ఈ ఏడు నాకు అనుకోకుండా కలిసొచ్చిన అంకె ఏడు.
అక్టోబర్ 10, 2020 ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో నా కథ చదివే అవకాశం దొరికింది.
నేను పాల్గొన్న వేదిక ఏడవది.
ఏడవ ప్రసంగ వేదికని నిర్వహించిన పెండ్యాల శ్రీనివాస్ గారితో మొదలుపెట్టి - మాట్లాడిన వారి వరసలో - ఏడవ దాన్ని నేను.
అన్నట్టు - నా పేరులో ఆంగ్ల అక్షరాలు ఏడు (L.A.L.I.T.H.A.).
ఇంతగా కలిసొచ్చేసిన "ఏడు" కి నాకు తెలిసి ఎన్ని పేర్లున్నాయా అని ఆలోచిస్తే నాకు ఏడుకి ఒకటి తక్కువగా - తెలుగులో రెండు, సంస్కృతంలో ఒకటి, కన్నడలో ఒకటి, హిందీలో ఒకటి, ఇంగ్లీషులో ఒకటి - మొత్తం ఏడుకి ఒకటి తక్కువగా "ఏడు"కి ఉన్న పేర్లు తట్టాయి.
అయ్యో! ఇంత మంచి "ఏడు"కి ఇంకొక్క పేరు తెలిస్తే బావుండేదే అని వెతుకుతూ ఉంటే దొరికేసింది - "చక్కుపగడ".
తెలుగులో ఆరు తర్వాత ఏడు
తెలుగులోనే ఆరున్నొక్కటి ఏడు
సంస్కృతంలో సంఖ్య సప్త
కన్నడద సంఖ్యె ఏళు
హిందీలో సంఖ్యా సాత్
ఇంగ్లీషులో హెవెన్ కి rhyme అయ్యే సెవెన్
ఈ ఒకటి-తక్కువ-ఏడు పేర్లని చేస్తూ "ఏడు"
దొరికేసిందొక చక్కదనపు మాట తోడు
ఏడు ఏడని మనమనే ఏడుకి
చమత్కారమైన ఏడో పేరు
"చక్కుపగడ"
చమక్కుమన్న చక్కుపగడ
******* ******* *******
******* ******* *******
ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొన్న తర్వాత "ఏడు" అంకె మీద మక్కువ పెరిగి - ఆ ఏడు గురించి రాసుకున్న ముచ్చట్ల తర్వాత నేను ఇక్కడ పంచుకోబోయేవి ఏంటంటే....
మొదటగా - నేను చదివిన కథ
తర్వాత - 7 వ వేదిక ప్రసంగాలు
అటు తర్వాత - 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అన్ని వేదికల play list:
ఏడక్షరాల పేరున్న నేను చదివిన (నేను రాసిన) కథ: "అమ్మకి హాఫర్లీ పరీక్ష ":
https://www.youtube.com/embed/jwvmQ5OzU7s?start=3540&end=4110
7 వ వేదిక ప్రసంగాలు:
https://youtu.be/jwvmQ5OzU7s?list=PLJs1zqc22OGHW2Hagr_L9tmexHMJKGfv1
7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు (యూట్యూబ్ ప్లే లిస్ట్):
https://www.youtube.com/playlist?list=PLJs1zqc22OGHW2Hagr_L9tmexHMJKGfv1
******* ******* *******
******* ******* *******
ముచ్చటైన ఏడుని ముత్యం మూడు సార్లు తలుచుకుంటూ ...
7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనే సదవకాశం నాకిచ్చిన వంగూరి చిట్టెన్ రాజుగారికి, వంగూరి ఫౌండేషన్ కార్యనిర్వాహక వర్గం వారికి కృతజ్ఞతలు.
7 వ వేదిక ప్రసంగాలని నిర్వహించిన స్నేహశీలి పెండ్యాల శ్రీనివాస్ గారికి, 7 వ వేదికలో పాల్గొన్న మా అందరికీ సాంకేతిక సహకారం అందించిన మధు పెమ్మరాజు గారికి, శేషగిరి నలబోతు గారికి ధన్యవాదాలు.
7 వ వేదికలో నాతో పాటు పాల్గొన్న మిగిలిన వక్తలందరికీ అభివందనాలు, శుభాభినందనలు.
హాహాహా
రిప్లయితొలగించండిGood చమక్కు
VANGURI - 7
ఏడు సార్లు చదివాక మళ్ళీ రాస్తా ..
Your post date is 7..( adding all no.s)
రిప్లయితొలగించండిI am sure you knew:-)
చక్కగా రాసావు చక్కుపగడ చమత్కారం గురించి... ఇప్పుడు నేను త్వర త్వరగా ఆ లింకుల్లోకి వెళ్లి నువ్వు 7వ వేదిక పై చమక్కుమనడం చూసేయాలి... ఉంటానే!
రిప్లయితొలగించండి‘ఏడు’న్నదో గానీ ఈ ‘చక్కుపగడ’ ఇన్నేళ్ళూ, నచ్చేసింది... ఆ పదమూ, నీ పోస్టూ.
రిప్లయితొలగించండినా బ్లాగ్ చదివి మెచ్చుకున్న మీ అందరికీ బోల్డన్ని థాంక్స్ !
రిప్లయితొలగించండి