ఏమీ తోచట్లేదు - తోచీ తోచనమ్మ - తనకి తానే - తనతో తనే - చే(వే)సుకున్న భేటీ ఇది.
ఇదెలాంటిదంటే - చిన్నప్పుడు జ్వరం వచ్చిందని బడి మానేసిన రోజు - అందరూ బడికెళ్లిపోతే - తోచక ఒక్కదాన్నే రెండు పక్కలా నేనే అయి కేరమ్ బోర్డు ఆడుకున్నట్లు.
"హలో - నిన్నుఇంటర్వ్యూ చేయాలని వచ్చాను"
"అలాక్కానీయ్ మరి"
"నీ పేరేంటి?"
"అది తెలీకుండా నేనెవరినని ఇంటర్వ్యూ చేద్దామని?"
"పాయింటే - సరే అదొదిలేయ్ - ఇంతకీ నువ్వేం చేస్తుంటావు?"
"మూడు పూట్లా భోజనం"
"అది కాక - ఉద్యోగం లాంటిదేమన్నా ...?"
"ఆ ... లేకేం - కోటి విద్యల్లో ఒకటి"
"తర్వాత?"
"తర్వాతంటే?"
"అదే - భోజనమయ్యాక, ఉద్యోగం నుంచి విడుపు దొరికాక ?"
"నిద్దరోతా"
"మరి ఖాళీ సమయాల్లో ?"
"ఏ ఖాళీ? ఎలాంటి ఖాళీ?"
"అందులో రకాలున్నాయా?"
"మరుండవా?"
"ఒకట్రెండు రకాలేవో చెప్పు- మచ్చుకి... "
"తిన్నాక కంచం ఖాళీ - లేచాక మంచం ఖాళీ "
"అబ్బే అది కాదు - నీ పనంతా అయ్యాక వుండే ఖాళీగా వుండే సమయంలో ఏం చేస్తావు ?"
"ఏమయినా చేస్తే అది ఖాళీ ఎలా అవుతుంది?"
"అది కాదు బాబోయ్ - హాబీలు గట్రా ఏమన్నా ఉన్నాయా అని"
"నాకసలే బో.... ల్డన్ని హాబీలున్నాయి కానీ ఈ గట్రా అంటే ఏంటి?"
"మన తెలుగు ఎట్సెట్రా అనుకో - ఇంక ఎదురడక్క గబగబా నీ హాబీలేంటో చెప్పు"
"సరే... విను .... నా హాబీలు ఇవీ :
"బావుంది - బావుంది - అన్నీ అర్థమయ్యాయి - ఒక్ఖ గూడార్థం తప్ప"
"అర్థమయితే అది గూఢమెందుకవుతుంది? అది ఎలా మొదలెట్టాలో తెలీకే కదా - ఈ ఉపోద్ఘాతమంతా!"
"ఇదీ అర్థం కాలేదు"
"మరేం లేదు ! ఒక నెలో , నెలన్నర క్రితమో - అపర్ణతో అన్నానా?! - cryptoquip ఎలా చేయాలో చెప్తానని - ఈరోజు దాకా పడనేలేదు - ఇవాళ ఎలాగైనా అది పూర్తి చేద్దామని"
"బడాయి కాకపోతే - ఆ ఫోన్ లో మాట్లాడేటప్పుడు చెప్పొచ్చుగా?"
"అదే నీతో లడాయి నాకు - పట్టుమని ఒక పావుగంట నిలకడగా మాట్లాడడానికి దొరకదు - ఇంక cryptoquip కి టైమెక్కడ ?"
"సరే - మొదలెట్టు - నేనూ వింటాను"
"కింద ఒక రెండు ఉదాహరణలు ఇస్తున్నాను చూడు - మరి "
"ఏమీ అర్థం కాలేదు - వీట్నేం చెయ్యాలి?"
