కిందటి శుక్రవారం - అనుకోకుండా - అప్పటికప్పుడు అనేసుకుని - శనివారం నాడు వెళ్ళి - ఇంకో సినిమా చూసేశాం.
నెలలో మొదటి శుక్రవారం - బదరి స్నేహితులతో కులాసాగా గడుపు వారం.
బుజ్జిజింకా, నేనూ - Lego కబుర్లు చెప్పుకుంటూ మా సాయంకాలాన్ని కాలక్షేపం చేశాం.
ఇంటికి వస్తూనే బదరి చెప్పారు - "రాజశేఖర్ కొత్త సినిమా గరుడవేగ బావుందట - రేపు వెళ్దాం" - అని.
అమ్మో - ఇంకో తెలుగు సినిమా అంటే బుజ్జిజింకని ఎన్ని కబుర్లు చెప్పి ఏమార్చాలో అనుకుంటూ - "అబ్బా అదేదో స్పై-థ్రిల్లర్ అని చదివాను - నాకలాంటివి నచ్చవు - ఓ ఆటా, పాటా, నవ్వులూ, రంగురంగుల పువ్వుల డ్రెస్సులూ ఏమీ ఉండవు - ఈసారికి వద్దు" అంటూ నేనంటే -
"పాపం! కొత్తగా ట్రై చేశారట. చాలా బావుందట - ఈ మధ్య రాజశేఖర్‌కి అసలేం హిట్లు లేవట" అంటూ బదరి -
మొత్తానికి మా ఇంకో సినీ-ఓదార్పు-యాత్రకి అంకురారోపణ జరిగింది.
శనివారం మధ్యాహ్నం భోజనాలయేదాకా సినిమా మాటే ఎత్తలేదు నేను.
నా శనివారపు siesta అయి వచ్చేటప్పటికి - Destiny 2 ఆడుకుంటూ తనయుడు, పక్కనే కూర్చుని వాడి ఆట చూస్తూ తండ్రి - కనిపించారు.
అప్పటికే సినిమాకి వెళ్దామా అని నాన్నగారు అడుగుటలూ, బుజ్జిజింక ఒడబడుటలూ - అన్నీ పూర్తయినట్టున్నాయి.
నాకా సంగతి తెలీదు కదా - కొంచెం నెమ్మదిగానే - "ఇంతకీ ఇవాళ సాయంత్రం వెళ్తున్నామా సినిమాకి?" - అన్నానో లేదో - బుజ్జిజింక వాడి ఆట నుంచి తల తిప్పకుండానే - "వెళ్తున్నాం" - అంటూనే - "అమ్మా! నీకు ఎప్పట్నుంచీ కొరియన్ వార్ సినిమాలంటే ఇష్టం మొదలైంది?" - అనడిగాడు.
ఇంకా ఇలా కూడా అన్నాడు - "This movie's name sounds like the courier service that brings Ammamma's ఆవకాయ." - అలా అంటూ - TORI లో వచ్చే గరుడవేగ కమర్షియల్ మొత్తం చెప్పాడు.
అప్పుడర్థమయింది - అంత తొందరగా వాడెలా ఒప్పుకున్నాడో - వాడు అదేదో - వారు , స్పైయ్యింగు - అని ఒప్పేసుకున్నాడు.
మొదటిసారిగా - effortlessగా - చా...లా శాంతియుతంగా మా సినిమా-యాత్ర మొదలు.
సాయంత్రం చుక్క పొడిచీ పొడవకుండానే - ఆమ్ వండేసుకుని - నీకో ముద్ద, నాకో ముద్ద అనుకుంటూ తినేసి - ఆపిన స్టవ్వే ఆపానా లేదా అని చూసుకుని - వేసిన తాళమే వేశామా లేదా అని తీసి వేసుకుని - తెల్లదీ, పెట్రోల్ తాగుటలో ఇంద్రుని వాహనానికి దీటైనదీ - అయిన మా కారైరావతాన్నెక్కి హుషారుగా సినీ-షికారు బయల్దేరాం - ఎనిమిదిన్నరకే.
