హలో .... నీకే ....
నీకే ... అంటే ? నాకేం పేరు లేదా అంటావా?
అరరె ... నా ఉద్దేశ్యం నీకు పేరు లేదని కాదు.
కానీ ఎన్నిపేర్లని సంబోధించను? ఏదో ఒక పేరుతో పిలుద్దామంటే నువ్వు ఒక "నువ్వు" మాత్రమే కాదే ?
ఎన్నో చోట్ల ఎన్నెన్నో రకాలుగా కనిపించి నన్ను ఆహ్లాద పరుస్తావు, ఆశ్చర్యపోయేలా చేస్తావు, ఆలోచనల్లోకినెడతావు.
అందుకే నిన్ను అలానే పిలవనీయ్ - ఈ ఒక్కసారికి.
నువ్వు నాకు పరిచయమూ కాదు అలా అని తెలీదనీ కాదు
నీతో మిత్రత్వమూ లేదు శత్రువ్వీ కాదు
నీకు నా దృష్టిలో స్త్రీ-పురుష భేదమూ లేదు
నాకు నీ గురించి కొంత తెలుసు చాలా ఎక్కువ తెలీదు
మరి నాకెందుకు ఈ ఉత్తరం రాస్తున్నావు అనడుగుతున్నావా?
ఆ విషయానికే వస్తున్నాను.
ఎంత కాదనుకున్నా నీకు నాకు ఎక్కడో వేలు విడిచిన సంబంధం ఉండనే వుంది.
ఎలా అంటావా - ఎప్పుడో నీ, నా పూర్వీకులు గుహలలో తిరుగుతున్నప్పుడు మొదటి సారిగా నిప్పు రాజేసినప్పుడు, ఉరుముకి అదిరి ఆకాశానికిచేతులెత్తి మొక్కినప్పుడు, ఎండ కాసి పూవు విరిస్తే సంతోషంతో చిందు వేసినప్పుడు పక్క పక్కనే వుండి వుంటారేమో?
కాదనగలవా?
తర్వాత తెగలుగా విడి ఖండాలుగా వలసపోయినా, కొత్త కొత్త భాషలు కట్టి మాటలు పేర్చినా నీకూ నాకూ ఇంకా ఒక మనదయిన భాష మిగిలేవుండి వుండాలి - అది నీకేమైనా తెలుసా? మనమెలాంటి సంబంధీకులమో, మనదెలాంటి అనుబంధమో నేను నీకిప్పుడు చెప్పలేకపోయినా ముందు ముందు చదువుతూ వుంటే నీకే తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలో చూశావా ఎంతగా ప్రతీ దానికీ చిరాకు పడుతున్నామో అందరమూ?
అంటే నేనూ నువ్వనే కాదు - ఎందరో నాలాంటి అనేక నేనులు, ఇంకెందరో నీలాంటి అనేకానేక నువ్వులూ - పలికే ప్రతి వాక్యానికి, జరిగే ప్రతి సంఘటనకీ దేని ముఖ విలువ దానిదిగా తీసుకోకుండా మనదైన రంగు పులిమి మనకి కావాల్సిన అర్థం వెతుక్కోవడం అలవాటయిపోయింది కదూ?
ఒకరు రాసిన రాత బాలేదని, తీసిన సినిమాలో కావాల్సిన సందేశం లేదని, ఎవరు చెప్పిన ఏదీ కూడా అందరూ ఆమోదించేలా లేదని వాదిస్తున్నామే మనం- ఒక్క నిముషం ఆగి అన్నీ మనకి నచ్చేవే ఉండాలనే స్వార్థం ఎందుకో చెబ్తావా?
మనలాగే అవతలవాళ్ళకీ ఒక ఇష్టం, అయిష్టం ఉంటాయని వాటిని గుర్తించి గౌరవిస్తేనే ప్రశాంతమయిన సహజీవనపు మనుగడ అని ఎప్పటికి తెలుస్తుంది నీకు, నాకు?
ఆరుస్తామో, తీరుస్తామో అని కాకపోయినా ఎవరో తమ తరతరాల అణిగి వున్న, అదిమి పెట్టి వున్నఆక్రోశపు గోడు వెళ్ళబోసుకుంటుంటే - మన తీరిక వేళలో కాలక్షేపానికి విని, చదివి - ఇది అసలు ఒక బాధే కాదని తీసి పారేయడానికి మనకేం హక్కుంది?
నీదీ నాదీ వాళ్ళ అనుభవానికి ఆవల వున్న ప్రపంచమేమో !!
మనకి వారి వైపు నుంచి ఆలోచించడానికి కూడా అందనంతగా వారు దెబ్బ తినివున్నారేమో!!!
ఎందుకిలా ఇప్పుడు గొంతు విప్పారని ప్రశ్నించే బదులు ఇప్పటికయినా మనకి ఇంకో వైపు వాదన విని మన ఆలోచన పరిధి పెరిగే అవకాశం దొరికిందని అనుకుందామా?
ఎప్పటికి గుర్తిస్తామో కదా -
మనకి పూర్తిగా భిన్నమయిన ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు వున్నవాళ్ళు ఎప్పుడూ వున్నారు, ఇంకెప్పటికీ వుంటారు అని ...
