కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ
సెకండ్ ఇయర్ లో ఉండగానే మొదటిసారిగా శ్రీనన్న తీసుకెళ్తే బెంగళూరు చూశాను. తనకప్పుడు BHEL లో మొదటి ఉద్యోగం. విజయనగర్ లో సాగి (సాగి కృష్ణ ప్రసాద్), బాలగోపాల్ లతో కలిసి ఒక ఇంట్లో ఉండేవాడు.
బెంగళూరులో వున్న పదిరోజులూ - పగలు వాళ్లందరూ ఆఫీసుకి వెళ్లాక - R.K. లక్ష్మణ్ -You said it! సిరీస్, ఇంకా Jeffrey Archer నవలలు, Archies comics - ఇలా ఒకటని కాదు - అన్ని రకాల పుస్తకాలూ - వున్నవన్నీ మహా ఆనందంగా చదివింది చదవకుండా చదివేశాను.
మొదటిసారి అమ్మతో కాకుండా ఇల్లు దాటి వెళ్లడమేమో కొంచెం బెంగగానే ఉండేది. పైగా గుంటూరు కారానికి అలవాటు పడిన నాకు చప్పగా వుండే కర్నాటక వంటలు నచ్చేవి కావు. శ్రీనన్న, సాగి పోటీలు పడి నాకోసం పెసరపప్పుతో టొమాటో పప్పు డిన్నర్ కి, French-toast పొద్దున్నే breakfast కి చేసి పెట్టేవారు. దాదాపుగా రోజూ అదే menu. అప్పుడే మరీ వాళ్ల వంట తిని ఇంటిమీద, అమ్మమీద బెంగ పెట్టేసుకుంటున్నానని నన్ను ఆంధ్రా restaurants - అమరావతి, నాగార్జునకి తీసుకెళ్లేవాడు శ్రీనన్న.
శ్రీనన్నInd-Suzuki మీద తను,నేను - ఇంకో బైక్ మీద సాగి, ఇంకో ఫ్రెండ్ - నలుగురం వెళ్లి భరచుక్కి , గగనచుక్కి అనే జలపాతాలు చూసొచ్చాము. మొత్తానికి వున్న ఆ పదిరోజుల్లోనే బెంగళూరుకి తెగ నచ్చేసింది - వదిలి వెళ్తుంటే బెంగొచ్చేసింది.
ఏమాటకామాట చెప్పాలంటే - ఓ వారం రోజులు అలా తిరిగివచ్చాక మా అమ్మ వంట విలువ తెలిసి వచ్చింది.
పాపం- మా అమ్మని నాన్నతో కలిసి తెగ tease చేసేదాన్ని. మధాహ్నం నాన్న భోంచేసి మళ్లీ ఆఫీసుకి వెళ్లేలోగా ఒక అరగంట పడుకునేవారు. ఎప్పుడైనా సెలవుల్లో ఇంట్లో వున్నప్పుడు - ఆయన పక్కనే మంచం మీద కూర్చుని - నేను పుస్తకమో, ఈనాడు పేపరో చదువుతూ ఉండేదాన్ని.
ఒక అలాంటి రోజు - ఈనాడు పేపర్ పట్టుకుని - హెడ్ లైన్స్ చూస్తూ - అలవాటైన విషం - అని చదివి - దానికి కొనసాగింపుగా - మా అమ్మ వంట - అని నా స్వంత కవిత్వం చేర్చాను. వెంటనే నాన్న మొహం మీద ముసిముసినవ్వు - అప్పుడే ఆక్కడికి వచ్చిన అమ్మ రుసరుస - "ఓ రెండు రోజులు ఎక్కడికైనా నేను లేకుండా వెళ్తే తెలుస్తుంది" - అన్న మాటల్తో కలిపి.
అదిగో - ఆవిణ్ణి అలా ఏడిపించిన పాపం వూరికే పోతుందా - బెంగళూరు పెసరపప్పు-వారోత్సవాల్లో చెల్లయిపోయింది.