తొలాట కాని మలాట తొమ్మిదింటికే మరి - తొక్కిసలాట ఉండదు కానీ పేర్లు పడే దగ్గర్నుంచీ సైన్మా చూస్తే ఆ మజాయే వేరు కదా మరి!
తీరా వెళ్ళేటప్పటికి - టికెట్ క్యూలో మా ముందున్న జంటకి ఆ కౌంటర్‌లో వున్న అబ్బాయి ముందున్న కుర్చీల-అమరిక-తెర మీద ఏదో చూపిస్తూ ఉంటే వాళ్ళు తల అడ్డంగా ఊపి బయటికి వచ్చేయడం కనిపించింది.
వాళ్ళ వెనకాలే వున్న బదరి - వాళ్ళు క్యూలోంచి ఇవతలికి రాగానే - తను ముందుకు వెళ్ళి ఆ టిక్కెటబ్బాయికి - నేనూ, మా బుజ్జాయి, మా బుజ్జిజింక వచ్చాము - అని ఎప్పుడో పెళ్లిరోజున గుమ్మం దగ్గర పేర్లు చెప్పినట్టు చెప్పగానే - టికెటబ్బాయి అడ్డంగా తలూపేశాడు - మా హాలులో సీట్లున్నవి ఇద్దరికే - అవి కూడా తొట్టతొలి వరసలో - అంటూ.
ఇంకేం చేస్తాం - ఇంటికెళ్ళిపోదాం అంటే - పాపం బదరి - నేను నిజంగా డిజప్పాయింట్ అయిన దానికన్నా - నేను డిజప్పాయింట్ అయాననుకుని తను ఎక్కువ డిజప్పాయింట్ అయ్యారు - "అయ్యో! సినిమాకొచ్చి చూడకుండా వెళ్ళిపోతే ఎలా ?"- అంటూ.
అప్పటికప్పుడు - ఆన్‌లైన్‌లో వెతికి దగ్గర్లో వున్న ఇంకో థియేటర్‌లో ఉన్న ఆమిర్‌ఖాన్ - సీక్రెట్ సూపర్‌స్టార్‌కి వెళ్దామన్నారు కానీ - నేను వద్దనేటప్పటికి ఇంటికి వచ్చేద్దామని బయల్దేరామో లేదో - అప్పుడే లోపలి వస్తున్న హనుమత్‌ప్రసాద్ కనిపించి పలకరించారు. తనతో ఒక రెండు నిముషాలు మాట్లాడి కారెక్కి ఇంటి దారి పట్టాము - పోన్లే రాజశేఖర్ సినిమా సోల్డ్-ఔట్ అంటే తెలుగు సినిమాకి మంచి సూచనే అనుకుంటూ.
తిరుగు-సవారీలోఅంతా నిశ్శబ్దం.
సరిగ్గా ఒక పదిహేను నిముషాల్లో ...ట్రింగ్..ట్రింగ్....ట్రింగ్....ట్..ర్...ర్...ర్రింగ్ అంటూ బదరి ఫోన్ మోగింది.
నేను తీసేలోగా కట్ అయింది - ఎవరి దగ్గర్నుంచా అని చూస్తే - హనుమత్‌ప్రసాద్.
ఎందుకు చేశారో అనుకుంటూనే బదరి వెంటనే కాల్ చేస్తే - అవతల్నుంచి చెప్పారతను - ఈ థియేటర్ సోల్డ్-ఔట్ అని పక్కనే ఇంకో థియేటర్‌లో తొమ్మిదింపావుకి ఇంకో షో వేస్తున్నారని - వీలైతే ఆన్‌లైన్‌లో వెంటనే టికెట్లు బుక్ చేసుకోమని చెప్పారు.
నిజం చెప్పాలంటే - రాజశేఖర్ సినిమా సోల్డ్-ఔట్ అయి - వెంటనే ఇంకో థియేటర్ అదనంగా అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం - నాకు తెలిసి మా ఊళ్ళో రికార్డే. మాకు భలే సంతోషంగా అనిపించింది రాజశేఖర్‌కి మంచిరోజులొచ్చాయని.
