గల్లీ బోయ్!
కాదండి వీడు సిల్లీ బోయ్!
కానే కాదండి వీడేమీ బుల్లీ బోయ్!
పేరట వీడిది మురాద్
Rap పాటట వీడికి మురాద్
చదివేది మామూలు డిగ్రీ
వుంటారు దోస్తులు జిగ్రీ
తల్లేమో helpless
వంటింటిని వీడదు ఈ మానిని
సొంతింటిలో ఉండడమే ఓ మెహర్బానీ
తండ్రేమో thoughtless
ఇంటికి తెస్తాడో నయీ మా ని
బిన్ బులాయీ మెహమాన్ ని
మురాద్‌కి వున్నాడో ఛోటా భాయీ
వాడు ఉలకడం పలకడం వినం
ఆ ఇంట్లో ఇంకో మనిషి బూఢీ దాదీ
ఈవిడ కానే కాదు కథకి అదనం
వీళ్లందరిదీ కలదొక వాడట మురికిది
ముంబైలో ప్రముఖమైన స్లమ్మట అది
దాని పేరట ధారవి
సల్మాన్, మొయీన్ మురాద్‌కి స్నేహితులండి
సాయానికి వీరెప్పుడు రెడీ అండి
డబ్బుల్లేవంటే అడగండి మొయీన్ని
కారెవరిదైనా సరే! తాళం కోసేస్తాడు
దాన్నట్టుకొచ్చేస్తాడు వున్న పళాన్ని
మొయీన్ దగ్గర వుంటారు పిల్లలు
నింపేస్తుంటారు గంజాయి సంచులు
తప్పేదైనా చేసేస్తాడు, చేయిస్తాడు మొయీన్
తను బతుకుతూ, తన పిల్లల్ని బతికించాలంటే
అలా చేయక తప్పదంటాడు మొయీన్
కొంచెం తేడా అయినా నచ్చేశాడు మొయీన్
హీరోకి హీరోయిన్ సఫీనా ఫిరదౌసి
అవుతుందట డాక్టర్ చదివేసి
ఇది నిజంగా ఓ cute బుల్లి రాకాసి
ఎవరైనా చూశారో హీరో కేసి
కొట్టేస్తుంది వాళ్ళని అమాంతం మీదకి దూకేసి
సీసాలు బద్దలు కొట్టేసి
తల మీద కొట్టేసి
మురాద్ అడిగితే చెప్పమని ఇంకెప్పుడూ ఆలా కొట్టేయనని ఒట్టేసి
నవ్వేస్తుంది ఓరగా చూసేసి
ఓ చిరునవ్వు దూసేసి
ఎందుకనవసరంగా చస్తావనేసి
అమ్మా-నాన్నా పెళ్లి చేస్తామంటే సంబంధం చూసేసి
సల్మాన్‌ని బెదిరిస్తుంది నిన్నే చేసుకుంటాననేసి
దెబ్బకి వాడు పారిపోతాడు హడలి పోయేసి
ఈ పిల్ల ఫిరదౌసి
కనుబొమలెగరేసి
సొట్టబుగ్గల నవ్వులు విసిరేసి
మురిపించేసింది మనసు దోచేసి
ఇందులో వున్నాడో rap స్టార్
వాడే M. C. షేర్
వాడికి వుందో దిల్ మహా more
మురాద్‌కి ఇస్తాడు ఊపు బార్-బార్
Off-screen పేరట సిద్ధాంత్ చతుర్వేదీ!
On-screen నటనతో మెరిపించే పరుసవేది
వీడి యాక్టింగుకి పెట్టలేం వంకేదీ.
వీడికిదే మొదటి సినిమా అంటే ఎలా నమ్మేదీ?
ఎలా నిను కనిపెట్టిందో ఆ జోయా అఖ్తర్!?
నటనలో ease తో అయిపోయావ్ జన-మన-చిత్‌చోర్!
