కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 23 - నీకై వచ్చితినోయీ...ఎండల్లో తిప్పితినోయీ...
అనుకున్నట్టుగానే అబ్బాయి మద్రాస్ వెళ్ళే రోజొచ్చింది. ఆ ముందు రోజు సాయంత్రం యూనివర్సిటీ రోడ్డులో కుడి పక్కకి తిరిగి అలిపిరి దాకా వెళ్ళే బదులు ఎడం పక్కగా నడుచుకుంటూ వెటర్నరీ కాలేజ్ దాకా వెళ్ళాం - వాకింగ్‌కి.
అప్పుడే చెప్పారు - తన సీనియర్ రాజశేఖర్ ఫ్రెండ్ జయ చదివేది ఆ కాలేజ్ లోనే అని. ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు ఆ అమ్మాయికి ముందే చెప్పి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేస్తానని చెప్పారు.
అక్కడి నుంచి మా హాస్టల్ కేసి తిరిగి వస్తూ రోడ్డు పక్కనే ఒక చెట్టు కింద వున్న నాపరాయి బెంచ్ మీద కూర్చుని తన చేతిలో వున్న - నాకు తిరిగి ఇద్దామని తీసుకొచ్చిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చూపించారు. భలే! నేను చదవమని ఇచ్చిన పుస్తకాన్ని అస్సలు నలపకుండా చదవడమే కాకుండా దానికి మంచి బ్రౌన్ పేపర్‌తో అట్ట వేసి తెచ్చారు. ఆ అట్ట మీద ఒక మూలగా మద్రాసులో తనుండబోయే ఫ్రెండు - సాయి గిరిధర్ - వాళ్ళ ఇంటి ఎడ్రెస్ రాసి వుంది.
"ఏంటి ఈ ఎడ్రెస్?"
"ఓ రెండు నెలలు ఉండను కదా - నీకేమన్నా కబుర్లు చెప్పాలనిపిస్తే లెటర్ రాయి - లేకపోతే మానెయ్"
హన్నా! నీ మాటల్లో, పాటల్లో బిజీగా ఉంటావేమో - వీలుచూసుకుని ఒక ఉత్తరం రాయవా - ప్లీజ్ - అనకుండా రాస్తే రాయి, లేకపోతే మానేయ్ అనేయడమే - హన్నా...హన్నన్నా! అనేసుకుని కాసపు మాట్లాడలేదు నేను.
ఆ బెంచ్ మీద ఒక ఐదు నిముషాలు కూర్చుని లేచి మళ్ళీ మా హాస్టల్ వైపు నడవడం మొదలు పెట్టామే కానీ నేనస్సలు మాట్లాడట్లేదు.
ఓ ఐదు మౌన-యుగాలు అలా నడిచాక - ఉన్నట్టుండి ... ఓ ప్రశ్న.
"ఔను బుజ్జాయ్...నీకు పజిల్స్ అంటే ఇష్టం కదా! నేనొక ఈజీ పజిల్ అడుగుతా చెప్తావా?"
"... ..."
"సర్లే! మాట్లాడవా అయితే? జవాబు చెప్పడానికి మాట్లాడాల్సిన అవసరం లేని పజిల్ ఇది ...అడగనా?"
"... ... "
(కానీ మనసులో ఆ పజిలేదో గబగబా అడిగితే బావుండుననిపించేస్తోంది - ఎందుకంటే ఇంకో ఇరవై నిముషాల్లో హాస్టల్ దగ్గరకి వెళ్ళిపోతాం.)
"అడిగేస్తున్నా .... అడిగేస్తున్నా.. "
ఇంక మాట్లాడకుండా వుండలేక "అబ్బ! ఇంకెంతసేపు తొందరగా అడగండి" అనేశాను.
"అదీ అలా అడుగు - అలా అయితేనే నిన్ను నేనడుగుతా. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు - ఒక మూగబ్బాయి షాపుకి వెళ్ళి పెన్సిల్ కావాలని ఎలా అడుగుతాడో చెప్పు?"