వెంటనే మా సవారీ-తెన్ను మారి మళ్ళీ సినిమా-దరికి దారి మళ్ళింది.
తొమ్మిదిగంటల ఇరవై నిముషాలకి సినిమా-హాల్ప్రవేశం చేశాం - మూడు కుడికాళ్ళు లోపల పెట్టి.
అప్పటికే - ఓ అబ్బాయి ముందు పరిగెడుతూ వెళ్తూ ఉంటే అతని వెనకాల ఇద్దరు మోటార్ సైకిళ్ళమీద వెళ్ళినా అందుకోలేక అవస్థలు పడుతూ వున్న అతి-పరిచయమున్న తెలుగు-సినిమా-సూత్రంతో జరుగుతున్న మా-సినిమా-వీక్షణ మొదలు.
సినిమా చాలా బావుంది.
తెలుగు సినిమాకి కొత్త కథ.
చాలా సెన్సిబుల్‌గా వున్న దర్శకత్వం.
అద్భుతంగా వినిపించిన నేపథ్యసంగీతం.
ఉన్న రెండు పాటల్లో - ఏ పాటకా పాటకి సరిగ్గా కుదిరిన సంగీతం.
దర్శకుడే కథా-నాయకుడై - అంతటా తానే అయి - మిగిలిన వాళ్ళందరూ కథకి అవసరమైన పాత్రల్లా - చాలా సహజంగా - గ్రిప్పింగ్‌గా కథ, కథనం ప్రధానాంశాలుగా నడిపిన తీరు గొప్పగా వుంది.
సినిమా కథలో భాగంగా - ఒక చోట అమ్మాయిలు పాట పాడుతూ ఆడుతున్నప్పుడు - హుషారుగా వాళ్ళ చుట్టూ బోల్డుమంది ఆ పాటకి గొంతు కలుపుతూ - ఆ ఆటకి తాళం వేస్తుంటే - వాళ్ళ మధ్యకి రాజశేఖర్ పరిగెత్తుకొచ్చి తనూ స్టెప్పులేయకపోవడం - రొటీన్నుంచి ఓ పెద్ద రిలీఫ్.
అన్నిటికన్నా ముఖ్యంగా - కొరియన్ వార్ లేకపోయినా - సినిమా మొత్తంలో ఒక్కసారంటే ఒక్కసారి వినిపించే నార్త్ కొరియా మాటని పట్టుకుని పొరపాటున వార్ సినిమా అన్చెప్పిన నాన్నగారిమీద అలక్కుండా - బుజ్జిజింక సినిమాని తెగ ఎంజాయ్ చేస్తూ చూడడం - ఇంకా బాగా అనిపించింది.
సినిమా అయిపోయి ఇంటికి వస్తుంటే వాడి దృష్టికోణపు సమీక్ష ఏంటంటే: సినిమా చాలా బావుంది.
ముఖ్యంగా వాడికి నచ్చినదేంటంటే - చాలా ఇంటెన్స్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన - Political rally లో బాంబ్ diffuse చేసిన సీను - ఎందుకంటే ఎవరికీ దెబ్బ తగల్లేదు కాబట్టి.
మొత్తానికి చాలా రోజులతర్వాత మా ఇంటిల్లిపాదికీ నచ్సిన సినిమా - PSV గరుడవేగ.
ఇంత నచ్చినా - నాకున్న some-సందేహాలు, some-సంశయాలు, some-సంగ్రహాలు:
1) What does PSV stand for ? Praveen Sattaru's Vision ? సరైన జవాబు ఏంటో మరి!
2) What is the meaning of 126.18M ?
3) What is NIA? దీనికోసం గూగుల్ చేస్తే మొట్టమొదటగా కనిపించింది National Institute on Aging. అబ్బే - ఇది అయ్యుండదేమో - అనుకుని NIA Inida అని వెతికితే - 2008 లో ఆవిర్భవించిన National Investigation Agency గురించి తెలిసింది. ఈ గరుడవేగ సినిమా పుణ్యమాని నాకు లోకజ్ఞానం పెరిగింది.