ఇంక డిగ్రీ సెకండ్ ఇయర్ లో రోజులు అయిపోయాయి - ఆడుతూ పాడుతూ - ఆదివారం విజయలక్ష్మి థియేటర్ లో పప్పి-కుట్టిలతో హిందీ సినిమాలు చూస్తూ.
ఇంకెంత - ఇంకొక్క ఏడాది - ACC లో .
మా కోటేశ్వరరావుగారి గురించి చెప్పకుండా నా డిగ్రీ రోజుల జ్ఞాపకాలు పూర్తయినట్టు అనిపించవు.
కోటేశ్వరరావు గారే ACC లో మాకు Ancilliary Math క్లాసెస్ తీసుకున్నా - అక్కడ ఆయన ఎంత బాగా చెప్పినా కూడా - ఎలెక్షన్ అనీ, స్ట్రైక్ అనీ కాలేజ్ సరిగ్గానే జరిగేది కాదు - అందుకే మేము తప్పక ట్యూషన్ చేరాల్సి వచ్చేది.
కోటేశ్వరరావు గారి దగ్గర విడవకుండా రోజూ మాథ్స్ ట్యూషన్ ఉండేది. మేము ఎలాగైనా ఆయన చేత ఒక్కరోజైనా సెలవు ఇప్పించుకోవాలని రకరకాలుగా ప్రయత్నించేవాళ్లం. మేము సెలవడిగిన ప్రతి స-కారణాన్నీ తిప్పి కొట్టడానికి KR గారి దగ్గర న-కార బాణాలుండేవి.
"సర్ - రేపు వర్షం పడుతుందని న్యూస్ లో చెప్పారండీ" అని ఎవరైనా అబ్బాయిలు అంటే "బట్ట తడుపు వానకి భయపడతారేంటయ్యా" అనే వారు.
"రేపు పండగండీ సెలవియ్యండి" అంటే - "అమ్మాయిల చేత ఇంట్లో పప్పు రుబ్బిస్తారు, అబ్బాయిల్నయితే - అది తే, ఇది తే - అని బజారుకి పంపిస్తారు. చక్కగా ట్యూషన్ కి వస్తే భోజనం టైంకి ఇంటికి పంపిస్తాను - హాయిగా ఇంటికెళ్లి పులిహార, పరవాణ్ణం తినొచ్చు" అని ఇంకో గంట ఎక్కువ లెక్కలు చేయించేవారు.
"ఆదివారం మంచి హిందీ సినిమా - షమ్మీ కపూర్ది ఉందండీ - సెలవిస్తే చూస్తాం" అంటే " ఆ చపాతీ మొహాలని ఏం చూస్తారు బాబూ !" అని మమ్మల్ని ట్యూషన్ లో కూర్చోబెట్టి - పక్కనే వున్న వాళ్ల ఇంట్లోంచి "ఆజా ఆజా మై హూఁ ప్యార్ తేరా - వల్లా వల్లా ఇన్ కార్ తేరా - ఆజా అహ్హహజా " అన్న పాట టీవీ లోంచి వినిపిస్తే - ఎవరో పిలిచినట్టు " ఆ వస్తున్నా" అని గబగబా ఇంట్లోకి వెళ్లి పాట చూసేసి ఓ ఐదు నిముషాల తర్వాత వచ్చేవారు.
ఆయన ట్యూషన్లో - మొదటి రోజు చేరినప్పుడు ఎక్కడ ఎవరు కూర్చుంటే ఏడాది అంతా అవే ప్లేసెస్ లో కూర్చునేవాళ్లం. నేను, అపర్ణ కూర్చునే ప్లేస్ స్పెషల్ - గోడకి ఆనుకుని కూర్చునే వీలు ఉండేది. ఇద్దరు మాథ్స్ మెయిన్ అమ్మాయిలు - మాతో పంతం పెట్టుకుని ఒకేరోజు అందరికన్నా ముందు వచ్చేసి మా గోడ-కుర్చీల్లో కూర్చునేశారు. నేనూ, అపర్ణ వాళ్లని అక్కడ చూసి మాట్లాడకుండా అందరికన్నా వెనక్కి వెళ్లి కూర్చున్నాము.
