అప్పుడెప్పుడో మొట్టమొదటిసారిగా అంటూ "ట్రంపె"ట్ ఒకటే తక్కువగా దండోరా వేసేసిన దగ్గర్నుంచీ ఒకటే ఎన్నికల కబుర్లు ఇంట్లో.
కొన్ని సరదాలద్దినవి
కొన్ని బెంగ పూసినవి
కొన్ని ఆశలు కల్పించేవి
కొన్ని నిరాశే ఖాయమనేవి
కొన్ని వద్దురా బాబూ అనిపించినవి
కొన్ని తప్పించుకోలేవులే అని బెదిరించినవి
కొన్ని అమ్మ-నాన్నల ఆలోచనలవి
కొన్ని బుజ్జిజింకల దిగుళ్లవి
చిన్నప్పుడు క్రికెట్ చూసే రోజుల్లో ఇండియా ఆడే One day-matches చూసేదాన్ని కాదు - నేను చూస్తే గెలవరేమో అనే sentiment కన్నా - చూడకుండా వుంటే గెలిచినా, గెలవకపోయినా ఆ ప్రభావం నామీద ఎక్కువ వుండదు - అని.
అదే రూలు ప్రకారం 2016 మార్చ్ నెలలో ప్రైమరీస్ లో వోటు వేసి వచ్చిన తర్వాత చివరి ఫలితం వచ్చే దాకా టీవీ చూడలేదు.
అసలు ఎన్నికల్లో వోటు ఎవరికి వేశామో ఎవరికీ ఎందుకు చెప్పద్దంటారో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు - పెద్ద పెద్ద పేరున్నవాళ్లందరూ మహా-బహిరంగంగా తామెవరిని బలపరుస్తున్నామో వార్తాపత్రికలలో వాళ్లకున్న పేరుకి తగ్గట్టు ఎంతో పెద్ద పెద్ద అక్షరాలలో ప్రకటనలు ఇచ్చి మరీ చెప్తుండగా ఇంకా ఈ దాపరికాలేంటో?!
నేనైతే ప్రైమరీస్ లో బెర్నీ శాండర్స్ కి వోటేశాను - అందరికన్నా ఆయన చెప్పిన మాటల్లో నిజాయితీ, నిబద్ధత వినిపించి.
ఫలితం తెలిసిందే - డెమొక్రాట్స్ లో హిల్లరీ క్లింటన్ గెలిచింది - రిపబ్లికన్స్ లో డొనాల్డ్ ట్రంప్.
ఇంతకు ముందు ఒబామా పోటీ చేసిన రెండు సార్లు - టీవీలో ప్రసారమయిన ప్రతీ ప్రెసిడెన్షియల్ డిబేటు, టౌన్-హాలు - ఎంతో ఉత్సాహంగా బుజ్జిజింకల్లో పెద్దవాడైన అన్నతో సహా కూర్చుని చూసిన - నాకు, బదరికి - ఈసారి ఎందుకో అసలు టీవీ పెట్టాలనే అనిపించలేదు.
ఆఖరికి అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్ధులని అనుకరిస్తూ సరదా చేసే SaturdayNight Live (SNL) కార్యక్రమం కూడా చూడలేదు - ఒక్కసారి కూడా.
అక్టోబర్ 9వ తారీఖున సెయింట్ లూయిస్ - వాషింగ్టన్ యూనివర్సిటీ లో ట్రంప్-క్లింటన్ డిబేట్ ఉందని - అదికూడా టౌన్-హాల్ పద్ధతిలో అంటే ఓటర్లు పంపించే / వేసే ప్రశ్నలకి అభ్యర్థులు అక్కడికక్కడ చెప్పే సమాధానాల రూపంలో ఉంటుందని తెలిసి - గబగబా భోజనాలు ముగించి టీవీ ముందు చేరాము.
ఆరవ తరగతిలో వున్న బుజ్జిజింక - మా దగ్గరకి రాకుండా వంటింట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు.
డిబేట్ మొదలు అయింది.
ఏండర్సన్ కూపర్ పరిచయం చేసిన పాట్రిస్ అనే ఒకావిడ అక్కడవున్న ప్రేక్షకుల్లోంచి అడిగిన మొదటి ప్రశ్న - "దీనికి ముందు జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కి - టీవీ పేరెంటల్ గైడ్లైన్స్ ప్రకారం - MA (అంటే మెచ్యూర్ ఆడియెన్సెస్) రేటింగ్ ఇవ్వదగ్గదిగా వుంది. మీకు తెలుసు కదా ఉపాధ్యాయులు - ఈ డిబేట్లు చూడడం ఒక హోంవర్క్ ఎసైన్మెంట్ గా పిల్లలకు ఇస్తారని. మీ ప్రవర్తన విద్యార్థులకి ఒక సముచితమైన, అనుకూలమయిన నమూనా గా ఉందని మీరు భావిస్తున్నారా?" - అని.
దానికి మొదటగా టాస్ గెలిచిన క్లింటన్, తర్వాత ట్రంప్ - ఒకరి తర్వాత ఒకరు - అసలు ప్రశ్నకు పొంతన లేకుండా ఇచ్చిన సమాధానాలు వినగానే - మొదటి ఏడెనిమిది నిముషాల్లోనే టీవీ ఆపేశాము.
(ఈ పోస్ట్ చివర్లో ఆ డిబేట్ పూర్తి పాఠం URL వుంది - భవిషత్తులో సరదాగా వెనక్కి వచ్చి చదువుకోవడానికి నాకు నేను దాచుకున్న రిఫరెన్స్).
ఇంతలో కాలిఫోర్నియా లో వున్న అన్న నుంచి ఫోన్ - "అమ్మా-నాన్నగారూ! మీరు డిబేట్ చూస్తున్నారా? ఒకవేళ చూస్తుంటే తమ్ముడు అక్కడ లేకుండా జాగ్రత్త పడ్డారా?" - అంటూ.
అప్పటికే చూడడం ఆపేశామని తెలిశాక అన్న గొంతులో వచ్చిన రిలీఫ్ ఫోన్ లో స్పష్టంగా తెలిసింది - వాడి బాధంతా తమ్ముడు ఆ అనుచితమయిన-భాష వింటాడనే కాదు - సరదా కబుర్లలో గడవాల్సిన అమ్మా-నాన్నల ఆదివారం అనవసరంగా టీవీ ముందు గడపబడుతుందని.
అప్పటినుంచి ఎన్నికల గురించి అంత పట్టించుకోవడం మానేశాము.
ఒక్కో క్షణం వోటు వేయకపోతే ఏమాయె - అని కూడా అనిపించేది.
మళ్లీ - ఏమో - మన ఒక్క వోటే తేడా రావొచ్చేమో - అనీనూ అనిపించేది.
అంతలోనే - ఏ తేడా అయినా ఏముంది, దొందూ-దొందే అయినప్పుడు - అని కూడా అనిపించేది.
రోజులు ఇలా ఎన్నికల మీదఎలాంటి కలలూ లేకుండా గడిచిపోతున్నాయి.
నవంబర్ వచ్చింది.
8వ తారీఖు ఎన్నికల తేదీ.
మళ్లీ మా ఇంట్లో కొంచెం ఎన్ని-కలకలం.
ఒకరోజు బదరి నవ్వుతూ అన్నారు - "ఫ్రెండ్ ఒకతను అంటున్నాడు - 'బదరి గారు! బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అమెరికాకి ఒక పిచ్చివాడు రాజవుతాడని' - అదే నిజమైతే ట్రంపే వస్తాడేమో? ఇంతకీ - బుజ్జాయ్! బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేనాటికి ఆయనకి అమెరికా ఉందని తెలుసా?"
బదరికి మహా నమ్మకం - నేనొక వాకింగ్-గూగ్లీ నని (గూగ్లీ తాను నాకు చేసిన అనేక బారసాలోత్సవాల్లో ప్రసాదించిన ఒకానొక నామధేయం).
"ఆయన 16th సెంచురీ - అమెరికా పుట్టింది 15th - తెలిసే ఉండాలి - లేకపోతే పాశ్చాత్యదేశం అనుండొచ్చు - అమెరికా అనే అనక్కర్లేదు కదా!" - నా సమాధానం - మనసులో ఏదో తెలియని గుబులుతో - ఇవన్నీ కాలక్షేపం కబుర్లే అని తెలిసినా.
ఇంకోరోజు - ఇంటినుంచి ఫోన్ చేసిన అమ్మ గొంతులో ఏదో బెంగ - "ట్రంపొస్తే ఇండియన్స్ కి కష్టమట - మీకేమీ ఇబ్బంది ఉండదు కదా?!" అంటూ.
"అబ్బే - అలాంటిదేం లేదమ్మా - మేమూ - మా రోటీనూ మామూలే!" అంటూ నేను - అమ్మ బెంగ - నా ఉత్సాహ భంగమవకుండా జాగ్రత్త పడుతూ.
సరిగ్గా ఎన్నికలు ఇంకో రెండు రోజులనగా అన్నగాడి ఫోన్.
ఎప్పట్లాగే కుశల ప్రశ్నలు అయ్యాక - అన్న పూర్తిగా తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాడు - బహుశా తన పక్కనున్న వారికి అర్థం కాకూడదనేమో !?
" అమ్మా! నువ్వూ, నాన్నగారు వెళ్తున్నారు కదా వోటు వెయ్యడానికి?"
"ఏమో నాన్నా! అంత ఉత్సాహంగా లేదు - ఎవరైనా ఒకటే కదా అనిపిస్తోంది"
"అవుననుకో - వున్న రెండు చెడ్డల్లో తక్కువ చెడ్డని సెలెక్ట్ చేసుకోవడం మంచిది కదా ?!"
"సరే - నాన్నా - మన చేతుల్లో లేనిది - నేనూ ఇంత ఆలోచించక్కర్లేదేమో - నేనూ నాన్నగారు వెళ్తాములే - నాన్నగారితో కూడా చెప్తాను నువ్వన్నది"
"Oh! Well ! అమ్మా - as you say it's not something we can control - I too don't want to waste time thinking about what's going to happen."
"అవును నాన్నమ్మా! జాగ్రత్త్త - మంచిగా తిను, rest well - అప్పుడు మంచిగా చదువుకో and also have fun!"
"అలాగే అమ్మా - bye!"
నవంబర్ 8 వచ్చింది - చిరజల్లు కురుస్తోంది.
ఆఫీస్ లంచ్ టైంలో బదరి, నేను సెల్విడ్జ్ మిడిల్ స్కూల్ కి వెళ్లి మా వోట్లు వేసేసి వచ్చాము - అసలు వోటు అన్నకి మాటిచ్చినట్టు క్లింటన్ కే వేసినా - మిగిలిన వోట్లన్నీ నేనైతే నాకు నచ్చిన, సుపరిచితమయిన పేర్లకి వేసేసి వచ్చాను - పార్టీతో సంబంధం లేకుండా.
బయటికి వచ్చాక బదరి అన్నారు - "ఇది అమెరికా చరిత్రలోనే ఒక frustrating-election" అని అందరూ అనుకుంటున్నారని.
ఎలాంటిదయితే ఏంటి?! - అయిపోయింది.
మళ్లీ నా క్రికెట్-మ్యాచ్ రూలు ప్రకారం రాష్ట్రాల ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నా నేను టీవీ చూడట్లేదు - వినట్లేదు.
బదరి మాత్రం చూస్తున్నారు.
ఆ రోజు రాత్రి పూర్తిగా లెక్కింపు అవకుండానే తెలిసిపోయింది ట్రంపే గెలుస్తున్నాడని.
పూర్తిగా చూడకుండానే పడుకుండిపోయాము.
నవంబర్ 9 - పొద్దున్నే ఐదున్నరకి బుజ్జిజింక స్కూల్ కోసం రోజూలాగే లేచాను - వాడినీ లేపాను.
స్నానం చేసి తయారయి కిందకి వచ్చిన బుజ్జిజింకకి "నాన్నగాడు! Trump has won" అని చెప్పీ చెప్పగానే వాడు నా దగ్గరికి వచ్చి రెండు చేతులతో నన్ను పట్టుకుని "అమ్మా! మనం ఇండియా వెళ్లిపోదామా?" అనడిగాడు.
"అదేం నాన్నా? ఎందుకలా ?"
"అన్న సెడ్ ట్రంప్ వుడ్ కిల్ అస్"
నాకు నవ్వొచ్చింది - వాడెందుకలా అన్నాడో తలుచుకుని.
ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడినా అన్న తెలుగులోనే మాట్లాడేవాడు - తమ్ముడికి అర్థం కాకూడదని.
ఒకసారలాంటి సందర్భంలో "అమ్మా! ట్రంప్ వస్తే చచ్చామే" అని అన్న అనగా విన్న బుజ్జిజింక దాన్ని literal గా తీసుకుని ఇప్పుడిలా అంటున్నాడని అర్థం అయ్యింది నాకు.
వెంటనే "అబ్బే - లేదు నాన్నా ! అన్న వూరికే అలా చెప్పాడు - మనమో పని చేద్దాం - మనం ట్రంప్ గురించి మంచిగా ఆలోచించామనుకో - ఆ positive vibrations వల్ల అతను మంచిగా ఆలోచిస్తాడేమో - అప్పుడు అంత చెడ్డగా ప్రవర్తించడేమో కదా - ప్రయత్నిద్దామా - ఇది నాకు చాలా సార్లు వర్క్ అయింది ?" అన్నాను - బుజ్జిజింక ట్రంప్-బెంగ పోగొట్టడానికి.
బుజ్జిజింక నన్నింకా అలాగే పట్టుకుని "ఓ వెల్ - హి కెన్ బి ఇంపీచ్డ్ - అమ్మా!" అనేసి - ఈలోగా స్కూల్ బస్ వచ్చే టైం అవడంతో కొత్తగా నేర్చుకుంటున్న తెలుగోత్సాహంతో "అమ్మా ! వెళ్లొస్తాను" అని నాకు చెప్పేసి బస్-స్టాప్ కి వెళ్లి పోయాడు.
[క్లింటన్-ట్రంప్ STL డిబేట్ అక్టోబర్ 9, 2016: http://singjupost.com/full-transcript-donald-trump-vs-hillary-clinton-second-presidential-debate-october-9-2016/]

ముందు ముందు ఎలా వుండబోతున్నా - ఇప్పటికి మాత్రం ...
అనుకున్నామనుకున్నా - అనుకోలేదనుకున్నా
కావాలనుకున్నా - కాకపోతే బాగుండునన్నా
కలగనలేదనుకున్నా - కలవరమనుకున్నా
ఇలలో జరగకూడదనుకున్నా - ఇలా జరగకుండాల్సిందనుకున్నా
ఇతనొచ్చాడేంటనుకున్నా - ఇంకెవరూ లేరా అనుకున్నా
ఇలా రాసి పెట్టి వుందనుకున్నా - రాసిన రాత మారాలనుకున్నా
ఏమనుకున్నా - ఎంతనుకున్నా
జరిగిపోయింది ఎంపిక
ఎంపికైనవాడు ట్రంపిక
[క్లింటన్-ట్రంప్ STL డిబేట్ అక్టోబర్ 9, 2016: http://singjupost.com/full-transcript-donald-trump-vs-hillary-clinton-second-presidential-debate-october-9-2016/]
వలచినా, వలదనుకున్నా
రిప్లయితొలగించండిగెలిచేస్తే మాత్రం ఏమైందిట?
ఎంపికైనది ట్రంపైనా
ఇంపు కాకుంటే ఇంపీచ్మెంటే అట!
పాపం ట్రంపు! తనే అనుకునివుండడు గెలుస్తానని. కొంచెం హడావిడి తగ్గించుకుని ఆలోచించి అడుగెయ్యాలని అనుకుంటున్నాను - ఎందుకంటే ఒక్కోసారి ఒక వ్యక్తి "పెదవి"తో అనే మాటలు అంత హానికరంగా అనిపించకపోయినా "పదవి"తో అనే మాటలు తప్పకుండా చిక్కులు తెచ్చిపెడతాయి. అందులోనూ అమెరికాలాంటి దేశానికి అధ్యక్షుడంటే - అది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది - దానికి అది ఎటువైపు గురిపెట్టబడివుందో అన్న పట్టింపు లేదు - కోయడమే దాని గురి. అందులోనూ ఇప్పుడది నిద్రపోతున్న రాజుగారికి కాపలా కాస్తున్న కోతి చేతిలో కత్తయ్యింది ;)
తొలగించండిలలిత గారు,
రిప్లయితొలగించండిట్రంపిక ఎంపిక గురించి సాగిన మీ "ఎంపిక-ట్రంపిక" బ్లాగు మహబాగుగా ఉంది.
వెంకట్ గారు: ట్రంపు ఎంపిక పైన రాసిన నా ఈ బ్లాగుని బాగు అన్న మీ వ్యాఖ్య మహ-బాగు!
తొలగించండి
రిప్లయితొలగించండిఅమెరికా ఇండియా అయిపోతుంది ఇండియా అమెరికా అయిపోతుందంటారా ?
జిలేబి
జిలెబి గారు: అలా అవుతుందని కాదు కానీ - కానీ జరుగుతున్నది మాత్రం ముందు-ముందు ఇంకేం జరగబోతుందో అని ఆలోచించేలా చేస్తోంది - ఆలోచించడం తప్ప చేయగలిగిందేమీ లేదని తెలిసినా!
తొలగించండి'Empika - Trumpika' title, inka post chaala saradaga baagunnayi.
రిప్లయితొలగించండి'Barasaalotsavalu - Aneka Naamadheyalu'.... ardham kaledu.
Is it a link to any of your previous posts?
Anonymous garu: There is no existing post - but there will be one soon - Stay tuned :)
తొలగించండిWalking Google! :-) ఔను లలితా! మీ అమ్మగారు, నాన్నగారు ముచ్చటగా నీకు పెట్టుకున్న నీ అసలు పేరు కన్నా, బదరీ మురిపెంతో నీకు పెట్టుకున్న బోల్డన్ని కొసరు పేర్లు ఎప్పుడో శతనామాలు దాటిపోయి ఉండాలి. మరి అలా, 'బారసాలోత్సవాలు- అనేక నామధేయాలు' అని ఓ చిన్న మాటలో తేల్చేయకుండా, ఆ పేర్లు- వాటి వెనక ఉన్న కబుర్లు రాయకూడదూ! ఎప్పటికప్పుడు నీ నోట వింటూనే ఉన్నా, అన్నీ ఓ పోస్ట్ గా రాస్తే చదవాలని ఉంది. Please.
రిప్లయితొలగించండినా చేయి పట్టి అక్షరాలు దిద్దించిన మా రామశేషు మాష్టారి తర్వాత - ఇన్నేళ్లకి నా వెనకనే వుండి నా బ్లాగ్చేయి పట్టి రాయించే నువ్వడిగితే కాదనగలనా?!
తొలగించండిఅందులోనూ నా పేరుల-పేరుల కథ
తొందరలోనే రాసెద - రాసి పోస్ట్ చేసెద.
రిప్లయితొలగించండివాకింగు గూగులు లలిత !
మాకందరికీ తెలియన మరలా బిందా
సౌ కొసరు నామములు గల
నీకథ మాకు వినిపించు నీరజ నేత్రీ :)
జిలేబి
తా కింగు బ్లాగుల జిలేబి !
తొలగించండిమీకందరికీ తెలిపెద తప్పక నావై
న కొసరు నామములు గల
నాకథ మీకు వినిపించ సరదా పుట్టీ :)
తొలగించండితాకింగౌ లలిత సుమా !
మీ కందరికీ తెలిపెద మిన్నా తరహా
లో కొసరు నామములు గల
నాకథ నాదైన తీరునవిను జిలేబీ :)
నెనర్లు మీకు కొసరు కథలకి
జిలేబి
ఆహా, ఇన్నాళ్ళకి "జిలేబి" గారికి సమ ఉజ్జీగా లలిత గారు వచ్చారు 👏👏🙂.
తొలగించండివిన్నకోట నరసింహారావుగారు: రాసివున్న పద్యాలకి పేరడీగా ఏదో అటుదిటు ఇటుదటు పదాలు సర్దడం తప్ప జిలేబిగారి లాగా ఛందస్సుతో అందమైన-punny-కందాలు రాయడం నాకు రాదండి. అయినా మీ వ్యాఖ్య నాకు పెద్ద ప్రశంసే. బోల్డన్ని ధన్యవాదాలు
తొలగించండిWalking Googly! అని ఉండాలి.
రిప్లయితొలగించండిSorry! Typo courtesy auto correct!
What's in a name? that which we call a Googly
తొలగించండిBy any other name would talk as much ;)
పెరుగుట విరుగుట కొరకే
రిప్లయితొలగించండిగిరిరాజ్: అవకాశం ఇచ్చిన నేల - అన్నం పెట్టిన నేల - పెరగకపోయినా పర్వాలేదు - విరగకూడదని బెంగ అంతే.
తొలగించండి