4) రాజశేఖర్‌ని చాలా ఏళ్ళ తర్వాత - అంటే అల్లరిప్రియుడు తర్వాత - హీరోగా చూశాం. సంతోషం. కానీ - పాపం! అతన్ని మోసేయడం కాకపొతే అంకుశం-ఆహుతి రోజుల angry-young-man ఎక్కడా? భార్య చాటు ఈ gingerly-old-dude ఎక్కడా? దీంతర్వాత అతనికి వచ్చే అవకాశాలు ఏంటబ్బా? అనిపించింది. బాండ్ సిరీస్ లాగా వేగా-సిరీస్ తీయబోరు కదా? ఈ సినిమా వల్ల సత్తారు సత్తా సినీ-ప్రపంచానికి తెలుస్తుందేమో కానీ రాజశేఖర్‌కి ఏంటి లాభమో అర్థం కాలేదు. నిజంగా చెప్పాలంటే - బదరి, నేనూ అనుకున్న మాట - హీరో ప్లేసులో ఎవరైనా సరిపోయేవారు - ఇప్పటి సెమి-వృద్ధ హీరోల్లో ఎవరో ఒకరు. అందరికన్నా కొంచెం ఎక్కువగా రవితేజా సరిపోయేవాడు.
4) ఇంక హీరోయిన్ రోల్ - చీర కట్టుకుని, బుక్కులు చదువుకుంటూ, మొక్కలు పెంచుకుంటూ - టీవీల్లో వాళ్ళ ఆయన గొప్పదనాన్ని చూపిస్తున్నా - అసలతనేం ఉద్యోగం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఉండడం - అతనికి బయటున్న టెన్షన్స్‌కి తోడు డివోర్స్ అంటూ ఆ గొడవేంటి? అమాయకత్వమా? ఏమీ పట్టనితనమా?
5) సినిమా మొదట్లో - ఆలీ కౌన్సెలింగ్ సీన్ - హీరో ఒకటి చెప్తే ఆలీ ఇంకోటి ఎలా ఊహించుకున్నాడో - అంటే హీరో చెప్పిన నక్షత్రతాబేళ్ళ స్మగ్లింగుకి, ఆలీ ఊహించుకున్న అదేదో dam దగ్గర drug-racketకి ముడి ఎలా కుదిరిందో అర్థం కాలేదు - బహుశా అంతకు ముందెప్పుడైనా ఆలీ పేపర్లలో చదివాడేమో అని సరిపెట్టుకుని-సర్దిపెట్టుకుందామనుకున్నా - ఆలీ చూసింది మరి హీరో-ఆలి ఎందుకు చూసి ఉండదు? చూస్తే ఎందుకు అర్థం చేసుకోకుండా విడాకులు అడుగుతోంది?
6) చీర కట్టుకున్నవాళ్ళు అలా అయోమయంగా ఉంటే - ఇంక హీరో టీమ్లో - dotలూ, dashలూ చూసి అది మోర్స్‌కోడ్ అని చెప్పడానికి - ఒక బోయ్-కట్ చేయించుకుని పాంటూ-టీచొక్కా వేసుకున్న అమ్మాయి.
నాకది చూడగానే వెం...ఠనే గుర్తుకొచ్చింది - ఎవరంటే - Cryptography లో PhDని అలవోకగా ఉప్పాడచీర కొంగున ముడేసుకున్న మా నిరుపమ.
Encrypted dataని crack చేసే smart అమ్మాయిలు లేటెస్ట్ మోడల్ smart phone లెక్కుండక్కర్లేదు భయ్! - అతి మామూలుగా కనిపిస్తూ - మన మధ్యలో తిరిగే ముద్దమందారాల్లా కూడా ఉండొచ్చు.
సినిమా వాళ్ళ ఫార్ములాల లెక్కలు మారితే బావుండును.
