22, డిసెంబర్ 2024, ఆదివారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 11

  క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 10





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



శ్లోకం - 11

సమః  సమవిభక్తాంగః 
స్నిగ్ధవర్ణః  ప్రతాపవాన్
పీనవక్షా  విశాలాక్షః
లక్ష్మీవాన్  శుభలక్షణః


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అర్థం: 

(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి  వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)


ఒడ్డూ పొడుగూ సమంగా వున్నవాడు, సరయిన అంగసౌష్ఠవం కలవాడు, చిక్కనైన మేనిఛాయ కలవాడు, శౌర్యవంతుడు, పుష్టిగా నున్న వక్షస్థలం కలవాడు, పెద్దవైన కన్నులు కలవాడు, దేదీప్యమైన వర్చస్సు కలవాడు, శోభస్కరమైన లక్షణాలు కలవాడు. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)


సమః  = ఒడ్డూ పొడుగూ సమంగా వున్నవాడు
సమవిభక్తాంగః = సరయిన అంగసౌష్ఠవం కలవాడు
స్నిగ్ధవర్ణః  = చిక్కనైన మేనిఛాయ కలవాడు
ప్రతాపవాన్ = శౌర్యవంతుడు
పీనవక్షా  = పుష్టిగా నున్న వక్షస్థలం కలవాడు
విశాలాక్షః = పెద్దవైన కన్నులు కలవాడు
లక్ష్మీవాన్  = దేదీప్యమైన వర్చస్సు కలవాడు
శుభలక్షణః = శోభస్కరమైన లక్షణాలు కలవాడు



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


श्लोकः - 11

समः  समविभक्ताङ्गः |
स्निग्धवर्णः  प्रतापवान् |
पीनवक्षा  विशालाक्षः |
लक्ष्मीवाञ्चुभलक्षणः ||



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Meaning in English

(NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)

He has a perfect stature, well-proportioned limbs and a dark complexion. He is mighty. He is having a rounded chest, large eyes. He is full of splendor and having virtuous qualities. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):


समः  = having perfect stature
समविभक्ताङ्गः = having well-proportionate limbs
स्निग्धवर्णः  = having dark complexion
प्रतापवान्  = mighty
पीनवक्षा  = having rounded chest
विशालाक्षः  = having large eyes
लक्ष्मीवान्  = full of splendor
शुभलक्षणः = having virtuous qualities



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 12

2 కామెంట్‌లు:

  1. సమమై యొడ్డూ పొడుగూ ,
    సమ సౌష్టవ శుభ శరీర సంజనితుడునూ ,
    కమనీయ వర్ణ శోభిత ,
    రమణుడు , శుభలక్షణుండు , రాము డయోధ్యన్ .

    రిప్లయితొలగించండి
  2. రాముని యవతారము , ఈ
    భూమికి రక్షా కవచము , పూని వెలిసె , సం
    క్షేమము లొసగగ , భారత
    భూమి , నయోధ్యను , పున్నెపు ప్రోవై .

    రిప్లయితొలగించండి