కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 24 - తంతిలేఖ రాశా నీకంది వుంటదీ...
ప్రతిసారి సెలవులకి ఇంటికి వెళ్లబోయే ముందు ఒకసారి హాస్టల్‌లో నాకిష్టమైన, నన్నిష్టపడే, నన్నెప్పుడూ పలకరించే, నేనెప్పుడూ మాట్లాడే అమ్మాయిలందరి దగ్గరికీ వెళ్లి Bye / Happy Journey అని చెప్పి రావడం నాకెంతో ఇష్టమైన pre-travel ritual.
ఈసారి కూడా అలాగే నేనుండే కళ్యాణి బ్లాక్‌లో పలకరింపుల-చిలకరింపులు పూర్తయ్యాక కిన్నెర బ్లాక్‌లో 300 సిరీస్ రూంలో వుండే (302-బి అనుకుంటా- సరిగ్గా గుర్తు లేదు) నా సీనియర్ - పెద్ద జడ, పెద్ద కళ్ళతో వంశీ హీరోయిన్‌లా ఉండి, తను అలా ఉంటానని అందరికన్నా తనకే ముందు తెలిసి - తన ప్రతి చిన్న కదలికనీ చాలా నాజూకుగా బోల్డంత lady-like గా ఉండేలా చూసుకుంటూ, కొంచెం cryptic గా మాట్లాడుతూ, starry-eyed అంటే ఇలాగే ఉంటారేమో అనిపించే నరసాపురం అమ్మాయి సుమిత్ర దగ్గరికి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పి, అడిగిందని తనకిష్టమైన అభినందన సినిమాలో ఓ పాటోటి పాడేసి - తర్వాత 200-సిరీస్ (203-బి అనుకుంటా) లో వుండే నా క్లాస్‌మేట్స్ అన్నపూర్ణ, సోనియాల రూంకి వెళ్ళాను.
అన్నపూర్ణ, సోనియాలతో పాటు ఆ రూంలో నా జూనియర్ సరోజిని కూడా వుండేది. ఆ రోజు వాళ్ళే కాకుండా ఇంకో సర్ప్రైజ్-గెస్ట్ కూడా వుంది - BH స్కూల్లో మా పప్పి క్లాస్‌మేట్ Miss.V. పద్మావతి యూనివర్సిటీ MCA ఎంట్రన్స్ రాయడానికి వచ్చానని చెప్పింది. నాకు భలే అనిపించింది ఆ అమ్మాయిని అక్కడ చూడడం. ఒకసారి గుంటూరులో ఆ అమ్మాయి పుట్టినరోజు కోసం పప్పితో కలిసి BH దగ్గరున్న నీహారిక ఫాన్సీస్టోర్‌లో ఒక మంచి పెన్ను కొని - లక్ష్మీపురంలో వాళ్ళింటికి ఆ అమ్మాయిని సర్ప్రైజ్ చేద్దామనుకుని వెళ్లి - ఆ అమ్మాయి ఆ పెన్నుని చాలా మామూలుగా అందుకుందని నాకు నేనే సర్ప్రైజ్ అయిన సంగతి నాకింకా గుర్తుంది.
మా గుంటూరమ్మాయీ, అందులోనూ పప్పి ఫ్రెండ్ కదా అన్న familiarity తో - హాయ్, హౌ ఆర్యూ - లాంటి మామూలు పలకరింపులు అయ్యాక ఒకే ఒక్క ప్రశ్న అదనంగా అడిగాను "ఎలా ప్రిపేర్ అవుతున్నావు, V? " అని.
వెంటనే ఒక snappy సమాధానం: "నువ్వెలా అయ్యావో అలాగే!" అంటూ.
"హన్నా - అంత మంచిగా పలకరిస్తే - అలాంటి ఆన్సర్ చెప్తుందా - ఆయ్!" అనేసుకుని - అప్పుడే కూర్చోబోతున్న నేను లేచి నిలబడి - అంత కన్నా snappy గా - "నాలా చదివితే నీకు సీటొచ్చినట్లే" అనేసి - అన్నపూర్ణ, సోనియా, సరోజినీలకి bye చెప్పేసి - నా రూంకి వచ్చేశాను.
