఆ మెరుపు గొంతులో ఉత్సాహంలా మారి - "అవును మర్చేపోయాను - మొన్న గంగోత్రి అమ్మాయి పటియాలా వేసుకుంది. ఎంత బావుందో - నీకూ అలాంటిది కొంటాను - కొననా ?"
అమ్మో! - గంగోత్రి అమ్మాయి అంటే రాజమండ్రి లో పెద్ద చుడీదార్ మెటీరియల్ షాప్ ఓనర్. ఆవిడకి అంటే టైలర్లు చేతిలో వుంటారు - ఎలా చెప్తే అలా వింటారు - కుడతారు.
నా లాగా ఫోన్లో తెలుగింగ్లీషు లో చెప్పి, అది మా అమ్మ తెలుగు నుంచి టైలర్ కుట్టు-భాషలోకి తర్జుమా అయేటప్పటికి ఎలా వుంటుందంటే --అబ్బే అది ఒక రెండు మాటలతో తెమలదు మరి.
ఒకసారి ఇలాగే ఆ గంగోత్రి లో డ్రెస్ కుట్టించుకుంటే అది బాగా చిన్నదిగా కుట్టారని అమ్మతో చెప్పాను - అది ఫాషన్ అని తెలీక కొంచెం, తెలిసినా అంత చిన్న డ్రెస్ లో దూరలేక కొంచెం - "ఇంకోసారి కొంచెం లూజ్ గా కుట్టమని చెప్పు " అని.
వాళ్ళు అది మరీ సీరియస్ గా తీసుకుని పై నుంచి కిందకి ఒక బురఖా లాగా కుట్టారు.
రాజమండ్రి వెళ్ళినప్పుడు అదే డ్రెస్ వేసుకుని గంగోత్రి కి వెళ్తే అది కుట్టిన టైలర్ నన్ను పైనుంచి కిందకి ఒకసారి చూసి "ఇది నేను కుట్టిన్దేనండీ - ఆయ్ " అనేసి లోపలి వెళ్ళిపోయాడు.
అతని కళ్ళల్లో తన వృత్తికి తనచేతులతో తనే చేసిన ద్రోహం తాలూకు పశ్చాత్తాపం కంటి చుక్క గా రాలబోయి ఆగినట్టు నాకనిపించింది అంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.
ఈ విషయమే తర్వాత ఒకసారి అపర్ణ తో చెబ్తూ - "అపర్ణా! ఇంక ఆ షాప్ లో నా ఫోటో పెట్టి దానికింద రాస్తారేమో - ఒక హామీ పత్రం లా - ఈ ఫోటో లోని అమ్మాయికి మేమెప్పుడూ బట్టలు కుట్టలేదు - అని. మొత్తానికి నేను గంగోత్రి కి బ్రాండ్ - అన్ - ఎమ్బాసడర్ అయిపోయా " అంటే దానికి అప్పర్ణ సవరింపు - "బ్రాండ్ - అన్ - ఎమ్బాసడర్ (brand-un-ambassador)కాదు లలితా - నువ్వు గంగోత్రి -బ్రాండ్ - ఎమ్బరాసడర్ (brand-embarassador) " అని.
అసలే గంగోత్రి -బ్రాండ్ - ఎమ్బరాసడర్ స్టేటస్ లో వున్న నేను ఎలాగోలా ఆ టాపిక్ తప్పించాలని "సరే అమ్మా - ఇంకా ఆఫీసు టైం అయింది మళ్ళీ రేపో ఎల్లుండో చేస్తాను" అని పెట్టేయబోతూ మళ్ళీ ఇంకో గళ్ళ చీర ఎక్కడ కొనేస్తుందో అని "నువ్వు హైద్రాబాదు వెళ్ళినప్పుడు చక్కగా నీక్కావల్సినవి కొనుక్కో - నేనింకా నువ్వు లాస్ట్ టైం పంపిన చీరలే ఇంకా కట్టుకోలేదు - ప్రస్తుతానికి ఏమీ వద్దు - సరేనా?" అని చిలక్కి చెప్పినట్టు చెప్తే "అలాగే లల్లీ! ఏదో చూసేకొద్దీ కొనాలనిపిస్తుంది కానీ - నాకూ బోల్డు వున్నాయి - ఈసారి కొననులే " అని హామీ ఇచ్చేస్తుంది.