"చూస్తూ కూర్చోవాలి - అవి నీకూ నాకూ కాదు. అసలీ cryptoquip ని ఎలా పరిష్కరించాలో నేను చూపించాక నీకు చేతైతే - అప్పుడు చెప్పాలి"
"సరే - ముందు చెప్పు మరి"
"కొంచెం ఇంగ్లీషు ఎక్కువ దొర్లుతుంది మరి"
"దొరలనీకు దొరలభాష
తెలుగులో బ్లాగూ - నువ్వు తెలుగులో బ్లాగూ
తెలుగులోనే రాసుకోవా
తెలుగుదీ బ్లాగు - మన తెలుగుదీ బ్లాగు -
ఇది దేనికి పేరడీ చెప్పుకో చూద్దాం!"
"నీ పేరడీలింక ఆపి ఒక అరగంట నా పద-గారడీ చూడు. అసలు cryptoquip అంటే ఏంటంటే ఒక పెద్ద వాక్యాన్ని ఒక రహస్య సంకేతంలా రాసి దానికొక అక్షరం మాత్రం సూచన (హింట్) గా ఇస్తారన్నమాట.
అంటే ఇలా :
JV VCEEI DHBVABPHB SGBTHI SGR OHBTHR JE G PJZJKGBI PHRJQGZ CEJK, VAZNO QACZR'TH QGZZHR SJP QABDOPGE NABPGE.
CLUE: E = N
ముందుగా అసలు ఏమేమి గమనించాలో చూద్దాం.
కింద బొమ్మలోని ఉదాహరణ వాక్యాన్ని వివరించడానికి వీలుగా ప్రతీ పదానికి కింద అంకెలు వేస్తున్నాను - చూడు - ఈ వాక్యంలో మొత్తం 17 పదాలు వున్నాయి.
ఇచ్చిన ఆధారాన్ని బట్టి ఆ సంకేత వాక్యంలో E వున్న చోటల్లా N రాసుకోవాలి.
తర్వాత జాగ్రత్తగా చూడు - 13వ పదంలో రెండక్షరాల apostrpophe contraction వుంది.
ఇంగ్లీషులో రెండక్షరాల apostrophe కంట్రాక్షన్లు రెండే వున్నాయి:
2. H = E
కింద బొమ్మలో అదే రాసుకున్నాం.
ఈ ఉదాహరణ వాక్యం ఒక complex sentence - ఎందుకంటే ఇది 11 వ పదం (CEJK ) తర్వాత ఒక కామా (,) తో విడగొట్టబడిన రెండు భాగాలున్న ఒక పెద్ద వాక్యం.
వాక్యంలో మొదటి పదంలో రెండు అక్షరాలున్నాయి (JV ).
అది AS కావొచ్చు - లేదా IF అయ్యుండొచ్చు.
నేను ప్రస్తుతానికి అది IF అనుకుంటున్నాను.
(గమనిక: Cryptoquip మొదటిసారిగా పరిష్కరిస్తున్నప్పుడు పెన్సిల్ వాడితే అనుకున్నది తప్పు అయితే దిద్దుకునే అవకాశం ఉంటుంది.)
దీనితో మనకి ఇంకో రెండు అక్షరాలు దొరికాయి - ఇంతకు ముందు తెలిసిన రెండక్షరాలతో కలిపి మొత్తం నాలుగు అక్షరాలు తెలిసిపోయాయి. .
3. J = I
4. V = F
ఇవి కూడా రాసేసుకున్నాం.
ఇంకిప్పుడేం దొరుకుతాయో చూద్దామా ?!
ఈ వాక్యంలో ఒక ఏకాక్షరి వుంది - 8 వ పదం - G.
అది I కాదు - ఎందుకంటే J = I కాబట్టి.
ఇంక వున్న ఇంకో ఏకాక్షరి A.
ఇంకో అక్షరం కూడా దొరికిపోయింది.
7. G = A
గబగబా G వున్న చోటల్లా A రాసేద్దాం మరి.
ఇప్పుడు 11వ పదం కేసి ఒకసారి చూడు - CEJK = UNI -
అది UNIT ఏమో అనిపించట్లేదూ ?
ఇంకెందుకాలస్యం - K వున్న చోటల్లా T పెట్టేద్దాం.
(తాగే టీ గుర్తుకొచ్చిందా - మరి వెళ్లి ఓ కప్పు తెచ్చుకో - నీకొకటీ - నాక్కూడా ఒకటీ - ఈ వాక్యంలో ఎన్ని కావాలంటే అన్నిటికీ ఒక్కోటీ - 9 కోటీ, 11 కోటీ ).
