శనివారపుదయపు సరదా వ్యాసంగం - YJ అనగా నా యూట్యూబ్-జాకీ అవతారం.
దాదాపు రెండు వారాల క్రితం ఒకరోజు ...
అల్పాహారవేళ మొదలుపెట్టి అసలాహారం వండి వడ్డించేలోగా - కుక్కర్ ఈలలకి పోటీగా, పోపు-మోతలకి దీటుగా - వంటింటి కౌంటర్‌టాప్ మీద పాడే ఐపాడ్‌తో పాటు గొంతు కలిపే నా ఐ-పద్మినీ-గానమేళాలో ఆరోజుకి సమర్పిస్తున్నవి కన్నడ భాషలో రాజన్-నాగేంద్ర-వారి నొప్పి పుట్టించని సుతిమెత్తని దెబ్బ-పాటలు (hit-songs).
యూట్యూబ్‌లో - పీ బీ శ్రీనివాస్ గొంతులో మంద్రంగా - తం నం తం నం... - అంటూ పాట మొదలవగానే - ఎప్పుడు విన్నానో తెలీలేదు కానీ - అదే పాట తెలుగులో నేనెక్కడో, ఎప్పుడో విన్న జ్ఞాపకంలా గుర్తొచ్చి నాకు తెలియకుండానే - పలికెనులే నా ప్రణయగీతం ...నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా.... అంటూ నేనూ గొంతు కలిపి పాడడం మొదలుపెట్టాను.
అనుకోకుండా గుర్తొచ్చిన ఆ నాలుగు ముక్కలూ తప్ప ముందూ-వెనకా ఇంకేమీ గుర్తు రావట్లేదు.
ఒక వారం రోజులు మా ఇంట హాంటింగ్-ఛాంట్ "తం నం తం నం తం నం తం నం పలికెనులే నా ప్రణయగీతం ...నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా..." తప్ప ఇంకో మాట లేదు - పాట లేదు.
ఇంతలో పని-వారం అయిపోయి మేము ఫన్-వారం అయ్యే ట్రాన్సిషనల్ శుక్రవారపు సాయంత్రం - తనువూ-మనసూ ముందున్న శనివారాన్ని తలచుకుని మహ-హుషారుగా వుండే సమయం.
అప్పుడు తట్టింది నాకు ఒకసారి చిమటావారి పాటల వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెతుకుదామని.
ఇంకేముంది వెంటనేఅక్కడికి వెళ్లి సెర్చ్ బై మ్యూజిక్ డైరెక్టర్ అంటే వచ్చే పాటల లిస్ట్‌లో రాజన్-నాగేంద్ర పేరుకింద వున్నపాటల్లో వెతికితే - ఇదిగో - ఒక పాట ఇలా కనిపించింది.
| praNaya geetaM | 1981 | rimjim rimjim..palikenulE |
అది చూడగానే - వారెవా - అనొక్కసారి నా భుజం నేనే తట్టేసుకుని - గబగబా యూట్యూబ్‌లో 'ప్రణయగీతం సాంగ్స్' అని వెతకగానే - దొరికేసింది తెలుగు-కవల పాట.
వెంటనే ప్లే చేసి వినడం మొదలుపెట్టాను.
ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతులో - రిం ఝిం రిం ఝిం... - అంటూ మొదలయి - తర్వాత అందుకున్న పీ సుశీల గొంతులో తియ్యగా సాగిన ఆ పాట వినగానే - డైనింగ్‌టేబుల్ దగ్గర కూర్చుని ఇంకా పూర్తి కాని ఆఫీస్‌వర్క్‌లో వున్న బదరి కళ్లు ఒక్కసారిగా వెలిగాయి - 'ఎంత బావుంది ఈ పాట వీళ్లిద్దరి గొంతులో!' -అన్నట్టు.
కన్నడ పాట ఎరడు కనసు సినిమాలోదైతే, తెలుగు పాట ప్రణయగీతంలోది.
ట్యూన్ తప్ప ఇంకే విషయంలోనూ పోలిక లేని పాటలు.
ఎరడు కనసు సినిమాని రామకృష్ణ-వాణిశ్రీలతో పూజ గా తీశారు తెలుగులో. ఏదో ఒకటి రెండు పాటలు తప్ప ఈ సినిమా అంతా ఒక ఇంట్లోనే సాగుతుంది అన్నట్టు గుర్తు నాకు. అందులో కన్నడ-తెలుగు కవల పాటలు చాలా వున్నాయి - ఆ కబుర్లింకోసారి.