సర్ క్లాస్ చెప్పడానికి వచ్చి ఆయన కుర్చీలో కూర్చుంటూ మా ప్లేస్ లో కూర్చున్న అమ్మాయిల కేసి చూసి - వెంటనే మా ఇద్దరికోసం వెతుక్కున్నారు. వెనకగా వున్న మేము కనపడగానే - "ఏంటమ్మా ! ఏదో మార్పు కనిపిస్తోంది - బాగాలేదు - రేపట్నుంచీ ఎవరి ప్లేస్ కి వాళ్లు వెళ్లిపొండి" అన్నారు. అంతే - తర్వాత నుంచీ మేమెంత ఆలస్యంగా వెళ్లినా అక్కడ ఎవరూ కూర్చునేవారు కాదు.
డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఇంకో మంచి సర్ప్రైజ్ ఏంటంటే - నాకు NGPE (National Graduate Physics Exmination) certificate రావడం.
BRR గారు ఒకరోజు ఫిజిక్స్ క్లాస్ లో చెప్పారు - ఆసక్తి వున్నవాళ్లు హిందూ కాలేజ్ లో జరగబోయే NGPE పరీక్షకి పేర్లు ఇవ్వొచ్చని.
పేరు ఇవ్వడం, ఒక ఆదివారం వెళ్లి రాయడం, తర్వాత రాశానన్న సంగతి మర్చిపోవడం - అన్నీ మామూలుగానే జరిగిపోయాయి.
ఒకరోజు BRR గారు క్లాస్ మొదలుపెట్టబోతూ NGPE లో గుంటూర్లో టెస్ట్ రాసినవాళ్లలో కొంచెం బాగా రాసి Achievement Certificates వచ్చినవాళ్ల పేర్లు పిలుస్తాను - అందరూ చప్పట్లు కొట్టండి అన్నారు.
మొదటి పేరు "నాగరాజు" - సరే - ఊహించిన పేరే - బాగా చదువుతాడు.
రెండో పేరు - "శ్రీకాంత్" - అన్నట్టు గుర్తు. అది కూడా అనుకున్నదే.
ఇద్దరికీ గా...ట్టిగా జేజేలు చెప్పేశాం - చేతి తాళాల చప్పుళ్లతో.
సర్ మూడో పేరు చదవబోతున్నట్టుగా పేపర్ ఎత్తారో లేదో నేను చప్పట్లు కొట్టడంమొదలుపెట్టాను - ఒక పనయిపోతుంది కదా అన్నట్లు.
"లలితా త్రిపుర సుందరి " - అని వినిపించగానే అది నాపేరనేదే గమనించకుండా ఇంకా గట్టిగా కొట్టాను చప్పట్లు - ఒక రెండు సెకండ్ల తర్వాత అర్థమయ్యింది - అది నాకే అని. పర్లేదు - బాగానే ఫిజిక్స్ అర్థమయినట్లుంది నాకు - అనిపించింది - నాకు నాకే - నా చేతిలో సర్టిఫికెట్ చూసుకుని - మనసులోనే జయహో Resnick & Halliday! అనుకున్నాను.
అపర్ణతో కాలేజ్, ట్యూషన్ లకి పరుగులు - అవయిపోయాక - రెండో లైనులో అపర్ణ వాళ్లింటి సందు మొదట్లో నిల్చుని చిరుచీకటి పడి - ఈవెనింగ్ బ్యూటీ - (సాయంత్రం పూట అన్ని నక్షత్ర్రాలకన్నా ముందుగా వచ్చి కనిపించే ఒక నక్షత్రం అది - అదే మా ఈవెనింగ్ బ్యూటీ) - కనిపించేదాకా నించుని - కృష్ణశాస్త్రి కవితల గురించి - మల్లాది రామకృష్ణ శాస్త్రి పాటల గురించి - Wodehouse: Wooster-Jeeves గురించి - Jane Austen-Mr. Darcy, Elizabeth ల గురించి - రాజ్ కపూర్ సినిమాల గురించి - మా నవోదయ నోట్ బుక్స్ లో రాసుకున్న హిందీ-తెలుగు పాటల గురించి - రన్నులు చేయని గవాస్కర్-మట్టి రాసుకుంటేనే సిక్సర్ కొట్టే రవిశాస్త్రి గురించి - సంక్రాంతికి వేయబోయే ముగ్గుల గురించి - బాలకుటీర్ గోడమీంచి కనిపించే గోరింటాకు చెట్టు పువ్వుల గురించి - కిటికీలోంచి కనిపించే వెన్నెలని చూస్తూ అపర్ణ రూంలో మేమిద్దరం ఫైనల్స్ కి చేయబోయే కంబైన్డ్ స్టడీ గురించి - ఆరతి పెంచే చిలక కస్తూరి గురించి - అపర్ణ వాళ్లింట్లో ప్రతి బుధవారం మెడిటేషన్ కి కలిసే కన్నడ కుటుంబాలన్నీ కలిసి గీతాకేఫ్ రూఫ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కన్నడ కంఠీరవ-రాజ్ కుమార్ "బహద్దూర్ గండు" సినిమా గురించి - ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకున్నా - మధ్యలో మాటలు ఆగిన ఒకటి-రెండు సెకండ్ల గాప్ లో - "What else, అపర్ణే?" - అనడుగుతూ నేను - "అది కాదు లలితా - నిన్నేమయిందో తెలుసా ...." అంటూ ఇంకో కొత్త టాపిక్ లోకి వెళ్తూ అపర్ణ - ఆ కబుర్లలోనే - మా డిగ్రీ రోజులు - మా కబుర్లలో టాపిక్కుల్లా గబగబా దొర్లిపోయాయి.
ఆ కబుర్లతో పాటు - ఎక్కడ పట్టామో -ఇవిగో - ఈ హిందీ కవితలు - మాకు మేమే చెప్పుకుని - మాలో మేమే నవ్వుకున్నవి :)
ఈలోగా మరి అందరం విడిపోయే రోజులు వచ్చేస్తున్నాయి కదా - ఫేర్-వెల్ పార్టీ చేసుకుందామని పెద్ద ప్లానింగ్ - దానికి వోటింగ్ మొదలుపెట్టారు.
నేను, అపర్ణ, మాతో పాటు మిగిలిన అమ్మాయిలు - గీతాకేఫ్ అయితే రూఫ్ గార్డెన్ లో హాయిగా చందమామని చూస్తూ దోశ తింటే బావుంటుందని - అబ్బాయిలేమో - శంకర్ విలాస్ అయితే ఇడ్లీ, ఐస్-క్రీం, బాసుందీ - ఇలా ఏదయినా బావుంటుంది, గీతా కేఫ్ వద్దనీ. - మొత్తానికి ఒక చిన్న సైజు కోల్డ్ వార్ నడిచింది.
ఈలోగా మధ్యవర్తులు అవతరించారు - అందులో ఒకతను - ఒకరోజు అపర్ణ, నేను - కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్దామని మా రిక్షాకేసి వెళ్లబోతుంటే - మా దగ్గరికి వచ్చి - మమ్మల్నిద్దరినీ ఒప్పించాలంటే తాను మా పక్షంలో ఉన్నట్లు నమ్మకం కలిగిస్తే మేము మాట వింటామని అనుకున్నాడో - లేకపోతే ఏదో చెప్పాలని వచ్చి అపర్ణ పక్కన వున్న - అప్పటికే ఆంగ్ల-తిట్ల-రాక్షసిగా పేరు "మోసిన" నన్ను చూసి అసలేం చెప్పాలో మర్చిపోయాడో - మొత్తానికి - తొందర తొందరగా -"మీరు, నేను కొంచెం అర్థం చేసుకుని కన్విన్స్ అవుతామండీ - కానీ జెంట్స్ ఒప్పుకోవట్లేదు - ఈసారికి శంకర్ విలాస్ కే వెళ్తే బావుంటుంది - మీరేం అంటారు?" అన్నాడు.