7) ఈ స్పై-సినిమాలో అసలితను కనిపించడం అవసరమా అనిపించినా - తన నటనతో తనెక్కడైనా అనవసరం అనిపించడని - గుర్తుంచుకోవాల్సిన అవసరం నాక్కల్పించిన - అవసరాల శ్రీనివాస్ - ఉన్న కాసేపు - ఇతనిక్కడ అవసరమే - అనిపించాడు.
8) చివర్లో చీర కట్టుకున్న హీరోయిన్ని సముద్రంలో పడేసి - ఈదిస్తాడేమో అని భయపెట్టినా - ఆ పని చేయని దర్శకుడికి జేజేలు.
9) అలాగే ఈ తెలుగు ప్రేక్షకులు నేనెలా తీసేసినా చూసేస్తారు అన్న ధీమాతో అవసరం లేకపోయినా చిన్నచిన్న పిల్లలతో పెద్దపెద్ద మాటలు చెప్పించకుండా - అలాగే - చివర - షిప్పుని పేల్చేసే సీనులో పిల్లలని కూడా పట్టుకొచ్చి అక్కర్లేని హడావిడి సృష్టించకుండా ఉన్నందుకు - పిల్లలూ, అమ్మల తరపున ఇంకొన్ని జేజేలు.
10) బకెట్లో పట్టుకెళ్లి - high pressure tube లోంచి illogical గా - విసిరిన బాంబుల తాకిడికి పేలిన - అంత మొదటిరకం యురేనియం వున్న ఓడ - తాను పేలిపోతూ పక్కనే హీరో, హీరోయిన్, సెమి-హీరో వున్న బార్జ్‌ని ఏమీ చేయకపోవడం - హీరోచితంగా ఉన్నా - కథోచితంగా అనిపించలేదు. కానీ - సర్దేసుకున్నాం - ఎంతైనా సర్వేజనా-సుజనోభవంతు - సర్వే సుజనా సుఖినోభవంతు-స్లోగన్ ప్రమోటర్లం కదా!
ఇదిగో... ఇందుకే! నేను తెలివైన దర్శకుల సినిమాలు చూడను - అక్కర్లేని అనుమానాలొస్తాయ్ - అడిగినందుకు ఆవేశాలొస్తాయ్ - అపార్థాలకి అవకాశాలొస్తాయ్ - అవి వివరించలేక ఆయాసాలొస్తాయ్.
ఇన్నొచ్చినా - ఇవన్నీ వస్తే వచ్చాయిలే - అని సినిమా చూడడం - అనుమానాలాడగడం - ఆవేశాల విలాసాలు చూడడం - అపార్థాల పాలబడడం - ఆయాసాల ఆవల కులాసాల కబుర్లాడడం - నాకో సరదా!
ఇంత జరిగాక...
ఇంకా-ఇంకా...
రాజశేఖర్ హీరోగా మరిన్ని సినిమాలు రావాలి గాని -
మరీ అదే మూసలో మరో NIA-టైపు సినిమా రాకుండుగాక
మళ్ళీ-మళ్ళీ మా ఊళ్ళో సినిమాహాళ్ళు - మెండుగా, రెండుగా - నిండుగాక
సత్తారుగారి సత్తా - వెరైటీ - అనిపించే సినిమాలు తీయుగాక
అని కోరుకుంటూ....
~ సినీ-మా-లక్ష్మి

ముందస్తుగా నీకు ధన్యవాదాలు మాకు గతనెల లో 1000 రూపాయిలు మిగిల్చినందుకు(రాజా ది గ్రేట్)..
రిప్లయితొలగించండిఇప్పుడు ఈ గరుడ కు ఏ బెడదా లేకుండా వేగంగా వెళ్లి నిర్మాత కి మావంతు సహాయం చేసి సత్తారు గారి యాంగ్రీ ఓల్డ్ మెన్ ని దీవించి వస్తాము..
దయచేసి ఏ సినిమా అయినా సరే మీరు మాకోసం వదలకుండా చూసి మాకు విలువైన విశ్లేషణ ఇచ్చి మేము వెళ్ళాలో వద్దో నిర్ణయం తీసుకుంటాము....