ఓ పదిహేను రోజుల్లో హైద్రాబాదు లో పప్పీ దగ్గరున్నపుడు ఫోన్ చేస్తే "అదే నీకు చెప్పాను - కాపర్ సల్ఫేటు గళ్ళ చీర అది తీసేసుకున్నాను - బ్లౌస్ కుట్టడానికి ఇచ్చేశాను" అని మెల్లిగా చెప్తుంది.
"అదేంటమ్మా వద్దన్నాను కదా" అని నీరసం గా అంటే
"లల్లీ! ఏంటి నీరసం గా వున్నావు - రాత్రి పడుకునేముందు పాలు తాగు. పళ్ళూ అవీ తిను బలంగా వుంటుంది " అంటూనే "పాపం - లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పానని మనకోసమే తెచ్చాడు చీరలు. పంపిస్తాను - నీకంతగా నచ్చకపోతే ఒకసారి కట్టుకుని నాకిచ్చేయ్." అని ఓదార్పు.
పక్కవాళ్ళు కొనుక్కున్నది బావుందనో , లేకపోతే తమకి నచ్చిందనో కొనుక్కునేవాళ్ళు వుంటారు - కానీ అమ్మేవాళ్ళ కి మాట ఇచ్చామనో, వాళ్ళమీద జాలితోనో కొనే మా అమ్మ ("లాంటి వాళ్ళు" అనలేను ఎందుకంటే ఆవిడ "లాంటివాళ్ళు" ఎక్కడా వుండరు) ని తలుచుకుని "చిలక్కి చెప్పినట్టు చెప్పాను అయినా అమ్మ వినలేదు ఎందుకంటే ఆవిడ చిలక కాదు - మా అమ్మ కాబట్టి" అని అనేసుకుని ఆ గళ్ళ చీర కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేను.
ఇప్పటికి అలా నా దగ్గర
1)చీరంతా ప్లెయిను - కుచ్చిళ్ళు , పమిట కొంగూ గళ్ళు
2) చీరంతా గళ్ళు - కుచ్చిళ్ళు , పమిట కొంగూ ప్లెయిను
3) బ్రౌన్ గళ్ళు
4) కాపర్ సల్ఫేట్ గళ్ళు
5) పర్పుల్ గళ్ళు
6) ఆ గళ్ళు, ఈ గళ్ళు, అనేక గళ్ళు..... ఇలా ఎన్నెన్నో గళ్ళ చీరలు
ఆ గళ్ళ గళ్ళ చీరల మీదకి "పాప గారికి నచ్చదంటారండి ఆ డిజైను" అని టైలర్ పద్మ గారంటే "పది వేల మైళ్ళ అవతల వుంది మీరేం కుట్టినా వేసుకుంటుంది" అని హామీ-అభయం ఇచ్చి మా అమ్మ కుట్టించే రకరకాల బుట్ట చేతుల చోళీలు...
ఆ గళ్ళ గళ్ళ చీరల్లో ..ఆ బుట్ట చేతుల చోళీల్లో (ఫోటోల్లో ) నన్ను చూసి "నీకేం బావుంటాయో నీకన్నా ఆంటీకే బాగా తెలుసు" అనే లక్ష్మి, "నీ బ్లౌస్ డిజైన్ లో ఆంటీ కష్టం-ఇష్టం కనిపిస్తున్నాయి" అనే అపర్ణ సాక్షిగా ఇప్పటికీ మా అమ్మే కొని పంపించే "ఇంద్రధనస్సు" అట్ట పెట్టెలో వచ్చేసింది ఇవాళ.

A really refreshing and delightful read with a couple of definitely LOL moments. Keep it up Lalitha.
రిప్లయితొలగించండిOne Me!
తొలగించండిబావుంది నీ రాక నా బ్లాగుకి. వ్యాఖ్యకి కృతజ్ఞతలు.
A mother's love is beautifully narrated laced with subtle humour. Didn't go overboard with humour and yet not undermined her love. Enjoyed thoroughly.
రిప్లయితొలగించండిLoved the 'embarrassador' ��
బ్రాండ్ "ఎంబరాస"డర్ అపర్ణ కాయిన్ చేసి నాకిచ్చిన బిరుదు. నీకు నచ్చినందుకు, వచ్చి మెచ్చినందుకు థాంక్స్!
తొలగించండిBrand-embarassador - hahaha 😂
రిప్లయితొలగించండిI like to be identified as "the" one :))
తొలగించండి