అన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడేదాన్ని - కానీ ఎప్పుడూ - ఏవో - కుదురుగా ఒదిగి పడుకున్న ఆకులని నిద్ర లేపి మరీ - హడావిడిగా గోల చేసి వెళ్లే గాలిలాగా - గలగలలాడడం తప్ప - ఈ ఒక్క మాట మీకు చెప్పుంటే ఎంత బావుండేదో అనుకునే బోల్డు మాటలుండిపోయాయి - ఇపుడనుకుని ఏం లాభం ?
ఆలస్యమయిపోయింది - ఇప్పుడెలా మీకివన్నీ వినిపించడం?
శ్రీనివాస్ సిస్టర్‌గా మీకు పరిచయమయిన నన్ను మీయింటి అమ్మాయిగా మీలో కలిపేసుకోవడానికి మీకు, సాగీకి ఒక్క పూటకన్నా ఎక్కువ టైం పట్టలేదు.
ప్రతీ సాయంత్రం NAL నుంచి బోల్డన్ని కబుర్లు మోసుకొచ్చే నాకబుర్లని వింటూ - ఇంటికి వచ్చిన ప్రతీ వాళ్లకి మళ్లీ మళ్లీ ఆ కబుర్లు తిరిగి చెప్తూ - లలిత ఒక అల్లరి prankster - అని మురిసిపోతూ వెలిగే కళ్లతో మెరిసిన మీ నవ్వులు - ఇదిగో - ఈరోజుకీ నా చెవుల్లో మువ్వల్లా మోగుతున్నాయి.
రాత్రి మీ పనంతా అయ్యాక - సాగి తన లోకంలో తాను పుస్తకం చదువుకుంటూ వుండేవేళ - మీరు నాకంటూ మీ అందమైన ఇంట్లో పంచిచ్చిన నా బెడ్‌రూం లో మంచం మీద కూర్చుని - మనిద్దరం కిటికీ అవతల పాకే తీగల్ని - వాటి మీద మెరుపురంగు పూసే వెన్నెల్నీ చూస్తూ - సాగితో మీ పెళ్లి చూపుల కథతో మొదలుపెట్టి - అక్కడినుంచి Jane Austen నవలల్లో హీరోయిన్ల కబుర్లు చెప్పుకుని - చివరికి మీకిష్టమైన గంజి-పెట్టిన-చుట్టూ-చెంగావి నూలు చీరలదాకా - ఎన్ని సల్లాపాలు, ఎన్నెన్ని హాసాలు , ఇంకెన్ని చిరు-చిరు-పరిహాసాలు!!!
అదేదో పరుగు పందెంలో ముందుండకపోతే అందుకోవాల్సినదాన్నేదో అందుకోలేమేమో అన్నట్టు - అటూ-ఇటూ చేతులు విసురుతూ హడావిడిగా తిరిగే వాళ్లతో కిక్కిరిసిన రోడ్ల మీద - నా అంతట నేను నడిస్తే ఎక్కడ అలసి వడిలిపోతానోనని - జాగ్రత్తగా నా చేయి మీ చేత గట్టిగా పట్టుకున్న - మీతోపాటు - మీ వెంట - నే తిరిగిన విజయనగర్ సాయంత్రాలంత రంగు-రంగుల-సందెలు మళ్లీ నాకింకెక్కడా దొరకలేదు. అయితేనేం కట్టుకున్న చీరకి మ్యాచ్ అయేలా వేసుకునే రంగురంగుల అద్దాల గాజుల్లో ఆ జ్ఞాపకాలని మీ పుణ్యమా అని దాచుకోగలిగాను - ఇది కూడా మీకు చెబ్దామని దాచుకున్న కబుర్లలో ఒకటి - ఇంకిప్పుడు తెలుపుదామని తలపున్నా తెలిపే వీలేది?
మీతో - మీ ఇంట్లో - నేనున్నది మహా అయితే ఒక నెల. కానీ ఆ కొద్దికాలంలోనే నన్ను - మీరు,సాగీ - own చేసేసుకున్నారు. నేను మాట్లాడిన మాట, పాడిన పాట - ఏదైనా సరే - మీ ఇంటి పసిపాప మొదటి మాట, మొదటి పాట - అన్నంతలా విని, ఇంటికొచ్చినవాళ్లకి వినిపించి మరీ మురిసిపోయేవారు.