ధన్యవాదములు
నా బ్లాగ్ చదువుతున్నందుకు థాంక్స్, హనుమాన్! ఒక్కమాట - నేను రాసే ఈ సినిమా కబుర్లు - కాలక్షేపం కోసం మాత్రమే - ఇవి సమీక్షలు, విశ్లేషణలు లాంటి పెద్ద పేర్లతో పిలవదగ్గవి కానేకావు.
తొలగించండిపాపం - బోల్డు కష్టపడి ఒక ప్రాజెక్ట్‌లా చాలా మంది పని చేసి సినిమాలు తీస్తారు. రివ్యూలో , నాలాంటి టైం-పాస్ / గాలి కబుర్లు రాసే వాళ్ళ రాతలు చదివో సినిమాలు చూడడం మానేయొద్దు.
ఇంకొక్కమాట - నేను అన్ని సినిమాలూ చూడను. చూసినా - అన్నిటిగురించి రాయను. ఇప్పటికిలా కుదిరిందంతే.
ఒకటి : //PSV & 126.18 // ఈ రెండూ న్యూమరాలజీ రహస్యాలండీ. రాజశేఖరుడికి హిట్ మోజు తీరలేదు కదా, అందుకు జీవితగారు ఆ ఆల్ఫా-న్యూమరిక్ మంత్రం వేయించి వుంటారు.😊
రిప్లయితొలగించండిరెండు : someదేహాలు, someశయాలు అనకుండా some-సందేహాలు, some-సంశయాలు అంటే శాస్త్రం ఎలా ఒప్పుకుంది? జస్టిఫై చెయ్యగలరు. (some-సంగ్రహాలకి సంశయలాభం ఇచ్చేశాం.)
మూడు: హీరోయిన్ డివోర్స్ డిమాండ్స్‌కి కారణం దర్శక/కధకుల మీద ఇంగ్లిష్ నవలలు, సినిమాల ప్రభావం ఎక్కువై కావచ్చు.
నాలుగు: మీరు బోల్డన్ని కబుర్లతో పాటు బోల్డన్ని రివ్యూలు కూడా రాయడం బావుంది. Btw, న్యూమరాలజీ ప్రకారం రివ్యూలకి "ర" గుణింతం మంచిది. మీ మొదటి రివ్యూ "ర"వితేజ సినిమా, రెండోది "రా"జశేఖర్ సినిమా...
1) న్యూమరాలజీ గురించి నాకసలు తెలీదండి. మీకు వీలైతే ఒక పోస్ట్ రాయండి - PSV & 126.18 గురించి.
తొలగించండి2) కొంచెం reinforce చేయడానికి some-సందేహాలు, some-సంశయాలు అని రాయాల్సొచ్చింది.
3) ఇంక అడగడానికి, చెప్పడానికి ఏమీ లేదు :)
4) My standard disclaimer: నేను రాసే ఈ సినిమా కబుర్లు - కాలక్షేపం కోసం మాత్రమే - ఇవి సమీక్షలు, విశ్లేషణలు లాంటి పెద్ద పేర్లతో పిలవదగ్గవి కానేకావు.
అన్నట్టు ఇంతకు ముందు కూడా సినిమాల గురించి రాశాను (https://boldannikaburlu.blogspot.com/search/label/సినీ-మా-లక్ష్మి కబుర్లు).
ఇవన్నీ నావైన వ్యూలే కానీ రివ్యూలు మాత్రం కాదు.
రిప్లయితొలగించండిఅయ్య బామ్మోయ్ :)
సినిమా చూడ్డాని కెళ్తారా లేక రెవ్యూ రాయాలను కుని సినిమా చూస్తారా :) జేకే !
తల తిరిగి పోయింది సినీ - మా - లక్ష్మి :)
(ఇంతకీ సినిమాకు లచ్చమ్మ దయ బానే ఉన్నట్టుంది మీరు చెప్పేది చూస్తూంటే :)
రాజశేఖర్ అంటే ఎవరు ?
