(ఈ కథ కిరణ్ కి పదిహేను నెలల వయసు నుంచి వాడికి మూడేళ్ళు వచ్చేదాకా ప్రతీ వారం రోజు విడిచి రోజు చెప్పినది. ఇందులో వాడే హీరో :). టార్గెట్ ఆ రోజుల్లో కిరణ్ కి ఇష్టమైన స్టోర్. ఇంకా వాడికి ఎల్లో కార్ ఇష్టం, వాక్యూం క్లీనర్ ఇష్టం. కిరణ్ ఆమ్ తినాలంటే అమ్మ ఇల్లు వాక్యూం చేస్తే సరి - అది చూస్తూ గబగబా తినేసేవాడు - మన ఇల్లు వాక్యూం చేస్తున్నామా, వేరే వాళ్ళ ఇల్లా అనే పట్టింపు లేదు :) ఫ్రెండ్స్ ఎవరి ఇంటికి వెళ్ళినా కిరణ్ ఆమ్-టైం కి నాకొక వాక్యూం క్లీనర్ ఇచ్చేసేవాళ్ళు :) కిరణ్ ఇందులో బుజ్జికోతికి చేసినవన్నీ వాళ్ళ అమ్మని (అమ్మకోతిని కాదండోయ్) చూసి నేర్చుకున్నవి :)) )
అనగనగా బాల్ల్విన్ అనే ఊళ్ళో అమ్మ, నాన్నగారు, అన్న, కిరణ్ వుంటారు.
ఒక రోజు అన్న స్కూల్ కి, నాన్నగారు ఆఫీసు కి వెళ్ళారు. అమ్మ ఆం వండుతోంది.
కిరణ్ గరాజ్ లో బాల్ తో ఆడుకుంటూ వున్నాడు.
పక్క ఇంట్లో అమ్మకోతి, ఒక బుజ్జికోతి వున్నాయి.
అమ్మకోతి గరాజ్ లో ఆడుకుంటున్న కిరణ్ దగ్గరికి వచ్చి " కిరణ్! కిరణ్! మా బుజ్జికోతికి బోర్ కొట్టి ఏడుస్తోంది. ఒకసారి నువ్వు టార్గెట్ కి టాటా తీసుకెళ్తావా, ప్లీజ్?" అని అడిగింది.
మరి ఏదైనా చేయాలంటే ముందు కిరణ్ అమ్మకి చెప్పాలి కదా!
అందుకని కిరణ్ "వుండు. మా అమ్మ ని అడిగి వస్తాను" అని అమ్మకోతికి చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు.
అమ్మ కిరణ్ ని చూసి "ఏంటి కిరణ్ నాన్నా? ఏం కావాలి" అని అడిగింది.
అప్పుడు కిరణ్ బుజ్జికోతిని టాటా తీసుకెళ్ళాలి అని చెప్పాడు.
అమ్మ అప్పుడు "సరే కిరణ్ నాన్నా! నీ ఎల్లో కార్ లో జాగ్రత్తగా వెళ్లి రా" అని చెప్పింది.
కిరణ్ అప్పుడు ఎల్లో కార్ కీస్, తన కళ్ళకి గ్లాసెస్, వాలెట్ తీసుకుని గరాజ్ లోకి వచ్చాడు.
బుజ్జికోతిని వాళ్ళ అమ్మకోతి ఎల్లో కార్ లో బేబీ సీట్ లో కూర్చోబెట్టింది.
అప్పుడు కిరణ్ బుజ్జికోతికి సీట్ బెల్ట్ పెట్టి, ఎల్లో కార్ స్టార్ట్ చేసి నెమ్మదిగా రివర్స్ చేసి, గరాజ్ వేసేసి, కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుని "జుయ్, జుయ్" అని ఫాస్ట్ గా మాంచెస్టర్ రోడ్ మీద వుంటుందే.....ఆ టార్గెట్ కి వెళ్ళాడు.
అక్కడ దిగగానే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి, సీట్ బెల్ట్ తీసి బుజ్జికోతిని టార్గెట్ షాపింగ్ కార్ట్ లో ఎక్కించి, మరి బెల్ట్ పెట్టకపోతే బుజ్జికోతి కార్ట్ లోంచి జారిపడిపోతుంది కదా అందుకని - బుజ్జికోతికి ఆ కార్ట్ కి వున్న బెల్ట్ పెట్టి , టార్గెట్ లోకి తీసుకుని వెళ్ళాడు.