మేమేం అంటాం ? బుద్ధిగా - "సరే - అలాగే కానీయండి" అని మా రెండు తలలూ ఊపి మరీ చెప్పి - రిక్షా ఎక్కి ఇంటి దగ్గర దిగేదాకా - ఆ అబ్బాయి అన్న "మీరు, నేను" vs. "జెంట్స్" ని తలచుకుని అపర్ణ-తెలుగులో పడీ-పడీ నవ్వుకుంటూనే వున్నాము.
మొత్తానికి శంకర్ విలాస్ లో మా ఫేర్వెల్ పార్టీ - మూడు కేకులు, ఆరు జోకులుగా - బానే జరిగింది.
మా నవ్వుల సందడిలో -ఆఖరి సంవత్సరం, ఆఖరి పార్టీ కదా - ఈ అమ్మాయి నవ్వుతోంది ఇవాళ్టికి ఏమీ అనదు - అని ధైర్యం చేసి వచ్చి - Bernoulli అడిగిన ఆటోగ్రాఫూ - నేనడక్కపోయినా తనివ్వబోతే దాన్ని వెనక్కి తిప్పి దానిమీదే All The Best To Bernoulli అని నేను రాసిచ్చిన ఒక తనదైన పాస్పోర్ట్ ఫొటోగ్రాఫూ - వోట్ ఆఫ్ థాంక్స్ కి శ్రీకాంత్ రాసుకొచ్చి చదివిన పేరాగ్రాఫూ - ఈ గ్ర్రాఫులన్నీ కాక ఫిజిక్స్ రికార్డులో నేను గీసే రకరకాల గ్రాఫులతో - నా ఫైనల్ ఇయర్ చదువోగ్రాఫు ఒక స్మూత్ సైన్-వేవ్ లా ACC-కాలంలో గీయబడింది.
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

मैं ने उसको देखा angle बदल-बदलकर
उसने मुझे मारा sandal बदल-बदलकर
मैं ने उससे बोला अबला समझकर
उसके पिता ने मुझे मारा तबला समझकर
घुंघरू की आवाज़ आयी
मैं समझा - वो आयी
सिन्धूर लेके मैं खड़ा
राखी लेके वो आयी
ఈలోగా మరి అందరం విడిపోయే రోజులు వచ్చేస్తున్నాయి కదా - ఫేర్-వెల్ పార్టీ చేసుకుందామని పెద్ద ప్లానింగ్ - దానికి వోటింగ్ మొదలుపెట్టారు.
నేను, అపర్ణ, మాతో పాటు మిగిలిన అమ్మాయిలు - గీతాకేఫ్ అయితే రూఫ్ గార్డెన్ లో హాయిగా చందమామని చూస్తూ దోశ తింటే బావుంటుందని - అబ్బాయిలేమో - శంకర్ విలాస్ అయితే ఇడ్లీ, ఐస్-క్రీం, బాసుందీ - ఇలా ఏదయినా బావుంటుంది, గీతా కేఫ్ వద్దనీ. - మొత్తానికి ఒక చిన్న సైజు కోల్డ్ వార్ నడిచింది.