మరసటి రోజు ఇంటికి ప్రయాణం - రైలు బండిలో.
ఈసారి వేసవి సెలవుల ప్రత్యేకత ఏంటంటే శ్రీనన్న పెళ్ళి శ్యామలతో - పేరూరులో. ఆ తర్వాత వారం రోజులకు గుంటూరులో నిరుపమ-శ్రీనివాసుల పెళ్ళి. రెండు పెళ్ళిళ్ళకీ వెళ్ళాలి, వెళ్తాను అనుకుని బోల్డంత సంబరపడ్డాను.
శ్రీనన్న పెళ్ళి పల్లెటూరి పెళ్ళి - పల్లకీ పెళ్ళి అని ఎంతో సరదా పడ్డాం - నేను, పప్పి, కుట్టి. పెళ్ళికి ఎవరెవరు ఎక్కడెక్కడినుంచి వస్తారూ, స్వాతి, మధుమతి వస్తే వాళ్ళతో మేం ముగ్గురం చేరి - అందరం కలిసి ఎలా అల్లరి చేస్తామో ఊహించుకుంటూ, మమ్మల్ని మేమే ఊరించుకుంటూ - ఎడతెరిపి లేకుండా, అలుపన్నది మరచి పగలూ, రాత్రీ ఇంక రోజూ అవే కబుర్లు.
అసలే మే నెల. ఎండలు మెండుగా కాస్తున్న నెల.
ఇంటి కిటికీలకి, తలుపులకి వట్టివేళ్ళ చాపలు కట్టుకుని, వాటిని తడుపుకుని - చల్లగా నీడపట్టున మన్-చాహే-గీత్ వింటున్న మా ముగ్గుర్నీ "లెండి లెండి శ్రీను పెళ్ళికి చీరలు కొనాలి మీ ముగ్గురికీ - మళ్ళీ నేను తెస్తే నచ్చవు మీకు. పదండి వెళ్దాం" అంటూ హడావిడి చేసి - మమ్మల్ని తీసుకుని రాఘవేంద్ర కాలనీలో వుండే అమ్మాజీ ఆంటీ ఇంటికి వెళ్ళి - ఆవిడని కూడా మాతో కలుపుకుని - రవిశంకర్ హోటల్‌కి ఎదురుగా వున్న దేవి సిల్క్స్ అనే షాపులో మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరయ్యేదాకా చూసిన చీర చూడకుండా షాపులో వున్న అన్ని చీరలూ చూసేసి - చివరికి ఆవిడకో పట్టుచీర, నాకొక ఆరెంజ్ కలర్ బిన్నీ-క్రేప్ చీర, పప్పి, కుట్టీలకి కూడా చెరొక బిన్నీ-సిల్క్ చీరలు కొంది అమ్మ.
పెళ్ళికి ఇంకో రెండు రోజుల్లో బయల్దేరుతామనగా ఒక పెద్ద పనసపండు తెచ్చారు నాన్న. దాన్ని నేను కోస్తానని తీసుకుని - కత్తిపీటతో అంత పెద్ద పండును చెక్కలుగా కోసుకుని - చేతికి నూనె రాసుకుని తొనలు అన్నీ వలవడానికి గంట సేపు పట్టింది నాకు. అప్పటివరకు ఎప్పుడైనా ఒక మూడో, నాలుగో పనసతొనలు - ఎవరైనా ఇస్తేనో, లేకపొతే కొనుక్కునో తినేటప్పుడు - ఇంకో రెండెక్కువ ఉంటే బాగుండును అనిపించేది. కానీ ఇప్పుడు అంత పెద్ద పనసపండులో వున్న బోల్డన్ని తొనలని చూడగానే ముందు భలే సంతోషంగా అనిపించినా - అదంతా కోసి, తొనలు ఒలిచేటప్పటికి ఆ పనసతొనల వాసన చుట్టూ వున్న వట్టివేళ్ళ వాసనతో కలిసి - ఒక రెండు కన్నా ఎక్కువ తినలేకపొయ్యాను.
