(నాన్నమ్మ చెప్పిన కథ. ఈ కథ చిన్న పిల్లలలు ఒక వరుసలో విషయాలు మననం చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి అవసరమైన మానసిక అభ్యాసానికి చాలా ఉపయోగపడుతుంది.)
అనగనగా ఒక కోతి వుంది.
ఒకరోజు అది ఒక అడవిలో వెళ్తూ వుంటే కాలులో ముల్లు గుచ్చుకుంది.
వెంటనే ఆ కోతి నేల మీద కూర్చుని కాలు చూసుకుని ఏడుస్తూ వుంది.
ఇంతలో అటుగా ఒక అబ్బాయి వచ్చాడు అతని చేతిలో ఒక కత్తి వుంది.
"కోతీ! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.
కోతి తన కాలులో గుచ్చుకున్న ముల్లు చూపించగానే తన చేతిలో వున్న కత్తితో ఆ ముల్లు తీసేసి అవతల విసిరేశాడు.
వెంటనే కోతి కోపంగా "హన్నా! ముల్లు తీయమన్నాను కానీ పడేయమన్నానా? నా ముల్లిస్తావా? లేకపోతే నీ కత్తిస్తావా ? "అని అడిగింది.
ఆ అబ్బాయి ఏం చేస్తాడు, పాపం! కత్తి కోతికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
కోతి ఆ కత్తి తీసుకుని వెళ్తూ వుంటే అడవిలో ఒకచోట ఒక కట్టెలు కొట్టుకునే అతను చేతితో చెట్టు కొమ్మలను విరుస్తూ కనిపించాడు.
కోతి అతని దగ్గరికి వెళ్లి "అయ్యో! అలా ఎంతసేపని చేతితో విరుస్తావు. ఇదిగో ఈ కత్తి తీసుకో" అని అతనికి కత్తి ఇచ్చింది.
కత్తితో కొన్ని కట్టెలు కొట్టాక కత్తి విరిగిపోయింది.
అంతే కోతి " నీ కట్టెలు కొట్టుకో అని ఇస్తే నా కత్తి విరిచేస్తావా? నా కత్తి ఇస్తావా? నీ కట్టెలు ఇస్తావా?" అని దబాయించింది.
ఇంకేం చేస్తాడు పాపం, ఆ కట్టెలు కొట్టుకునే అతను! తన కట్టెలు అన్నీ కట్ట కత్తి కోతికి ఇచ్చేశాడు.
కోతి కట్టెల మోపును తల మీద పెట్టుకుని వెళ్తూ వుంటే ఒక వూరిలో ముసలమ్మ కొబ్బరి ఆకులతో పొయ్యి వెలిగించడానికి సతమతమవుతూ కనిపించింది.
వెంటనే కోతి ముసలమ్మ దగ్గరికి వెళ్లి "అవ్వా! ఆ కొబ్బరాకులతో పొగే కానీ మంట మండదు. అలా ఏం అవస్థ పడతావు గానీ ఈ కట్టెలు తీసుకుని వంట చేసుకో " అని తన దగ్గరున్న కట్టెలు ఇచ్చింది.
ఆ అవ్వ ఆనందంగా కట్టెలు పెట్టి పొయ్యి రాజేసి పెనం కాల్చి అట్లు పోసుకుంది. అట్లు వేయడం పూర్తి అయేటప్పటికి కోతి ఇచ్చిన కట్టెలు అన్నీ కాలి బూడిద అయిపోయాయి.
అది చూసి కోతి "నా కట్టెలన్నీ కాల్చి బూడిద చేసేస్తావా? నా కట్టెలు ఇస్తావా? లేకపోతే నీ అట్లు ఇస్తావా?" అని పేచీ పెట్టింది.
పాపం ఆ అవ్వ చేసేదేమీ లేక అట్లన్నీ కోతికి ఇచ్చేసింది.
కోతి ఆ అట్లు మూట కట్టుకుని వెళ్తూవుంటే బజార్లో ఒక పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు.
వెంటనే కోతి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి " బాబూ! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది.
దానికి ఆ పిల్లాడు " మా అమ్మ కొత్త కుండ కొనుక్కురా అని సంతకి పంపించింది. వున్న డబ్బులన్నీ కుండ కొనడానికే ఖర్చు అయిపోయాయి. నాకిప్పుడు ఆకలి వేస్తోంది. కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు." అని ఏడ్చాడు.
అది వినగానే కోతి "అయ్యో! అలాగా! దా...నా దగ్గర అట్లు వున్నాయి. తిను. " అని అట్ల మూట ఆ అబ్బాయి చేతికి ఇచ్చింది.
వాడు బాగా ఆకలి మీద వున్నాడేమో - ఆవురు ఆవురని అట్లన్నీ తినేశాడు.
అంతే కోతికి మళ్ళీ కోపం వచ్చేసింది. "ఏదో ఒకటో రెండో తింటావని ఇస్తే అన్నీ తినేస్తావా? నా అట్లు ఇస్తావా? నీ కుండ ఇస్తావా? " అని అరిచింది.