ఇదీ ఓ ప్రశ్నేనా అన్నట్లు చూసి నా కుడి చేత్తో ఎడమ అరచేతి మీద రాస్తున్నట్లు ఏక్ట్ చేసి "ఇలా ..." అని చెప్పాను.
కళ్ళెగరేసి "భలే చెప్పావే! " అన్నట్లు నవ్వుతూ నన్ను చూస్తూ ఓ రెండు నిముషాలు ఏదో ఆలోచిస్తున్నట్టు ఆగి "మరైతే.... ఒక కళ్ళు లేని అబ్బాయి షాపుకెళ్ళి ఐస్‌క్రీం కావాలని ఎలా అడుగుతాడూ?" అనడిగారు.
నేనప్పుడు - 'ప్రశ్న అడగడానికే ఇంత ఆలోచించాలా - హుఁ - నేనేనెంత తొందరగా జవాబు చెప్తానో చూడండి' అన్నట్లు తలెగరేసి - అస్సలొక్క నిముషం కూడా ఆలోచించకుండా - కళ్ళు గా... ఠిగా మూసేసుకుని చేత్తో కుడి చెయ్యి నోటి దగ్గర పెట్టి నాలిక బైట పెట్టి కోన్ ఐస్‌క్రీంని తింటున్నట్టు ఏక్ట్ చేసి చూపించాను.
ఓ రెండు నిముషాలు పక్కనుంచి ఎలాంటి మాటా లేదు.
ఏంటా అని పక్కకి తిరిగి చూస్తే - హహ్హహ్హ అని నవ్వుతూ "కళ్ళు లేకపోతే నోరేమైంది ఐస్‌క్రీం అడగడానికి?" అని తను అనగానే నాకూ బోల్డంత నవ్వొచ్చేసింది.
అలా నవ్వుతూనే - గుడ్‌నైట్, హాపీజర్నీ చెప్పేసి - whose whose hostel they they go అనేసుకున్నాం.
------------------------------------------------------------------------------------------------
మా థర్డ్ సెమిస్టర్ పరీక్షలు మొదలు ... పరీక్షలు కదా పాపం అమ్మాయిలు టీ తాగి నైటవుట్లు చేసి చదువుకుంటారు అని మా డైనింగ్ హాల్లో రాత్రి తొమ్మిదిన్నరకి చిక్కటి స్పెషల్-టీ ఇచ్చేవారు.
ఆ చిక్క-టీ తెచ్చుకుని - కొంచెం కొంచెం వెచ్చగా పుచ్చుకుంటూ - టీవీ రూంలో రాత్రి పదిన్నరకి వచ్చే సోమవారపు-చిత్రమాలో, లేకపోతే ఏ ఫిల్మ్-ఫేర్ ఎవార్డ్స్లో చూస్తూ - ఆ పెద్ద గ్లాసుడు చిక్క-టీ తాగేసి - రూంకి వెళ్ళిపోయి "హమ్మయ్య" అనుకుని దుప్పటి కప్పేసుకుని పడుకుండిపోయేదాన్ని.
ఆడుతూ, పాడుతూ పరీక్షలు అయిపోయాయి. వెంటనే ఫోర్త్ సెమిస్టర్ మొదలయింది. ఇంకొన్ని వారాలయితేనే కానీ వేసవి సెలవులు మొదలవవు.
తిరుపతిలో ఎండలు కొండల మీదుగా పరావర్తనం చెంది జుట్టు కిందున్న గుండులను కూడా మాడ్చేస్తున్నాయి. పగలంతా ఎలా వున్నా సాయంత్రాలు మాత్రం భలే ఉండేవి. టౌన్ లోకి ఎవరు వెళ్తున్నా మల్లెపూలు బోల్డు తెచ్చేవారు. మాలలు కట్టడం వచ్చినవాళ్ళు చకచకా మాలలల్లి అందరికీ ఇచ్చేవారు.
నాకెప్పుడో చిన్నప్పుడు చేతి వేళ్ళతో దారం మల్లెపూవు కాడ చుట్టూ తిప్పి ముడి వేయడం రాక ఏడుస్తున్నానని - నాకు సులువుగా ఉంటుందని కాలి బొటనవేలికి దారం ముడేసి కాలి-మాల కట్టడం నేర్పారు నాన్నమ్మ.
మళ్ళీ ఇన్నేళ్ళకి మాల కట్టడం నేర్చుకోవాలి అని సరదా వేసింది. మా క్లాస్‌మేట్ పద్మప్రియ చాలా బాగా మల్లెపూల మాల కట్టేది. ఒకసారి తన పక్కనే కూర్చుని ఎంత బాగా కడుతోందో అనుకుంటూ చూస్తుంటే తనే నాకొక ఐడియా ఇచ్చింది - చుట్టుపక్కలున్న చెట్ల ఆకులు తెస్తే మాల కట్టడం నేర్పుతాను, అప్పుడు మల్లెపూల మాల కట్టడం తొందరగా వస్తుంది - అని.
అన్నట్లుగానే నాకు మల్లెపూలు మాల కట్టడం వచ్చేదాకా ఓపిగ్గా విసుక్కోకుండా నేర్పింది పద్మప్రియ.
రాత్రి ఒక్కోసారి పవర్-కట్ ఉండేది.
అప్పుడు మా 603-వింగ్ ముందున్న స్టెయిర్-కేస్-లాండింగ్ మీద కూర్చుని ఆ చీకట్లో గొంతెత్తి "మంచిగంధం ముద్ద మీద - నల్ల కస్తూరి బొట్టు లాగా - ౘందమామ ఆకాశంలో అందగించాడూ - చిందులేశాడూ" అని పాడుకోవడం -
ఆ చీకట్లో గుత్తి పద్మజ "నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో ..నీడల్లే వున్నా...నీతో వస్తున్నా" అంటూ అందరినీ అల్లరిగా భయపెట్టడం- అందరం హాస్టల్ టెర్రేస్ మీద పక్కలు వేసుకుని ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ పడుకోవడం - లేదింక వేసవిని మించిన హాయింక - అనిపించేది.
ఓ రోజు కరెంట్ పోయిందని రూంలో వేడిగా ఉందని అందరం టెర్రేస్ మీద పడుకున్నాము. నాకు అర్థరాత్రి వేళ మెలకువ వచ్చింది. చెవిలో ఏదో నొప్పి - లోపల ఏదో కదులుతోంది. నాకు వెంటనే అర్థమయింది - చెవిలో పురుగు దూరిందని.
వెంటనే "వాఁ ..." అని ఏడవడం మొదలు పెట్టాను. నా ఏడుపుకి పక్కనే పడుకుని వున్న శ్రీలత, సంగీత అందరూ లేచారు.
లేచీ లేవగానే హడావిడిగా వెళ్ళి ఒక టార్చ్‌లైట్ తీసుకొచ్చారు.
చెవి దగ్గర టార్చ్‌లైట్ పెడితే లోపల ఉన్నదేదో ఆ వెలుగు చూసి బయటికి వస్తుందని కాసేపు నా చెవి దగ్గర వెలుగుతూ, ఆరుతూ ఉండేలా పట్టుకున్నారు. దాంతో ఆ లోపల ఉన్నదేదో బయటికి రావడం మాటే మర్చిపోయి ఆ డిస్కో-లైట్ వెలుగుల్లో ఇంకా స్పీడుగా తిరగడం మొదలుపెట్టింది. నాకేమో ఆ తిరుగుడుకి నొప్పి ఇంకా ఎక్కువయ్యింది. ఆరున్నొక్కరాగపు శృతి పెరిగింది.
నా బాధ చూడలేక - శ్రీలత "ఏడవకు లల్లీ - చెవిలో కొంచెం నీళ్ళు పోస్తే - చచ్చిపోయి తేలి వచ్చేస్తుంది" అంటూ ఓ నాలుగు చుక్కల నీళ్ళు చెవిలో పోశారు. తనన్నట్లే చెవిలో వున్నది చచ్చిపోలేదు కానీ బైటికి వచ్చేసింది - తీరా చూస్తే అదొక బుల్లి నల్లచీమ - పాపం దానికెంత భయమేసిందో అనుకుని జాలి పడి మేడ మీద వదిలేశాం.
చీమ చెవిలో ఆడుకోవడం, తర్వాత నీళ్ళలో ఈదులాడుకోవడంతో రెండోరోజు చెవి కొంచెం నొప్పి చేసింది. క్లాసులకి కూడా వెళ్ళలేక రూమ్ లోనే పడుకున్న నన్ను అలా చూడలేక, శ్రీలత ఒక రిక్షా పిలుచుకొచ్చి బాలాజీ కాలనీలో వుండే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఆవిడ చెవిలో చూసి ఏమీ లేదు - ఇయర్-డ్రాప్స్ వాడితే నొప్పి తగ్గిపోతుందని చెప్పారు. ఆవిడన్నట్లే మరుసటి రోజుకి చెవినొప్పి తగ్గింది.
మళ్ళీ క్లాసులు - డైనింగ్ హాల్లో కబుర్లు, పాటలు అన్నీ మామూలే.
ఒక వారం ఇంటికి ఫోన్ చేసినప్పుడు నేను హాస్టల్లో చేసే కూరలు నచ్చక జస్ట్ పెరుగు అన్నం, సాంబార్లో ముక్కలు మాత్రం తింటున్నానని విని మా అమ్మ - పాపం - "లల్లీ! మీ హాస్టల్లో ఎగ్ పెడతారు కదా. ఒకసారి ట్రై చెయ్యి. సహిస్తే తిను ఫరవాలేదు. అలా ఉట్టి పెరుగూ అన్నం తింటే నీరసమొస్తుంది. క్రితం సారి నేనొచ్చినప్పుడు మీ మేట్రన్‌కి చెప్పాను కూడా నీకు రాత్రిపూట వేడి పాలు ఇమ్మని - ఇస్తున్నారా?" - అని ఒకటే బాధపడిపోయి ఒకటికి రెండు సార్లు ఎగ్ తినడం అలవాటు చేసుకోమని చెప్పింది.
అలా హాస్టల్లో గురువారం రాత్రి పూట చేసే ఉడికించిన ఎగ్ కూర తినడం మొదలు పెట్టాను. డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే ముందున్న టేబుల్స్, కుర్చీలు దాటుకుంటూ వెళ్తే వెనకగా వున్న కిచెన్ ముందు రెండు నాపరాళ్ళ అరుగులు ఉండేవి.
కుడి పక్కనున్న అరుగు మీద పెద్ద గిన్నెలో అన్నం, ఇంకో గిన్నెలో ఒక కూర - కారెట్టో, బీట్రూటో, వంకాయో (ఎప్పుడూ అవే), పక్కనే ఇంకో గిన్నెలో గడ్డ పెరుగు వుంచేవాళ్ళు. ఎడమ పక్క అరుగు మీద అప్పడాలు, ఎగ్ కూరలాంటి స్పెషల్ కూరలు పెట్టేవాళ్ళు.
గురువారం రాత్రి ఆ ఎడమ పక్క అరుగు దగ్గర కణ్ణగి నించుని ఒక్కొక్క ఎగ్ గరిటతో తీసి అమ్మాయిల ప్లేట్లలో వడ్డించేది. ఒక్కోసారి అక్కడ చాలా మంది ఉండి బోల్డన్ని ప్లేట్లు ఆవిడ ముందు చాచి నించునేవారు. వాళ్ళలో నేనూ దూరి నా ప్లేట్ ముందుకి చాపి - "ఓ గుడ్డు పెట్టండి ప్లీజ్!" అని అనే దాన్ని. ఓ రెండు వారాల దాకా మా కణ్ణగి అంతగా పట్టించుకోలేదు. మూడో గురువారం అలాగే "ఓ గుడ్డు పెట్టండి ప్లీజ్!" అనగానే నా ప్లేట్లో ఎగ్ వేయబోతూ ఆగి "నువ్వడక్కపోయినా కూర వేస్తాను" అంది ఆవిడ (implied meaning ఇంక గుడ్డు పెట్టే మాటెత్తకూ అని.). ఇంకెందుకంటాను కదా - నేననాలనుకున్నది - నేనంటుంటే ఆవిడ వినాలనుకున్నది - ఆవిడ విందీ, ఆవిడకి అర్థం అయిందీ - mischief accomplished! ఆ తర్వాత ఎగ్ అంతగా నచ్చక తినడం ఆపేశాను - అద్దర్వాత సంగతి.
ఈలోగా ఏప్రిల్ ఆఖరి వారం - వేసవి సెలవులు మొదలవబోతున్నాయి. మళ్ళీ రైళ్లు, టిక్కెట్లు, రిజర్వేషన్లు - హడావిడి.
ఇప్పటిదాకా అబ్బాయిని తలుచుకుంటున్నా, పుస్తకం మీద ఎడ్రెస్ కనిపిస్తున్నా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. పంతం - తప్పకుండా రాయి ఎదురు చూస్తుంటాను అని చెప్పలేదని.
ఈలోగా ఇంటికి వెళ్ళే రోజు దగ్గరికి వచ్చేసింది. ఇంటికి వెళ్ళేలోగా అబ్బాయికి ఏమైనా చెప్పాలనిపించింది. వెంటనే శుభని తోడు తీసుకుని SVU లో వున్న పోస్ట్-ఆఫీసుకి వెళ్ళి ఒక టెలిగ్రాం ఇచ్చాను మద్రాసు ఎడ్రెస్‌కి - Tere mere sapne ab ek rang hain, Jahaan bhi le jaaye raahe ham sang hai - అని.
తంతిలేఖ రాశా నీకంది వుంటదీ... రూ రు రూ
పాట-బాణమేశా మది బెంగగుంటదీ... రూ రు రూ
- అని పాడుకుంటూ వేసవి సెలవులకి రైలెక్కి ఇంటికి వెళ్ళాను.
తర్వాత కథ వేసవి సెలవుల తర్వాత...
< <<... మే లో వేసవి సెలవులు కదా - అందుకని మళ్ళీ జూన్ 19 కి ఇంకొన్ని కబుర్లు ->>

గుడ్డు ఎపిసొడ్ బావుందండీ.... ఆవిడకి బానే వెలిగింది, లేట్ గా అయినా...
రిప్లయితొలగించండిమమతగారు: నా బ్లాగ్ చదువుతున్నందుకు చాలా థాంక్స్!
తొలగించండిAlert 👇 🙂 :-
రిప్లయితొలగించండి“వేసవి సెలవలు” అయిపోయినట్లేనా? జూన్ 19 వచ్చేస్తోంది 🙂.
విన్నకోట నరసింహారావుగారు: నా వేసవి సెలవుల ప్రసక్తిని గుర్తు పెట్టుకుని - చేసిన మీ alert-comment కి ధన్యవాదాలు.
తొలగించండిప్రేమ లేఖ రాశా, నీకంది ఉంటదీ
రిప్లయితొలగించండిపూల బాణమేశా ఎద కంది ఉంటదీ
మీరు వ్యాఖ్య రాస్తే ఎంతొ బాగుంటదీ…
తొలగించండినా పాట పట్టేస్తే సరదాగ వుంటదీ!
థాంక్స్ అండి దీపా!