దానికి తోడు ఆఫీస్ నుంచి వెంకటేశ్వర్లు తెచ్చిన గోరింటాకు హడావిడి కూడా అప్పుడే. మధ్యాహ్నం భోజనాలయ్యాక మాకు గోరింటాకు మిక్సీలో రుబ్బి పెట్టుకోమని ఇచ్చి అమ్మ చీరలకి ఫాల్స్ కుట్టించుకు వస్తానని టైలర్ రాణిగారి దగ్గరికి వెళ్ళింది.
నేను పప్పికి, కుట్టికి రెండు చేతులకి, పాదాలకి గోరింటాకు పెట్టి, నేను కూడా ఎడం చేతికి, పాదాలకి గోరింటాకు పెట్టుకుని - ముగ్గురం ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. పెట్టిన గోరింటాకు తొందరగా ఎండిపోతే బాగా పండదని దాన్ని మధ్యమధ్యలో నీళ్లతో తడుపుకుంటూ వున్నాము. నెమ్మదిగా రెండు గంటలు దాటి మూడయ్యింది. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. మేం ముగ్గురం గోరింటాకు తీసేదాకా కదలలేము. ఆకలి వేస్తోంది. కానీ లేవలేము, ఏమీ తినలేము.
నెమ్మదిగా ముగ్గురం ఆకలి-కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాము - ఎలాంటి కబుర్లవీ అంటే... 4/14 లో మసాలా అమ్మే బండి మీద నుంచి వచ్చే వాసన ఎంత బావుంటుందో అని తలుచుకుంటూ, మిరపకాయ బజ్జీల్లో పెట్టే ఉల్లిపాయల్లో నిమ్మకాయ ఎంత పిండితే బావుంటుందో అని మాటలతోనే కొలుచుకుంటూ, పులిబొంగరాల నునుపుని మురిపెంగా కళ్ళతోనే నెమరేసుకుంటూ - మొత్తం మీద గోరింటాకు ఎండి, దాన్ని చేతులనుండి, కాళ్లనుండి ఒలిచేవరకూ ఆ తిండి-కబుర్లతోనే కడుపు నింపేసుకున్నాం.
ఇంతలో అమ్మ రానే వచ్చింది - వస్తూ వస్తూ అప్పుడే ఫ్రెష్‌గా చేసిన సోంపాప్డీ తీసుకొచ్చింది. ఆ సోంపాప్డీ మా నోట ఆమ్-దోప్డీ అయ్యింది.
పెళ్ళికి ఎంత హడావిడి పడాలో అంతా ఇక్కడినుంచే పడుతూ సూట్‌కేసులు సర్దుకుని అందరం నాన్న సెల్ఫ్-డ్రైవింగ్‌లో కార్లో (అప్పటికి ఫియట్ ఉండేది - ప్రీమియర్ పద్మిని నాకిష్టమైన పేరు) అనాతవరం వెళ్ళాం.
పేరూరులో శ్రీనన్న-శ్యామలల పెళ్ళి చాలా బాగా జరిగింది. బోల్డన్ని మంచి జ్ఞాపకాలు ఆ పెళ్ళిలో. ఆ పెళ్ళిలోనే బెంగుళూరు సుందరిపిన్ని, ప్రశాంతిలని కలిశాను. వాళ్ళిద్దరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ పల్లకి ఊరేగింపులో తిరగడం - అప్పగింతలు, నాగవల్లి అన్నీ అయ్యాక పందిట్లో కూర్చుని అందరితో కబుర్లు చెప్తున్నప్పుడు మావూరి మునసబుగారబ్బాయి, అప్పటికే ఏ. యూ. లో MCA అయి విప్రోలో పనిచేస్తున్న కిరణ్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడడం - అదే పందిట్లో నల్లపట్టుచీర కట్టుకుని బంగారపు బొమ్మలా మెరిసిన అరుణని తనెటు తిరిగితే అటు కళ్ళు తిప్పుతూ "అబ్బ ఎంత బావుందీ అమ్మాయి!" అని మురవటం - ఇప్పటికీ మరువలేను.