ప్రస్తుతానికి ఈ తం నం - రిం ఝిం పాటలు - కవల పాటల్లో - ఒకే మ్యూజిక్ డైరెక్టర్ - వేరే సినిమాలు - వేరే భాషలు - వేరే కథలు - ఒకటే ట్యూన్-కి మంచి ఉదాహరణలు.
ఇంక పాటల్లోకి వెళ్తే ....
మొదటగా కన్నడ - ఎరడు కనసు పాట
ఇందులో కన్నడకంఠీరవ రాజ్‌కుమార్ - కల్పన నటించారు.
(రామకృష్ణ-వాణిశ్రీల తెలుగు సినిమా పూజ లో ఇదే సందర్భంలో వచ్చే పాట - - నింగీ నేలా ఒకటాయెనే...)
సిరి-కన్నడ-రాజ్య రాజకుమారుడి పాదాల దగ్గర మొదలవుతుంది పాట.
ఇందులో కల్పన నృత్యం, అభినయం చూడాల్సిందే తప్ప చెప్పనలవి కాదు.
ముఖ్యంగా పల్లవిలో "ఘల్ ఘల్ ..." అనే లైను దగ్గర -
పల్లవి తర్వాత వంటింటి సీనులో ఆ కళ్లూ - పోకళ్లూ
ఎవరికివారు చూసి నివ్వెరపోవాల్సిందే తప్ప
నేను వివరింప దగన్ సిన్మతీ!
అన్నట్టు నా సిన్మతీ!-పద్యాలు గుర్తొచ్చాయి అనుకోకుండా - వెళ్లి గబగబా మళ్లీ చదువుకునొచ్చా - నా సిన్మావలోకనం పోస్టులో.
పాట మ్యూట్‌లో పెట్టి ఆవిడ ఆట చూస్తే మహ-తమాషాగా వుంటుంది.
ఇంక - కన్నడకంఠీరవుని నటన, నటనం - మనోహరం.
పి బి శ్రీనివాస్వరం కర్ణపేయం.
ఒకదానికొకటి కూడుకొని
నికరమాయెనవి - సరిజోడు
పాటలోకి వెళ్తే - హొన్నబళె - అన్న మెరిసే గాజుల మాట బోల్డంత నచ్చేసింది.
ణ-కార ... హ-కార ... ళ-కార ... సహిత కస్తూరి-భాష-కన్నడ... ఎప్పట్లాగే తెగ మురిపించింది.
పాట వింటూ, ఆట చూస్తూ ...
మీరు కూడా పాడుకోవడానికి వీలుగా ఇచ్చిన పాట పదాలు చదువుతూ -
మీ పెదవులు కదుపుతూ -
ఎంజాయ్-మాడి !
తం నం - తం నం - తం నం... మనసు మిడియుతిదె - హో... సోతిదె
కైయల్లి కుణివ - ఈ హొన్న బళెయ - ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె
నన్నెదెయ వీణ - తన్నంతె తానే - తం నం తం నం ఎందిదె
ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె ... తం నం తం నం ఎందిదె
తం నం - తం నం - నన్నీ ... మనసు మిడియుతిదె - హో... సోతిదె
కైయల్లి కుణివ - ఈ హొన్న బళెయ - ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె
నన్నెదెయ వీణె తన్నంతె తానే తం నం తం నం ఎందిదె
ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె... తం నం తం నం ఎందిదె
నీ సనిహకె - బందరె - తనువిదు... నడుగుతిదె - ఏతకె - ఎదె - ఝల్ ఎందిదె
హ ... నీ సనిహకె - బందరె - తనువిదు... నడుగుతిదె - ఏతకె - ఎదె ఝల్ ఎందిదె
అహహా...ఒలిదిహ - జీవవు - బెరెయలు ... మన హూవాగి తను కెంపాగి నిన్న కాదిదె
తం నం తం నం తం నం మనసు మిడియుతిదె
హా ... హాహహా ...
నీ నడెయువ - హాదిగె - హూవిన... హాసిగెయ - హాసువె - కై హిడిదు నడెసువె
అహ ... నీ నడెయువ - హాదిగె - హూవిన... హాసిగెయ - హాసువె - కై హిడిదు నడెసువె
అహహా... మెల్లగె - నల్లనె - నడెసు బా ... ఎందూ హీగె - ఇరువ ఆసె - నన్నీ మనసిగె
తం నం తం నం నన్నీ మనసు మిడియుతిదె ... హో... సోతిదె
కైయల్లి కుణివ ఈ హొన్న బళెయ ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె
నన్నెదెయ వీణె తన్నంతె తానే తం నం తం నం ఎందిదె
ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె... తం నం తం నం ఎందిదె (ఆ ఆ .....)
ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె... తం నం తం నం ఎందిదె (ఊఁ ... ఊఁ ...)
ఇప్పుడిక మన తెలుగు ప్రణయగీతం
కులాసాగా ఆడినవారు తెల్ల చీరలో సుజాత - పసుపుడుపుల్లో చంద్రమోహన్.
ధిలాసాతో పాడినవారు కోయిలమ్మ సుశీల - గండుకోయిల బాలసుబ్రహ్మణ్యం.
పాట మొదలైన మొదటి పన్నెండో సెకండు నుంచి పదిహేనో సెకండు దాకా వచ్చే ఒక చిన్న మ్యూజిక్ బిట్ ... డోలక్-సత్యంగారిని తలుచుకునేలా చేసింది (కన్నెవయసు లో బాలుని-గళమున జలజలా జాలువారిన ఏ దివిలో విరిసిన పారిజాతమో ... జ్ఞాపకాల్లోంచి భలె-భలే హాయిలూరింది).
ఎత్తుగడే - ఎస్పీబీ గొంతులో - వహ్వా - అనేలా వుంటుంది.
ఎన్నో మన్ననలందిన ఆ స్వరం ...
ఎన్ని ఎదల రేపెనో కలవరం
ఎన్ని కన్నెల కన్నులకిచ్చెనో - కలల వరం.
తర్వాత అందుకున్న కోయిల్సుశీల
బాలుకి సవాలుగా
వీణ తీగలతో స్వరాన్ని పేనినట్టు
తేనె ధారతో గళాన్ని నింపినట్టు
సంగీత ఝరి - స్వర మాధురి
దానికి తోడు - మొదటి చరణంలో లక్ష్మీనారాయణ-లాంచీ మీద - చంద్రమోహనుడి నటనవిలాసం - "కాలమే లీలగా ఆగెనా" అన్నచోట తలెగరేసిన వైనం - ఓహ్ !
పక్కనే మా గోదారి అందాలు - లాంచీ కదులుతుంటే పక్కనే కనిపిస్తున్న ఇనప కమ్మీల్లాంటివి చూసి మా గన్నవరం ఎక్విడెక్టేమో అనిపించింది.
సుజాత - ఈవిణ్ణి ఎక్కడ చూసినా - "గోరింటాకు" సినిమాలో తొణక్కుండా హుందాగా కనిపించిన డాక్టర్‌గా తప్ప ఇంకోలా ఊహించడానికే అవదు నాకు - అందుకని ఈ పాటలో కూడా సెలెక్టివ్-ఇగ్నోరెన్సు నా బ్లిస్సు.
పై కన్నడపాటది సున్నితపు-బాటైతే
ఈ తెలుగు పాటది సరిగమల-దూకుడు
పైగా మాటలు తెగ పేర్చేశారు - ముందే వున్న ట్యూనుకి.
భావనలు రేకులై వేచడ (వేచివుండడ)మేంటి?!
(చార్మినార్రేకులు ఎండలో బానే వేయిస్తాయి - అదొప్పుకుంటాను)
"నాలోని వాణి - నీలాల వేణి " ఏంటబ్బా?!
రసధునులు రవళులవడం -
లయగతులు హొయలులై ఒదగడం -
ఏదో రాజన్-నాగేంద్ర స్వర-మంద్ర పుణ్యమా అని ఈ పాట నా బ్లాగుకెక్కించి -
ఇలా పాటలు - మాటలు ఎక్కించి మరీ పొక్కించేశాను -
చూసి, విని -
మరి - సరిగమల-లల లల ల -సహితంగా పాడుకుని -
ఆనందించండి మరి!
పాసరి పగారి గాసరి దనీస పసరిస గసరిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస
రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - పలికేనులే...
సరిదనిగపమపమ
నా... ప్రణయగీతం...
లలలలలలలల
నాలోని వాణి - నీలాల వేణి - తానే నేనై పాడగా
నా మేనిలోన - మాణిక్యవీణ - నేనే తానై మ్రోగగా
లలల
నేలా నింగీ ఆడగా
లలల
పూలే తాళం వేయగా
రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - పలికేనులే...
సరిదనిగమపమ
నా... ప్రణయగీతం...
సరి గమ గమ గరి
సరి గప గప దని
మద నిస నిస నిద
పద సరి సరి గప
రూ... రూ... రూ ...రూ ...
ఆ హా హా హా
ఆహా
లలలల
నీ వదనమే - కమలమై - పూచెనా ... భావనలే రేకులై నాకై వేచెనా
నీ హృదయమే - భ్రమరమై - దాగెనా ... కోరికలే రెక్కలై నాపై మూగెనా
అహహా ... కాలమే - లీలగా - ఆగెనా ... నీలో వున్ననాదాలన్ని నాలో పొంగెనా
పాసరి పగారి గాసరి దనీస పసరిస గసరిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస
రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - పలికేనులే...
సరిదనిగపమపమ
నా ... ప్రణయగీతం...
లలలలలలలల
నాలోని వాణి - నీలాల వేణి - తానే నేనై పాడగా
నా మేనిలోన - మాణిక్యవీణ - నేనే తానై మ్రోగగా
లలల
నేలా నింగీ ఆడగా
లలల
పూలే తాళం వేయగా
రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - పలికేనులే...
సరిదనిగపమపమ
నా... ప్రణయగీతం...
నీ పెదవియే - మురళియై - పిలిచెనా ... రసధునులే రవళులై నాలో నిలిచెనా
నీ పదములే - హంసలై - కదలెనా ... లయగతులే హొయలులై నాలో ఒదిగెనా
అహహా ...నందనం - చేతికే - అందెనా ... నాలో వున్న అందాలన్నీ నీలో పండెనా
పాసరి పగారి గాసరి దనీస పసరిస గసరిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస రిస
రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - పలికేనులే...
సరిదనిగపమపమ
నా... ప్రణయగీతం...
లలలలలలలల
నాలోని వాణి - నీలాల వేణి - తానే నేనై పాడగా
నా మేనిలోన - మాణిక్యవీణ - నేనే తానై మ్రోగగా
లలల
నేలా నింగీ ఆడగా
లలల
పూలే తాళం వేయగా
.......
ఇప్పటికి ఈ పాటల ప్రసారం- మాటల ప్రహారం సశేషం ...
ఉండి రాగమాలపించుడి ... (అనగా అనగనగా ... Stay tuned!)
~పాటల భైరవి
మీదు పలుకులన్ని మిక్కిలి మధురము
రిప్లయితొలగించండిపలుకు పలుకు నందు పలికె సుధలు
వినిన కలుగు ముదము వీనుల విందగు
తేనెలూరెనమ్మ తెలుగుద(ధ)నము!
శ్రీనివాస్‌గారు: మీకు నా రాతలు నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా వుంది.
తొలగించండిప్రతీవారం సంగీతం ఇలాగ నేర్పితే మాకు కూసింత సంగీత జ్ఞానం అబ్బేత్తాది అక్కో !
రిప్లయితొలగించండిహనుమాన్: సంగీతం నేర్పలేను కానీ నాకు నచ్చిన సంగీతం తప్పక పంచుకుంటాను - గొంతు కలిపి పాడితే నేర్చేసుకోవచ్చు - నాలాగా! :)
తొలగించండిఅబ్బ ఎన్నాళ్ళైందండీ ప్రణయగీతం పాట విని... ఫెల్ట్ సో గుడ్.. మెనీ మెనీ థాంక్స్.. అసలు పాట గురించి కూడా ఎంతబాగా రాశారండీ.. అర్జంట్ గా మీరో పాటల బ్లాగ్ మొదలెట్టేయాల్సిన టైమొచ్చినట్లుంది మరి ఆలోచించి చూడండి :-)
రిప్లయితొలగించండిపేరుమోసిన పాటల బ్లాగులు (రాజి గారివి, వేణు శ్రీకాంత్ గారివి) వున్నాయి కదండీ. ఏదో నెలకొకటో, రెండో పాటల పోస్టులు రాసే నా మాటలు, పాటలు అన్నీ ఈ బ్లాగులోనే - ఇప్పటికి. మీరన్నట్టు రింఝిం పాట చాలా బావుంటుందండి - ఆ పాట పట్టుకోగలిగినందుకు పట్టాపగ్గాల్లేకుండా వుంది నా సంతోషం :)
తొలగించండి