8. K = T
ఆగిపోకలాగ - ఆగే దేఖో !
13 వ మాట : QACZR ' TH = - - U - - ' - E
నాకెందుకో ఈ వాక్య-వాలకం చూస్తుంటే 13 వ మాట COULD ' VE లేక WOULD ' VE అనిపిస్తోంది.
మొదటిది సందేహా-క్షరం కాబట్టి OULD ' V రాసేయనా?
QACZR ' TH = - OULD ' VE
9. A = O
10. Z = L
11. R = D
12. T = V
ఇప్పుడు చూద్దాం - అమ్మో - ఒక్క పద-అక్కరకి ఎన్ని అక్కరాలు దొరికిపోయాయో!
1. E = N
2. H = E
3. J = I
4. V = F
10. Z = L
11. R = D
12. T = V
ఇంతకీ విషయమేంటంటే - HARVEY KORMAN అనే ఒక హాస్యనటుడు ఉండేవారట - ఆయన సైన్యంలో వైద్యబృందంలో పని చేస్తే ఆయన్ని CORPSMAN KORMAN అనేవారు కదా - అనే ఒక గూడార్థమిచ్చే వాక్యమిది.
అలాంటి చరిత్ర హింట్లు కూడా చాలా సహాయపడతాయి - కాకపోతే నాకు ముందు తెలీదనుకో - పూర్తిగా అన్ని అక్షరాలూ తెలిశాక కుతూహలంతో గూగిలిస్తే తెలిసిందది.
ఇంతకీ నచ్చిందా - cryptoquip?"
"నచ్చింది కానీ - అరగంట అని ఆరు-అరగంటలు కూర్చోపెట్టావు - ఇంతకీ నా పేరడీ పాట ఏంటో చెప్పలేదు నువ్వు"
"అబ్బా ! ముందు పైన ఇచ్చిన రెండు ఉదాహరణల చిక్కుముడి నువ్వు విప్పు - నీ పేరడీ గుట్టు రట్టు చేస్తాను"
"అంతేనా?"
"ఇప్పటికింతే - ఈ గజిబిజి (Puzzle) లో జిగిబిగి చూస్తూ గడిపేయ్ - అందాకా !"

కబుర్లు చెప్పుట - వింటే ఎవరికైనా - ఎవరూ లేకపోతే నాతో నేనే
పాటలు పాడుట - వినడానికి ఎవరున్నా - ఎవరూ లేకపోతే నాకై నేనే
సినిమాలు చూచుట - వద్దని war చేసే మా వారికి చూపెట్టుట
జంతికలు నవులుట - నవలలు చదువుట
నూజీళ్లు చప్పరించుట - పజిళ్లగళ్లు నింపుట
ముగ్గులు వేయుట - రగ్గులు నేయుట-చూచుట
ఫ్రెండ్షిప్పుచేయుట - వర్షిప్పు చేసిన చూచుట
పెడర్థాలని న-స్మరించుట - గూడార్థాలని పరిష్కరించుట
ఏదో చెయ్యాలనుకొనుట - ఆ ఏదో కాక ఇంకేదో చేయుట"
"అర్థమయితే అది గూఢమెందుకవుతుంది? అది ఎలా మొదలెట్టాలో తెలీకే కదా - ఈ ఉపోద్ఘాతమంతా!"
"ఇదీ అర్థం కాలేదు"
"మరేం లేదు ! ఒక నెలో , నెలన్నర క్రితమో - అపర్ణతో అన్నానా?! - cryptoquip ఎలా చేయాలో చెప్తానని - ఈరోజు దాకా పడనేలేదు - ఇవాళ ఎలాగైనా అది పూర్తి చేద్దామని"
"బడాయి కాకపోతే - ఆ ఫోన్ లో మాట్లాడేటప్పుడు చెప్పొచ్చుగా?"
"అదే నీతో లడాయి నాకు - పట్టుమని ఒక పావుగంట నిలకడగా మాట్లాడడానికి దొరకదు - ఇంక cryptoquip కి టైమెక్కడ ?"