పెళ్లయి, పిల్లలకు తల్లినయిన తర్వాత కూడా - ఆ పెద్దరికపు ఛాయలు నాకు ఆపాదించక - నన్ను మీకు మొదట తెలిసిన నేనుగానే వుండనిచ్చారు.
నేను, బదరి మిమ్మల్ని కలిసిన ప్రతిసారి - మీ ఇంటికి తొలిపండక్కి అల్లుడొచ్చినంత సంబరమే. తనకిష్టమని హడావిడి పడుతూ మీరు చేసి పెట్టిన "స్పెషల్స్", సాగి చేత వలిపించి కొసరి కొసరి తినిపించిన పళ్లు - ఇంకెక్కడ దొరుకుతుంది మాకింత unconditional-love ?
ఇది నేను మీరు నాకు తెలిసినంతలో - మీనుంచి నాకు దొరికినంతలో - దాచుకున్న జ్ఞాపకాల మెరుపులు.
నాలా మీకెందరో - వారికి మీరు పంచిన స్నేహం, ఆత్మీయత ఇంకెన్ని రెట్లో.
నేను చెప్పాలనుకున్నవి ఎన్నో - ఎప్పటికప్పుడు మీతో చెప్పేస్తున్నా - ఇంకా ఎన్నో మిగిలిపోయాయి అనిపించి ఆ బెంగతో ఇలా రాసేసుకుంటున్నాను కానీ - గోదావరి సంగీతపు యాసతో - స్వచ్ఛమైన తెల్లని మనసు పెదవుల మీద పలికితే ఆ వెండి-వాక్కు శబ్దం ఇలాగే వుంటుందేమో అనిపించే - nasal voice తో - వినిపించే మీ గొంతు ఇంక వినలేనేమోనన్న బెంగ నాకు లేదు లెండి - నా గుర్తులో గుర్తుండిపోయింది - నేను నవ్విన ప్రతీసారీ నాతో కలిసిమోగే మీ నవ్వు-మువ్వల్లాగా .
ఇంతకుముందు - మంచివాళ్లని దేవుడుతొందరగా తీసుకెళ్తాడని - అందరూ అంటుంటే వింటున్నా నేనెప్పుడూ నమ్మలేదు.
'ఆ...!ఆ దేవుడికి ఇంకేం పనిలేదా? -ఇక్కడ మంచి వాళ్లెవరో చూసి ఎంచుకుని మరీ పట్టికెళ్లిపోవడానికి' - అని.
ఎన్నో తెలిసిన పెద్దలు, అన్నీ చూడగల కవులు - పోయినోళ్లు అందరూ మంచోళ్లు - అంటూ పాటలు కట్టి చెవి దగ్గర పాడి చెప్పినా పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడెందుకో మీకిలా చెప్పాలనిపిస్తోంది - ఇందిరా!
మీరంత మంచోళ్లు కాకపోతే బావుండేదండి - ఆయ్!

నీవింత బాగా రాయటానికి ఈ రకంగా ఇందిర కారణం కాకపోతే బావుండు. 😔
రిప్లయితొలగించండిYes, Lakshmi - I share the same feeling.
తొలగించండిEven though I shared whatever I wrote here with Indira several times - whenever we met in Bangalore when we visited India OR when I spoke to her over the phone, I was actually planning to give her a surprise by writing about her in my Tvaamanurajaami series and call her after I write those posts in the coming months. But a bitter surprise came as a blow to me last week. Within less than a month so much happened - which left me feeling helpless.
When I received the 'In Memoriam' written by Sagi (with the beautiful picture of Indira on it) - about the positive strength Indira bestowed upon their family even in her absence - in the form of friends reciprocating the love and warmth they got from Indira and standing by Sagi and kids - with their affection and support, I couldn't stop myself joining my hands with Sagi to clap for her and basking in the good times that I spent with her - hence the blog post - and my pining about the way I forced myself to write it.
లలితా! ఇందిరను నేను కలిసింది మీ ఇంట్లో రెండంటే రెండే సార్లు. మీ బంధం చూసి, బాగా దగ్గర బంధువులనుకున్నా. మీది స్నేహబంధం అని తెలుసుకుని ఎంత ఆశ్చర్య పోయానో. మీ ఫ్రెండ్స్ అనే ఏకైక కారణంతోనే మమ్మల్నీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది ఇందిర. అంతటి స్నేహశీలి తను. ఆ కొన్ని నిముషాల interaction నాకు ఇన్నేళ్ళు గుర్తుందంటే...