ఆ పిల్లాడు బెదిరిపోయి కోతికి కుండ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
కోతి ఆ కుండ తీసుకుని వెళ్తూ ఒక తోట దగ్గర ఆగింది.
ఆ తోటకి చిల్లు కుండతో నీళ్ళు పెడుతూ తోటమాలి కనిపించాడు.
కోతి తోటమాలి దగ్గరికి వెళ్లి "ఆ చిల్లు కుండతో ఎన్ని సార్లని అటూ ఇటూ తిరుగుతావు? ఇదిగో ఈ కొత్త కుండ తీసుకో." అని ఇచ్చింది.
తోటమాలి ఆనందంగా ఆ కొత్త కుండతో తోటకి నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంతలో నూతి లోంచి కొత్తకుండతో నీళ్ళు తోడుతూ వుండగా నూతి గోడకి తగిలి కుండ పగిలిపోయింది.
వెంటనే కోతి "నా కుండ ఇస్తావా? నీ పూల దండలు ఇస్తావా? " అని పట్టు పట్టి ఆ తోటమాలి దగ్గర పూలదండలన్నీ పట్టుకుపోయింది.
పూలదండలు పట్టుకుని కోతి అలా వెళ్తూ వుంటే ఒక చోట రాజుగారి కూతురి పెళ్లి జరుగుతూ కనిపించింది. ఆ పెళ్ళిలో పూలు దొరకలేదని అందరూ అనుకుంటూ వుంటే కోతి వెళ్లి " పూలు లేని పెళ్లి ఏం పెళ్లి? ఈ పూలు తీసుకోండి" అని తన దగ్గరున్న పూలదండలు పెళ్లికూతురుకి ఇచ్చింది.
కోతి ఇచ్చిన పూలతో అలంకరించుకుని రాజుగారి కూతురు పెళ్లి చేసుకుంది.
మర్నాటికి పూలదండలు వాడిపోవడం చూసి " నా పూల దండ ఇస్తారా? మీ పిల్ల నిస్తారా " అని పేచీ పెట్టి రాజుగారి కూతుర్ని తీసుకుని కోతి వేరే వూరికి బయల్దేరింది.
దారిలో ఒక సర్కస్ చేసేవాళ్ళు కనిపించారు. గడ ఎక్కడానికి పిల్ల లేదే అనుకుంటూ వుంటే "ఇదిగో నా దగ్గర పిల్ల వుంది. దీన్ని గడ ఎక్కించండి" అని కోతి రాజుగారి కూతుర్ని వాళ్లకి ఇచ్చింది.
సర్కస్ వాళ్ళు గడ ఎక్కించగానే కొంచెం నడవగానే అలవాటులేక తూలిపడి రాజుగారి కూతురుకి కాలు విరిగింది.
వెంటనే కోతి "హన్నా! నా పిల్ల కాలు విరక్కొడతారా? నా పిల్ల కాలు బాగు చేస్తారా? లేకపోతే మీ డప్పు ఇస్తారా? " అని అడిగింది.
కోతితో గొడవ ఎందుకని సర్కస్ వాళ్ళు డప్పు ఇచ్చేశారు.
కోతి ఆ డప్పు తీసుకుని ఒక చెట్టు కొమ్మ మీద ఎక్కి కూర్చుని ఇలా పాడింది.....
ముల్లు పోయి కత్తి వచ్చే డాం డాం డాం
కత్తి పోయి కట్టే వచ్చే డాం డాం డాం
కట్టే పోయి అట్టు వచ్చే డాం డాం డాం
అట్టు పోయి కుండ వచ్చే డాం డాం డాం
కుండ పోయి దండ వచ్చే డాం డాం డాం
దండ పోయి పిల్ల వచ్చే డాం డాం డాం
పిల్ల పోయి డప్పు వచ్చే డాం డాం డాం - డాం డాం డాం

ఎప్పుడో చిన్నప్పుడు విన్న చిన్న కథ !నా చిన్నపుడు కోతిని చూస్తే కోతీ వచె డామ్ డామ్...అనేవాన్ని అట దోస కావలిస్తే డామ్ డామ్ దోచ కావాలి అని ఏడిచే వాడినంట !!!!మా అక్కలు చెప్పి నవ్వుతారు మళ్లీ చాలాకాలం తర్వాత పూర్తి కథా చెప్పావ్ థాంక్యూ !నా చిట్టి తల్లికి చెపుతా డామ్ ..డామ్ ..డామ్
రిప్లయితొలగించండిచెప్పు చెప్పు - మీ చిట్టి తల్లికి. నేనయితే మా బుజ్జిజింకలకి ఈ కథ చెప్తూ ఆఖర్న వచ్చే పాటలో కావాలని మర్చిపోయినట్టు వరస తప్పి - వాళ్లు నన్ను - తూగుతున్న కళ్లతో సగం నిద్రలోకి జారుకుంటూ కూడా - అలా కాదమ్మా! అని సరి చేస్తూ వుంటే తెగ మురిసిపోయేదాన్ని.
తొలగించండి