జోయా అఖ్తర్!
బార్-బార్ నీకు జోహార్!
ఎందుకూ?...అంటే....
Situation demand చేసిందీ అంటూ....
హీరో రణ్వీర్ సింగుకి చివరాఖరి rap పోటీల సీనులో కూడా బ్రాండెడ్ బట్టలేయనందుకు...
హీరో చేత తన అమ్మని బాధ పెడుతున్న నాన్నని పల్లెత్తు మాట కూడా అనిపించనందుకు...
తనకి నచ్చని పనిచేసిన నాన్నని చూపించి తల్లిని "మా బాబుని ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా?" అడిగించనందుకు...
బాత్రూంలో హీరో-హీరోయిన్ను కలుసుకున్న సందర్భాన్ని అసందర్భమైన ఏ shower కింద పాటకో వాడుకోనందుకు...
తండ్రి కన్నా వయసులో చాలా చిన్నదిగా అనిపించిన కొత్త పినతల్లికి హీరో మీద కలిగిన అభిమానాన్ని rap పాటకే పరిమితం చేయక లేనిపోని చెత్తగా మార్చనందుకు...
హీరోయిన్ అలియా భట్టుకి అక్కర్లేని డిజైనర్ డ్రెస్సులు వేయనందుకు...
హీరో-హీరోయిన్లని ఏ స్విజ్జర్లాండో పట్టుకెళ్లి డాన్సాడించనందుకు...
జోయా అఖ్తర్!
బార్-బార్ నీకు జోహార్!
ఎందుకూ?...అంటే....
నీ సినిమాలో...
సరైన బట్టలు కూడా కొనుక్కోలేని హీరో ఇంటిని ఏ బీచ్ ఒడ్డునో కళాత్మకంగా చూపించనదుకు...
కార్ డ్రైవర్ ఐన హీరో మామూలు కార్ డ్రైవర్ లాగే ఒదిగున్నందుకు...
ఒంటి వేలుతో సెక్యూరిటీ గార్డ్ పొమ్మని సైగ చేస్తే, హీరో వాణ్ణి గాల్లో కెగిరి తన్ని ఏడు సముద్రాలవతల పడేయకుండా నోర్మూసుకుని కార్లో కొచ్చి కూర్చుని ఆ గుండె మంటతో rap పాడుకున్నందుకు...
కార్లో వెనక కూర్చుని ఏడుస్తున్న కార్ ఓనర్ కూతుర్ని గుండెకి హత్తుకుని, పాట పాడి ఓదార్చకుండా అచ్చు ఓ కార్ డ్రైవర్ లాగే మనసులోనే బాధపడుతున్నా పైకి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినందుకు...
హీరో తనకెదురైన ప్రతి అవమానాన్ని తనకిష్టమైన rap పాటలో గెలుపుకి ఉపయోగించుకున్న తపనని చూపినందుకు...
అసలూ ... తొమ్మిదేళ్లుగా successful హీరో ఐన రణ్వీర్ సింగ్ తనకి introduction song పెట్టకుండా ఏ పేరూ-ఊరూ లేని సిద్దాంత్ చతుర్వేదికి పెట్టినా ఉక్రోషపడనందుకు...
తనే హీరో అయినా రణ్వీర్ సింగ్ సిద్దాంత్ చతుర్వేదిని అనుసరిస్తున్నట్టు, అతనికి తాను mentee అయినట్టు మాట విన్నట్లు నటించినందుకు...
సినిమా మొదలైందగ్గర్నుంచీ మిత్రలాభాన్నే చూపించినందుకు - మనుషుల్లో మంచితనాన్నే చూపించినందుకు...
Oh Boy! నీ గల్లీలో bullyల్లేరోయ్! - అనిపించినందుకు...
సినిమాలు చూసి చెడిపోతారన్నదే నిజమైతే - ఈ సినిమా చూసి బాగు పడొచ్చు...