తొలగించండిSome people leave a void when they go. But yet some leave behind a treasure trove of happy memories for everyone that they pass by in their sojourn on earth. Indira belongs to the latter type.
If the saying that "a picture speaks a thousand Words is true", Indira's picture here speaks a million words.
మనసు భారమాయె
రిప్లయితొలగించండిఎంత బాగా వ్రాసారు.మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా.
రిప్లయితొలగించండి<>
రిప్లయితొలగించండిచెప్పాల్సిన అవసరం లేదండీ. అక్షరాలు ఎంత అందంగా ఉన్నా అభిమానాన్ని తూచి చెప్పలేవు. చెప్పుకుంటేనే కొన్నిసార్లు ఆర్టిఫీషియల్‌గా ఉంటుంది.
<>
మంచివాళ్ళు కాకపోతే మనం ఇంతలా ప్రేమించలేం. మంచివాళ్ళయితే ఆయన ఉంచడు.
ఇటువంటిది జీవితాంతం ఉండిపోయే విచారం. అందుకే పిల్లలకు, మిత్రులకు చెబుతుంటాను, నేనూ ఆచరించడానికి ప్రయత్నిస్తుంటాను - ఎదుటివారి గురించి మంచిమాటలు చెప్పాలనిపిస్తే త్వరగా చెప్పండి, వాళ్లకే చెప్పండి, వాళ్లు బతికున్నప్పుడే చెప్పండి, సంతోషపడతారు. వాళ్లు దాటిపోయిన తరువాత - ముఖ్యంగా హఠాత్తుగా - విచారించడమే మిగులుతుంది. నివాళులు, శ్రద్ధాంజలులు మాత్రమే చెయ్యగలుగుతాం. తల్లితండ్రులు, ఇతర వయోవృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి విషయంలోనూ మనవైపునుండి ఈ రకమైన స్పందన మరీ ముఖ్యం.
రిప్లయితొలగించండిసినిమా డైలాగులాగా చెప్పనక్కరలేదు; ఆ మనిషి గురించి, తన మంచితనం గురించి, చేసిన సహాయమేదన్నా ఉంటే దాన్ని గురించి, చూపించిన ఆప్యాయత గురించి, కలిసి ఆనందంగా గడిపిన రోజుల గురించి - తలుచుకుంటున్నట్లుగా అనిపించే రీతిలోనాలుగు సంతోషపరిచే మాటలు చాలు.
అలాగే అటువంటివారిని చూసిరావాలనిపిస్తే వీలుచేసుకుని చూసిరావడం కూడా మంచిపనే. ఇప్పటి దూరాభారపు జీవితాలలో అంత తేలిక కాదని తెలుసు. కనీసం ఫేస్ టైమ్ లాంటి వాటి ద్వారానైనా ప్రయత్నించవచ్చు. నేను చెబుతున్నది వాళ్లు ఇక కోలుకోరనీ, దీర్ఘకాలం బతికుండకపోవచ్చనీ నిరాశావాదంకాదు. మనం తరువాత తీరుబడిగా విచారించవలసిన అవసరం తప్పుతుందనీ, చెబితే / చూసొస్తే / మాట్లాడితే ఇరుపక్షాలకీ తృప్తిగా ఉంటుందనిన్నీ.
ఈ ఇందిర గారు దేవుడికి మరీ ఇష్టురాలిలాగా ఉన్నారు - 52 ఏళ్లకే వెళ్లిపోయారు. అదేమీ పండు వయసు కాదు కదా. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలి 🌹🌺🌷💐.
Sarma garu, Chitra garu, Muralidhar garu, Vinnakota NarasimhaRao garu:
రిప్లయితొలగించండిThank You for your comments!
మంచి పోస్ట్ లలిత గారు. చివర్లో మీ conclusion తో ఆవిడ గొప్పతనాన్ని ఒకే మాటలో అద్భుతంగా వర్ణించారు.
రిప్లయితొలగించండిThanks, Pavan garu!
తొలగించండి