పెళ్ళయింది - ఇంక గుంటూరు బయల్దేరుదాం - అనుకుని మరసటి రోజు పొద్దున్నే తయారవుతూ ఉంటే - రాజీవ్ గాంధీ assassination వార్త. అన్ని చోట్లా బందులూ, కర్ఫ్యూలు - బస్సులూ, రైళ్ళూ ఆపేస్తున్నారు అని చెప్పారు. ఒక్కసారిగా ఏదో చెప్పలేని బాధ - అయ్యో ఏంటి ఇలా అయ్యింది - అనిపించింది.
అప్పుడే ఇంకో interesting జ్ఞాపకం ఏంటంటే - నేను చదివిన ఒక పాఠాన్ని రాజీవ్ గాంధీ వేసుకున్న బూట్లతో relate చేసుకోవడం. అంతకు ముందు సెమిస్టర్లో Managerial Economics లో ఒక పాఠం చెప్పేటప్పుడు రాజశేఖర్ సర్ చెప్పారు - కంపెనీల షేర్ వాల్యూ పడిపోవడానికి చాలా కారణాలుంటాయి - natural disasters, పేరున్న వ్యక్తుల జననమరణాలు వగైరా వగైరా అంటూ. రాజీవ్ గాంధీ పోయిన సమయంలో ఆయన కాళ్ళకి Italian Brand - Lotto shoe వేసుకుని వున్నారు అని పేపర్లలో రాశారు. అప్పుడు నేననుకున్నాను - ఇప్పుడు Lotto షేర్ వాల్యూ పడిపోతుందేమో కదా అని. గుర్తుండిపోయిన ఒకానొక యాదృచ్ఛికమైన ఆలోచన అది.
బందులు అవీ జరగడంతో అనుకున్నట్లుగా గుంటూరు వెళ్లలేకపోయాము - గుంటూరు టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన నిరుపమ-శ్రీనివాసుల పెళ్ళికి వెళ్లడం కుదరలేదు.
అనాతవరంలో వుండిపోయిన మమ్మల్ని అమలాపురంలో వుండే నాన్న ఫ్రెండ్ తొండారం సుబ్బారావుగారు (తొండవరం ఆయన పుట్టి పెరిగిన ఊరనుకుంటాను) భోజనానికి పిలిచారు. వాళ్ళింటికి వెళ్లి "వద్దు-వద్దం"టున్నవాళ్ళ చేత మొహమాటపెట్టి మరీ - ఒక పూటలో మూడుపూటలకి సరిపడేలా కొసరి-కొసరి తినిపించే వారింటి ఆతిథ్యం అందుకుని - అమలాపురంలో సీతారామయ్యగారి మనవరాలు, పెళ్ళిపుస్తకం సినిమాలు చూసి - మళ్ళీ అనాతారంలో ఓ రెండ్రోజులుండి గుంటూరు వచ్చేశాం.
సెలవులన్నీ అయిపోయాయి. మళ్ళీ తిరుపతికి తిరుగు ప్రయాణం.
నేను హాస్టల్‌కి తిరిగి వచ్చేటప్పటికి బదరి కూడా మద్రాసు నుంచి ప్రాజెక్ట్ వర్క్ అయిపోయి తిరుపతికి తిరిగి వచ్చున్నారు. వస్తూ వస్తూ మద్రాసులో సాయిగిరిధర్ వాళ్ళ వదిన సహాయంతో షాపింగ్ చేసి నాకోసం తను కొన్న ఆకుపచ్చరంగు షిఫాన్ చీర, జాలీ-అల్లిక వున్న వెండి పట్టీలు తీసుకుని వచ్చారు - తన స్టైపెండ్ మొత్తం వాటికోసం ఖర్చు చేసి. అవి చూడగానే ఇష్టమూ, తీసుకోవాలంటే కొంచెం మొహమాటమూ - మొత్తానికి మొహమాటాన్ని ఇష్టం పక్కకి నెట్టేసింది.