"సరే - మొదలెట్టు - నేనూ వింటాను"
"కింద ఒక రెండు ఉదాహరణలు ఇస్తున్నాను చూడు - మరి "
(1)
(2)
"ఏమీ అర్థం కాలేదు - వీట్నేం చెయ్యాలి?"
"చూస్తూ కూర్చోవాలి - అవి నీకూ నాకూ కాదు. అసలీ cryptoquip ని ఎలా పరిష్కరించాలో నేను చూపించాక నీకు చేతైతే - అప్పుడు చెప్పాలి"
"సరే - ముందు చెప్పు మరి"
"కొంచెం ఇంగ్లీషు ఎక్కువ దొర్లుతుంది మరి"
"దొరలనీకు దొరలభాష
తెలుగులో బ్లాగూ - నువ్వు తెలుగులో బ్లాగూ
తెలుగులోనే రాసుకోవా
తెలుగుదీ బ్లాగు - మన తెలుగుదీ బ్లాగు -
ఇది దేనికి పేరడీ చెప్పుకో చూద్దాం!"
"నీ పేరడీలింక ఆపి ఒక అరగంట నా పద-గారడీ చూడు. అసలు cryptoquip అంటే ఏంటంటే ఒక పెద్ద వాక్యాన్ని ఒక రహస్య సంకేతంలా రాసి దానికొక అక్షరం మాత్రం సూచన (హింట్) గా ఇస్తారన్నమాట.
అంటే ఇలా :
JV VCEEI DHBVABPHB SGBTHI SGR OHBTHR JE G PJZJKGBI PHRJQGZ CEJK, VAZNO QACZR'TH QGZZHR SJP QABDOPGE NABPGE.
CLUE: E = N
ముందుగా అసలు ఏమేమి గమనించాలో చూద్దాం.
- అది ఎలాంటి వాక్యమో చూడాలి - simple vs. complex, statement vs. question etc.,
- విరామ చిహ్నాలు (punctuation marks) ఎక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చూడాలి.
- Apostrophe వుందా, వుంటే ఎక్కడ వుంది?
- ఏకాక్షర పదాలు వున్నాయా (అంటే I , A లాంటివి)?
- తరచుగా వాడే రెండక్షరాల పదాలు వున్నాయా? - వుంటే అవి వీటిలో ఒకటి అయి వుండొచ్చు - AN, AS, BE, DO, GO, HE, IN, IS, ME, NO, OF, ON, SO, TO.
- తరచుగా వాడే మూడక్షరాల పదాలు వున్నాయా? - వుంటే అవి వీటిలో ఒకటి అయి వుండొచ్చు-THE, AND etc.,
- ఒకే అక్షరం రెండు సార్లు వచ్చే పదాలు వున్నాయా?
- ఒక మాట: ఈ Cryptoquip ఉదాహరణలన్నీ American English మీద ఆధారపడి వున్నాయి. అందుకని ఇలాంటి తేడాలు గుర్తుంచుకోవాలి: colour = color ; neighbour = neighbor ; speciality = specialty etc.,
కింద బొమ్మలోని ఉదాహరణ వాక్యాన్ని వివరించడానికి వీలుగా ప్రతీ పదానికి కింద అంకెలు వేస్తున్నాను - చూడు - ఈ వాక్యంలో మొత్తం 17 పదాలు వున్నాయి.
ఇచ్చిన ఆధారాన్ని బట్టి ఆ సంకేత వాక్యంలో E వున్న చోటల్లా N రాసుకోవాలి.
తర్వాత జాగ్రత్తగా చూడు - 13వ పదంలో రెండక్షరాల apostrpophe contraction వుంది.
ఇంగ్లీషులో రెండక్షరాల apostrophe కంట్రాక్షన్లు రెండే వున్నాయి:
అందులో ఒకటి - ' RE = ARE
ఇంకొకటి - ' VE = HAVE
ఈ రూలు ప్రకారం : QACZR' TH లో H తప్పనిసరిగా E అయివుండాలి.
ఇప్పుడు మన దగ్గర రెండు క్లూలు వున్నాయి:
1. E = N 2. H = E
ఈ ఉదాహరణ వాక్యం ఒక complex sentence - ఎందుకంటే ఇది 11 వ పదం (CEJK ) తర్వాత ఒక కామా (,) తో విడగొట్టబడిన రెండు భాగాలున్న ఒక పెద్ద వాక్యం.