చెప్పడం మర్చిపోయాను - టార్గెట్ లోకి వెళ్లబోయేముందు కిరణ్ గ్లాస్సెస్ తీసేశాడు - లేకపోతే అన్నీ డార్క్, డార్క్ గా కనిపిస్తాయి కదా - అందుకని.
టార్గెట్ లోకి వెళ్ళగానే బుజ్జికోతి చాకొలేట్ కావాలీ..ఈ..ఈ.. అని ఏడ్చింది.
కిరణ్ అప్పుడు "హుష్, బుజ్జుకోతీ! అలా గట్టిగా ఏడవకూడదు." అని బుజ్జికోతి చెవిలో నె...మ్మదిగా చెప్పి ఒక చాకొలేట్ తీసి బుజ్జికోతికి పట్టుకోమని ఇచ్చాడు - మరి మనం బిల్ పే చేసేవరకూ తినకూడదు కదా.
కిరణ్ టార్గెట్ లో ఒక రెడ్ లాన్ మోవర్ కిరణ్ కి, ఒక బ్లాక్ లాన్ మోవర్ బుజ్జికోతికి కొన్నాడు.
మళ్ళీ ఒక ఎల్లో వాక్యూం క్లీనర్ కూడా కొన్నాడు. ఎందుకంటే కిరణ్ కి లాన్ మోవర్, వాక్యూం క్లీనర్ ఇష్టం కదా అందుకని.
అన్నీ షాపింగ్ కార్ట్ లో పెట్టుకున్నాడు.
ఇంతలో బుజ్జికోతి మళ్ళీ ఊఊ...ఊఊ... అని ఏడవడం మొదలుపెట్టింది - దానికి ఒక ఎల్లో కార్ బొమ్మ కావాలని.
మళ్ళీ కిరణ్ ఏం చేస్తాడు పాపం! బుజ్జికోతి చెవిలో "బుజ్జికోతీ! అలా ఏడవకూడదు" అని చెప్పి ఒక ఎల్లో కార్ బొమ్మ బుజ్జికోతికి ఇచ్చి పట్టుకోమన్నాడు.
అలా కావలసినవి అన్నీ తీసుకుని కౌంటర్ దగ్గర అమ్మాయికి వాలెట్ లోంచి డెబిట్ కార్డు తీసి బిల్ పే చేసేసి, కిరణ్ మళ్ళీ రెడ్ లాన్ మోవర్, బ్లాక్ లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్, ఎల్లో కార్ బొమ్మ - అన్నీ షాపింగ్ కార్ట్ లో పెట్టుకుని, చాకొలేట్ ఓపెన్ చేసి బుజ్జికోతికి ఇచ్చి, మళ్ళీ ఎల్లో కార్ దగ్గరికి వచ్చాడు.
వచ్చి ఎల్లో కార్ ట్రంక్ తెరిచి రెడ్ లాన్ మోవర్, బ్లాక్ లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్, ఎల్లో కార్ బొమ్మ - అన్నీ ట్రంక్ లో పెట్టుకుని ట్రంక్ క్లోస్ చేసేశాడు.
బుజ్జికోతిని కార్ సీట్ లో కూర్చోబెట్టి , మళ్ళీ బెల్ట్ పెట్టి, కిరణ్ కూడా కార్ లో ఎక్కి గ్లాస్సెస్ పెట్టుకుని "జుయ్, జుయ్" అని ఫాస్ట్ గా ఇంటికి వచ్చేశాడు.
ఇంటికి వచ్చి బుజ్జికోతిని, బ్లాక్ లాన్ మోవర్ ని, ఎల్లో కార్ బొమ్మ ని అమ్మకోతి దగ్గర దింపేసి రెడ్ లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్ ని తీసుకుని అమ్మ దగ్గరికి వచ్చేసి, ఇచ్చేసి, పప్పు-ఆమ్, పెరుగు-ఆమ్ తినేసి హా....యిగా బజ్జున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి