బ్లాగ్ తర్వాత నాకున్న ఒకే ఒక social-netoworking opportunity - Whatsapp.
పేరుకి ఒక నాలుగు Whatsapp సమూహాల్లో - నూకల సతీష్ నడిపే మన ఊరు అనాతవరం అనే గ్రూపు, అమ్ములు-లలిత నడిపే వడ్లమానీస్ గ్రూపు, నేనే సృష్టించిన శివకోడు కజిన్స్, టంగుటూర్ ఫ్రెండ్స్ అనే రెండు గ్రూపులు - మొదలైన వాటిల్లో వున్నా- ఆ గ్రూపుల సంభాషణల్లో నేను కలిపించుకుని మాట్లాడడానికి, ఏమైనా పంచుకోవడానికి అంత పెద్ద విశేషాలు నా దగ్గర రోజూ ఏమీ ఉండవు.
అదీ కాక రోజూ అక్కడ పోస్ట్ చేసే మెసేజెస్ చూడడానికి కూడా కుదరదు.
అలా అని ఆ గ్రూపుల్లోంచి బయటికి రావాలని కూడా అనిపించదు .
నా మటుక్కి నాకు - ఏధైనా పెళ్ళో, పార్టీయో జరుగుతూ వుంటే ఓ పక్కన కూర్చుని - అక్కడ హడావిడిగా అటూ ఇటూ తిరిగే వాళ్లని చూస్తూ - వాళ్ల మాటలని వినడం ఎంత బావుంటుందో - వారానికి ఒక్కసారైనా - కుదిరినప్పుడు Whatsapp చూడడమూ అంతే బావుంటుంది.
ఫోటోలు, వీడియోలు, తమాషా కబుర్లు, జోకులు, వూళ్లో జరిగే పండగల విశేషాలు - ఇలా ఎంతో కాలక్షేపం నాకు - వారానికి ఒక అరగంటో-గంటో.
ప్రతీ శుక్రవారం పొద్దున్నేWhatsapp సంభాషణలు చూస్తాను - ఒక పది నిముషాలు.
ఇవాళా అలాగే చూస్తున్న నాకు - మా అనాతవరం గ్రూపులో - శారద, మా టంగుటూర్ ఫ్రెండ్స్ గ్రూపులో చిన్ననాటి స్నేహితుడు - విక్రమ్ పోస్ట్ చేసిన ఒక చిన్న మెసేజ్ కనిపించింది.
ముందు అంతగా పట్టించుకోలేదు.
కానీ అసలే పాటలు అందులోనూ రేడియో లో వచ్చేవి - నాకెందుకో ఎప్పుడూ తర్వాత ఏం పాట వస్తుందో తెలియకుండా రేడియో లో వినే వివిధభారతి - జనరంజని లాంటి కార్యక్రమాలంటే ఇష్టం - CDలూ, కేసెట్లకన్నా.
అందుకే - ఇదేదో రేడియో అని వుంది - అదేంటో చూద్దామని వెనక్కి వెళ్లి URL మీద click చేశాను.
అంతే ! నా ఫోన్ స్క్రీన్ మీద ఒక నీలపు తెర ---ఇలా....
అక్కడ చెప్పినట్టుగానే వేలితో press చేశాను - ముందుగా ఏడు కిటికీల క్యూపొల నుంచి చూస్తే కనిపించేలా పచ్చగా, నీలంగా, తెల్లగా - రంగురంగుల అందమైన భూమి ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షం - ఇలా ....
ఆ తర్వాత ఇలా ... ఏదో ఇంగ్లీష్ పాట మొదలయింది - Star 88.3 అనే FM స్టేషన్ నుంచి.
ఎడమ పక్కనున్న కిందగా వున్న ప్లస్సు, మైనస్సు (+, - ) గుర్తుల్లో మైనస్సు మీద వేలుని పెట్టి ఆ భూమిని కొంచెం zoom-out చేస్తూ, చేస్తూ - తిప్పుతూ మొత్తానికి ఇండియా లో హైదరాబాదు Teluguone Radio FM స్టేషన్ పట్టుకున్నాను.
ఒక మాట - ఆ కుడిపక్క కింద ఆకుపచ్చ రంగులో కనిపించే FM స్టేషన్ - active station. దానిని bookmark చేసుకుంటే : http://radio.garden/live/hyderabad/teluguone/ - అని direct URL సేవ్ చేసుకోవచ్చు.
అబ్బా - ఎన్ని రోజులకి బో... ల్డన్ని తెలుగు పాటలు, ఇం.... కా.... బో... ల్డన్ని తెలుగు మాటలు విన్నానో - అనుకోకుండా ఎవరో మల్లాది వారి టాక్-షోకి - వైరాగ్యం, వేదాంతం, విరక్తి - అనే విషయం మీద ఏదో సందేహం అడగడానికి కాల్ చేసిన ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారి గొంతు విన్నాను - ఇంకా బే-ఏరియా సత్యలత గారు నడిపే బృందావనం కార్యక్రమం విన్నాను.
నాకైతే చాలా నచ్చేసింది ఈ రేడియో గార్డెన్ - ఎందుకంటే -
ఈ మాటల పాటల తోట గురించి చెప్పిన శారద, విక్రమ్ లకి బోల్డన్ని Thank You లు !!!
ఈరోజుకి నాదైన ఒక చిన్న కబురు:
ఇవాళ - బుజ్జిజింక - పాపం - బాగా చలిగా వుందేమో - స్కూల్ నుంచి రావడమే ముక్కు పీల్చుకుంటూ, తలనొప్పని వచ్చాడు ఇంటికి.
రాగానే వెచ్చగా స్నానం చేసి సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు.
లేవగానే -ఇంకా తగ్గని వాడి తలనొప్పికి మందు వేసి, తలకి నూనె రాసి - ఏవో కబుర్లు చెప్తూ - గిన్నెలు డిష్-వాషర్ లో పెడుతూ - ఇల్లు-ఇల్లాలు సినిమాలోంచి - వినరా సూరమ్మ కూతురు మొగుడా - అని గట్టిగా పాడుకుంటూ - రాజబాబు వెర్షనూ, రమాప్రభ వెర్షనూ - రెండూ నేనే అయి - నాలో నేనే నవ్వుకుంటూ ఉంటే - వెనకాలే నించుని నాకేసే చూస్తున్న బుజ్జిజింక ఉన్నట్టుండి - అమ్మా! When you do something that is not that fun, you make it fun by making strange sounds - I wish I could do that అన్నాడు.
That statement made this mom's day!

"Radio Garden
Explore live radio by rotating the globe
http://radio.garden/live/warsaw/star883/
This is incredible - అంటూ.

- ప్రపంచంలో ఎన్ని దేశాల్లో, ఎన్ని భాషల్లో FM స్టేషన్లు వున్నాయో అన్నీ వినొచ్చు.
- ఏ కొత్త App installation అవసరం లేదు
- Browser - based
- కాసేపు గ్లోబు తిప్పుకుంటూ - ఆడుకుంటూ - వేరే వేరే భాషల్లో పాటలు-మాటలు వినచ్చు
- ముఖ్యంగా మన తెలుగు పాటల ట్యూన్లకి ఏ పర-భాషా పాట "ఇన్స్పిరేషనో" ఎంచక్కా తెలుసుకుని కొలంబస్సులా మురిసిపోవచ్చు.
ఈ మాటల పాటల తోట గురించి చెప్పిన శారద, విక్రమ్ లకి బోల్డన్ని Thank You లు !!!
ఈరోజుకి నాదైన ఒక చిన్న కబురు:
ఇవాళ - బుజ్జిజింక - పాపం - బాగా చలిగా వుందేమో - స్కూల్ నుంచి రావడమే ముక్కు పీల్చుకుంటూ, తలనొప్పని వచ్చాడు ఇంటికి.
రాగానే వెచ్చగా స్నానం చేసి సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు.
లేవగానే -ఇంకా తగ్గని వాడి తలనొప్పికి మందు వేసి, తలకి నూనె రాసి - ఏవో కబుర్లు చెప్తూ - గిన్నెలు డిష్-వాషర్ లో పెడుతూ - ఇల్లు-ఇల్లాలు సినిమాలోంచి - వినరా సూరమ్మ కూతురు మొగుడా - అని గట్టిగా పాడుకుంటూ - రాజబాబు వెర్షనూ, రమాప్రభ వెర్షనూ - రెండూ నేనే అయి - నాలో నేనే నవ్వుకుంటూ ఉంటే - వెనకాలే నించుని నాకేసే చూస్తున్న బుజ్జిజింక ఉన్నట్టుండి - అమ్మా! When you do something that is not that fun, you make it fun by making strange sounds - I wish I could do that అన్నాడు.
That statement made this mom's day!
Thank you for sharing my thought in your words, nenu radio ni chala miss avvutunna, mana pranayama lekunda anni vishyalu panache oka manchi .... sadhanamu/nestamu
రిప్లయితొలగించండిశారదా! నీకే నేను బోల్డన్ని థాంక్స్ చెప్పాలి - ఇంత మంచి రేడియో గురించి చెప్పినందుకు.
తొలగించండిరేడియో గార్డెన్ గురించి వివరo గా చెప్పినందుకు ధన్యవాదాలు అక్కా !!!!
రిప్లయితొలగించండినేను రాసిన వివరాలు చదివినందుకు థాంక్స్, హనుమాన్!
తొలగించండి'టేప్ రికార్డర్ లో కన్నా రేడియో లో తర్వాత ఏ పాట వస్తుందో తెలియకుండా వినడంలోనే మజా ఉంటుందని అందుకే రేడియో వినడానికే ఇష్టపడతానని' నువ్వు దాదాపు 22 సం॥ ల కింద నాతో అన్నమాట ఈ పోస్ట్ చదవగానే నాకు గుర్తుకు వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ రేడియో లో పాటల విషయంలో నీలో మార్పేం లేదన్నమాట. In fact, you have gone global with radio, literally and figuratively!! :-)
రిప్లయితొలగించండినాకు సంబంధించిన విషయాలు ఎంతో ఇష్టంగా తలచుకునే నీకు అసలు ఏమని చెప్పాలో తెలీట్లేదు - ప్రస్తుతానికి బోల్డన్ని థాంక్స్!
తొలగించండి