21, జులై 2018, శనివారం

రజతోత్సవాలు అతికించిన బేర్లకూ ఉంటాయి...


సరిగ్గా ఈ రోజుకి పాతికేళ్ల క్రితం
సరిగ్గా ఇదే రోజు...


అది ఓ వర్షం కురిసిన రాత్రి
కిటికీ అవతల చినుకుల చిందులు 
బెంగళూరు వర్షం -
పొద్దున్నే మొదలైన వాన
పొద్దుగూకిన తర్వాత వచ్చిన చుట్టమయింది

కిటికీ కీవల అమ్మాయి మనసులో దిగులు 
అమ్మ మురిపెంగా పెట్టే రెండూ కావాలనిపించాయ్
నాన్నతో కబుర్లాడే వేళలు - నాలుగందాల నవ్వులు గుర్తొచ్చాయ్
ఆటపాటల తోడుండే చెల్లెళ్ళు, చెలులు కళ్ళ ముందు కదిలారు
బెంగటిల్లిన ఆ వేళ వాననీటికి పోటీగా కన్నీటి ధార
అప్పుడా అమ్మాయికి ఎదురుగా మెరుపులా కదిలిన ఓ ప్రేమంత్ర-దండం
పదంటే పది నిముషాల్లో - తెల్లటి చార్ట్ పేపర్ మీద వెలిసిన టెడ్డీ-బేర్ల బృందం


అది చూసిన అమ్మాయి కంట నీరాగి గలగలల నవ్వయింది
అబ్బాయి పెదవి మీద చిట్లిన పగడపు చినుకయింది
ఆ రోజుటి ఆ కాయితపు అతికింపు 
ఈ నాటికి పాతికేళ్ల మురిపెపు జ్ఞాపకమయింది ...
మరి అందుకే చెప్పాలనిపించింది -
రజతోత్సవాలు అతికించిన బేర్లకూ ఉంటాయి- అంటూ...

4 కామెంట్‌లు:

  1. ఈ పోస్ట్ చాలా నచ్చిందండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిత్ర గారు: మీరలా నచ్చిందనడం నాకూ నచ్చేసిందండి!

      తొలగించండి
  2. ఇంత అపురూపంగా దాచుకుంటే అతికించిన టెడ్డీ బేర్లకైనా రజతోత్సవాలేమిటి, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలూ ఘనంగా జరుగుతాయి.
    భావాలూ, అనుభవాలూ, బంధాలు,భాంధవ్యాలూ ఎలా దాచుకోవాలో, ఎలా పంచుకోవాలో నీ బ్లాగ్ ఒక గైడ్ లా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు లలితా!

    రిప్లయితొలగించండి