చీర్స్
జిలేబి
నేను మాత్రం సినిమా చూడగానే "a reference of what was viewed" రాసుకోకపోతే మళ్ళీ ఏ Netflix లో వచ్చినప్పుడో చూడలేదనేసుకుని ఇంకొక్కసారి చూసేస్తానేమోనని బెంగ అంతే :)
తొలగించండిరాజశేఖర్ ఒకానొక తెలుగు సినిమా హీరోదాత్తుడు - కొంతకాలంగా క్లాసో, మాసో - అవకాశాల్లేక కాసులు తగ్గినవాడు.
రివ్యూ బావుందండీ... నాకు తోచినంతలో మీ ప్రశ్నలకు వివరణలు...
రిప్లయితొలగించండి1) and 2) PSV కి మీరు ఇచ్చిన ఎక్స్పాన్షన్ బావుందండీ కానీ PSV Stands for "Plarform Supply Vessel" (Ship) and 126.18 M(Meters) is the length of that ship. ఇక గరుడవేగ అనేది ఆ షిప్ పేరు. ఈ వివరాలు క్లైమాక్స్ లో హీరోగారు బైనాక్యులర్స్ తో సర్వర్ కోసం వెతికేటప్పుడు చూపిస్తారు.
4) హహహ జింజెర్లీ ఓల్డ్ డూడ్ :-))) ఇతనికేంటి లాభం అన్న ప్రశ్న నాకూ వచ్చిందండీ.. నాలుగు డబ్బులు వస్తే మరో నాలుగు సినిమాలు వస్తాయని ఆశ కన్నా ఇంకేం ఉంటుంది చెప్పండి.
5) ఇక హీరోయిన్ రోల్... కొందరంతేనని చూపించడం ప్రవీణ్ ఉద్దేశ్యమనుకుంటానండీ... ఆ అమ్మాయ్ ప్రయారిటీస్ హీరో ప్రయారిటీస్ పూర్తిగా వేరు. మొదట్లో కూడా సీక్రెట్ మిషన్స్ గురించి భార్యకి కూడా చెప్పుకోలేని పరిస్థితి అంటాడే కానీ చేసే ఉద్యోగం ఇదేనని ఆవిడకి కూడా తెలుసన్నట్లే చూపిస్తాడు. ఇక ఇక ఆ మిషన్స్ గురించి ఆలీకి ఎలా తెలిసినా ఆ వంకన డైరెక్టర్ గారు వాటి డీటేయిల్స్ మనకి చూపించడమే ఉద్దేశ్యం, కాకపోతే ఆడియన్స్ ని మరికాస్త కన్ఫూజన్ కి గురిచేశారు. అన్నట్లు ఆలీ, హీరో-ఆలి వహ్వా వహ్వా :-)))
10) ఆ బాంబుల తాకిడికి ఓడ పేలలేదండీ అవి టైమ్ బాంబులు అవి సెట్ చేయబడిన టైమ్ లోపల వాటినన్నిటిని ఆ షిప్ కి వేరు వేరు స్పాట్స్ లో అంటుకునేలా విసిరేశాడు ఒకేసారి అన్నీ పేలినా కూడా షిప్ పాక్షికంగా పైన మాత్రమే దెబ్బ తినడం చూపిస్తాడు ఫైనల్ టివీ ఫుటేజ్ లో.. అంతటి శక్తివంతమైన PU 239 ప్లూటోనియం ని ఆషామాషీగా తరలించరు కదండీ భద్రమైన కంటైనర్లలోనే తరలిస్తూ ఉండి ఉంటారు సో వాటికి ఏం కాకుండా కేవలం ఆయిల్ స్పిల్ అయి ఉన్న క్రూ మాత్రం చనిపోయారని అర్ధం చేసుకోవాలి.
మీర్రాసిన comment చదివాక నేను సినిమా ఎంత శ్రద్ధగా చూశానో అర్థమయింది. ఇంత ఓపిగ్గా ఇన్ని వివరాలు రాసిన మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండి