చిన్నప్పుడు - ఇంట్లో దేవతార్చనకి పూలు కోయడం బోల్డంత ఇష్టంగా ఉండేది.
పూలు కోయడం అనేది మామూలు పనే. అందులో పట్టి చూడడానికి ఏ విశేషమూ వుండదేమో. కానీ నాకు మాత్రం చిన్నప్పుడు పూలు కోసే ఆ పది, పదిహేను నిముషాల సమయం ఎంతో బాగా అనిపించేది. పైగా అప్పటికి వున్న ఊరు, ప్రదేశాన్ని బట్టి, అప్పటికి వింటున్న పాటల బట్టి ఎన్నో ఎన్నెన్నో మంచి జ్ఞాపకాలు.
జంగారెడ్డిగూడెంలో వున్నప్పుడు పొద్దున పొద్దున్నే వెళ్ళి గార్డుగారి ఇంటి ఎదురుగుండా ఖాళీ స్థలంలో వున్న గరుడవర్ధనం పూల చెట్టెక్కి - దగ్గర్లోనే వున్న గుడి మైకులోంచి వచ్చే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గొంతులో 'శ్రీరంగ పుర విహారా ..." వింటూ అమ్మ చేసే పూజ కోసం రేపు విడవాల్సిన మొగ్గలకి చేయి తగలకుండా కోసిన పూలు తెల్లటి జ్ఞాపకం.
పీబీ శ్రీనివాస్, ఎస్జానకి మెత్తటి గొంతులతో శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం పాడుతుంటే మేల్కొంటున్న మా గుళ్ళో శివుడితో పాటే లేచి చెల్లాయత్త వంటింట్లో కొలువైన ఇష్టదేవతల పూజ కోసం కోసిన ముద్ద మందారాలు, మొల్లలు - ఎర్రటి తెల్లటి జ్ఞాపకం.
అనాతవరం నట్టింట్లో దేవుడి గూట్లో సింహాసనంలో విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణాదేవి విగ్రహాలకి పూజ చేసే లలిత దొడ్డ పూజ కోసం ఆల్ ఇండియా రేడియో - విశాఖపట్టణం స్టేషన్లో వచ్చే భక్తిరంజని పాటలు వింటూ పూలబుట్ట లోకి కోసిన మందారాలు, నిత్యమల్లె పూలు, డిసెంబరాలు - రంగురంగుల జ్ఞాపకం.
పూజ కోసం కోసిన ఆ పూలని తాకి తాకి, ఆ పూల పేర్లను పలుమార్లు తలచి తలచి మురిసిపోయేదాన్ని.
అసలా పూల మీద అంత ఇష్టం ఎలా కలిగిందీ, అదెలా పెరిగిందీ అనాలోచిస్తే - మనసులో మొట్టమొదటగా కదిలేదీ, మెదిలేదీ ఒక సంప్రదాయ గీతం.
కాటుక రంగులో చుక్కల వెలుగులో హొయలుపోతున్న రాజసమైన కృష్ణరజనిని వెలుగు రేఖలతో వెలిగిస్తూ ఎదిగివస్తున్న ఛాయామార్తాండ బింబపు పెంపుని జాముజాముకీ పూలతో, పూలమీద మెరిసే నానావిధవర్ణరాశులైన నవరత్న శోభలైన పుప్పొడుల ఛాయలతో పోల్చి - శ్రీ సూర్యనారాయణా ... మేలుకో ... హరి సూర్యనారాయణా అతి మెత్తగా ఆ భానుడిని మేలుకొమ్మని స్తుతిస్తూ, నుతిస్తూ - బాలాంత్రపు రజనీకాంతరావుగారు కూర్చిన సూర్య-స్తోత్ర-మాల వింటూ పెరిగానేమో - అక్కడ మొదలయి - ఇప్పటికీ వింటుంటానేమో - ఇల్లిప్పటిదాకా పూల పేరు వినగానే చుట్టుముట్టే పులకరింతల పొలకువ నన్నల్లాగే అంటిపెట్టుకుని వుంది.

శ్రీ సూర్యనారాయణా ... మేలుకో ... హరి సూర్యనారాయణా
పొడుస్తూ భానుడు పొన్నపూవూ ఛాయ పొన్నపూవూ మీద బొగడ పూవూ ఛాయ
ఉదయిస్తు భానుడు ఉల్లిపూవూ ఛాయ ఉల్లిపూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ
గడియెక్కి భానుడు కంబపూవూ ఛాయ కంబపూవూ మీద కాకారి పూ ఛాయ
జామెక్కి భానుడు జాజిపూవూ ఛాయ జాజిపూవూ మీద సంపెంగి పూ ఛాయ
మధ్యాహ్న భానుడు మల్లెపూవూ ఛాయ మల్లెపూవూ మీద మంకెన్న పొడి ఛాయ
మూడుజాముల భానుడు మూలగపూవూ ఛాయ మూలగపూవూ మీద ముత్యంపు పొడి ఛాయ
అస్తమాన భానుడు ఆవపూవూ ఛాయ ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ
వాలుతూ భానుడు వంగపండూ ఛాయ వంగపండూ మీద వజ్రంపు పొడి ఛాయ
గ్రుంకుతూ భానుడు గుమ్మడీ పూ ఛాయ గుమ్మడీ పూ మీద కుంకంపు పొడి ఛాయ
అలా అలా ఆ పూల ఛాయలో బాల్యపు పసిదారుల పరుగెత్తి - పసిడి వన్నెల కౌమారంలో అడుగిడి - అప్పటివరకూ పరుగిడిన అడుగు, అలికిడి కూడా వినబడని నడకల నిలకడ కాగానే కంటికానినవి అచ్చొత్తిన పుస్తకాల విచ్చిన పూలలాంటి అచ్చతెలుగు అక్షరాల మాలలు - దేవులపల్లివారి జిలిబిలి పలుకుల కృష్ణపక్షపు కవితా చంద్రికలు.
మొట్టమొదటగా పాడుకున్న దేవులపల్లివారి పాట - ఇప్పటికీ జీవనగమనమైన పాట -ఆకలా , దాహమా చింతలా వంతలా ?- ఈ కరణి వెఱ్ఱినై ఏకతమ తిరుగాడ ! అంటూ సాగే ఆకులో ఆకునై ... అన్న పాట.
నేను పుట్టక మునుపే - అప్పటివరకు పల్లెల దారుల, ఏటి దాపుల, తోటల తోపుల మావిచివురుల మేసి కవితా-గానమాలపించిన కృష్ణ-కోకిల కంఠం మూగబోయిందట.
బెంగటిల్లిన ఆ కవికోకిల కవితాఝరిని ఆగనీయక తన కంఠంతో సంగీత-రజనీకాంతులతో వెలిగించారట రజని. ఆ గేయ కవితా కాంతులే కృష్ణరజని (కృష్ణశాస్త్రిగారి సాహిత్యం, రజనీకాంతరావుగారి సంగీతం) పేరిట కవితా-గేయాలయాయని చదువుకున్నాను.
ఆ రజనీకాంతరావుగారు సాహిత్యంతో ఆడుతూ, సంగీతంతో పాడుతూ - ఆడుతూ, పాడుతూ - తెలుగు పాటని పలికించి, తెలుగు బాటని వెలిగించి - అమరపురికి తరలిరట - మరపురాని మధుర గీతాలు మనకి పంచి - ఈ విళంబిలో, వైశాఖ శుద్ధ సప్తమి నాడు (2018 ఏప్రిల్ 22).

కృష్ణశాస్త్రిగారి కవిత అమృతవీణట -
సంగీత చంద్రికల నలదినవి రజనీవారి కాంతులట
అమృతవీణపై కాంతులీనిన కృష్ణరజని సాహిత్యసంగీతాల ప్రోవట
తన పక్షాన కృష్ణశాస్త్రిగారు లేని లోటు తోచిందో ఏమో
తన పక్షమందు కృష్ణ లేక రజని కృష్ణపక్షమాయెనట
సఖుని దరికి కృష్ణ-పక్షమైన రజని తరలినారట
వారిరువురి కలయిక నాకములోనట
వారిరువురి కలయిక నాకములోనట
కృష్ణ-రజనీకాంతులు లేని భాషా-కృష్ణపక్షపు-రజనిలో కినిసెనిప్పుడట
తెలుగు భావ కవిత....
ఇప్పుడింక తెలుగు భావకవితకే నోరుంటే ఇలా పాడుకునేదేమో ... అప్పుడెప్పుడో కృష్ణశాస్త్రిగారు రాసుకున్న ఒక పాటలో మాటల్లా ...
ఇప్పుడింక తెలుగు భావకవితకే నోరుంటే ఇలా పాడుకునేదేమో ... అప్పుడెప్పుడో కృష్ణశాస్త్రిగారు రాసుకున్న ఒక పాటలో మాటల్లా ...
ఆగి ఆగి మ్రోగి మ్రోగి
అదే పిలుపు! అదే పిలుపు!
ఆగి ఆగి సాగి సాగి
అదే నడక! అదే నడక!
తెమలనీవు నా జాతర
తెలవారదు కృష్ణరజని
ఈ వ్యాసం అద్భుతమైన నివాళి రజనీ గారికీ
రిప్లయితొలగించండివ్యాఖ్య రాయడానికి పూనుకుని వేళ్ళు కదలకుండా కళ్ళముందు ఎన్నో దృశ్యాలు, మనసులో,చెవుల్లో లలిత రసాల పల్లవ పదాలూ మనోవేగంతో కదిలిపోతూ ఉంటే..
అర్ధం అయింది, ఈ కృష్ణ రజనీ జ్యోత్స్న ఎంత ప్రకాశవంతమో!
కృష్ణ రజనీ జ్యోత్స్న - భలే మాటన్నావు - ఆ వెన్నెల వెలుగు ఆచంద్రతారార్కం!
తొలగించండిఎంత అందమైన నివాళి!!👌
రిప్లయితొలగించండిYVR గారు: నా తలపు-నెమరు మెచ్చుకున్న మీకు ధన్యవాదాలు.
తొలగించండికృష్ణశాస్త్రి గారు, రజనీకాంతరావుగారు ఇప్పుడు ఆ ‘దేవుల’పల్లి లో కలుసుకొనుంటారు.
రిప్లయితొలగించండి‘కృష్ణపక్షమై’న రజని - ఎంత అందమైన పదసృష్టి!!
Typical of your style.
రాను రాను నీ కలం మరింత రసాలూరుతోంది లలితా!
Undoubtedly one of your best.
నువ్విలా చదివి మెచ్చుకుంటూ వుంటే బోల్డన్ని కబుర్లింకా ఇంకా ఇంకా ఊరుతూనే వుంటాయి, లక్ష్మీ!
తొలగించండి
రిప్లయితొలగించండిరాను రాను కలము రసములూరె లలిత
రవళి కృష్ణ పక్ష రజని పదము
నీ నివాళి యున్ను నీదైన బాణిని
తీర్చి నావు సూవె తేటగొనుచు!
జిలేబి
మెప్పు-పద్యానికి ధన్యవాదాలు, జిలేబిగారు.
తొలగించండికలనేత నివాళి చాలా బాగుంది. ఇద్దరికిద్దరూ మహానుభావులు, తెలుగు వారి అదృష్టం 🙏.
రిప్లయితొలగించండి"కలనేత నివాళి" - నాకు భలే నచ్చింది ఈ మాట. ధన్యవాదాలు, విన్నకోట నరసింహారావుగారు!
తొలగించండిపూలు, కవిత, సంగీతం - చక్కటి కృష్ణరజని నివాళి. "ఎస్జానకి" - ఇది మాత్రం ఒకటి రెండు సార్లు చదివితే కానీ పట్టుకోలేకపోయాను.
రిప్లయితొలగించండిమీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు, అన్యగామిగారు! ఎస్జానకి - ఇష్టంగా పిలిచేటప్పుడు అలాగే నోట పలుకుతుంది మరి!
తొలగించండిచాలా బాగా వ్రాశారండి. పువ్వులు కోయడం మామూలు పని కాదండి. అదీ అలా పువ్వులతో అనుబంధం ఉన్నవాళ్ళకి.
రిప్లయితొలగించండిచూసేవాళ్ళకి కూడా అది ఆనందహేతువు.
మంచి పరిమళభరితమైన పూలదండలాంటి మాట అన్నారు, లక్ష్మీదేవిగారు! ధన్యవాదాలు.
తొలగించండిLovely beyond words!! I had missed this at that time and reading only today - but this is a case of "better late than never".
రిప్లయితొలగించండిIn this case, it's better that you have read it late, as it brought back the memories of the moonlit nights on which we studiously recited poems from "Krishnapaksham" - just before our Physics Main exams :))
తొలగించండి