ఇందులో కల వుంది
కలని అందుకోవడానికి పరుగుంది
కలని అందుకునే పరుగులో నేస్తాల తోడుంది
కలని గెలిచిన హీరో తనవారికి పంచిన ప్రేముంది.
అన్నట్టు ఈ సినిమాలో rap పాటలన్నీ ఓ ఎత్తైతే ...
జీవితంలో ఇష్టంగా చేయాలనుకున్నది ఏదైనా సరే
ఆ ఇష్టమేదో కనుగొని
ఆ కనుగొన్న ఇష్టాన్ని ఇష్టంగా కలగని
ఆ కలని కళ్ళలో నింపుకుని
కన్న కలని అందుకుని
ఆ కలని జీవించడంలో వున్న మజాని చూపించిన ఓ అందమైన పాట - నాకు భలే నచ్చేసిన పాట - జీనే మే ఆయే మజా!
ఇస్కో సున్నే భీ హై మజా!
~ సినీ-మా-లక్ష్మి

తరాజూ కే బస్ దో థాల్ హై
ఏక్ ఓర్ హమ్ దూజే మే ఖ్వాబ్ హై
జిందగీ యే పరేషాన్ హై
గనీమత్ హై తూ హై యహా
జీనే మే ఆ హై మజా
ఖరీదా నహీ జాతా ఖ్వాబ్ హై
కిరాయా భీ ఐసా లాజవాబ్ హై
జిందగీ యే పరేషాన్ హై
గనీమత్ హై తూ హై యహా
జీనే మే ఆ హై మజా
తూ జో మిలా జాగా ఖ్వాబ్ హై
ఖోయీ హుయీ మేరీ కితాబ్ హై
ముస్కాయా సా ఆదాబ్ హై
జీనే మే ఆ హై మజా
సుస్తాయే మౌసమ్ ఆబాద్ హై
హవావోం కే రుఖ్ హమ్ సే నారాజ్ హై
జిందగీ యే పరేషాన్ హై
గనీమత్ హై తూ హై యహా
జీనే మే ఆ హై మజా
తూ జో మిలా చిడా సాజ్ హై
ఖామోషీ కో మిలీ ఆవాజ్ హై
బెహ్తీ హవా సా ఎహ్సాస్ హై
జీనే మే ఆ హై మజా
బిగ్డా హువా హిసాబ్ హై
థోడా నఫా థోడా నుక్సాన్ హై
జిందగీ యే పరేషాన్ హై
గనీమత్ హై తూ హై యహా
జీనే మే ఆ హై మజా
ఇంకా ఈ సినిమా చూడాలేదండి లలిత గారు, ఇప్పుడు అర్జంట్ గా చూడాలనిపిస్తోంది మీరింత బాగా ఈ సినిమాని పొగిడాక.
రిప్లయితొలగించండివీలైతే చూడండి, పవన్‌గారు! మీకూ నచ్చుతుందని అనుకుంటున్నాను.
తొలగించండిఈ సిన్మా మీకు చాలా బాహా నచ్చేసినట్లుందండి! :)
రిప్లయితొలగించండిరాప్ స్టైల్ లో రాసిన ఇంట్రడక్షన్ వెరైటీ గా వుంది, అలానే దీనికి పెట్టిన టైటిల్ కూడా సిన్మా కథకి అతికినట్లుగా చాలా బావుంది!
ఉట్టి బాహా కాదండి - మహ-బాహా నచ్చేహింది ఈ హిందీ సైన్మా! నా రాప్-స్టైల్ రివ్యూని, పోస్ట్ టైటిల్‌నీ మెచ్చుకున్న మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండిGood cinema is a rare enjoyment these days, and a good review is even rarer! How lucky I am to have found both! I felt like "apna time aa gaya" :-) Well done, cine-ma-lakshmi - keep rapping!
రిప్లయితొలగించండిAparne! your comment made me feel like "apna time aa gaya" :)
తొలగించండి