14, డిసెంబర్ 2024, శనివారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 10

  క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 9





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



శ్లోకం - 10

మహోరస్కో  మహేష్వాసః 
గూఢజత్రురరిందమః
ఆజానుబాహుః  సుశిరాః
సులలాటః  సువిక్రమః

 

 
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అర్థం: 


(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి  వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)

    విశాలమైన వక్షస్థలం కలవాడు, గొప్ప ధనుస్సు కలవాడు, మాంసపుష్ఠి గల మీద ఎముకలు కలవాడు, శత్రువులను అణచగలవాడు, ఆజానుబాహువు, శోభస్కరమైన శిరము కలవాడు, అందమైన నుదురు కలవాడు, మనోహరమైన నడక గలవాడు.



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)


మహోరస్కః  మహేష్వాసః 
గూఢజత్రుః  అరిందమః 
ఆజానుబాహుః  సుశిరాః 
సులలాటః  సువిక్రమః 



మహోరస్కః = విశాలమైన వక్షస్థలం కలవాడు
మహేష్వాసః = గొప్ప ధనుస్సు కలవాడు
గూఢజత్రుః = మాంసపుష్ఠి గల మీద ఎముకలు కలవాడు 
అరిందమః = శత్రువులను అణచగలవాడు
ఆజానుబాహుః = ఆజానుబాహువు
సుశిరాః = శోభస్కరమైన శిరము కలవాడు
సులలాటః =  అందమైన నుదురు కలవాడు
సువిక్రమః = మనోహరమైన నడక గలవాడు 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

श्लोकः - 10

महोरस्को  महेष्वासः |
गूधजत्रुररिन्दमः |
आजानुबाहुः  सुशिराः |
सुललाटः  सुविक्रमः ||



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Meaning in English


(NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)

He has a broad chest, holds a mighty bow. His collar bone is covered with He has arms extending to knees, a well-formed head and a well-shaped forehead. He moves with a charming gait.



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):


महोरस्कः  =  having broad chest
महेष्वासः  =  holding mighty bow
गूढजत्रुः   =  having collar bone covered with flesh
अरिन्दमः  =  capable of subduing his foes
आजानुबाहुः  =  having arms extending to knees
सुशिराः  =  has well-formed head
सुललाटः  =  has well-shaped forehead
सुविक्रमः  = moves with a charming gait



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 11

5 కామెంట్‌లు:

  1. కన్ను లానంద భాష్పముల్ గ్రమ్ము , నీదు
    దివ్యమంగళ మూర్తి దేదీప్యమాన
    మయి గనంగ , రామా ! కమల దళాక్ష !
    జన్మ ధన్యత గాంచును , జన జగతికి .

    రిప్లయితొలగించండి
  2. అరి భయంకర కోదండ ధర ! రఘువర !
    శాంత గంభీర ! వర కరుణాంతరంగ !
    శ్రీ విభవ మణి ఘృణిత కిరీట ధారి !
    రక్ష మాం రామ ! రోగ జరా విరామ !

    రిప్లయితొలగించండి
  3. కన్నులార ఆరడుగుల , కందిరీగ
    నడుము శుభమోహనాంగుని , నవ మనోజ్ఞ
    దివ్వమంగళ రాముని , తేరి పార
    జూచిన జనుల దదృష్టము సుమ్ము ! నాడు .

    రిప్లయితొలగించండి
  4. భువన మోహన ! రాఘవా ! పుణ్యభాగ !
    సుర ముని తపో విహార ! భాసుర శుభాంగ !
    కర ముకుళిత జన గణ రక్షా ప్రభాంగ !
    ఘన నిశాచర రావణ గర్వ భంగ !

    రిప్లయితొలగించండి
  5. త్యాగరాజ వినుత రాగాలవాల ! శ్రీ
    పోతరాజ వినుత పుణ్య పురుష !
    రామదాస పోష రామభద్ర ! నమోస్తు ,
    హనుమ భజిత! మాకు అండ నిలుము .

    రిప్లయితొలగించండి