ఈలోగా మధ్యవర్తులు అవతరించారు - అందులో ఒకతను - ఒకరోజు అపర్ణ, నేను - కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్దామని మా రిక్షాకేసి వెళ్లబోతుంటే - మా దగ్గరికి వచ్చి - మమ్మల్నిద్దరినీ ఒప్పించాలంటే తాను మా పక్షంలో ఉన్నట్లు నమ్మకం కలిగిస్తే మేము మాట వింటామని అనుకున్నాడో - లేకపోతే ఏదో చెప్పాలని వచ్చి అపర్ణ పక్కన వున్న - అప్పటికే ఆంగ్ల-తిట్ల-రాక్షసిగా పేరు "మోసిన" నన్ను చూసి అసలేం చెప్పాలో మర్చిపోయాడో - మొత్తానికి - తొందర తొందరగా -"మీరు, నేను కొంచెం అర్థం చేసుకుని కన్విన్స్ అవుతామండీ - కానీ జెంట్స్ ఒప్పుకోవట్లేదు - ఈసారికి శంకర్ విలాస్ కే వెళ్తే బావుంటుంది - మీరేం అంటారు?" అన్నాడు.
మేమేం అంటాం ? బుద్ధిగా - "సరే - అలాగే కానీయండి" అని మా రెండు తలలూ ఊపి మరీ చెప్పి - రిక్షా ఎక్కి ఇంటి దగ్గర దిగేదాకా - ఆ అబ్బాయి అన్న "మీరు, నేను" vs. "జెంట్స్" ని తలచుకుని అపర్ణ-తెలుగులో పడీ-పడీ నవ్వుకుంటూనే వున్నాము.
మొత్తానికి శంకర్ విలాస్ లో మా ఫేర్వెల్ పార్టీ - మూడు కేకులు, ఆరు జోకులుగా - బానే జరిగింది.
మా నవ్వుల సందడిలో -ఆఖరి సంవత్సరం, ఆఖరి పార్టీ కదా - ఈ అమ్మాయి నవ్వుతోంది ఇవాళ్టికి ఏమీ అనదు - అని ధైర్యం చేసి వచ్చి - Bernoulli అడిగిన ఆటోగ్రాఫూ - నేనడక్కపోయినా తనివ్వబోతే దాన్ని వెనక్కి తిప్పి దానిమీదే All The Best To Bernoulli అని నేను రాసిచ్చిన ఒక తనదైన పాస్పోర్ట్ ఫొటోగ్రాఫూ - వోట్ ఆఫ్ థాంక్స్ కి శ్రీకాంత్ రాసుకొచ్చి చదివిన పేరాగ్రాఫూ - ఈ గ్ర్రాఫులన్నీ కాక ఫిజిక్స్ రికార్డులో నేను గీసే రకరకాల గ్రాఫులతో - నా ఫైనల్ ఇయర్ చదువోగ్రాఫు ఒక స్మూత్ సైన్-వేవ్ లా ACC-కాలంలో గీయబడింది.
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
రిప్లయితొలగించండిఆయ్ ఆ తర్వాత ఏమయ్యిందండీ ?
జిలేబి
ఆ తర్వాత ఏమయిందో తెలియాలంటే ఓ నెలాగాలండి...ఆయ్!
తొలగించండిఅలవాటైన విషం - మా అమ్మ వంట
రిప్లయితొలగించండినేను చిన్నప్పుడు మా అమ్మ ఒకసారి వారం రోజులు ఊరికి వెళ్తే, రోజూ మా నాన్న తో కలిసి హోటల్ లో తినచ్చని సంబరపడ్డాను కానీ మూడు రోజుల్లో హోటల్ ఫుడ్ మొహం మొత్తేసి మిగతా నాలుగు రోజులు సరైన ఫుడ్ లేక అల్లాడాను.
Resnick & Halliday అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం గూగుల్ ను ఆశ్రయించాల్సి వచ్చింది ఈ పూర్ స్టూడెంట్ :)
క్లాసు పుస్తకాలు దాటి ఏనాడూ మీరన్నఆ కృష్ణ శాస్త్రి కవితలు, ఆ ఇంగ్లీషోళ్ళ పేర్లు కూడా ఎప్పుడూ వినలేదు.
ఎదో కృష్ణ, చిరంజీవి సినిమాల గురించిన దిక్కుమాలిన విషయాలు తప్ప అలాంటి మంచి డిస్కషన్స్ ఎప్పుడూ మా మధ్య మా ఫ్రెండ్స్ మధ్య జరగలేదు :( ఫీలింగ్ jealous
చాలా బాగా రాశారు. ఎప్పుడూ చెప్పే మాటే అయినా చెప్పక తప్పదు లలిత గారూ. అంత బాగా రాశారు మరి.
