1, జూన్ 2016, బుధవారం

స్వర్ణోత్సవపు జంట



పెళ్ళికొడుకు 
మేనత్త కొడుకు 
అనాతవరపు అగ్గిబరాటా 

పెళ్లి కూతురు 
మేనమామ కూతురు 
మాటాడని మల్లెమొగ్గ

ఆనాటి పెళ్ళికి 
తల్లుల తండ్రుల ఆశీస్సులు - అక్షింతలు 
ఈనాటి ఉత్సవానికి 
కూతుళ్ళ-మనవళ్ళ కేరింతలు - సంబరాలు 

కలిసి పంచుకున్న కలలెన్నో 
కలిపి చెప్పుకున్న కథలెన్నో
పూయించిన పూలెన్నో 
ఫలించిన స్వప్నాలెన్నో
కడుపున పుట్టిన బంగరు తల్లులు ముగ్గురు 
అక్కున చేర్చి సాకిన కొడుకులు అందరూ

మీరు చెప్పిన మాటలే మంత్రాలు 
మీరు సాయమందించిన బ్రతుకులే మేళతాళాలు 
మీరు కలుపుకున్న బంధాలే పెళ్లి పందిరి 
మీరు నిలుపుకున్న స్నేహాలే బంధు మిత్రులు

అమ్మా ! నాన్నా! 
మీ ఈ యాభై ఏళ్ల పెళ్ళికి 
ఆకాశ విడిది లోనూ హడావిడి వుంటుంది 
మన నింగి-కెగసిన-కెరటం సాక్షిగా !!!
తలవండి - ఎదలో కొలువున్న దాన్నొక్కసారి 
చిరునవ్వు పెదవులతో 
చెమరించని కళ్ళతో ... 


శుభాభినందనలతో .... 
మీ 
లల్లి 
జూన్ -02-2016




14 కామెంట్‌లు:

  1. లలితా! చివరి పంక్తులుచదివి నాకే ఇలా ఐపోతే ......
    I would say, undoubtedly the best lines from you so far.....
    బంగారం లాంటి మనసులున్న ఆంటీకి, అంకుల్ కీ వివాహ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది లేందే సందడే లేదు - తనువుతోనైనా, తలపులోనైనా. మొదటిది కుదరదు కదా - అందుకే తలపుల్లో చూసేసుకుంటాను :) అమ్మా, నాన్నలకి నీ అభినందనలు చేరాయి.

      తొలగించండి
  2. Nice one mavya gari ki attaiah gari ki wish them a happy wedding anniversary

    రిప్లయితొలగించండి
  3. మంచోళ్ళు ని ముందు తీసుకెళ్ళి తన వద్ద దాచుకునే అలవాటు పై వాడికి.....ఈరోజు పైనున్న దేవుళ్ళ తో కింద ఉన్న తన దేవుళ్ళ కి ఆసిస్సులు అందిస్తుంది...... నిజ్జంగా కుట్టి అక్క బంగారం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగా చెప్పావు, హనుమాన్! నీ కమెంట్ కి థాంక్స్!

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. థాంక్స్, లలితా! మీ శుభాకాంక్షలు అందజేశాను.

      తొలగించండి
  5. చక్కని అభివ్యక్తి.. మీ ఇంటిసంబరానికి శుభాభినందనలండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ! మా అమ్మా, నాన్నలకి మీ అభినందనలు తెలియజేస్తాను - వాళ్ళకి మీరు గుర్తే :)

      తొలగించండి
  6. ఓహ్.. చాలా బాగా చెప్పారండీ.. కాస్త ఆలశ్యంగా నా శుభాభినందనలు కూడా అందజేయండి మీ అమ్మ గారికి నాన్నగారికి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేణూశ్రీకాంత్ గారూ - తప్పకుండానండీ - ఈ సారి ఫోన్ చేసినప్పుడు మీ అభినందనలు అందజేస్తాను - మా అమ్మా, నాన్నలకి. మీ కమెంట్ కి చాలా చాలా థాంక్స్!!

      తొలగించండి
  7. Love never turns old....Time only turns Silver to Gold. Heartfelt Anniversary wishes to the golden couple.

    రిప్లయితొలగించండి