వాక్యంలో మొదటి పదంలో రెండు అక్షరాలున్నాయి (JV ).
అది AS కావొచ్చు - లేదా IF అయ్యుండొచ్చు.
నేను ప్రస్తుతానికి అది IF అనుకుంటున్నాను.
(గమనిక: Cryptoquip మొదటిసారిగా పరిష్కరిస్తున్నప్పుడు పెన్సిల్ వాడితే అనుకున్నది తప్పు అయితే దిద్దుకునే అవకాశం ఉంటుంది.)
దీనితో మనకి ఇంకో రెండు అక్షరాలు దొరికాయి - ఇంతకు ముందు తెలిసిన రెండక్షరాలతో కలిపి మొత్తం నాలుగు అక్షరాలు తెలిసిపోయాయి. .
3. J = I
4. V = F
ఇవి కూడా రాసేసుకున్నాం.
ఇప్పుడు వాక్యంలోని రెండో పదం చూస్తే : VCEEI = F -NN - (V =F ; E = N అని మనకు తెలుసు కాబట్టి ).
తెలిసిన అక్షరాలని బట్టి మిగిలిన ఖాళీలని FUNNY అని పూరించడం తేలిక - కదా!?
దీంతో ఇంకో రెండక్షరాలు వచ్చేశాయ్.
5. C = U
6. I = Y
అవీ రాసేసుకుందాం - మరి కింది బొమ్మలోలా !
ఇంకిప్పుడేం దొరుకుతాయో చూద్దామా ?!
ఈ వాక్యంలో ఒక ఏకాక్షరి వుంది - 8 వ పదం - G.
అది I కాదు - ఎందుకంటే J = I కాబట్టి.
ఇంక వున్న ఇంకో ఏకాక్షరి A.
ఇంకో అక్షరం కూడా దొరికిపోయింది.
7. G = A
గబగబా G వున్న చోటల్లా A రాసేద్దాం మరి.
ఇప్పుడు 11వ పదం కేసి ఒకసారి చూడు - CEJK = UNI -
అది UNIT ఏమో అనిపించట్లేదూ ?
ఇంకెందుకాలస్యం - K వున్న చోటల్లా T పెట్టేద్దాం.
(తాగే టీ గుర్తుకొచ్చిందా - మరి వెళ్లి ఓ కప్పు తెచ్చుకో - నీకొకటీ - నాక్కూడా ఒకటీ - ఈ వాక్యంలో ఎన్ని కావాలంటే అన్నిటికీ ఒక్కోటీ - 9 కోటీ, 11 కోటీ ).
8. K = T
ఆగిపోకలాగ - ఆగే దేఖో !
13 వ మాట : QACZR ' TH = - - U - - ' - E
నాకెందుకో ఈ వాక్య-వాలకం చూస్తుంటే 13 వ మాట COULD ' VE లేక WOULD ' VE అనిపిస్తోంది.
మొదటిది సందేహా-క్షరం కాబట్టి OULD ' V రాసేయనా?
QACZR ' TH = - OULD ' VE
9. A = O
10. Z = L
11. R = D
12. T = V
ఇప్పుడు చూద్దాం - అమ్మో - ఒక్క పద-అక్కరకి ఎన్ని అక్కరాలు దొరికిపోయాయో!
1. E = N
2. H = E
3. J = I
4. V = F
5. C = U
6. I = Y
7. G = A
8. K = T
9. A = O10. Z = L
11. R = D
12. T = V
8 వ మాట జాగ్రత్తగా చూడు - MILITARY లా వుంది కదూ !
PJZJKGBI = - ILITA -Y
13. P = M
14. B = R
తీసికెళ్లి పెట్టేశా - కింది బొమ్మలో !
బావుంది కదూ - ఒక్కొక్క అక్షరం మనకలా చిక్కిపోతుంటే - చిక్కుముడి వీడుతుంటే !
అందుకే మరి - నాకీ cryptoquip అంటే ఎప్పటికీ చిక్కిపోని ఇష్టం.
ఇప్పుడు 10 వ మాట (PHRJQGZ = MEDI -AL) - MEDICAL కాక ఇంకేమవుతుందంట?