మీరు నిజంగా చాలా humble అండీ పవన్ గారు!
తొలగించండినేను రాసిన నాకిష్టమయిన జ్ఞాపకాలన్నిటినీ మీరు చాలా శ్రద్ధగా చదివి-రాసిన కమెంట్ చూసి చాలా చాలా సంతోషంగా అనిపించింది. Thanks a lot!
మొత్తానికి కేక పెట్టించారుగా!!బాగా ఏంజాయ్ చేసారు
రిప్లయితొలగించండిఅవును హనుమాన్! అప్పుడు enjoy చేశాను - అలాగే ఇప్పుడు కూడా enjoy చేస్తున్నాను :)
తొలగించండిమేడం, మీరు ఎంతో బాగా రాయగలరు కాబట్టి బాలమురళిగారికి మంచి నివాళి రాయమని అర్థించడం దురాశ కాదనుకుంటాను, మన్నిస్తారని ఆశిస్తున్నాను
రిప్లయితొలగించండినాగేశ్వరరావు గారు,
తొలగించండిమీ అభిమానపూరిత వ్యాఖ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు.
"మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గొప్ప సంగీత విద్వాంసులు" అన్న ఒక్క generic statement తప్ప ఆయన గురించి నాకేమీ తెలియదండి. ఏడాదిలో ఒకసారో, రెండు సార్లో ఆయన పాడిన సినిమా పాటో, రామదాసు కీర్తనో, తిల్లానానో వింటాను - అంతే. వారి గురించి నేను నివాళి రాయడం అంటే సూర్యుణ్ణి మీకు దివిటీ వెలుగులో చూపించడానికి ప్రయత్నించినట్లు వుంటుంది. మీరు ఎంతో అభిమానంతో అడిగినా నేను రాయలేకపోతున్నందుకు ఏమీ అనుకోకండి - దయచేసి!
Excellent read Lalitha! It's amazing how you remember so many details of your college days😀
రిప్లయితొలగించండిLife is a once-in-a-life-time experience - it is meant to be cherished & relished - As Said by Me :)
తొలగించండిThanks for your nice words!
Hi lalli మీ Bangalore trip కబుర్లు super
రిప్లయితొలగించండిThanks, Syamala - for taking time to read my blog & comment.
తొలగించండినేను ఇప్పుడే చదివినాను 4days busy my sister's son marriage
రిప్లయితొలగించండి'అమ్మ వంటకు వంకలు పెట్టడం'..... నన్ను నేను చూసుకున్నాను ఇక్కడ.
రిప్లయితొలగించండిమీ హిందీ కవిత.... 'లా జవాబ్' అంతే!
ఇంచుమించు మీ టాపిక్స్ లాంటివే మా ఫ్రెండ్స్ మధ్య కూడా ఉండేవి. వాటితో పాటు Linda Goodman sun signs గురించి ఎక్కువగా మాటలుండేవి. ఇంకా మాకిష్టమైన మరో వ్యాపకం గ్రాంధికం లో మాట్లడ్డం లేదా 'కన్యాశుల్కం' లోని వ్యావహారిక భాషలో మాట్లాడడం. కాలేజ్ రోజుల్లోకి తీసుకెళ్ళిపోయావు లలితా!
పాపం ఆ మధ్యవర్తి కంగారు తో కూడిన, భయం నిండిన, తికమక మాటలు.... hilarious!
Linda Goodman's Sun Signs - బాగా గుర్తు చేశావు - డిగ్రీ లో అంత ఆసక్తి వుండేది కాదు ఆ పుస్తకం మీద. తర్వాత మాత్రం అది నిత్యపఠనమయ్యింది - ఆ విశేషాలూ వస్తాయి - Stay tuned!
తొలగించండి