ఎవరినీ మనకి శారీరక హాని కలిగించనంత వరకూ వారి వ్యక్తిత్వపు పరిధిలోకి వెళ్లి "ఎందుకిలా ఆలోచిస్తునారు - ఇదేంటిలా చేస్తున్నారు?" అని అడగకుండా ఉండడమే వారి వ్యక్తి స్వేఛ్చ ని గౌరవించడం అని ...
ఇంకో విషయం చెప్పనా - అందరమూ మన మన దేవుళ్ళే వేరయినప్పుడు మనమెలా ఒక్కటవుతాం అంటావు చూడు - అప్పుడు నాకెంత తమాషాగా అనిపిస్తుందో తెలుసా?
ఒక శతాబ్దకాలం పూర్తిగా జీవించలేని నువ్వూ నేనే రోజు రోజూ ఒక అమ్మగా (నాన్నగా), అక్కగా (అన్నగా), అత్తగా (మామగా), స్నేహితురాలిగా (స్నేహితుడిగా) - బంధాన్ని బట్టి, భావాన్ని బట్టి మనచుట్టూ వున్న మనకి కావాల్సిన, మనము కావాలనుకున్న వారందరికీ - వారి వారికి కావాల్సిన రూపాల్లో కనిపిస్తూ మనగలుగుతున్నప్పుడు...
ఎప్పుడో యుగాయుగాలనుంచి ఉన్నాడని అందరూ నమ్మే అందరి కన్నా అన్నిటికన్నా ఎంతో శక్తిమంతుడయిన దేవుడు చమత్కారుడై ప్రతి మతానికి వేరుగా, ఎవరి నమ్మకానికి తగ్గట్టు వారి దృష్టికి కావలసినట్టుగా కనిపించగల డేమో అని నమ్మడానికి కష్టమంటే ఎలా?
ఒకటి మాత్రం నిజం - మనం మెచ్చామని ఏ రాతా శిలాక్షరమయిపోదు, మనకి నచ్చలేదని ఇంకేదీ నీటిలో రాతై పోదు. మనం పట్టించుకున్నా, పట్టించుకోక పోయినా మంచి మాట ఎప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూ వుండకపోదు.
ఇప్పుడు చెప్పకతప్పదు నీకు నేనేమవుతానో.
మనిద్దరం - సమూహాలు పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఆచారాల వీలుకో, వ్యవహారాల సులువుకో, మనకు తెలియని, అంచనాకి అందని ఇంకే కారణానికో పెద్దలనేవాళ్ళు ఒక చోట చేరి మన మధ్య గీతలు గీసి తెగలుగా విడగొడితే - అప్పుడే ఆ యుగసంధి కాలంలో విడిపోయిన - ఆ మనిషి-కులపు, మానవత్వపు-మతపు ఆనవాళ్ళం. ఖండాలుగా వీడి, దేశాలుగా ఏర్పడినా నువ్వూ, నేనూ ఆ కులమే - ఆ మతమే.
ఇప్పటికయినా గుర్తు పట్టావా?
పరవాలేదులే - మనం-మనం అనే భావన నుంచి విడివడి నేను-నువ్వు అని ఇంత దూరం వచ్చేసిన తర్వాత కొంచెం సమయం పడుతుంది మళ్ళీ మనం మనంగా మనగలగడానికి .
అంత వరకూ వేచివుండగలను...
ఎన్నో నువ్వులు మరెన్నో నేనులు మనమయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ...
నేను

ఇట్లు ,
నేను
A very nice.... And very very well-written... Ode to perspective (from my perspective:-)) I agree that when all the accounts are in, we are all just people. No one is for one-up or one-down. The acceptance of this is the first step towards universal tolerance, and personal happiness. This is beautifully brought out in this piece.
రిప్లయితొలగించండిI also especially liked the portion about "different gods" for "different peoples" (yes, I realize that both the plurals are not valid:-)) when all these differences merge, all the pieces that flew apart during the Big Bang would come together and.....may be, the Universe will end! So, until then, let us celebrate diversity and live and give leave.
Glad that you liked it :) It didn't surprise me though.
తొలగించండిThe "different gods" is the thought shared by my kiddo-number-one, which surprised me when I heard it the first time when we were having one of our heart-to-heart convos during his summer vacation. I will credit it to him :)
���� A timeless message at the right time! A contemporary message that is true for any time and anyone. May we all judge less and accept more for a better society. Very well written Lalitha!
రిప్లయితొలగించండిThank You !!! - for your nice comment - at right time for the right blog post.
తొలగించండి
రిప్లయితొలగించండిమీ టపాలు బాగున్నాయండీ !
జిలేబి
నమస్తే! మెచ్చినందుకు ధన్యవాదాలు!!
తొలగించండిNice way to say that we need to be more tolerant 👌
రిప్లయితొలగించండిAnonymous garu: Thanks for liking my way of saying it!
తొలగించండిvery nice post I remember my post "అవే దృశ్యాలు,అవే భావాలు,అవే మాటలు ,అవే స్మృతులు - అయినా ఎంత నిత్య నూతనం!"
రిప్లయితొలగించండిThanks for sharing your blog post.
తొలగించండి