15. Q = C - అనేసుకున్నాం.
4 వ మాట SGBTHI = -ARVEY - సర్వే కి కుదరదు కదా - అందుకని ఓ ఇంగ్లీషాయన పేరు HARVEY అయివుండనోపునేమో ?
16. S = H - హార్వేగారి పుణ్యమా అని !
3 వ మాట పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది నీకు?
అది పెద్ద PERFORMER అనిపించట్లేదూ?
అయితే ఇంకేం - రాసుకో మరి!
17. D = P - కింది బొమ్మలో.
మిలిటరీ అంటున్నారు - 16 వ మాట CORPSMAN అవునేమో కదా !
అవును మరి - అప్పుడు O ఏమంటుంది మరి? - "ఓయస్" అంటానంటుంది.
18. O = S
ఇంక 12 వ మాట FOLKS అనకపోతే మన cryptoquip ఫోక్స్ ఒప్పుకోరు - చూసుకో మరి!
ఎన్ను ఎన్నిక ఇంక K-నే!
19. N = K
హమ్మయ్య!
JV VCEEI DHBVABPHB SGBTHI SGR OHBTHR JE G PJZJKGBI PHRJQGZ CEJK, VAZNO QACZR 'TH QGZZHR SJP QABDOPGE NABPGE.

IF FUNNY PERFORMER HARVEY HAD SERVED IN A MILITARY MEDICAL UNIT, FOLKS COULD 'VE CALLED HIM CORPSMAN KORMAN.
1. E = N
2. H = E
3. J = I
4. V = F
10. Z = L
11. R = D
12. T = V
2. H = E
3. J = I
4. V = F
5. C = U
6. I = Y
7. G = A
8. K = T
9. A = O10. Z = L
11. R = D
12. T = V
13. P = M
14. B = R
15. Q = C
16. S = H
17. D = P
18. O = S
19. N = K
ఇంతకీ విషయమేంటంటే - HARVEY KORMAN అనే ఒక హాస్యనటుడు ఉండేవారట - ఆయన సైన్యంలో వైద్యబృందంలో పని చేస్తే ఆయన్ని CORPSMAN KORMAN అనేవారు కదా - అనే ఒక గూడార్థమిచ్చే వాక్యమిది.
అలాంటి చరిత్ర హింట్లు కూడా చాలా సహాయపడతాయి - కాకపోతే నాకు ముందు తెలీదనుకో - పూర్తిగా అన్ని అక్షరాలూ తెలిశాక కుతూహలంతో గూగిలిస్తే తెలిసిందది.
ఇంతకీ నచ్చిందా - cryptoquip?"
"నచ్చింది కానీ - అరగంట అని ఆరు-అరగంటలు కూర్చోపెట్టావు - ఇంతకీ నా పేరడీ పాట ఏంటో చెప్పలేదు నువ్వు"
"అబ్బా ! ముందు పైన ఇచ్చిన రెండు ఉదాహరణల చిక్కుముడి నువ్వు విప్పు - నీ పేరడీ గుట్టు రట్టు చేస్తాను"
"అంతేనా?"
"ఇప్పటికింతే - ఈ గజిబిజి (Puzzle) లో జిగిబిగి చూస్తూ గడిపేయ్ - అందాకా !"
చిన్నప్పుడు మాటాడుకున్న క భాష కదూ :)
రిప్లయితొలగించండికాదు :)
తొలగించండిఅసలు take off ఎక్కడ, ఎలా మొదలు పెట్టి, ఎలా టాపిక్ లోకి కనెక్ట్ చేశావు కదా!
రిప్లయితొలగించండినిజంగానే నిన్నెవరైనా ఇంటర్వ్యూ చేస్తే నీ జవాబులు ఇలానే ఉంటాయి.
నీ హాబీల గురించి నీవు రాసుకున్న నాలుగు ముక్కలూ భలే ఉన్నాయి.
జీళ్ళు ఇంకా నచ్చాయి. :-)
ఎంత variety and versatility ఉంటుందో నీ బ్లాగు లో.
You got me hooked onto Cryptoquip.
