గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 5 - నా కథావస్థల్లో క్రీడావస్థ
ఫిఫ్త్ ఫారం - ఎస్సెల్సీ లోఉన్నాం కదా
ట్యూషన్ సంగతి చెప్పాను కదా - ముక్కామల కృష్ణమూర్తి గారి దగ్గర. ఇంట్లో ట్యూషనూ అదీ పెట్టించారని.
అసలిక్కడింకో సంగతి చెప్పాలి.
ట్యూషన్‌కి అందరూ వచ్చేవాళ్ళు కదా - నారాయణమూర్తిగారి సత్తిగాడు, నాయనరాజుగారి సూరిగాడు, సుబ్బయ్య, మెహబుల్లా, గురుజ అర్జున్రావ్ - వీళ్ళందరూ వచ్చేవాళ్ళు.
చెప్పాను కదా! - రాత్రి పదిగంటల దాకా నిద్రపోయేవాణ్ణి కాదని?! మిగిలినవాళ్ళందరూ పడుకుండి పోయేవాళ్ళు.
గుఱ్ఱాలకి వెళ్ళే ముందు - వాళ్ళ అరిచేతులకి బొగ్గు రాసేసి - ముక్కులో పుల్ల పెట్టేవాణ్ణి. పెడితే - వాళ్ళు ముక్కు నలుపుకునేవాళ్ళు - నిద్రలోనే. చేతికున్న బొగ్గంతా మొహానికి పులిమేసుకునేవాళ్ళు. పొద్దున్న లేచి చూస్తే కొండముచ్చుల్లా వుండేవాళ్ళు. వాళ్ళకి అద్దం చూపెట్టేవాణ్ణి.
"ఎవర్రాశార్రా ఈ బొగ్గు ఎవర్రాశారు?" - అంటూ గగ్గోలెత్తిపోయేవాళ్లు. నేనేమీ ఎరగనట్టు -" ఏమో ఎవర్రాశారో ఏంటో" - అని ఇవతలికి వచ్చి తప్పించుకునేవాణ్ణి.
అన్నట్టు - ఇంతకు ముందు ఆటల్లో ఇంకోదాని గురించి చెప్పడం మర్చిపోయాను - ఆకుతెచ్చేఆట.
ఇదెంతమందైనా ఆడుకోవచ్చు. ఆకుతెచ్చేఆటలో అనాతారంలో మణిగాడు , అయ్యగారి వెంకట్రావు, బుచ్చిమేష్టారి శేషు, రాజుల కుర్రాళ్ళు - మేమందరం ఉండేవాళ్ళం.
ఈ ఆకుతెచ్చేఆటలో దొంగైన వాడు - మనం చెప్పిన ఆకు తీసుకొచ్చి మనమీద పెట్టి ఔట్ చెయ్యాలి - ఈ రకంగా వుండేదన్నమాట. మావిడాకులు అవీ అంటే కాళత్తయ్యగారి పెరట్లో ఉండేవి కాబట్టి అవి తెచ్చేసేవారు. మేమేం చేసే వాళ్ళమంటే జీడిమామిడాకు తెమ్మనేవాళ్ళం. జీడిమామిడాకంటే భీమనపల్లి వెళ్ళాలి. రెండు కిలోమీటర్లు వాడు నడిచో, సైకిలుమీదో వెళ్ళి - ఆ ఆకు తీసుకొచ్చి - అప్పుడు మమ్మల్ని ఔట్ చెయ్యాలి. భలే సరదాగా ఉండేది.
అనాతారంలో పంచ-బాబులు - మూల గున్నయ్యగారి బాబి, సిద్ధాంతిగారి బాబి, బుల్లినారాయణగారి బాబి - నేను, రామంగారి బాబి, నాయనరాజుగారి బాబి. అందర్లోకీ నాయనరాజుగారి బాబి చిన్నవాడు శ్రీను వాళ్ళ క్లాస్‌మేట్.
మా నలుగురిలో మూల గున్నయ్యగారి బాబి, సిద్ధాంతిగారి బాబి - చాలా పెద్దవాళ్ళు నాకన్నా. ఇంక రామంగారి బాబి - వాణ్ణేమో పాపం పుల్లయ్య అనేవారు. వాడసలు పేరేంటో నాకు తెలీదు.
మనం ఏ అల్లరి పంజేసినా కూడా - "ఎవర్రా ఈ వెధవపని చేశారూ ? నారాయణగారి బాబేనా?" - అనెవరైనా పెద్దవాళ్ళు అడిగితే - "కాదండి" - అనేసేవారు - ఎందుకంటే వాళ్లంతా అంతా నా గ్యాంగ్ - అందుకని వాళ్ళందరూ కూడా - "లేదండి - రామంగారి బాబండి" - అని వాడి మీదకి నెట్టేసేవాళ్ళం.
అలాగా - చిన్నప్పటినుంచి కూడా మనది కృష్ణావతారమే - అవతారంగారి మనవణ్ణి కదా. ఆ రకంగా ఆడించేహేవాణ్ణి.
అప్పుడప్పుడు శివకోడెళ్ళేవాణ్ణి.
శివకోళ్ళో కాపుల కుర్రాళ్ళు వాళ్ళు వుండేవారన్నమాట - శివకోడు ఊరంతా వాళ్ళే కదా - మేకల బాబులు, రమణ, మల్లిపూడి సత్తెంకాపు కొడుకులు - మల్లిపూడి బాబ్జీ, కొండయ్య - కస్తూరి పాపారావు - భాస్కరు - వీళ్ళంతా కూడా నాకు స్నేహితులే. ఎంచేతనంటే మా మేనమామగారి ఊరే అది - మా మాతామహుల ఊరు. మా అమ్మమ్మ, తాతగారు ఉండేవారు - మా అమ్మతో వెళ్ళేవాణ్ణి అక్కడికి.
వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎక్కువ చెడుగుడు ఆడేవాళ్ళం వాళ్ళతోటి.
ఆ టీములో మా మేనబావ ప్రసాదు, నేను కూడా అపోజిషను. వాడు సైంటిస్టు. వాడేం చేసేవాడంటే ఒక సైకిలు హబ్బుకి దారం చుట్టబెట్టి - వాడేమో చేతిలో ఒక పుల్ల పట్టుకుని - ఈ దారం దానికి తగిలించి నన్నేమో పెడలు తిప్పమనేవాడు.
నేను పెడలు తిప్పుతుంటే - ఆ చక్రం తిరిగి దారం వచ్చి ఆ పుల్లకి చుట్టుకునేదన్నమాట. నేనేం జేసే వాణ్ణంటే కాసేపు మెల్లిగా తిప్పి ఒక్కసారిగా గట్టిగా తిప్పేసేవాణ్ణి.
ఆ దారం తెగిపోయేది. దాంతోటి వాడేం చేసే వాడంటే - "ఏయ్! వెధవ ! దారం తెంపేశావ్ - ఠాట్ నీతోటి మాట్లాడను -అవతలికి ఫో - నీతో పచ్చి" - అని ఉక్రోషంగా తిట్టేసేవాడు.
"ఎహె పోతే పో" అనేసేవాణ్ణి.
ప్రసాద్ తమ్ముడు మణి మాత్రం నాతోనే ఉండేవాడు. నేనేం చెప్తే అది చేసేవాడు వీడు - నాకన్నా పదినెల్లు చిన్నాడు వీడు. ప్రసాదేమో నాకన్నా రెండేళ్ళు పెద్దాడు.
నేను చేసే అల్లరి పనులన్నింటికీ వ్యూహం రచించడమే నా వంతు - పనులన్నీ మణి చేతే చేయించేవాణ్ణి - ఎందుకంటే రేప్పొద్దున ఎవడన్నా గొడవ పెట్టి కొట్టాడనుకో వాణ్ణి కొడతాడు, నన్ను కొట్టడు కదా! - కృష్ణుడు సారథ్యం చేసినట్టన్నమాట. కొట్టేవాడు అర్జునుడు, దెబ్బలు తింటే అర్జునుడు తింటాడు.
అందుకే మా మామయ్య పేర్లు పెట్టారు - "కృష్ణార్జునులు వీళ్ళిద్దరూ - ఆ బాబి కృష్ణుడు, ఈ మణిగాడు అర్జునుడు - వెధవ వ్యూహమంతా వాడిదేలే - ఏవమ్మో అక్కయ్యో - వెధవ తెలివితేటలన్నీ వాడివే - వాడు వ్యూహం వేస్తున్నాడు - వీడేమో పిచ్చోడు వీడేమో వెళ్ళి తన్నులు తింటున్నాడు" - అనేవారు మమ్మల్నిద్దరినీ చూసి.
శివకోడులో మణి ఎలాగో - అనాతారంలో పుల్లయ్య అంటే రామం గారి బాబిగాడు - రెండు చోట్లా వ్యూహం మనది - తన్నులు తినేవాళ్ళు వాళ్ళు.
చిన్నప్పుడు ఎస్సెసెల్సీ వరకు - ఇవన్నీ జరిగేటప్పటికి ఏమైందంటే - ఈ ఆటలు, అల్లరి, వ్యవహారాలూ - ఈ గందరగోళంలో - ఎస్సెల్సీ తన్నేసింది 1961లో.
తన్నేసి - పోయిందేమిటీ - ఇంగ్లీషు, లెక్కలు. ఇంట్లో పెట్టుకున్న మేష్టారెవరూ ? ఇంగ్లీషు - లెక్కల మేష్టారే - హహ్హహ్హ - అదీ జోకు.
సరే - వేటికైతే ప్రైవేటు పెట్టించారో - ఆ రెండు సబ్జెక్ట్లే తన్నేసినయ్ - మళ్ళీ సరే అక్టోబరు కట్టేం - మళ్ళీ అవే తన్నేసినయ్. తన్నేసింతర్వాత - మా నాన్నేమో - "సరే ఇప్పుడింకేం వద్దు. నిన్ను వైజాగ్ పంపించేస్తాను. మళ్ళీ వచ్చే మార్చిక్కట్టు (అంటే 63 మార్చి)" - అన్నాక అందాకా మనకి తీరిక దొరికేసింది.
61 అక్టోబర్ అయిపోయింది కదా - 62 టోటల్ ఫ్రీ. వైజాగ్ వెళ్ళిపోయి భారత్ ట్యుటోరియల్ కాలేజ్‌లో చేరిపోయాను. ఇక్కడితో స్వస్తి. తరవాయి కథ వాయలు వాయలుగా చెప్తాను.
చెల్లిన అల్లరి
ఆడిన ఆటలు
వెళ్ళిన ప్రతి నెలవు
అనువైన ఇరవు
వెరసి దాటొచ్చిన ప్రతిదారీ
ఈదేసిన గోదారి
<వచ్చేనెల తరువాయి కథ>

సరదాగా సాగుతున్నాయి మీ బాబీ గారి కబుర్లు లలిత గారు. పాత కబుర్లన్నీ చదివేయాలి చాలా రోజులైంది ఇటు వైపు రాక.
రిప్లయితొలగించండిపవన్ గారూ ! నా పాత పోస్టులు చదవడమే కాదు - మీరు మీ బ్లాగులో కొత్తవి కూడా రాయాలి మరి !
తొలగించండి