అంతలో మా పద్మావతి యూనివర్సిటీలో, పక్కనే వున్న పద్మావతి డిగ్రీ కాలేజ్‌లో వున్న అమ్మాయిలందరూ పద్మావతి గెస్ట్ హౌస్ ముందు రోడ్ మీద కూర్చుని ఎందుకో స్ట్రైక్ చేశారు (మండల్ కమిషన్‌కి సంబంధించినదేమో నన్నట్లు గుర్తు - కాకపోయుండొచ్చు కూడా). అప్పుడు ఒక మూడు రోజులు మా డైనింగ్ హాల్ మూసేశారు. ఒక రెండు రోజులు బయట హోటల్స్ లో, మెస్సుల్లో భోంచేశాను. ఒక రోజు మాత్రం కంప్యూటర్ లాబ్‌లో ఆలస్యం అయి టౌన్‌లోకి భోజనానికి వెళ్తే హాస్టల్‌లో సాయకాలం వేసే హాజరు టైంకి రాలేను అనుకుంటూ వుంటే - అప్పుడు బదరి తన ఫ్రెండ్ షేకీ సైకిల్ అడిగి తీసుకుని నన్ను వెటెరినరీ కాలేజ్ హాస్టల్‌లో వున్న రాజశేఖర్ ఫ్రెండ్ జయలత దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు జయ అడిగిందని మల్లీశ్వరి సినిమాలో 'ఆకాశ వీధిలో ...' పాట పాడి - వాళ్ళ హాస్టల్లోనే భోంచేసిం తర్వాత నన్ను మళ్ళీ సైకిల్ మీద మా హాస్టల్ దగ్గర దింపేసి వెళ్లారు. జయలత దగ్గర్నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎదురుగా వస్తున్న లారీని తప్పుకుందామని రోడ్ దాటి పక్కనున్న మట్టిరోడ్డు మీదికి సైకిల్ తిప్పినప్పుడు అక్కడ నేల ఎగుడుదిగుడుగా ఉండడంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరం కింద పడిపోయాం. దెబ్బలేమీ తగల్లేదు కానీ - ఆ టైంలో ఇంకో లారీ వచ్చుంటే - అమ్మో! అని అప్పుడూ అనిపించింది -ఇప్పుడూ అనిపిస్తోంది.
ఇంతలో ఒక సెలవు రోజు వచ్చింది - ఆగస్టు పదిహేను. హాస్టల్లో అమ్మాయిలు చాలామంది తలకోన, కళ్యాణి డామ్ చూద్దామని వెళ్లారు.నాకు చిన్నప్పట్నుంచి శివాలయం అంటే చాలా ఇష్టం. ఏ ఆడంబరం, అలంకారం లేకుండా విభూతి, మారేడు దళాలతో నిర్మలంగా కనిపించే శివలింగం చుట్టూ వుండే ప్రశాంతత నచ్చుతుంది. అందులోనూ నాకు ఊహ తెలిసినప్పట్నుంచి అనాతవరంలో నాన్నమ్మతో, శివకోడులో అమ్మతో, ఇంకెక్కడికి వెళ్లినా నాన్నతోనూ నేనెక్కువగా చూసినవి శివాలయాలే. ఆ రోజు నాకు కాళహస్తి వెళ్లాలనిపించింది. నాకనిపించింది అని చెప్పానో లేదో - సరే పద - అని బస్సెక్కించి కాళహస్తి తీసుకెళ్లారు బదరి.
కాళహస్తి గుడిలో అటూ ఇటూ మండపాల మధ్య వుండే ఆ పొడవైన కాలమ్స్ లాంటి వాటిల్లో నడుస్తూ చుట్టూ వున్న శిల్పాలు చూస్తూ - literally పరుగులే పెట్టాను నేను. గుడికన్నా కిందుగా వున్న పాతాళ-విఘ్నేశ్వరుణ్ణి చూసి, గుడి బయట ఎత్తుగా వున్న కన్నప్ప మందిరాన్ని చూసి - కాసేపు కూర్చుందామని గుడి లోపల ఒక మండపంలో కూర్చున్నాము. నా పాదాలు నొప్పిగా వున్నాయి అని చేత్తో ఒత్తుకుంటూ - ఏదో మాట్లాడుతూ - పక్క నుంచి నన్నెవరో చూస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూస్తే ....dang!
ఎవరున్నారక్కడా...... :) ఎవరంటే....ఎవరంటే.... పెద్ద కళ్ళు లేకపోయినా వున్న కళ్ళే పే....ద్దవిగా చేసుకుని రెప్ప వేయకుండా నన్నే చూస్తున్న సుబ్బారావు - గుంటూరులో మా ఇంటి ముందుండే కిరాణాకొట్టు సొంతదారు.
అతన్ని చూడగానే - నేనొక చెయ్యి కొంచెమంటే కొంచెమే ఎత్తి హాయ్ చెప్తున్నట్లుగా ఊపాను. సుబ్బారావు మాత్రం - కళ్ళు తిప్పేసుకుని నా హాయ్-ని హాయిగా ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోయాడు.
సరే! ఇంకేం చేస్తాను - పలకరించితేనే ఉలికి పడుతున్నాడు -దగ్గరికివెళ్లి బదరిని పరిచయం చేస్తే స్పృహ తప్పుతాడేమో అని - నేను అంతగా ఇబ్బంది పెట్టలేదు.
నేను తనని ఇబ్బంది పెట్టలేదు కానీ - సుబ్బారావే మహా ఇబ్బంది పడిపోయాడు ఆ రోజు.
ఆగస్టు-పదిహేను తర్వాత మూణ్ణాలుగు రోజులకి ఇంటి నుంచి ఫోన్ - అదీ వారం మధ్యలో - expect చేయని వేళలో.
అవతల నుంచి నాన్న గొంతు - కొంచెం సీరియస్‌గా "లల్లీ - అమ్మ వస్తోంది తిరుపతికి, నీ పుట్టిన రోజు వస్తోందిగా - నిన్ను చూడాలని ఉందట. టికెట్ confirm కాగానే చెప్తాను - స్టేషన్‌కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి నువ్వు " అని గబగబా చెప్పేసి పెట్టేశారు.
అప్పుడనిపించింది ....
మమ్ము ఎవరో చూసిరి
అమ్మకపుడే చెప్పిరి
చూపులోనే... 'పెళ్లి' జరిగే... మంత్రమేదో వేసిరి :))
మా అమ్మొచ్చినప్పుడు ఏం జరిగిందో నెమరేసుకుంటూ ఇక్కడే వుంటాను నేను ... ఆ టైటిల్ పాట పాడుకుంటూ...
వీలయితే ఆ టైటిల్ పాట, ఈ కొసరు పాట పాడుకుంటూ మీరూ నాతో పాటే వేచి వుండండి - ముందున్న పండక్కి ...
నేనీ బడిలో ... నువ్వా బడిలో ...
కాళహస్తి కలిపింది ఇద్దరినీ
తనవెంటే మనమున్నామని
స్వర్ణముఖి మురిసింది అద్దరినీ ....
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

మీరు బాగా వ్రాస్తున్నారు.
రిప్లయితొలగించండిమీ శైలిలో మంచి ప్రవాహగుణం ఉంది.
అది అంత సులువైన దేమీ కాదు.
మీ తెలుగుభాషావిన్యాసమూ అందంగా ఉంటుంది.
అందమైన తెలుగు చదవటం విందుభోజనం చేయటం లాంటిదే.
అందుకోండి అభినందనలు.
శ్యామలీయంగారు: మీ వ్యాఖ్య చదివితే నాకేం అనిపించిందంటే - నా చిన్నప్పట్నుంచీ తెలుగు నేర్పిన గురువులందరూ వరసగా నిల్చుని నన్ను ఆశీర్వదిస్తున్నట్లు. ధన్యోస్మి!
తొలగించండిమీరు యద్దనపూడి గారిగురించి వ్రాస్తారని ఎదురుచూసాం.
రిప్లయితొలగించండిఆవిడలేని లోటు మీరు తీర్చాలి.
నీహారికగారు: యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు నాకెప్పుడూ Jane Austen నవలలకి నకళ్ళలా అనిపిస్తాయి- అంతకు మించి ఆవిడని గురించి రాయడానికి నాకంతగా ఏమీ తెలీదు.
తొలగించండిమీరు మరీనండి - ఆంధ్రుల అభిమాన రచయిత్రి ఆవిడెక్కడ - ఏదో వారం వారం బ్లాగు రాయడానికే టాపిక్ దొరకని నేనెక్కడ - మరీ అతిశయోక్తి అలంకారంలా వుంది మీ పోలిక.
మీ బందుగుల్ని, స్నేహితులని ఎవర్ని మీ వ్రాతల్తో నొప్పించకుండా మీరు తీసుకొనే జాగ్రత్త నాకు బాగా నచ్చే విషయం. మీ భాష ప్రవాహం గురించి శ్యామలీయం గారి వ్యాఖ్యతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. .
రిప్లయితొలగించండిఅన్యగామిగారు: బందుగులు, స్నేహితులే కాదండి - ఎవరినైనా నొప్పిస్తే (తెలిసో, తెలీకో) నాకే ఎక్కువ నొప్పి కలుగుతుంది - అందుకే ఆ జాగ్రత్త! మీ అభిమానపూరిత వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిLalli నువ్వు చిన్నప్పటి సంగతులు అన్ని గుర్తు పెట్టు కునికిపాట్లు బలే రాస్తున్నావు really hatsup
రిప్లయితొలగించండిThank you! మీ పేరు తెలిస్తే బావుండేది.
తొలగించండినీ నోటి వెంట మీ కథ వినాలని అనుకున్నా కానీ ఇలావచ్చి అలావెళ్లిపోయారు... హూ..
రిప్లయితొలగించండిఫాఫామ్ సుబ్బారావు ఉలిక్కిపడ్డాడా( బ్రహ్మీ ని ఉహించుకున్నా) హాహాహా..
మొత్తమ్మీద సుబ్బారావు శుభమే చేసాడు
హనుమాన్! ఆ అరగంటైనా నువ్వు రాగలిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది.
తొలగించండిఇంక సుబ్బారావు విషయానికొస్తే - నిజమే పాపం! - ఉలిక్కిపడ్డాడు. ఇంటికెళ్ళి అమ్మకి చెప్పేదాకా నిద్ర కూడా పోయుండడు
లలితా! ఐతే ఈ సుబ్బారావు మీ కధ లో గంధర్వుడన్నమాట.
రిప్లయితొలగించండికథను accelerate చేసేశాడు.
పోస్ట్ టైటిల్ చాలా బావుంది.
ఈ పోస్ట్ లో చాలానే జతల కళ్ళ గురించి ప్రస్తావన ఉంది.
నీ శెలవుల తర్వాత మళ్ళీ ఎప్పుడు బ్లాగు రాస్తావా అని నేనూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశా.
నువ్వన్నట్లు సుబ్బారావు మా పెళ్ళి-కథలో గంధర్వుడే :)
తొలగించండినా బ్లాగ్ పోస్ట్ కోసం అంతగా ఎదురుచూశానూ అని నువ్వు రాయడం నాకు భలే నచ్చింది. ఎప్పట్లాగే నీ unconditional encouragement కి బోల్డన్ని థాంక్స్, లక్ష్మీ!
శ్యామలీయం గారి వ్యాఖ్యతో ఏకిభవిస్తున్నాను.
రిప్లయితొలగించండిఇప్పటిదాకా 36 నుంచి వెనక్కి 25 దాకా చదివాను.
30 లో ఏం సినిమా చూశాను లాంటి ప్రశ్నలు వేయకండి.
సమాధానాలు చెప్పే అలవాటు లేదు.
అన్నట్టు ఇది ఒక నవలగా వేసేయ్యండి మీరు. ...... మహా
బులుసు సుబ్రహ్మణ్యంగారు! నా త్వామనురజామి చదివి, కమెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్!
తొలగించండి1. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి
రిప్లయితొలగించండిచూపులోనే ఆప లేని మత్తు మందు చల్లిరి
2. నేనీ దరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
మీరింత ఓపిగ్గా ప్రతీ పాటనీ పట్టి రాసినందుకు థాంక్సండి,దీపా!
తొలగించండి