P.S: ఈ స్పెల్లింగ్స్ అమెరికన్ పద్ధతి లో ఉన్నట్లున్నాయి. కదా!
అది తుంటర్వ్యూ లా లేదూ? ;) నీకు Cryptoquip నచ్చినందుకు భలే ఆనందంగా వుంది - మనిద్దరికీ మాట్లాడుకోవడానికి ఇంకో common topic దొరికినందుకు.
తొలగించండిI have added the following note:
"ఒక మాట: ఈ Cryptoquip ఉదాహరణలన్నీ American English మీద ఆధారపడి వున్నాయి. అందుకని ఇలాంటి తేడాలు గుర్తుంచుకోవాలి: colour = color ; neighbour = neighbor ; speciality = specialty etc., "
Firstly, a very enjoyable post especially considering that the content is of a "technical" nature. Making tech documentation reader friendly ani nee skill sets lo raasuko vachchu :-) Secondly, thanks for the 'dedicated' blog post. Thirdly, can't wait v to get on to those two crypto quips!
రిప్లయితొలగించండిAparne! Firstly, my tech docs are much sought after - and your comment reinforces the same. Thank you!
తొలగించండిSecondly, thanks for making me write this post - if not for our busy schedules, I would have explained this over the phone. Thirdly, I am waiting for your answers for the 2 examples. Try to complete your homework - it should be very easy for you.
Btw, adi e song parody no naaku telisipoyindi ga! Paata unna Movie peru = chinnappati aata. Idi correctaa?!!
రిప్లయితొలగించండినువ్వు నా నేస్తమనిపించావు - సమాధానం cryptic గా ఇచ్చి - అవును - అది - నాలుగు స్తంభాలాట సినిమాలో "దొరలనీకు కనుల నీరు - దొరలదీ లోకం" పాట.
తొలగించండిమీ పోస్ట్, ఇంటర్వ్యూ బాగుందండీ లలిత గారు, కాకపొతే పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక వారం పట్టుద్దేమో నాకు. బుర్రను అంత ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు :)
రిప్లయితొలగించండిపవన్ గారు - ఎంత మాట - పోస్ట్ చదివి మెచ్చుకున్నారు - అంతే చాలు! చాలా థాంక్స్!
తొలగించండిఅబ్బో ఇది చాలా కష్టం. మీకు బోల్డు జేజేలు
రిప్లయితొలగించండిమాలతి గారు! మీరు ఓపిగ్గా చదివినందుకు, బోల్డన్ని జేజేలు చెప్పినందుకు మీకు మరిన్ని-జేజేలు!
తొలగించండినిజ్జంగా గజిబిజే ఎవడన్నా నీ ఇంటర్వూ కోసం వస్తే వాడి పరిస్తితి ఏంటి అక్కో !!!!!
రిప్లయితొలగించండినువ్వు మరీను, హనుమాన్ -నన్నెవరు ఇంటర్వ్యూ చెయ్యాలీ? :)
తొలగించండిSuper Lalitha.. Never knew about this. Some exercise to my mind on a holiday. As always..please keep posting such interesting things and at the same time do not loose 'KAVI HRUDAYAM'. Again thanks a lot for introducing Cryptoquip to me .
రిప్లయితొలగించండిGiriraj: I'm glad that you're interested in the Cryptoquip. It's really fun to solve. Please try the examples from this post. Thanks for your comment.
తొలగించండిఒక కొత్త సబ్జెక్ట్ తెలుసుకున్నాను. థాంక్స్
రిప్లయితొలగించండినాకిష్టమైన సబ్జెక్ట్ ఇది - చదివినందుకు మీకు థాంక్స్!
తొలగించండిచాలా బాగా explain చేశారు 'అ ఆ' లు తెలియని నాలాంటి వాళ్లకి కూడా అర్ధమయ్యేలా... ఇన్నాళ్ళకి ధైర్యం చేసాను కనీసం open చెయ్యడానికి కూడా !
రిప్లయితొలగించండిముందు ఒకటి ప్రయత్నించి చూస్తాను ఓ వారం పది రోజులు పట్టినా సరే:)
The humorous way you take all your readers to the main subject from there to the destination is really enjoyable. Your blog is just mind boggling.
Thank you for the help లలితగారూ _/\_