సఖ్యం సాప్తపదీనం.
ఏడడుగులు కలిసి నడిస్తే స్నేహితులవుతారట. మరి కలిసిన మొదటి రోజునే బోల్డన్ని అడుగులు కలిసి నడిచాం. ఆ సఖ్యం ఇంకెంత గట్టిగా ఉండాలీ?
ఆ నడకల పదాలలో సరిగమలు - ఇక్కడ రాసి పెట్టుకున్నా:
త్వామనురజామి - 17 - మాట లేని రోజు అది - వాక్కు లేని walk అది!
అడుగులేసి అక్కడితో ఆగామా?! ఆ పక్కరోజు కాక అటు పక్కరోజు కలిసి రైలు ప్రయాణం కూడా చేశాం.
ఆ రైలు ప్రయాణపు పదనిసలు - ఇక్కడ దాచిపెట్టుకున్నా:
త్వామనురజామి - 18 - పాడకున్న ఏమిలే - చదివేద్దాం రాతలే!
త్వామనురజామి - 19 - बोलనంత సేపు స్నేహమా - నేను बोలాక కోపమా?
అక్కడితో - అప్పటికి అనుకోకపోయినా - ఇంకొన్నాళ్ళకి - అనుకోకుండా ఎంతో జరిగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అనుకున్నంతా అయ్యింది.
ఇవాళ్టికి నిన్నైన డిసెంబర్ 19 నాటి తొలిఅడుగులకి, ఇవాళ్టికి రేపైన డిసెంబర్ 21 నాటి తొలిప్రయాణానికి - ఇవాళ్టికి ముప్పై ఏళ్ళు.
ఒకటి కాదు, రెండు కాదు, ఐదూ-పదీ కాదు, ఏకంగా మూడుపదుల ఏళ్ళు - దాదాపుగా మూడు వందల అరవై నిండు పున్నములు.
తొలి అడుగుల నాటి ఆ శీతాకాలపు సాయంకాలం ఈ రోజుకీ నా కళ్ళ ముందు ఆ రోజు ఎలా మెరిసిందో అదే మెరుపుతో మెదులుతూ మురిపిస్తోంది.
ఆ సాయంకాలం
ఆ శీతాకాలపు చలిని అడగని-సాయం కాలం
ఆ శీతాకాలపు ఎండని అడిగిన-సాయం కాలం
అప్పటిదాకా...
ఒక క్షణం - చుట్టుముట్టిన కొండగాలికి వణుకుతూ
మరు క్షణం - వెచ్చకాగిన ఎండ వేడికి ఉరుకుతూ
ఒక్కదాన్నీ -
మా చదువుల ఒడి క్యాంపస్ దారుల్లో
ఎండ వేసిన నీడ ముగ్గులతో ఆడుకుంటూ
కనిపించని గాలితో మాటాడుకుంటూ
నాదైన ప్రపంచంలో నాకై నేనే నంటూ
నాకు నేనే తోడనుకుంటూ
నాలో నేనే పాడుకుంటూ
నాతో నేనే తిరుగాడుకుంటూ... ఉన్నానా?!
ఇంతలో నా కన్నెదుట
కన్నెనైన నా కట్టెదుట
నిలిచాడొక అబ్బాయి
మోగక - మదిలో మూగే పాటలా...
నవ్వుతూ - సవ్వడి లేని మువ్వలా...
ఆ నవ్వు - పెదవుల మీంచి కన్నుల్లోకి పాకుతోందో
ఆ నవ్వు - కన్నుల్లోంచి పెదవుల మీదికి జారుతోందో
ఎటుదెటు సాగుతోందో
తెలీనీక
కనువిందుగా
తళుకల్లె
కనికట్టుగా
మిణుకల్లె
ఎటులెటు సోకుతోందో
తోచనీక
పలకరించె నన్ను
నిలవరించె నన్ను
నాకప్పుడు ఎందుకలా అనిపించిందో -
కానీ - ఇది మూగసందేశమో... అనిపించి -
అదే - నాకనువైన మనోరాగ సంకేతమో అనుకున్నా.
అప్పుడు...
మనసులో వలపే మెరిసిందో
ఆ తలపుకే మనసే మురిసిందో
ఆ పైనున్న మిన్నే వంగిందో
నాకున్న కన్నే చెదిరిందో
పుట్టిన ఇరవైయ్యొక్క ఏళ్ళకి మళ్ళీ కొత్తగా పుట్టాను
అప్పటి వరకు ఉన్న నేను నిన్ననయ్యా...
అప్పటి నుంచి నేను తనదన్నదయ్యా!
**చెలి మనసే శివధనుసైనది
తొలిచూపుల వశమైనది**
అన్న వేటూరి వారి పాట
నిజమాయె మా పాలిట
అంతే!
ఆ మొదటి రోజు నడకలో కలిసిన అడుగులు
అన్నై, ఇన్నై, బోల్డన్నై -
మనువులయ్యాయి
మనుగడలయ్యాయి
("సఖ్యం సాప్తపదీనం" అన్న బాసకి బాసటైన బాట)
లలితా! మూడు పదుల మీ ‘పద’నిస లకు మూలమైన ఆ ‘సప్తపదుల’ను నువ్వు గుర్తుపెట్టుకొని తలచుకున్న తీరు మనోహరం.
రిప్లయితొలగించండిమీ పదనిసలు, సరిగమలతో కలసి ఎప్పటికీ ఇలాగే సరాగాలు 🎶 పలకాలని కోరుకుంటున్నా.😊
చాలా థాంక్స్, లక్ష్మీ!
తొలగించండిఇంతలో నా కన్నెదుట
రిప్లయితొలగించండికన్నెనైన నా కట్టెదుట
నిలిచాడొక అబ్బాయి
మోగక - మదిలో మూగే పాటలా...
నవ్వుతూ - సవ్వడి లేని మువ్వలా...
ఆ నవ్వు - పెదవుల మీంచి కన్నుల్లోకి పాకుతోందో
ఆ నవ్వు - కన్నుల్లోంచి పెదవుల మీదికి జారుతోందో
ఎటుదెటు సాగుతోందో
తెలీనీక
కనువిందుగా
తళుకల్లె
కనికట్టుగా
మిణుకల్లె
ఎటులెటు సోకుతోందో
తోచనీక
పలకరించె నన్ను
నిలవరించె నన్ను
..paisa vasool...:-) Thanks a lot!!
నా మాటమాటని పేరుపేరునా నచ్చుకునే మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండిమరిన్ని వసంతాలు, శరదృతువులు మీ కోసం ఆశిస్తూ, మూడు దశాబ్దాల మీ చెలిమికి ఇవే శతాభినందనలు.
రిప్లయితొలగించండిబోల్డన్ని థాంక్స్, అపర్ణే!
తొలగించండి